shabd-logo

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023

2 చూడబడింది 2

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పులేదు, తప్పంతయు నరుంధతిది. నీ వున్నావు, నీ మఱఁద లున్నది. ఇదిగో, నాకెందుకు?' అన్నాఁడు ధర్మారావు. రామేశ్వరశాస్త్రిని జంత నెత్తుకొని యరుంధతి ముందునకుఁ బోయినది. దొడ్డిలో ఫలికి వెడలినతరువాత నని సూయారుంధతులు గలిసికొనిరి. అరుంధతి : ఈ ప్రయాణమెన్ని నాళ్ళనుండి యనుకొన్నారు? అనసూయ : నన్ను నీ వనియేయనవలయును. ధర్మారావు భార్య నాకు మఱఁదలు. అరుం; అట్లయినచో నాఁడుబిడ్డను మన్నించవలయునుగదా! అస : అస లాడుబిడ్డలను గౌరవించుమూ అరుం : వారు మా యింటి కెప్పుడును రానేరారు. కనుక నిన్నే మన్నించవలయును. నిజముగాసమా వదినే,ఎన్నిసారులు బయలు దేఱినా మనుకొంటివి? ఎప్పుడు నేదియో యొకయభ్యంతరమే. మీ తమ్ముఁడు గూఁటిపిచ్చుక; కదలరు. నేనువందసార్లు పశుపతిగారి యింటికిఁ బోదమని చెప్పితిని. వారికి వేతెపనిలేదుగా! దేవుఁడు, దేవునిపెండ్లి; యదియేగోల . అనః ఆ దేవాలయమునకు మీరు ధర్మకర్తలా? అరుం: కాదు. అయినచో నింతయిబ్బందియే లేదు. అన: మఱి యేమిటి? అరుం: దానికి వేతే కథయున్నది. ఈ పిల్లవాని పేరేమిటి? అనః ధర్మారావు, మీ యన్నగారు పోరాడి యీ పేరు పెట్టించిరి. నీ భర్తవల నీయన గూడ పెద్దకవి కావలయునఁట్ర. నీ పేరు కూఁతుకు, మీ యాయన పేరు కొడుకునకుఁ బెట్టుకొన్నాము, మీ యిర్వురను మా యింట వెలయించుకొన్నాము. అరుం: వారిని వెలయించుకొనుట బాగుగానే యున్నది,వారు గొప్పవారు గనుక. నేనే మున్నది, నా పేరు పెట్టుకొనుటకు?అస: అదియు నాయననుబట్టియే వచ్చిన దనుకొనుము. ఆరుం: మీయరుంధతి మఱి యెచ్చట? అన : మా యరుంధతి కాదు. మీఅరుంధతియే. అరుంధతి పలకయుఁబుస్తకములను బుచ్చుకొనిఢతిని దగ్గఱకుఁ దీసికొనెను. చిన్నపిల్ల దగ్గఱకుఁబోయెను. అన అవునమ్మా, మాకును మీకును క్రొత్త యేమిటి? అది సామాన్య ముగా నెవరియొద్దకును బోదు. చూడు, నీ యొద్దకుఁ బిలువగా నేవచ్చి నది. అరుం: ఇంక మే నిద్దరమును గలసి యెంత చేయవలయును?

అరుంధతి చిన్న యరుంధతిని బుజ్జగించును 'ఏఎమ్మా! మా యింటికి వచ్చెదవా? తీసికొనిపోయెద' ననెను. చిన్నపిల్ల తెలయూఁ పెను. అస: వచ్చును. దాని కేమి? అది సిద్ధముగానే యున్నది.

అదివసంతకాలము. కోకిల కుహూ కుహూనినాదములు పెండ్లి పిలుపులవలె విననయ్యెను. మావిచివుళ్ళు బుగ్గలపైఁ దోఁచిన నూత్న నధువుల మధుర జజ్జాకాంతి విరఁజిమ్మెను. ప్రాతః ప్రవిక సస్మల్లి కాసుమ వాసనలు పసియెదలోని ప్రేమభావమువలెఁ దారాడెను. గుమ్ముగాల గొమ్మలు వంగి యాపరించిన మాకందతరుచ్ఛా నూశైత్యము చేత తగ్గేనేకాని మధుమాసపు టెండలకు నియమములేను. అవి తామే గ్రీష్మాతపము లనుకొనెను. కొంచెము ధనవంతుఁడు రాజ్యమునకుఁ దానే రాజుననుకొనఁడా? అది యెవని తప్పు! నాల్గు పిచ్చుకలు చేరిన తప్పు, మధుమాసపు టెంపలు గ్రీష్మాతపముల తైక్ష్యము ప్రదర్శించి సంతఁ గోపమువచ్చి కొబ్బరిబొండము లెన నీరిచ్చేను. అన్న దాతలు వైశాఖపూజలు చేసి మల్లెపూలు, మంచిగంధము, పానకము, విసన కఱ్ఱలు విరఁజిరి. ప్రపామంటపములవలన మధుమాసపు టెండలకుఁ ద్రపాతిరేకము కలిగెను. కృపారహితుఁడైన మన్మధుఁడు విపాటితా శ్లోక ప్రసూనమును వింటఁ దొడి గారు. మధుకరీజ్యానిస్వాన ప్రతిధ్వనిత రోదోంతరాళుఁడై న పంచబాణుని శౌర్య రేఖ సర్వమానవ హృద యాంతరాళముల విహ్వలతఁ గలిగించెను. మాకందప్రసవక సాయ వాసనావాసితగరుదభిరామలైన మధుకరికాలోకమునుమకరంద పానో స్మత్తులుమధుకరనాయకులు కించిచ్చుంబితాధరబింబులై వెగటువాసన లకు విహ్వలించిరి. మంటలు, పొడుగువాసములు, గొంగళులు, కుండలు పూని కొండకొమ్మలఁ బట్టిన యేనుఁగు తేనెతుట్టెలు దులుపుటకుఁబోయిన శబరకాంతల చికురబంధముననున్న మల్లికా ప్రసూనములఁ దేనియగ్రోలుచున్న తుమ్మెదలు సృష్టి లయములై క కాలి

