shabd-logo

పదహారవ అధ్యాయము

8 December 2023

1 చూడబడింది 1

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమూఁడుపుటలు, నాలుగు రోజుల కొకసారి; ఇప్పుడు పదిరోజుల కొకసారి; అదియును కార్డు, కార్డులో సగము ధర్మారావున కీది న్యాయముగానే తోఁచెను. కాని వారి

యిరురి యంతరాత్మలలో నొకరికొకరు దూరముగా లేరు. దూర మైనది యుత్తరముల యొత్తిడి. ధర్మారాని పది యుత్తరములు వ్రాసెను. ప్రతియు తరములోని చివరివాశ్యమిది: “నీవును, శశి రేఖయు నెప్పుడువత్తురు?” కిరీటి 'ఇప్పుదువత్తు నిప్పుడువత్తు' నని వ్రాయును. కిరీటి వర్షర్తువు వచ్చినంతనే వత్తునని వ్రాసెను. వర్షర్తువు వచ్చెను. వచ్చిన వర్షర్తువు దొడ్డిలోని కూరపాదులు పండించెను. అతిథులు వచ్చుచున్నారు, వారికిఁ గావలయు నని కాఁబోలు దొడ్డిలోని చేమంతి మొక్క పూయించెను. హేమంతములోఁబూయు సేమంతికా కుసుమములు తొందరపడి వర్షావేళఁ బూచెను. ఆ మొక్కనాటి రెండేండ్లయినది. అది యింతవఱకుఁ బూచినది కాదు. శశి రేఖ వచ్చుచున్నది; ఆమె జడలోనికిఁ బూవు లేవీ యన్నట్లు సేమంతిక పచ్చపరికిణీ కట్టిన పదియేండ్ల కన్నెవలెం బూవయ్యెను. ఇంకఁబట్ట ణపు గడ్డి చేవంతిపూలు- వాసన లేనివి - తనపైకి దండయాత్ర వచ్చు చున్నవని దెలి సెఁ గాఁబోలు! కుసుమిందు శక్తి యుస్న కొంచెము వ్యర్థముగాకుండ చేసికొందము, దీప ముండఁగనే యిల్లు చక్క బెట్టుకొనుమన్నారు, ఇంక రెండు మూఁడేండ్లకుమించి నా ప్రతిభ లేదు. చెన్న పురిపూలు తడుముకొని వచ్చుచున్న వని యామె తొందరపడి పూచెను. మందారతరువు, రేక మందార, ముద్దమందార రెండును బూచి సేమంతికా మందార పుష్పములు దొడ్డియన్న ముత్తయిదువు తాల్చిన పసుపు కుంకుమలవలె ఖండితనాయిక

యొక్క ఈర్ష్యా క్రోధదృగంచలకాంతులవలె వికసిల్లెను. వర్షర్తువు పొలాలనిండ నిండిన నీళ్ళలోఁ గురిసి, పడుచున్న చినుకు పడినచోట నెల్లను బొట్లపూలు పూయించెను. కాంపుపడుచులు, మాలెతలు పొలాల మీఁద నూడ్చు చుండిరి, తంయిమని దూరము నుండి ధ్వనివచ్చును. రైలేమో యని వెను దిరిగి చూతురు. వను గాలితో వానవచ్చి పడును. చిన్న చిన్న మట్టి బెడ్డలతో విసరి కొట్టినట్లు వర్షపు వర్షపు పెద్ద పెద్ద చినుకులు చెంపలవఱకు ఛెడీలుమని కొట్టును. 'అబ్బో! నా మగఁడైన నింతదెబ్బ కొట్టలేదే!' యని యొక తె యనఁగా, మఱియొకతె 'నిన్ను వానమగఁడు వదలి పెట్టునా, ఇంటిలోని మగఁడు వదలి పెట్టిన' సనును. ఊడ్చుచుఁ గొందఱు తల యెత్తక యే యూడ్చుచుందురు. వర్షము వారి ఏఁ పులమీఁద స్వారి చేసి పోవును. పొలముగల యజమాని తాటియాకులగొడుగులోఁ బొలము గట్టునఁ గూర్చుందును. లేదా నారుకట్టలు దూరదూరాలకు విసరి వేయుచుండును. వరుసము వచ్చి తాటియాకుల గొడుగు మీఁద శ్రీకృష్ణుఁడు కాళియా హిశిరస్సునవలె నృత్యము చేయును. భగవంతుని కాలిగజ్జెలు మ్రోఁగుచుండును. ప్రణయినీమధురకోపమువలె రివ్వున వచ్చి రివ్వసపోయిన చిలుపవానాలు కాంపులవసములు తడి పొడిగాఁ జేయును. మఱలనెండ (పట్టును. మజలందడువును. మూఁడు నెలలు కాచిన యెండలకుఁ జర్మము, మాంసము, మజ్జి, అస్థివజకు నుష్టమై నేఁడువచ్చిన నీలమేఘస్రవద్వరాబిందువులకు శరీరములు చల్లనై ప్రాణములు హాయి యనించెను. ఊడుపుగత్తెలు రైలు వచ్చు చుండఁగా నిలుచుందురు. రైలువంకఁ జూతురు. అందులోఁగొందఱు పిల్లలు రైలులో నున్న వారిని కేతులతోఁ ఎలుతురు. పిలుచుచున్న కాఁపుల్లలను గిరీటిచూచి శశిరేఖతోఁ జెప్పెను. "సుబ్బన్న పేఁట మనలఁ బిలుచుచున్నది చూచితివా' యని ఆమె నవ్వెను. రైలు దిగినంతనే ధర్మారావును గిరీటియుఁ గౌఁగిలించుకొనిరి. దూరమున నున్న శశి రేఖ సవ్వాను. ధర్మారావు 'మాచితివటోయి! నీ భార్య నవ్వచున్నది' అనెను. కిరీటి శశి రేఖను దగ్గఱకుఁబిలిచి మఃవ్వురు నింటిదారి పట్టిరి. అరుంధతీ శశిరేఖలు వేయియేండ్ల నాఁటియక్కా సెల్లెఁడ్రవలెఁ గలిసికొనిరి. ప్రతి నిముసము సరుంధతికి శని రేఖదేవతావతారవ:నిపించినది. అంతవడిగాఁ బ్రేమించినయిల్లాలు, అంత చక్కఁగాఁ దేశీ ప్రసాదము వడసిన భక్తురాలు- శశి రేఖ యన్న చో సరుంధతికి నామె స్త్రీలోకమౌళిరత్న మనిపించెను. శశిరేఖ సౌంద ర్యము నవమల్లి కాుసుమసౌభాగ్య ప్రతిస్పర్థి. అచ్చర భూలోకమున కవతరించినట్లున్నది. రాణివాసమిలో నున్న యసూర్యంపశ్య శరీర చ్ఛాయ లామె దేహమున మెఱుఁగెక్కెను. అరుంధతియు సౌందర్య వతియే. ఆమె సౌందర్యము వేఱు, ఆమె సౌందర్యము సేమంతికా పుష్పము వంటిది. వ.నిసి యచ్చరవలె నుండదు, భూలోకమందలి యొక సౌందర్యవతివలె నుండును. ఆమెశరీరచ్ఛాయ పచ్చని బంగా రము. అందు సితచ్ఛాయలు సమ్మిశ్రితము కాలేదు. అరుంధతి ముఖాంచలములఁ దఱునుకొని వచ్చుదున్న ప్రేమభావము గోచరిం చదు. పొం గడఁగి సహజమైన వినయముచే నామె మొగము విరియుటకుఁ గొంకునున్న కింజల్క విశంగిత నవనీరేజపత్ర సదృశమై యుండును. అరుంధతి శశిరేఖ నాదరించి యిరువురు నా కథ లీ కథలు చెప్పుకొను చుండిరి. అప్పటికిఁ బ్రొద్దు వాటారినది. శశి రేఖా కిరీటులు భొజనము బెజవాడ స్టేషనులోఁ జేసి వచ్చిరి. మధ్యాహ్న మేధో ఫలహారమైన తరువాతఁ గిరీటి ధర్మారావులు జాతీయక ళాశాల వైపునకుఁ బోయిరి. రధంతరి వీరు వత్తులని తెలిసి ధర్మారావు నింటికి వచ్చెను. వారు మువ్వరును నొకరితో నొకరు మాటాడుకొను చుండఁగా శశిరేఖ 'ఎంత మంచి దిన మమ్మా! మీ వంటి మంచివారి నిద్దజను గలసికొంటి' ననెను.

రథంతరి: అప్పుడే యెక్కడ నైనది! అసలు చూడవలసిన యామెను జూడనే లేదు- శశిరేఖ: ఎవరామె? రథం: తినబో వును రుచులెందుకు? అమె యీ పాటికి బయలు దేఱి వచ్చునం డును. శశి: పెద్దయామెయా? నలుబది యేండ్లుండునా? రథం: నలు యేడు లేదు! నాల్గువేలయేండ్లు. యుగయుగాలనాటి స్త్రీ.

శశి రేఖ యామె పరాచిక ములాడుచున్నదని నవ్వెను. అంతలో గిరిక వచ్చెను. ఆమె సల్లని చీరఁదాల్చి తెల్లనిరైకఁదొడిగి, సర్వా భరణశోభితయై బయలుదేతెను. వీధియంతయు బురదయై యామె పాదములకు రాచిన యలక్తను ప్రక్కల వెంబడి వ్రేళ్ళవద్ద చెఱిగి

పోయెను. ఆమె ధర్మారావు నింటికి పదియడుగుల దూరము నున్న దనఁగ నౌక తొందరక తెయైన చిలుపవానజల్లు వచ్చి, యామె వస్త్రములు తడి సెను. ఆమె తొందరగా నడచెరుగాని వాన యంత కన్నఁ దొందరగాఁ గురిసెను. తాను వాస సతిక్రమించ లేక పోతి ≈నుటలో నామె నవ్వుమ లోనికరుదెంచి, వచ్చుచునే యరుంధతితో 'వదినెగారు! యీ వాన మీకన్న గడుకరి. నన్ను నిముసములో నింత చేసినది' అనెను. ఇంతలో సరుంధతీ రథంతరులు కాక మఱియొక స్త్రీయం కుటఁజూచి సిగ్గుపడి ముఖమండలమునం దపరి చిత వెల్లడించెను. రథంతరి “భయములేదు, భయములేదు. ఈమె యింకొక వరిసిగారు ర”మ్మనెను. గిరిక 'చీర తడిసినది. ఇంటికిఁ బోయి వఱలఁ బొడి చీర కట్టుకొనివచ్చెద' నను. రథంతరి 'మజలఁ దడువని నమ్మక మెక్కడిది? నీకు వతీ పసిపిల్లవై పోవు చున్నా! నీ యొడలిమీఁద్రికి వచ్చిన యావమునైనా నీ వెఱుఁ గవు కాఁబోలు! అంత యవికిత శ్రోణీభర మేలనే?' యనెను. గిరిక కన్నులు విస్తరించి 'అమ్మో! వదినగా రేమో యనుకొంటిని. ఈ సారి నా శ్రోణీభరాలసతకు వచ్చుచునే మేఘము యొక్క వేగము నకు సరిచూచుకొందును' అనెను. అరుంధతి 'మజల సంతదూరము పోవుట యెందులకు? నాది క్రొత్తచీర యొకఁడున్నది. కట్టుకొందువు కాని' అనెను. శశి రేఖ వారి సంభాషణకు నచ్చెరువుపోయినది. 'వీరు మవ్వపను విచిత్రస్త్రీలు. ఒకరికన్ననొకరు పనిత్రశీలలు. ఒకరి కన్న నొకరు వివేకవతులు. కాని యొక్కరికిని నాంగ్లేయ భాషా వాసన యున్నట్లు తోచలేదు. మాటలలో రసస్ఫురణ చాలనున్నది. ఈమూడవయామె యెవరు? ఆమె కన్నులలో నేదో దివ్యజ్యోతి కసఁబడుచున్నది. ఎఱ్ఱనై విప్పారిన ముఖమండలము, విశాలము లయిన నేత్రములు, మిక్కిలి వెడల్పయిన ఫాలము, దీర్ఘ నాసిక, ఉబి 8న గండభాగములు శరీరమంతయుఁ గఠినమై, మా హారోగ్యవతివలె నున్నది. పదునెన్మిదేఁడు లుండవచ్చును. అనాఘ్రాతమైన పుష్పము. అందుకనియే రేకలు బిగిసి చిక్కనయై యున్నవి. ఎవ రామె? ఆమె శరీరాంచలములయందు దేవతాత్వము గోచరించుచున్నది. ఆమె నేత్రము లెంత సేపును నూర్ధ్వగతములేశాని, యామె నేలవంకఁకలదు. ఆమె యెనరై యుండును? రథంతరి గిరికతో 'కిరీటి నెఱx గుదువా?' యనెను. అరుంధతి 'తడిగుడ్డలతో నెంతసే పుండెదవు? చీరకట్టు' మ్మనిన, రథంతరి'నీ చీర యామెకు సరిపోవునే యను కొందము సరిపోవలదా?' యనెను. గిరిక రథంతరివంక నొక చూపు చూచెను. అది సునిశితమై రధంతరి హృదయముదాఁక గ్రుచ్చుకొనెను. రధంతరి కనులుమూసికొని నమస్కారము చేసెను. మననులో ననుకొన్నది, 'స్వామీ! నీ యదృష్టము. నాకుఁ దగినంత సేవ నేనును జేయుచున్నాను' అరుంధతి 'ఏమమ్మా! గిరికా! రథంతరిమీఁద నంతకోప మెందుకు? నీలో నున్న రసాంభోధికి రథం తరియేతాము లెత్తుచున్నది. నీవుస్వామికి మఱియు మఱియు దగ్గఱి దానవగుమన్నావు' అనెను,