కము లని వ్యాఖ్యానము చేసెను. పెద్దయరుంధతి చెన్న దల దువ్వి జడ వేసి పరికిణీ తొడిగి, పశుపతి పట్టుత్తరీయమును వల్లె వేసి, పోయిన మేర నెల్లఁ దన వెంటనే తీసికొనిపోయెను. పశుపతి ధర్మారావులు భోజనము చేయుచుండిరి. అనసూయయు, నరుంధతి యను గొంచెము దూరముగా నిలుచుండిరి.

పశుపతి: నేఁడు పిల్ల కనిపించలేదే! అనః ఇదిగో! దీపపు సీడలో నిలుచున్నది. అరుంధతియు సరుంధతియు నొక టైరి. 50క మనగోడు లేదు. ధర్మా: అది మంత్రగత్తె. దానితో జట్టు గట్టనీయ కుఁదు! మా యూరిలో గిరిక యని యున్నది. నేను తెలియక వీరికిద్ద ఱికిని జతకలిపితిని. గిరిక యట్టెయట్టె పెరిగిపోయినది. ఇంకఁ మనమాట వినదు- అన: అంత వినకపోయిన నేమి చేయునుము? నీ భార్య యెంత చెడిపోయినదో మా పిల్లయు నంతియే చెడిపోవును. ఎక్కువ చెడిపోదు గదా! పశు: ఈయన భార్య యగుట యెక్కువ చెడిపోయినది కాక పోయినదా? ధర్మా: ముసగదా యని యబద్ధములు మాటాడఁ గూడదు. నన్నుఁ బెండ్లాడి యదియేమి చెడిపోయినది? మొగమున్నది యద్ద మున్నది. అడుగరాదా? అన: ఏమమ్మా! మా ధర్మారా వును బెండ్లాడి నీవు చెడిపోయినావా, బాగుపడినావా? ఏమో సిగ్గు పడుచున్నది! మోస్తరు చూచినచో బాగుపడినట్లే యున్నది. పశు : నేనొప్పుకొనెదను. ధర్మా: నీ వొప్పుకొనక పోయినచో నది నా భార్య కాకపోయినదా? అరుం: ఉఱు ముఱిమి ఎంగలమ మీఁదఁ బడినట్లు, ప్రసంగము నా మీదికి దిరిగినది. అన: అంత కోప మెందుకమ్మా! ని స్న పలేదు. మా పిల్లనన్నా రనుకొనుము. అరుం : పిల్ల మాత్రము పడవలె సని యెచ్చట నున్నది? అదియుఁ బడదు. ధర్మా: పడ కేమి? అది పడును. అది ముద్దడబ్బు కాదు. అరుం : ఇక్కడ నెవరును గారు. అవః నేఁ డీమె నుక్కుమీఁదఁ గోపము పెట్టుకొని వచ్చినది. ధర్మా: పొరుగింటికి వచ్చినప్పు డంతమాత్ర ముండవలదా? అరుం మీకుఁ బొరుగిల్లేమో నాకుఁ గాదు. ధర్మా: ముందు వచ్చిన చెవులకన్న వెనుక వచ్చిన కొమ్మలువాఁడి. పశు : నీవే కొమ్ములు, ఆవిడయే చెవులు. ధర్మా: అట్లయినదో నేను లేవు వెడలిపోయెను. పశు: సొమ్ము, మా పిల్ల లిద్దఱునుమా యింటనే యుందురు. ధర్మా: మొత్తానికి మీరు మీరు నొక

టియే. నేనే పరాయివాఁడను. పశు : పెరుఁగు తోడుకొనే నేమో

చూడుము. అన: ఇందాక నరుంధతి చేతఁ దోడు వేయించితిని. తోడు కొనెనో లేవో! అరుంధతి చేయి యెటువంటిదో నేఁడు చూడవల యును. ఇంటికివచ్చిన చుట్టాలమీఁద దానికిఁ బ్రేమయున్నచో దోడుకొనును. పశు : చాలు, గట్టిగాఁ దోడుకొన్నది. నెమ్మ దిగాఁ బోయుము. చినికి మీఁదఁ బడుచున్నది. ధర్మా : గట్టిగాఁ దోడుకొన్నచో మీ యమ్మాయికి బంధువులమీఁదఁ బ్రీతి యున్న దన్నమాటయే ! అన: నీకు మతీ గట్టి కుదుప పడినది. నీ మీఁద మఱియుఁ బ్రేమ యన్న మాట! అరుం : పసిపిల్లను బట్టుకొని మీ యిష్టము వచ్చినట్లనఁడు! అన : పసిపిల్ల యేమమ్మా! ఎనిమి దేండ్లు వచ్చి వి! ధర్మా : ఎనిమిదేండ్లు వచ్చినచో నింకేమి? 'అష్టవర్షా భవేత్క న్యా' యన్నాఁడు సృ్మతికర్త. ఇంకఁ బెండ్లి చేయవలసినదే. పశు: ఈ బాల్యవివాహములు మన దేశములోనుండ పోవలయును. ధర్మా : అన్నట్లుగా నీవు సంఘసంస్కర్త 3) కాఁబో లును. అనః పైకి, మాటలలో! పశు: నిజముగా; మాటలు కావు. చూచుండుము. మా అమ్మాయికిఁ బదుమూఁడేండ్లు దాటిన దరు వాతఁగాని బెండ్లి చేయను. అరుం: అందులో లేదు. దాని యిష్టము వచ్చినవాని కిచ్చి పెండ్లి చేయవలయును. పశు: అట్లే చేసెదను. అస: ఇప్పుడ యనవచ్చును. జే పొక వేళ నది యొక ధనహీమని జూచి పెండ్లి చేసికొందుననును. ఒక నలువది యేండ్లవానినిఁ జూచి పెండ్లి చేసికొందు ననును. పశు: నలువది యేండ్ల వానినిఁ బెండ్లి చేసి, కొందునని యే పిల్లయు ననదు. ధర్మా: అ ట్లనకుము. స్త్రీలు ధన మును, భోగమును వాఁఛింతురు, శకుంతల నూడుము! దుష్యంతునిఁ జేసికొన్నది. దుష్యంతుఁడు మహారాజై యిద్దఱు ముగ్గుకు భార్యలు గలిగి, వారివలన సంతానముబడయక దిగులుపడుచున్న వయసులోని వాడు. శకుంతల పసిపిల్ల బతీయక దిగులు పడుచుపరు పదునేడేండ్లుండవచ్చును. ఆమె దువ్యంతుని వాంఛించలేదా? పశు : పుస్తకములలో నట్లే

యుండును, అస; లోకములోఁ గూడనట్లేయుండును. ధర్మా: నాకు

ప్రబలసాక్ష్యము వచ్చినది. అకుం: చేతు లెండిపోవు చున్నవి. లేచి

చేతులు కడుగుకొనుఁడు. ధర్మా; ఈమాటయే మఱిచిపోతిమి. అరుం: ఇంకఁ జేతులు కడుగుకొన నక్కరలేదు. బట్టలకు రాచుకొనవచ్చును. ధర్మా: నేను మాత్రమేనా, మీ యన్న గారుకూడనా? పశు: దొడ్డి లోనికిఁబోవునంత యోపికయున్నది నాకు. అనః ఆయనకు నుస్నది. అరుంధతీయు, అనసూయయు భోజనము చేయుచుండిరి. అన సూయ యత్తగారుకూడ ఫలహారమునకుఁ గూర్చున్నది. వస్తువు లన్నియుఁ జేతులదగ్గఱఁ బెట్టుకొనిరి. చిన్న యరుంధతి యరుంధతి దగ్గఱనే గూర్చుందు నన్నది.