శశి రేఖకు వారి మాటలలోని యర్థములు తెలియలేదు. ఆమె వచ్చినప్పటి నుండియు నరుంధతీ రథంతరు లామె వంక నే చూడు చుండిరి. ఆమెతోనే ప్రసంగించుముండిరి. ఇంతవరకుఁ ద న్నంత యాదరించినవా రిరువురు నామె వచ్చినతోడనే తనవంక నైనఁజూడ కుండుటకు శశి రేఖ నివ్వెఱవోయినది. అరుంధతి తన చీరఁ దెచ్చి గిరిక చేత బలవంతముగాఁ గట్టించినది. గిరిక దానిని ధరించి మజల నీ చీర పనికివచ్చునా? యనెను. అరుంధతి 'నీవు వయసు చేతఁ బసి దానవు. నేను నీకు నమస్కరించరాదు' అనెను. అరుంధతికన్న గిరిక కొన్ని నెలలు చిన్నది. బయటవర్షము మజిల విజృంభించినది. ఈసారి

చిత్తజల్లులవలెఁగాక నిలిచి కురియుచున్నది. బయట నొక మహాధ్వని కలుగుచున్నది. రథంతరి: కిరీటి నెఱుఁగుదువా? గిరిక: ఎఱుఁగను. అరుం ధతి: ఎఱుఁగ కేమి మీ యన్నగారి వెంటఁ దిరుగు కుఱ్ఱవాఁడు నిరు డీ యూరిలో బి. ఎ చదువుకొనలేదా? గిరిక: అవు నొకటి రెండుసారులు చూచితిని. అరుం: ఈమె యాయన భార్య. ఈమె పేరు శశి రేఖ.

అరుంధతి యిట్లు చెప్పుమనే యుస్నది. గిరిక తనలోఁదా నేదో మాటాడుకొనుచున్నది. రథంతరి ఆయనుకొనుచున్నది. పైకస

రాదా? యనెను. గిరిక సవ్వినది. ఆమె నవ్వులో నొక తన్మయ రేఖ గోచరించినది. శశిరేఖ చక్కఁగా సంగీతము పాడఁగలదు. ఆమె 'పై కనుఁడు, విందు, మనెను. గిఱిక శశి రేఖవంక నిట్టివలెం జూచినది. అరుంధతి 'మా చెవులేమి పాపమ చేసినవా? ఒక్క పుణ్యపుమాట మా చెవిని పడనీయరాదా' యనెను. గిరిక 'ఏమో సమ్మా! మీ మాటలు నవ్వులో, నిజములో తెలియదు. ఏ పను కొనుచున్నాను? ఏమియు సినలేదు. రాతి రొక సంగతి జ్ఞాపకము వచ్చినది. అది యనుకొనుచున్నాను.' అరుంధతి: దేవాలయ మునకుఁ బోదమా? రథంతరి: వాన వెలియలేదు.

శశి రేఖ గిరిక వంకఁ జూచినది చూచినట్లే యుండెను. అరుం ధతితో 'నీమె యెవరిభార్య' యనెను. అరుంధతి నివ్వెఱవోయి శశి రేఖవంకఁ జూచెను. చూచి 'ఎవరిభార్యయేమిటి? ఆమె దేవదాసి' యనెను. దేవదాసియనఁగా తెలుఁగు దేశమున నితరస్థలమున నున్న వారి కేమి తెలియును? సుబ్బన్న పేఁటలోని వారికే తెలియును. తక్కి నది తెలియకపోయినను శశిరేఖ కొకటి తెలిసెను. అది యామె కులము. బయట వాన కొంచెము తగ్గెను. ఆకాశములో మెజువులు స్వర్గమున జరుగుమన్న దేవదానవ యుద్ధసమయముల మెఱపించిన కత్తులవలె నుండెను. ఆకాశమున నుఱుము లొకటి పశ్చిమమున నఱుమును, దాని కెదురుగా మజల ను తరదిక్కున నుఱుమును. ఆలయములో బ్రాహ్మణులు రెండు బారులు తీర్చి మంత్రపుష్పము చెప్పినట్లున్నది. వేదములు వంతులు వేసికొని గానము చేసినట్లున్నది. నేలనున్న గనులు వర్షమునకు పై మన్ను కొట్టుకొనిపోఁగా శాణోల్లే తములై వెలువడిన మహామరకతములవలె, దారి కిరుప్రక్కలఁ బడియున్న, పాచిపట్టి యాకుపచ్చరంగుగల బాపురుకప్ప లొకదాని కొకఁ డెదురుపడి పనసలు చదువుచున్నట్లు మేఘములు కూడ నొక దాని కొకఁ డెదురుపడి యుతువఁ జొచ్చెను. అంతవరకు గిరిక తడి

రైకతో నుండెను. శశిరేఖ: ఆమె యింతవరకుఁ దడిరైకతోనే యున్నది. అరుంధతి: నేనువాడని రైకలేదు. పెట్టెలో నున్నవికూడ వాడినవే! రధంతరి: నేను జెప్పలేదా? నీరైక చిఱిగిపోవుట తప్ప లాభముతోడి, చెలువముల మొదలి టెంకి సిరిపుట్టెను. ఆమె యుభయః పార్శ్వ ములఁ దామరతూండ్లు తొండముల ధరించిన యేనుగుల చేతఁ బరి సేవింపబడుచుండెను. భూమినుండి మైథిలి యుదయించెను. శ్రీరామ చంద్రుని యంకభాగమున మరువుఁ గులుకుచుండెను. విదర్భలో శ్రీ కుక్మిణీ దేవి పుట్టెను. ఆమె యుత్తరము వ్రాసి బ్రాహ్మణుని బెలిచి స్వామికిఁ గబురు పంపించెను. దుర్గాలయమ్ లకు గౌరీపూజా ర్థమై చనెను. శైబ్య సుగ్రీవమేఘ పుష్పవలాహక సన్నద్ధమై మెఱుపు వంటిరధమెక్కి మెఱపు మెఱసినట్లు స్వామి నాలుగైదుబాణములతో సైన్యమంతయుఁ జీకాకు చేసి రుక్మిణి నెత్తుకొనిపోయెను. 'నిత్యము మదనుఁడు నీవే, నీకు రతీదేవి నెనే పుష్పబాణుఁడైన మదను నభిన యిచెను. గిరిక ప్రత్యాలీఢ పాదయై యల్లెత్రాటిని దృఢముష్టి ముద్ర చేలాగి, వామహస్తముసఁ గనిష్ఠికయు బొట్టనవ్రేలును సాంచి తక్కిన మూఁడు వ్రేళ్ళు బిగించి యిక్షు ధనుర్ల సకము బెగించి, వామ భుమున వ్రేలాడుచున్న తూణీరమునుండి చేయి యమ్మతీసిన వైఖరి యాకాశమునఁ జంద్రమండలాకృతిగా లాగి యాక ర్ణాంత పరికృష్ణ జ్యావల్లికి సంధించి శరవిమోచనము చేసెను. తచ్ఛరీరలాఘవము తిచ్ఛరాకర్షణ వేగము, శరసంధాన నైపుణి, తత్సమయకృత భూవల్లీ వికటన ర్తసమ”, ఏనాడో చనిపోయిన ధనుర్విద్య నంతయుఁ బ్రత్య శ్రీ కరించెను. గిరికా! నీతో నీవేకాదు మఱి యెన్ని మహా విషయ మాల సంస్కృతియోశింపఁబోవుచున్నది. మృదంగ నిస్వాసము చేతను గజ్జియల మ్రోతలను తాళపుసవ్వడిచేతను దేవాలయాంతర్భాగము సమావృతమైన యంధకారముచేత నుఱుము చున్న మేఘుమ వలెనే తోఁచెను. నృత్య రేఖాభిరామయైన దేవదాసి తరుక్కు తళుక్కువ. ని మేజయుచుండెను. పీయూష థారాసదృశరసవర్ష ము కురియుచుండెను. గంట సేపటికి సృత్య మవనాసదశ నందినది. అభినయమైపోయినది. రతీ దేవివలె కడ చిన రాతిరి స్వప్న గతుఁడై న స్వామితో సేకశయ్యా గతయై స్వామిచేత సర్వతః పరిభు క్తస్వయౌవన యైన వేళ నెట్లు రత్యంత స్వేదమనోహరమూర్తియై తా నుండెనో యట్లు నిలిచెను. అప్పుడు గిరిక... వలె శోషపొందెను.