అస: అది యివ్వేశ ప్రొద్దుక్రుంకునప్పుడు భోజనము చేయలేదు. నీదగ్గఱఁ గూర్చుందు సనుచున్నది. కూర్చుండఁబెట్టుకొనుము. అరుం ఒక్కపూఁటలోఁ బెల్ల నాదగ్గఱ నింతచనువైనదేమో? అత్త: దాని పెనతల్లి యనుకొనిన దేమో? అస: అట్లనుకొనుటకుఁ బసిపాపయా యేమి? అవిడ యెవరే, ఆవిడదగ్గఱఁ గూర్చుందు ననుచున్నావు? చిన్న అరుంధతి: అక్కయ్య. అన: ఇదియేమి వరుసయే! అత్తగారిని బట్టుకొని యక్కగా రనుచున్నావు? అరుం: నే నత్తగారి నేమిటి? నాకు దాని యీడునకుఁ దగిన కొడుకైన నున్నచో సత్తగార నను కొందును. అక్కగారే బాగున్నది. సన్ను నీవు అక్కగారే యనుము. చి. అరుం: నేనట్లే యందును. అన: దీనిని నీ వెంట సుబ్బన్న పేఁటకుఁ దీసికొనిపొమ్మ, అరుం: నేనే వెళ్ళెదను. అన: దీని కేశా పట్టినదే! లేక పోయిన రోజును ముంగివలె మాటాడదు. ఎవరు వచ్చి సను వారిదగ్గఱకుఁ బోదు. ఈ నాఁ డిది యేమిటి? ఈమె దగ్గఱకుఁ బోయినది. వారి యూకు పోయెద సనుచున్నది. అరుం: పట్టిన చో నెనరు పట్టుదురు; నేనే పట్టవలయును.

ఆరాత్రి పశుపతి కూఁతు రరుంధతి యొద్దనే పండుకొన్నది. తల్లి కోపించినది. మంచముమీఁద ముగ్గురికినిఁ జోటు చాలదు. రామేశ్వరశాస్త్రి, యటునిటు మసలు నని యామె చెప్పుచున్నది. నీవు విడిగా బండుకొమ్మనెను. అరుంధతి యేడ్చినది. అత్తగారు 'పోనీవే, వారిని బెద్దమంచము మీఁదఁ బండుకొననిమ్ము!' అన్నది. ఒక రాత్రివేళ నరుంధతికి మెలఁకువ వచ్చినది. పసివాఁ డటు తిరిగి పండుకొన్నాఁడు. చిన్న యరుంధతి తన్ను గాఢముగాఁ గవుఁగిలించువిచిత్రముగా నున్నది. నేనన్నచో నీ పసిది యిట్లున్న దేమో?? ఆమె ససినాని చేయిఁ దీసి ప్రక్క నుంచఁబోయెను. నిద్రలోఁగూడ నామె తీయనీయలేదు. అరుంధతి మిఱల నిదురపోయినది. మఱల మెలుకవ వచ్చి యిరువురిఎఢ్య కుడి వైపున నొఁదిగి పండుకొనుట కష్టమై పిల్లవానిని జిన్న యరుంధతియున్న వైపునకుఁ గదలించి పరుండఁబెట్టి తా నతని వెనుక గౌడమచేతివైపున నాని పండుకొనెను. రామేశ్వ' శాస్త్రి చిన్న యరుంఢతి తన తల్లియే యన కొను ان ఆమె డొక్కలోఁ దూరి పగుండెను! పెద్దదయిన గవాక్షమునుండి గాలి చక్కఁగా లోనికి వచ్చుచుండెను. అరుంధతికి నిదురపట్టెను. ఆమె యొక కల కనెను. అందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రెండుతలలతో నామెకుఁ గనిపించెను. ఒక శిరస్సు కనిపించి కనిపించలేదు. దాని వెనుక నే యింకొక శిరస్సుండెను. శిరస్సు లేమో యని చూచెను. కాని శిరస్సులు రెండే. అరుంధతికి మెలఁకువ వచ్చెను. స్వామి తన కార్యమునాఁకు కనిపించెరు, ఇంత లేదు. మఱల జాగ్రదావస్థలోఁగాని స్వప్నావస్థలో ఁగాని కనిపించ కాని యామె మసస్సులో స్వామి నిత్యము నాడుచునేయుండెను.

ఆమె నేఁడు తనకు నచ్చిన కలనుగూర్చి విచారించెను. 'స్వామికి రెండు శిరస్సులో, మూఁడు శిరస్సులా నాకుఁ గనిపించినవి? వెనుక నొక శిరస్సు కనిపించెను, మూండేమో యనుకొనుచుండఁగా రెండే యన్నట్లు తోఁచెను. ఒకానొకప్పుడు స్వప్నములో జరిగే సంగతు లకు, జాగ్రదావస్థలో జరుగు సంగతులకును సంబంధ ముండదు. ఈ స్వప్నముసకు ఫలితార్థ మేదైనఁగలదా! ఇంకొక జాను: ప్రొద్దున్నది. ఫలమే నై నఁ గలదేని యది జరుగుటకుఁ గొంత యాలస్య మున్నదన్న మాటయే. మఱిదెల్లవాఱుజామునవచ్చిన స్వప్నములు సద్యః ఫలదము లని, రాతిరికాలమునఁ గన్న కలల ఫలిత మాలస్యముగాఁ గలుగునని స్వాన్నికులు చెప్పుదురు. దీనికి ఫలిత మేమైయుండును? ఇంతలో నామెకు నిదురపట్టెను. తెల్లవాఱవచ్చుచున్నది. అరుంధతి మేలొనెను. చిన్న యరుంధతి నిద్రలో లేచి మఱలఁ దస వీఁ పానుకొని పండు

గొన్నది. క్రిందఁబడు నేమో! మరియు మీ

అరుంధతి తాను లేచి యనసూయను లేపెను. అరుం: అరుంధతి తెల్లవారులు నన్నుఁ గౌఁగిలించుకొనియే పండుకొన్నది. అన: ఏమో! దానికి నీ వన్నచో నట్లున్నది. నిమ్మ. మీకును మాకును నేది మోలేకున్న యెడల నిట్టి' సంబంధ మెట్లు కలుగును? నేను నిన్నటివఱకుఁ జూడలేను. నీవు నా కాత్మ బంనువవైతివి. ఎనిమిదేండ్ల క్రింద ధర్మారావును జూచితిని, మజల నిన్నఁ జూచితిని. అతనితో మా తమ్మునితో మాటాడుచున్నట్లే మాటాడు ముంటిని. ఎవరిమీఁద నెవరి కెందుకు బ్రేమల్గు చున్నదో యెవరును జెప్పలేరు. అమం: నిజమే, సృష్టిలోని రహస్యము తెలియ శక్యముగానిది. అస: నీవు చాల చదువుకొన్నావఁట మా అరుంధతికి గూడఁ జదువు చెప్పుము. అదుం: సంప్రదాయము తెలిసి కొనుటకన్న నెక్కువ చనువుండదు. సంప్రదాయము చదువే. దానిని మఱచిపోరాదు. వేతే చదువనక్కఱలేదు. మనయిండ్లలోఁ బెద్ద వారందజము నిత్యము గొప్పసంగతులను గూర్చియే మాట లాడుకొనుచుంటి మేని పిల్లల కవి వానియంతట నవియే వచ్చును. అందుకనియే మన దేశములో నోములు, వ్రతములు, పండుగలు నిన్ని యున్నవి. ఇవియన్నియు నాఁడుపిల్లలకు విద్యనచ్చు మార్గములే.

ఇంటిలో నా సంప్రదాయము చెడకుండఁ జూచుకొనవలయును. మఱునాఁడు ప్రొద్దున నరుంధతి బడినుండి వచ్చుచుండెను. పశుపతియు ధర్మారావును గూర్చుండి మాట్లాడుచుండిరి. ధర్మారా 'విటురా' యని పిలిచెను. పిల్లదగ్గజకు వచ్చెను.

ధర్మా: ఏమి చదువుకొనుమంటివి? చి. అరుంధతి: రెండవ క్లాసు. ధరా: ఆడపిల్లలను గ్రైస్తవుల బడులతోనికిఁ బంపించరాదు. మనము బాగుగాఁ జెడిపోతిమి. వారినిఁగూడ నేల చెడఁగొట్టవల యును! దేశమంతయు మన సంప్రదాయములు చెడిపోయిసెను గృహ ములలోనైన సవి చావకున్నచో నష్టములేదు. ఆడపిల్లలను మిషను స్కూళ్ళలోఁ జూచుచున్నాము. మిస్సమ్మలను జూచి మనపిల్ల లంద అును బూర్వపుఁ బద్ధతులనే తిరస్కరించుకున్నారు. మనముబయటికీ బోయినపుడు మడి, యాచారములు లేకపోయినను నింటికివచ్చినంతనేసంప్రదాయమునకు వెలగట్టు ముసలమ్మలు లేచిచో హిందువుల గృహము లీపాటికే తక్కినవానివలె నశించిపోయెడివి. ఇంగ్లీషు చదివి స్త్రీలు ఉద్యోగము చేయనక్కరలేదుకదా! కాదు, చేయవలె నందు వేని నీ కూఁతు నెవనికో ధనవంతుని కిత్తువుగాని పేదవాని కీయవు. నీ కూతు రుద్యోగము చేయవలసిన యవసరము లేదు. పశు: నా కూఁతును బేదవానికే యిచ్చెదను. నీవలె నెవఁడో మంచికవినిఁ జూచి వాని కిచ్చెదను. ధర్మా: సరే! అట్ల! అవుడు నీ కూఁతునకు గృహము చక్కఁగాఁ బాలించుకొనుట చేత నఁజాలును. గృహదేవ తలు, గృహమునకుసంబంధించిన మంచిచెడ్డలు తెలిసికొనియుండినచో నది పెద్దచదువు. ప్రహ్లాదుఁడనినాఁడే 'చదువులలో మర్మమెల్లఁ జది వితి దఁడ్రీ' యని, 'ఆమర్మము దైవభక్తి'అని ప్రహ్లాదులే చెప్పి. మన దేశమునందును, మన గృహములందును, మన సంప్రదాయములలో నాచారములలో నా దైవభక్తి ప్రతిఫలించుచుండెడిది. మన దేశము సందున్న సంప్రదాయములను, నాచారములను జంపి దైవమును నశింపఁ జేసికొన్నాము. చచ్చి చెడి చేయంగల విన్నపములై యా దేవుఁడింకను మన యిల్లు వదలి పెట్టి పోలేదు. వాని నచ్చటఁ గూడ నుండనీయక యేల తఱిమెదవు? పిల్లను బడికిఁ బంపించి 'అమ్మ, తల, వల, ఝషమ, భేకము' ఇవి కొన్నాళ్ళును, 'ఆవునకు నాలుగు కాళ్ళు, దానికి రెండు కొమ్ములు, అది పాలిచ్చును' ఇవి కొన్నా ళ్ళును జెప్పి యేల పాడు చేసెదవు? ఆవు పాలిచ్చునని తెలియని పిల్ల యెవకు? దానికి నాల్గు కాళ్ళని తెలిసికోలేని జంతు వెవరు? పిల్లల మనస్సులు మెత్తగానుండును. వారికి జక్కగా గథలు చెప్పి, బోధచేయము వారి మనస్సుకు బట్టును. విషయము గ్రహించుటకు బసిపిల్లల మనస్సు సిద్ధముగా నున్నది. అక్షరములు నేర్చుకొని వుస్త కము చూచి చదువుటకుఁ బిల్లలకన్ను సిద్ధముగాలేదు. నాలుగై దేండ్లు రాచి చదివించినగాని వారు ధారాళముగాఁ జదివి పుస్తకము లర్థము చేసికొన లేరు. వ్యగ్రమైన వారి మనసు నీ నాలు గేండ్లును వృధాగా నేల పాడు చేసెదవు? అక్షరములు నేర్చి; చదువు