"వ్యాకోచః కేశపాశ స్తరళిత మలకై స్వేదమోక్షా కపోతా

క్లిష్టా బెంబాధరశ్రీః కుచకలశరుచా హారికా హారయష్టిః

కాంచీ కాంతిర్హ తారా స్తనజఘనపదం పాణినాచ్ఛాద్య సద్యః పశ్యంతీ సత్రపం మాం తదపి' విలులితా ముగ్ధశాంతి ర్ధినోతి." యన్న యర్థమున కుదాహరణగాఁ గూర్చుండెను. ఆమె యప్పటి విలులితభావము దీపపు వెలుగుననుండి మాచుచున్న స్వామికే తెలియవలెను. హంగునకై వచ్చిన ముగ్గురునుసృత్యాంతా వస్థ తెలిసికొని యాలయగర్భమునుండి వినిర్గమించిరి. మిగిలిన యోదార్పు రథంతరిపాలఁ బడినది. ఆమె సుప్రీతపీతాంబరుని వ లె గిరికను దరిసి ముడి వేసెను. ముంగురులు దిద్దెను. కపోలములు చేలాంచలముతోఁ గుడి చెను. చిక్కు పడిన హారయష్టి సరిదీ సెను. వదినెగార్లిద్దరును జెఱియొక రెక్కయుఁ బుచ్చుకొని యామెను నిలువబెట్టిరి. అర్చకుఁడు విష్ణుపాదములిచ్చెను. సంపెంగపూవు దేవదాసికిఁగానుకగాఁ బ్రసాదముగా నిచ్చెను. నలువురును ముఖ ఎండపమన గూర్చుండిరి. శశిరేఖయొడలు శశి రేఖకుఁ జెలియదు. దేవదాసి యొకలు దేవదాసికే తెలియదు. శశిరేఖకుఁ దానొక కల్పితజగత్తున, సమానువ ప్రపంచముస దిరుగాడుచున్నట్లు తోచెను. ఈ సంవిధానమే చిత్రముగానున్నది. ధర్మారావు సడలఁ సుబ్బన్న పేఁట యెడల కిరీటికంత ప్రేమ యెందులకో తానిప్పుడు తెలిసి కొన్నది. తక్కిన ప్రపంచమంతయు నీరసించిపోయినది. ఇచ్చట మాత్రము రసప్రవాహ పట్టిట్టు మో) నడచుచున్నది. ఇచ్చట ముగ్ధఁదు కానివాఁ నవ్వడు? నీరంద తెరో పూర్వజన్మ పుణ్యవిశేషము చేత నిచట నుదయించిరి. శ్రీకృష్ణ దేవుఁడు. దేవకీ దేవి కడువునఁ బడెను. సర్వదేవతలును ఎ థురలో బృందలో మానుషావ తారము లెత్తిరి. అట్లే శ్రీకృష్ణస్వామి సుబ్బన్న పేఁటలో వేణు గోపాలమూర్తి యవతరించెను. ఒకత రుక్మిణి, ఒకతె సుభద్ర, మరియొక తె సత్యభామ, ఒకఁడు సాత్యకి, ఒకఁ డజ్జనుఁడు. వీరందఱు నుదయించిరి కాఁబోలు. నిజమయిన భక్తి యెన్ని యేని యూహల కెడమిచ్చును. వీరంద అవతారములు కాకపోవచ్చును. ఒకానొక పూర్వజన్మ కృతసంస్కారలేశముచేత రసస్వరూపమనుండుటయే యాశ్చర్యము. ఆ రాత్రి యరుంధతీ ధర్మారావులు కిరీటి శశిరేఖలను బెండ్లి

కొడుకు, పెండ్లికూఁతురులుగా నలంకరించి పానుపు వేసిరి. రథంతరి మంగ, రత్నగిరి, మరియు నిరుగుపొరుగు స్త్రీ లెల్లరును వచ్చిరి. కిరీటి లజ్జాశకలిత మందహాసుఁడయ్యెను. శశిరేఖ లజ్ఞాసంపిహిత మూర్తి యయ్యెను. ఆరుంధతీ ధర్మారావుల బలవంత మెక్కు వయ్యెను. వారు గృహాధికారులు వారిమాట జవదాఁట వీలులేక పోయెను. పూల చెండ్లాడించిరి. ముత్తయిదువలు పాటలు పాడిరి. అనాఁ డందఱితోఁబాటు ధర్మారావొక ముత్తయిదువు, పరాచి కములుకొంత హద్దుమీరినవి. ఎనిమిది నెలలు కాఁపురము చేసిన భార్యాభర్తల పునస్సంథానమిట్లుండును? ఇది యంతయు నరుంధతి ముచ్చట. ఎవరిదారిని వారుపోవుచు ముత్తైదువలు తాంబూలములు రవిక గుడ్డలు తీసికొనిపోయిరి. అందఱు పదిమంది ఆత్మీయులే వచ్చిరి. అందఱును వెడలిపోయిరి. మంగ వెనుక వెనుక తారాడి యకుంధతితో 'అమ్మా! చాల శోభగానున్నది. చిలుకయు, గోరు వంకవలె నిద్దఱును బంగారపు మొలకలవలె నున్నారు. వారు రెడ్లా? మీకుఁ దక్కిన కులములతో సంబంధము నేఁడు వదలునది కాదు. సన్ను బిలిచితివెందులకు? అనెను. అరుంధతి మంగ చేతిలో తాంబూల మిడెను. మంగ పుచ్చుకొనుటకు నెనుదీసెను. సావి త్రమ్మగారు 'తీసికోవే మంగా! నాయింటఁ దాంబూలమైనఁ దీసి కొమ్మ, తక్కినవన్నియు మనయిద్దఱ కొకసారియే యాశలు వద లెనుగదా యనెను. ఆమె పుచ్చుకొనిపోయెను. సావిత్రమ్మగారు 'మంగ చిన్ననాఁ డెట్లుండెనో నేడు నట్లేయుండెను. అప్పుడును బక్క పలుచగాఁ జువ్వవలె నుండెడిది. ఇప్పుడు నట్లే. తలమాత్రము నెరసినది' అనెను. రత్నగిరి ధర్మారావుతో మాట్లాడఁ దలచినట్లు పోవుచుఁ బోవుచు వెనుకాడెను. ధర్మారావు తదూహయెఱిఁగిదగ్గఱకు బోయి 'యేమమ్మా' యనెను. రత్నగిరి యఱువదవపడిలో పడి నది. అయినను సవతి కొడుకునొద్ద సిగ్గుపడుట మానలేదు. ఆమె 'బాబూ! గిరిక యేమాత్రము దూరము వచ్చినది' యనెను. ధర్మా