నాఁటికి నీ చదువు చెప్పుకృత్రిమమార్గములచేత మెత్తని వారి మనస్సు

గిడసబాఱివిషయగ్రహణమునం దశక్తమైపోవును. పసిపిల్లల మనస్సు సుకుమారముగా నుండును. సుకుమారములైన విషయములు బోధిం దుము. అవి పిల్లలకుఁ దెలియును. మనస్సునందలి సౌకుమార్యము వృద్ధియు నగును. మనకు సోకు బలిసి పిల్లలఁ గుఱించి శ్రద్ధ తీసికొనము. నాల్గవ క్లాసు, మూడవ ఫారము ప్రైనింగై, యక్షర జ్ఞానము లేని యుపాధ్యాయులకు మన పిల్లల నప్పగింతువు. వారికే రాదు. వీరి కేమి చెప్పుదురు? ఈ రీతిగా మనదేశములోఁ బసివాం డ్రకుఁ జెప్పు చదువు పాడై పోయినది. నా చిన్నతనములో మాయూ రిలో నిత్యమును బురాణము చెప్పుచుండెడివారు. నాటకము లాడు' చుండెడివారు. వీనివలనఁబౌరాణిక కథలన్నియు నాకుఁ జిన్న నాఁడే తెలియును. ఇప్పుడు మనుష్యులు బి. ఏ. ప్యాసగుదురు. వారికిఁ బురాణకథాసందర్భములే తెలియవు. అవి తెలియక తెలుఁగుచదువు రాదు. వారికిఁ గ్రీ స్తనఁగాఁ గ్రీస్తే మనకు విష్ణువనఁగా శ్రియఃపతి, మామమామ। మన్మధుని తండ్రి, పద్మాక్షుఁడు. మఱి యింకను లక్ష పేర్లు. వీని యర్థములు వురాణ కధావిషయములు తెలిసినచో సుల భముగాఁ దెలియును. అందు చేతఁ బిల్లలకుఁ బాడు పుస్తకములుమాని వెంచి, త్రిపురాసురసంహార మిట్లు జరిగినది; గజేంద్రమోక్షణ సుట్లు. జరిగినది; పరుశురాముఁదు రాజుల నిరువది యొక్కసారి వధించెను; రావణాసురుని గర్భమునం దమృతకుంభ మున్నది - యిట్టి కధ లన్నియుఁ జెప్పుము. 'అతిపరిచయా దవజ్ఞా' యన్నాట్లు మన పురాణ కథలలో నున్న హృదయంగమత్వము మనకుఁ దెలియుట లేదు. ఇంగ్లీషు సారస్వతము చదివిన మనకు గ్రీసు దేశపుఁ బూర్వగాధలలో నున్న భావరమ్యత తెలియును. 'ప్రొక్రాప్టియను బెడ్' అని, "హెర్క్యు లీసువలె బలశాలి' యని యా విషయములు సర్వథా మన వాక్ర పంచమునఁ జేరినవి. మన పురాణ కథలు కూడ వానికన్న హృక్యము లై నవి. మనము దూరము చూడవలయును. కొన్ని మనోహర కథలు చూచి యవి 'రొమాంటిక్'గా నున్న వందుము. వసిష్టుడు పుత్రశోకముచేత నదిలో ఁబడి చచ్చుటకు రాఁగా భయమెత్తి శత ద్రూనది నూఱుపాయలుఁగా జీలినదఁట! తన యాశ్రమ ధేనువును దన కీయ నన్నాఁడని విశ్వామిత్రుఁ డలిగి బలవంతముగా ధేనువును