రావు 'యేమాత్రము దూరమువచ్చినది! యేమాత్రముదూరము వచ్చిన దేమిటి? నేఁటి సాయంకాలమున దేవాలయములోఁ జూడ వలయు నామెను. కడచిన రాత్రి యామెకుస్వప్న దర్శనమైనది. దర్శనము త్రివిధమని నీకుఁ దెలియునుగదా! అందుఁజిత్రదర్శనములో విశే వము లేదు. అదియుఁగూడ రసహేతువే కాని భక్తిపధమునఁ బోవు నిటువంటి నాయికలకుఁ చెప్పుకొనఁదగినది కాదు. ఇంక స్వప్నదర్శ సము. సాక్షాద్దర్శనము రెండును భక్తిభావగతలగు నాయికలపాలిటి కల్పవృక్షములు. గిరికను స్వప్నమునందు స్వామి యంగీకరించెను. ఇట్లే ప్రతి దినముమ గిరిక పెంట హంగు పోవుచుండవలయును. బహు తపస్సులు చేసినకాని ఋషులకు స్వామి గోచరించలేదు. ఇదియుఁ గళాతవస్సు. ఈ తపస్సునకు ధ్యానము- రాగము. జపము - తాళము, స్నానము - నృత్యము. ఇది నిత్యము సమాచరించవలయును. దేవ దాసి మనల సందజను బునీతులఁ జేయబోవుచున్నది! ఆమెను సర్వదా పరిరక్షించుకొనవలయును. ఆమెను గూర్చి నీ వంత విచా రించరాదు. ఇంకఁ గొలదినాళ్ళలో గిరిక మఱియు మాఱిపోవును. అప్పుడు తొందరపడరాదు. గిరిక కేమి, బంగారుతల్లి! మా తండ్రి నన్నేమో మహావైదికునిఁ జేయవలె ననుకొనెను. అన్నను రామ చంద్రరాజును గొప్పవిలుకానినిఁజేసి యతనికి బ్రహ్మోపదేశముచేసి యధర్వవేదము పునరుద్ధరించి బ్రహ్మాస్త్రము మొదలైనవి కల్పిత మీ లుకావు, యధార్థములని ఋజువు చేయించి, జగత్తు వఱల క్షత్రి యులచే నేలించవలయు సనుకొన్నాఁడు. శ్రీధరముగారు వేమారెడ్డి కవచితిప్పయవలె రాజుగారికి కోశాధికారి యువుననుకొన్నాఁడు. esa యూహలును సర్వథా సంచ్యుతములై పోయెను. ఆయన యూహలు రెండే- ఒకటి సగము ఫలితమునకు వచ్చినది; వ ఱియొకటి సంపూర్ణ ఫలితమునకు వచ్చినది. పసిరికమీఁద నా కాళ లేదు. గిరిక గిరిక సూ! మాతండ్రి సంపూర్ణ మనోరథ మామనే ! గిరికను జూచిన సి కెట్లుం దునో కాని నాకుమాత్రము దేవతాస్త్రీలను జూచినట్లుండును. కబీరు గిరికను నిత్యము వంటి పెట్టుకొనియుండవలయును. కాలము చెడ్డది. బిగ్రహనాశకులున్నారు. వారితో విగ్రహము మన కెందుకు ?'. 19 ఏను, ధర్మారావు కంఠము గద్గదికతోఁ బొలిచెను. మనిసి సఖశిడును మాటాడలేదు.. ఆమెయు నతని నెన్నడును బలుకరించలేదు. రత్నగిరి సంతోషమో! ఉత్సాహమో! నడచి బోవుచు నొకి భావమును ప్రకటించెను. అదిసహసమో, భరతశాస్త్ర పై శారద్యము వలనఁ గలిగిన ఫలితమో! సంస్కృతమైన తద్భావప్రైటన చీఁకటినిఁ జీల్చివేసెను. తటిల్లతలు సరస్వతి పురువులవలెం దశతక మెఱసెను, మేఘము లుఱిమెను. నెమ్మదిగాఁ జినుక నారంభించెను. చినికి చినికి పెద్దవా యయ్యెను. దానితో గాలి సాఁగెను. చలి వేసెను. శళి రేఖాకిరీటులయు, నరుంధతీధర్మారావులయు గాఢ పరిష్వంగములు పూర్వము సహ్యము, పరమసహ్యము నయ్యెను. దుప్పటి యాపాద మస్తము లాగి శశి రేఖాకిరీటులు నిద్రించిరి. కఠోరగర్భిణి యరుం ధతిదూరముగానే పండుకొనెను. ఆమెకుఁ దొమ్మిదవ నెలవచ్చెనేమో! అంత చలిలో నామెకు దుప్పటి యక్కఱలేక పోయెను.

అరుంధతి: నేఁడు మీరిర్వుకు వెచ్చటికిఁ బోయితిరి 1 ధర్మా: శివరావుతో మాట్లాడుచుంటిమి. అరుం: నేఁడు మేము నలు పురము దేవాయములోనికిఁ బోనిమి. అచ్చట నేఁడు గిరిక నృత్యము చేసినది. ఆమె యెంత విద్యావంతురాలు! ఆమె మునుపటివలెఁగాడు. నే నెఱుఁగుదునుగదా! ఆమెభక్తి వేఱుగను, విద్య వేఱుగను బూర్వ ముండెడిది. ఇప్పుడు రెండును గలసిపోయినవి. విద్యా ప్రదర్శన వే యందే యామె భక్తిభావము విజృంభించుచున్నది. కడచిన రాత్రి యామెకు స్వప్నమన స్వామి సాక్షాత్కరించినఁట ! సాక్షాత్కరించి —అని యరుంధతి సిగ్గుపడెను. ధర్మా: సరియే తరువాతఁ దెలిసినది..

అరుంధతి: అది గడుసుఁదన మనఁగా? ధర్మా: నే నేమంటిని? అవ్యవహితం వారికాగిలి మనసు చేఁదప్ప శరీరము చేతను ఖా పాది కాలేదు. కిరీటి శశి రేఖలకు మూఁడు రాత్రులుకడచినవి. నాల్గవ నాఁడు కిరీటి ప్రయాణమయ్యెను. ధర్మారావు సరియని యతనిని వెంటఁ బెట్టుకొని దేవాలయాభిముఖముగాఁ బోయెను.

ధర్మా: నీవు దేవదాసి నెఱుఁగుదువా? కిరీటి: వెనుక సీ వొకసారి చుపించితివి. రాత్రి శశిరేఖ చెప్పినది. ధర్మా: ఏమని! కిరీటి: ఏమని యేమిటి? ఆమె వ. హాభక్తురాలఁట! మహావిద్యావంతు

రాలంట! ఆమె నంత భక్తురాలిని జేసినది నీవేసఁట! శశి రేఖ నిన్నొ క్క'టే మెచ్చుకొనుట!