సరిగా దెప్పించునప్పుడు వసిష్ఠు ననుమతిపూని నందిని శరీరరోమములను విద లించెను. ప్రతిరోమకూపమునుండి సహస్రములైన యవనభటులుప్ప తిల్లి విశ్వామిత్రుని సై స్యమ'ను దునుమాడిరి. 'రొమాన్సు' అనగాఁ గధాచమత్కారము, వీనియందుకన్నఁ గథాచమత్కృతి యెచ్చట నుండును? ఇవియన్నియు నేవో ప్రాతకథలని, వానియం దర్థము లేదని యని యేవో స్వప్రయోజనార్థల చేత రచియింపఁ బడినవని యన్యాయములైన యూహలల్లి 'త్రావలేని పిల్లి బోరగిలఁ ద్రోసి కొనే నన్నట్లు చెడిపోవుచున్నాము. హృదయమునకు సునిశితత్వము రావలయు సన్నచో, మనస్సు చక్కఁగాఁ బరిపక్వదశకు రావలయు సన్నచో నూహాపోహలు వృద్ధిచేయు నా కథలు చదివిననే రానల యును. వాఁ దూహించుటకుఁ దావులేకుండ పట్టిగొడ్డువి షయములు చెప్పివచోఁ బసివాని మనస్సులో నూహ రేగదు. శైశవమ నుం డియు ని మంచియా, చెడ్డమా యను వివిగ్శతోడనే ప్రారం భించిన వాని కీ భావనాశక్తి గలుగదు. మన జాతిని జూడుము. నూజేండ్లనుండి యిట్టి విద్య చదువుకొనుట చేత భావనాశ క్తి లేక దరి ద్రమైనది. ప్రతివాఁడును గృత్రిమతర్కము నవలంబించును గాని భావనాబలము కలవాఁడు కనిపించుటలేదు. మన భావనాశక్తి సశిం చుటకే యిట్టి విద్య గఱపఁబడుచున్నది. పిల్లలను బాఠశాలనుండి మానిపించుము. నీవు నహసూయయు రాతిరిపూఁట పిల్ల కనేక కథలు చెప్పవచ్చును. నాటకమలకుఁ దీసికొని పొమ్మ- ఈనాటకములకు దీసికొనిపోయినచో నున్న జ్ఞానముగూడఁ జెడిపొప్తాను. మంచి నాటక ములు లేవు. మొగిలులోని నీరు మాచి చెఱువులోని నీకు పోఁగొట్టు కొన్నాము. ఏమైనను సరియే, పిల్లనుమాత్రము పాఠశాలకుఁ బంపించ కుము. పంపించినను సరేకాని, ఇంటివద్ద నామెకు వన దేవతలు మన కథలు, మనసంప్రదాయముల నన్నియుఁ జెప్పుచుండవలయును. ఎవనికిచ్చి వివాహము జేసెదవో వానికిఁ దెలుఁగు భార్య నిమ్ము. ఇంగ్లీషు భార్య నిచ్చినచో వాఁడేమి చేసికొనును? వాఁడు ఎ. సేం ఎస్. అయినచో ఫరవాలేదు., మనవందఱమును 5. .래. లము కాము కదా!నుండుటలో మాత్రమే మున్నది? అసహ్యముగా నున్నచో నన్నము

సయించదు. ఏల సహించదు? ఏనాదివారు, కొందఱు నీచజాతివారు ససహ్యమైన దేహములతో, గుడ్డలలో దినుటలేదా? వా రనాగర కులు, బుద్ధిమాలినవారు; నేను నాగరకుఁడను. నాకు బరిశుభ్రమగా నుండవలయు సనురు; పరిశుభ్రముగా నుండుట నాగరకతయైనచో భోద నము చేయు వేళ మడిబట్టయని, దానితో నింకెవనిఁ దా తనని నియమ ముగా నుండుట మఱియు నాగరకతయేమో! మురికియుండుట, లేక పోవుటలోని తారతమ్యము ప్రత్యక్షము. శుభ్రమైన వస్త్రమునకును, మడిబట్టకనుగల తారతమ్య పప్రత్యక్షము. దేవున్నానందు వేని యది య:ప్రత్యక్ష విషయము. అప్రత్యక్షమై బుద్ధిమంతుని చేత నూహింపబడు దియే మతము. అదియే ఉవ్యము. అది నీ సామాన్య జ్ఞామను దాయుందును. సస్వామయములు నీ వాచరించవేని యది నీకే నమము. సూర్యనిపై దుమ్ము చల్లిన గన్నులలోఁ బడును, పశు: ఒక మాట, సీవీ యా వేశమంలెయు నడంచుకొని యీ భావ ములను 'సూపమునఁ బరిణమింపఁ జేయుదువేని యది యుత్త మము. జీవిలు గూడ శిశ్పను వంటిది. కావ్యమనందు విషయము ధ్వనించినట్లే జీవితము నందును వన యాదర్శములు ధ్వనించవల యును. ఈ సంగతి నీకు జలియును. ఇంక నుద్వేగము రానీయకుండ వీలయినంతలో నీ భావనులకు బదిమందికి విద్యరూపమునఁ దెలియఁ జేయుము. ధర్తా: నేనే కళాశాలలోనైన ముద్యోగినై సచో నట్టుచేయ వచ్చును. జాతీయకళాశా లో సీతాపతి మొదలైనవారికి నా యీ మార్గమ సనేకదా బోధించితిని! అందుకనియే మూఁడు నాలుగేండ్లు చదివిన సీతాపతి బి. ఏ. పరీక్షయై వారికన్న నెక్కవ తెనుఁగు వచ్చినవాడై నాఁడు! పశు: కానిమ్ము. ఎప్పుడును జీకటిదినములే శావుకదా! ఒక ప్పుడుకాకపోయిన వి. ఱియొక ప్పుడైనను నీజ్ఞాసమ, నీ పాండిత్యము, నీవిమర్శశ క్తి లోకమునకుఁ దెలియకపోవునా? ధర్మా: కళాశాలాధికారులు విదేశీ యులు. వారికి భాష యధార్థస్వరూపము తెలియదు. ఎవఁడాశ్రయించునో, ఎవఁడు తమ మతము, మతాభి