ధర్మా: 'శశి రేఖ నిట్లు చేసినది యెవరు?' ఇద్దఱును దేవాలయ ప్రాంతములఁ బోయిరి. ధర్మా: ఇందులో దేవాలయ మెవరిదో తెలియునా? కిరీటి: పై శిఖరములే తెలియ జేయుచున్నవి గదా! ధర్మా: ఎన్ని దేవాలయములు నీకుఁ గానఁబడుచున్నవి? కిరీటి రెండు. ధర్మా: అచ్చటనున్నవి మూఁడాలయములు, కిరీటి, మూఁడ వది యెచ్చట నున్నది? ధర్మా: ఆశివాలయములో నొళ పెడ మన్నది. మన మచ్చటి కే పోవుచున్నాము. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యాలయము. ఈ యూకునకు సుబ్బన్న పేఁట యని పేరెల వచ్చెనో నీకుఁ ఔలియునా? కిరీటి: ఒకసారిహాస్టలులో విద్యార్థు అందఱును చెప్పుకొన్నారు. నీకు నా కథకు నేదో సంబంధమున్న దనికూడ ననుకొన్నారు. కాని శశిరేఖా విరహస్య ధాకులిత హృద యుఁడను. నే నప్పుడు నిన్నదుగలేదు. ధర్మా: నాకు, నా స్వామికి నేమీ సంబంధము? ఆయనిదారి యాయనది; నా దారినాది. నీకొకఁదు చెప్పవలయును. మన మచ్చటికిఁ బోయిన తరువాత స్వామి నీకెట్లు కనఁబడునో తెలియదు. అనఁగా జాతివిగ్రహమ గానే గోచరించునో నిజమైన పామువలెనే కనఁబడునో! కాని యొక్కఁదు మాత్రము చెప్పఁగలను. ఆయన రెండు శిరస్సుల నాగు.

ఇరువురునుగలసి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి యాలయాంతర్భాగ మునకుఁ బోయిరి. అది ప్రాతఃకాలము. గణాచారి గుడిలో నున్నది. ధర్మా : "స్వామిక

కిరీటి: ఈమెయేకదా! గణాచారి జూడుము. కిరీటి: విగ్రహమంటివి, విగ్రహమే లేదే! అంతలోఁ గిరిటి సచికితి హృదయఁడై రెండడుగులు వెనుక

వేసి నిశ్చలదృష్టితో విగ్రహమున్నవై పుననే చూచుచుండెను. ధర్మా రావు నమస్కారము చేసెను. కిరీటియు సతని సనుసరించిను. అర్చ రుఁడు విభూతి యిచ్చెను. ఇరువురును దేవాలయము వెలుపలికివచ్చిరి. పెవిలి వచ్చుచు ధర్మారాపై, గణాచారు లొకరినొకరు చూచుకొనిరి. ఆమె తనవంకఁ జూడకుండఁ బోవుచున్ని కిరీటి వంకకుఁ జీతులెత్తిరేఖ 'అక్కా! యెట్లున్న' దనెను. అరుంధతి 'బిగ్గరగా మాట్లాడ కుము- మగవారికి విసఁబడును. నీ మగనితో ననలేదు గదా !" అనెను.

మరునాఁడు కిరీటి ప్రయాణ మయ్యెను. శశిరేఖ 'గిరికను జూచికాని రా' ననెను. కిరీటియు ధర్మారావును శశి రేఖయు గిరిక యింటికి పోయిరి. శశి రేఖ యొక్క తెయు లోనికిఁ బోయెను. మిత్రు లిర్వురును బయట నిలుచుండిరి. శశిరేఖను రత్నగిరి చూచి కూఁతు కున్న చోటికిఁ దీసికొనిపోయెను. గిరిక ప్రొద్దుననే స్నానముచేసి, వడి కట్టుకొని తనగదిలోఁ గూర్చుండి కనులు మూసికొని, ధ్యానించు చుండెను. ఎట్టయెదుట జగ మెత్తున వేణుగోపాలస్వామి విగ్రహము కంచుతోఁ జేసినది యున్నది. గిరిక పద్మాసనస్థ యై ప్రాణా మామము పట్టి దృష్టి భ్రూమధ్యమున బిగించి యుండెను. శశి రేఖ నివ్వె పోయెను. ఆమె రత్నగిరితోఁ నన్నది: ఆమెను నేనిప్పుడేవని పల్కరింతును? నేను చెప్పిపోవుటకు వచ్చితినని చెప్పుము. మేమింక నీ గ్రామ మునకు వచ్చుచుఁ బోవుచునే యుంచుము. ఈస్వామికి మాకును దెంచరాని బంధ మేర్పడినది. అని గిరిక యున్న దిక్కున కొక నమ స్కారముచేసి, యామె తాను వెలికి వచ్చెను. మవ్వురు రైలుసకుల బోయిరి. శశి రేఖా కిరీటులు రైలులో గూర్చుండిరి. శశిశేఖ తన యొడలు తా నెఱుఁగదు. కిరీటి మనస్సులో రెండు శిరస్సులనాగు మెదలుచుండెను. రైలు కదలిపోయెను. అన్న దమ్ము లొకరి నొకరు వాంఛాగాఢ మైన కనులతోఁ జూచుకొనిరి. వైలు నెమ్మదిగా నడచి సను, గొంతసేపటికి వారొకరొకరికి గన్పించలేదు. రైలు పోయినంత మేర ధూమమును బైకి జిమ్ముమనే యుందును. ధర్మారావు తిరిగి యింటికి వచ్చెను. అరుంధతికి మజల నొప్పులు వచ్చెను. గుంటూ రులో నున్న కుగ్లరుదొరసానియాసుపత్రికిఁ దీసికొనిపోదుననిధర్మారా పెన్నిసార్లో చెప్పెను. ఆమెయన్ని సార్లు సంగీకరించలేదు. 'అక్కడ బ్రసవసమయమున నిరాభరణలనుగా నిర్వసనలనుఁగా నుంచెద రఁట! తెల్లని గుడ్డమాత్రమే కప్పియుంతురఁట! తిలకములు లేని మొగాలతోఁ నాభరణములు లేని యొదళ్ళతోఁ దెల్లని వస్త్రములతో

సమంగళాకృతిఁ దాల్చుట కేమికర్మము! నేను పోనన్న దామె పఱునాఁడు ప్రొద్దుననింటివద్దనే ప్రసవించినది. మగశిశువు కలిగెను. ప్రసవసమయమునఁ జాల బాధపడినది. మంగ మెలఁకువలు తెలిసిన ప్రసవ వైద్యురాలు. పూర్వము గ్రామములో నొక చాకలి మంత్రి నాని యుండెడిది. ఆమె యీ చేతివిద్యలో నాటి తేఱినది. ఆమెచాల యనుభవశాలిని. ఎంద గడ్డయిన ప్రసవమైనను మెలకువతో నామె సాధించెడిది. 'పోర్సెప్సు మొదలైన సాధనముల యవసరము లేకుండ నామె యుపాయము వలననే గర్భకోశమ: యొక్క సర్వంకష మయిన జ్ఞానమ; తదనుకూల హస్తప్రయోగ వైశారద్యము వీనితో నామె లోకముసకు బహూపకారిణిగా నుండెను. అది యొక విద్య, అవిద్య చదువుకొనునది కాదు. సంప్రదాయముచేత వచ్చునది. సంప్ర దాయమునకుఁ జదువుకొనుటకును దేశములో మహాయుద్ధము ప్రబలి ధన దేవత, యధికార దేవత చదువుకొనుట యొక్క పక్షమునఁ జేరి సంప్రదాయము నోడించెను. సంప్రదాయము పొందిన యోటమి మఱలఁ దానినిఁ దలయెత్తనీయలేదు. ఈ సంప్రదాయమున కెన్నెన్ని చోటులకై సను పరాభవమే వాటిల్లెను. చాకలిది నాలుగైదు ప్రసవ ములు సంబాళించుచుండఁగా మంగ చూచి కొంత గ్రహించెను. అప్పటినుండి యాస్పత్రులకుఁ బోనివారు సుబ్బన్న పేఁటలో వంగ సాయ ఎ. పేక్షింతురు. ఆమె వచ్చి కోడలికి సహాయపడేను. గోధపడు చున్న వేళ మంగ యన్నది.. 'నాయనా! పిల్ల యింత బాధపడు చున్నది. గురులింగశాస్త్రిగారు లేకపోయె. ఆయన మంత్రించి పంచపాతెఁడు జల మిచ్చినచో వీసమెత్తుబాధ లేకుండఁ బ్రసవించి ముండును. ఆయన చనిపోయిన తరువాత గ్రామములో దిక్కు పోయినది. కొంచెము విభూతి మంత్రించియిచ్చువాఁడు లేఁడు. గాలికి ధూళికి గాఁపైనవాఁడు లేడు. ప్రతివానికి నింగ్లీషే 'నేదమైనది. అరుంధతికి బుట్టిన కొడుకు వ్రేలెఁడంత పొడుగు. వానికన్న గెలుక పిల్లనయము.' ఇవి మంగ మాటలు.

చుంచు కూసినట్లు కూసిన వాని యేడువు వాకిటఁ గూర్చున్న ధర్మారావు హృదయనాళములలో నున్న కాశమునందుశబ్దంచినది. సర్వము సుఖావసానమని తెలిసిన తరువాత ధర్మారావు తోఁచితోఁచనివాఁడు పనియుఁ బాటయులేక యూరివెంట నడదు చుండెను. కొంత సేపటి కతఁడు తాను కోటగుమ్మము దాఁటి లోనికిఁ బోవుచుంటి నని తెలిసికొనెను. ఇచ్చటికి వచ్చితి నేమని వెనుదిరుగఁ బోయి హరప్పనాయని జూచిపోద మనుకొని, మఱల వెనుదిరిగి పోయెను. హరప్పనాయఁ డేదో చదువుచుండెను. అతఁడు ధర్మా రావునుజూచి 'ఇది జార్జి ఇలియట్ వ్రాసిన సైలాన్ మార్నరు' అనెను. ధర్మారావు వెనుదిరిగిపోయెను. హరప్ప మఱలఁ జదువు చుండెను. ధర్మారావు దేవాలయము ముందుకు నడిచెను. అప్పటికి జామ ప్రొద్దెక్కినది. దేవదాసి యాలయము ముఖమండపమునం దున్నది. తాను పురిటివాఁడు. ధర్మారావు లోనికిఁ బోవుటకు వీలు లేదు. ద్వారబంధమునందుఁ గూర్చుండెను. దేవదాసి యతనివంకఁ జూచుచుండెను. ఇంతలో ధర్మారా వెందుకు వచ్చినట్లో, ఎందుకు పోయినట్లో తెలియక హరప్ప పుస్తకము మూసి యతని ననుసరిం చెను. అతఁడువచ్చి యాలయమున కెదురుగా వీధిలో నిలుచుండెను. తలుపులు తీసియున్నవి. ధ్వజ స్తంభము ప్రక్కనుండి దేవదాసి శిరము మీఁదుగా హరప్పదృష్టి స్వామిమీఁదం బడెను. హరప్ప కంటికి మొదట నేనో మెఱసి నట్లు తోఁచి నిదానించి చూచిన తరువాత స్వామి మొగముపనున్న తిలశముగా స్ఫురించెను. హరప్ప యెన్న దును మొగమునఁ దిలకము ధరింపడు; కొందఱు 'తండ్రి మతమే కొడుకునకు, కేషన్జీమతానుయాయి' యనుకొందురు. వారందలును దిలకమును ధరించరు. చైతన్యుఁడు తిలకమును ధరించెను. తదవతార మైన కేష్టల్టీ యేల ధరించలేదొ? హరప్ప స్వామి మొగముస నున్న వెండి యూర్ధ్వపుండ్రములు చూచినంతనే భక్తి నిమీలితాక్షుఁడై యిట్లు ధ్యానించెను. 'ప్రభూ! నీ ఆలయములోనికి వత్తునని బుద్ధి పుట్టి యేడేం డ్లయినది. సన్ను నీవు లోనికి రానిచ్చుటలేదు. నా మొగ మునఁ గూడఁ దిలక మెప్పుడు పెట్టింతువు? ఎప్పుడు నీమాలయము లోనికి రప్పించుకొందువు? నాకు నీ సన్నిధి సేవ యెప్పుడు? పంచమని వలె వీధిలో నుండియే చూచుచుంటినిగాని సన్నిహితుఁడనగు స్థితి నాకు లేకపోయెను. దేవదాసి హరప్పను జూచెను. ఆమె యతనివంక నే