ప్రాయములకు సన్నిహితబుద్ధియో వాఁడు వారికిఁ బెద్దబండితుఁడు.

హైందవులైనవారే యొకప్ప డధికారు గానుండ వచ్చును. వారును

సూణ భాషావిశారదులే కాని, తెలుఁగులోతుఁ దెలియనివారు. ఇందులో నౌశరహస్యమున్నది. పాఠము చెప్పుటకన్న వారేని యధార్థ ప్రవర్తనాయనుకొందురో యట్లునడచుట ఎక్కువ ముఖ్యము. ఈల కేమిగాని మేము తేవు వెళ్ళెనము. ※: ? వెళ్ళువని చెప్పువఱకు వెళ్ళరాదు. ధర్మా: మా యమ్మ ముసలి చొక్కర్తయు నింటిలో నున్నది. ఇపుడామె వంటగూడఁ జేసికొన లేకుండ నున్నది. ఇంటిలో వంట రెండు పూటలను నా భార్యయే. పశు: అందుకనియే యరుంధతి యట్లు చిక్కి యున్నది. ఆమె యొడ లిలోఁ బ్రాణములే లేవు. ధర్మా: వంట మా నలుగురికే యైనను నిల్లు బోలెడంత యిల్లు. ఆ చాకచే యంతయుఁ జేయువజకే దాని పని యగుచున్నది. 'తాఁదూర కంతలేదు. మెడకొక డో' అన్నట్లు నేనొక పరిచారికను ఔట్టుకొని నెలనెలకు దాని కెక్కడనుండి తెచ్చ యీయను ? అరుంధతి కేకో జబ్బుకూడ నున్నది, మందిప్పించుటకు తాకత్తులేదు కాని! ఇరువురను భోజనమనకు లెమ్మనిరి. నాఁడు అరుంధతి ధర్మారావులు ప్రయాణమైరి. అసూయా పశు పతులు పోనీయలేదు. ఆరుంధతి యన్నది 'అరుంధతిని నా వెంటఁ బంపి చో నే నుండెదరు. పశు: ఆ పిల్ల మీ పిల్లయేనమ్మా! తీసి కొని పొండు! అ.గో! అచూడు. నిన్ను బట్టకొని యెట్లు వ్రేలాడు చున్నదో? ధర్మా: నీకే చీరలు సగలును దేలేక నేను బాధపడు చున్నాను, అదికూడ నెందుకు? అరుం: నాకుఁ జాల తెచ్చుకున్నారు! ఒక వేళ మీకంత కష్టమైనచో నా బదులు దానికిఁ దెండు. ధర్మా : అమ్మో! నిన్ను నేను వదలి పెట్టలేను. అస : నీ కీమె ఏదియో మందు పెట్టియుందును. ధర్మా: ఆ దశ తొలగిపోయినది.

ఆ రోజంతయఁ గడచిపోయెను. అరుంధతీ ద్వయమున కెడం బాటులేదు. వారు మఱునాఁడు మజల బయలుదేరి. పశుపతి యన్నాఁడు 'మీరు సోమవారను నాఁడు బయలు దేరినచో ఔడవాడ వజకు నేను వత్తను.' ధర్మా : నీ మాట నమ్మినదెవరు? నే డేమి వారము? పశు; గురువారము, ధర్మా: శుక్ర, శని, ఆది మూఁదు రోజులే! నే' నుండ సబ్బా! పశు: ఉండక తప్ప దబ్బా, ధర్మా: నీవు తప్పక వచ్చెదవా? అ: నీ వబర్