చూచుచుండెను. కూర్చున్న చోటినుండి లేవలేదు. ధర్మారా వటు దేవదాసిని జూచును. ఇటు హరప్పను జూచును. లును దన కూర్చున్న చోటినుండి లేవలేదు. హరప్ప యట్లే నిలుచుండెను. కదల లేను. ప్రొద్దు బాగుగ నెక్కినది. అర్చకుఁడు స్వామికి నా వేద్యము పెట్టి తెర యడ్డమువేసి యిచ్చిన నీరాజనము బయటుఁదెచ్చి దేవదాసికి జూపించెను. ఆమె సాష్టాంగపడి నమస్కరించెను. ధర్మారావు మోక రించి సమస్కరించెను. వీధిలో హరప్ప నిలుచుండి చేతులు పైకెత్తి నమస్కరించెను. ఎవరిదారిని వారు పోయిరి. ధర్మారావు మఱల గ్రామమువెంటఁ దిరుగుచుండెను. అతని కింటివద్దకుఁ బోయినచోఁ దిండి యెవకు పెట్టెదరు? సావిత్రమ్మగారు శిశువునకు నీరు పోసి గాలెంతరాలికి నీరు పోసి యప్పుడు మడికట్టకోవలయును. రధం శరియు, మంగయు సాయమున్నారు గాని, పని తేలదు. ఆనాఁడు కూడు రెండు జాములుదాఁటియే. ఈ కారణము ధర్మారావువిచారించు కొనలేను. విచారించుకొనకుండఁగనే యతని హృదయమునకు దెలియును. అతఁడు మరల గ్రామము పెంటఁ దిరుగఁజొచ్చెను. పసిరిక కనఁబడెను. అతనికి ధర్మారావు చాలయేండ్లుగా నొంటరిగాఁగనిపించ లేదు. నేఁడిట్లుగనిపించినంతనే పసిరిక వచ్చి యాతనిమీఁదవ్రాలెను. పసిరిక యతని చేయి పుచ్చుకొని లాగికొని పోఁదొడఁగాను. ధర్మా రావు మాఱుపలుకకుండ నతని ననుసరించుచుండెను. అంతవఱ కెండలు గాచి యాపగలు మేఘములు క్రమ్మి యప్పుడు చినుక సాఁగెను. ధర్మారావు తలయెత్తి నాలుగుదిక్కులును జూచెను. మేఘములు సాంద్రముగాఁ బట్టినవి. గాలి లేదు. మేఘములు తప్పక కురియును. పసిరిక తలయెత్తఁదు. నడచుచుండెను. ఇఱువురును శ్రార్దిశ నున్న మెట్ట చేలకుఁ బోయిరి. జొన్న చేలు గజమెత్తునఁ బెరిగి యుండెను. దున్నిన చాళ్ళలోఁ జిన్న చిన్న గుంటలున్న చోట్ల వాన నీరు నిలిచియుండెను. అది రాత్రిపడినవాసం చిలుకలు, పొలము పిచ్చుకలు, గోరువంకలు చేలమీఁద సందందు కనఁబడజొచ్చెను.

ఒకటి రెండుకొంగలు దూరానఁ బల్లపుజేలపై నెగురుచుండెను. కిలిపిట్ట యొకటి సన్న నియీల కొట్టుచు, తెక్కలు స్నానము చేసిన బ్రాహ్మణుఁడు పిడిచిన యుత్తరీయము చేతులపై వేసికొని యెండఁబెట్టుటకుఁ గదలించినట్లు కదలించుచు, నాకాశమున రివ్వుసఁ బరు గెత్తెను. పసిరిక పిట్టలకై పరువెత్తి వానినిఁ బట్టుకొ నేను. యెగిరిపోయినను గొన్ని యతని చేతికిఁ జిక్కును. చిక్కినపిట్ట కొన్ని కీచు మనును. పసిరిక కిలకిలారుననవ్వి దానిని వదలిపెట్టును. ఒక పొలము పిచ్చుక పసిరిక భుజముపై వ్రాలి ధర్మారావును జూచి 'నీ వున్నావా' యన్నట్లడ్డముగా నెగిరిపోయెను. జెక్కలు కదలించి యా వేగమ తో గొంతదూరము పోయి మఱల, గదలించి యా వేగమతో మఱికొంతదూరము పోయి, యిట్లు పోవుచుండెను. మొద టిసారి కదలించిన వేగము మందగించువఱకుఁ బిచ్చుక వేగము మంద గించుటయే గాక యెగిరిన యెత్తుకూడ తగ్గి భూమికి దగ్గఱగా వచ్చును. మఱల లెక్కలు కదల్చునప్పుడు వేగము వచ్చును. ఎత్తునకుఁ బోవును.

పసిరిక ధర్మారావును జేల మట్టును ద్రిప్పెను. ఆతిధ్య మొసఁగు టకు ఊఁచబియ్యము లేవు. మొక్కజొన్నకంగెలులేవు. అన్నియు జిన్ని మొక్కలే. జొన్న చేలలో వేసిన పెసరకాండ తీగలైన సాఁగ లేదు. లేఁజొన్నా కులమీఁద వానచినుకులు నిలిచెను. గట్ల వెంట నున్న పచ్చిక యంతయుఁ దడిగానుండెను. చినుకుచున్న వాన కొంత పెద్దదాయెను. దూరమున నేదో పరుగెత్తుచున్నట్లుండెను. పసిరిక చిత్రముగాఁ దలద్రిప్పి యా పరుగెత్తుచున్న దానివంకఁ జూచెను. మజల ధర్మారావు వంకఁ జూచెను. నాగస్వరము పాడుచు పాడుచుండగా నాడుచున్న పాము తల చప్పున ప్రక్కకుఁ ద్రప్పునట్లు పసిరిక తల ద్రిప్పెను. అతఁ డొక్క పరుఁవుసం బోయి యా పరువెత్తుచున్న దానిని బట్టుకొ నేను. అది యెక సర్పము. పసిరిక చేయఁ బోవుచున్న గడుసు దనము దానికిఁ దెలిసినది. అతడు తన్ను పోఁ బోవుచుండెను. అది పసిరికను పసిరికకు వేలు నొప్పి పెట్టి దానినిఁ గ్రంధ ధర్మారావువద్దకు దీసికొని వ్రేలిమీఁదఁ గఱచినది. వదలి పోవుచున్న దాని త్రపైఁ గోపముతోఁ ఁదొక్కెను. అది యతనినిఁ జూచి, నవ్వినట్లు పడగవిప్పి, నేలమీఁద్ర వదలిన గాలిపడగవలె నటునిటు కదలుచుల బోయెను. పసిరిక కిలకిలారు మని నవ్వెను. అతఁడు మఱల ధర్మా రావువద్దకు వచ్చెను. ధర్మారావు ముక్కు-మీఁద వ్రేలుంచెను. పని

నవ్వెను. వర్షము వర్ష వ పెద్దది కాఁజొచ్చెను, ఆ వానకు వడ గండ్లు పడెను. పసిరిక వడగండ్లేకి తాను కొన్ని తిని, ధర్మారావుసకుఁ గొన్ని యిచ్చెను. ధర్మారావు తానింకను స్నానమే చేయలేదు. వానిని దిన లేదు. ఒక పాము వానలోఁ బరువెత్తుచుండెను. వడగండ్లుదానిశిర స్సునఁ దాడించుచుండెను. అది పడగ విప్పి టుస్సుమనిలేచి ప్రక్క వాటుగా బొంయి మని వీచుచున్న గాలిని గసిగాల్లు కొఱికి కష్టము మీఁద బోవుచుండెను, పసిరిక పరువెత్తితన చేతులుదానిపడగమీఁద నుంచి, యది పోయినంతమేర వడగండ్లు దాని తలమీఁదఁ దగుల కుండఁ జేసెను. అట్లు పాము పోయినంతమేర సతఁడు పోయెను. మెంత తొందరగాఁ బరువెత్తునో యతఁడు సంత తొందరగాఁ బరువె త్తెను. ధర్నా రావనుకొ నెను: 'ఇచ్చటికిఁ జలసార్లు మే మొంటరిగా వచ్చెదము. మాకొక్క పామైనను గనఁబడదు. ఒక పిట్టయైనను గనబడదు. ఇతనితో వచ్చినప్పు డన్నియుఁ బాములే! అన్నియుఁ బిట్టలే'. వర్షము విజృంభించి కురియసాఁగెను. ధర్మారావు వానలోఁ దడిసి ముద్దయయ్యెను. పసిరిక గోచిమాత్రము పెట్టును. అతనిమీఁద వాన కురిసిన ట్లేలేదు.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి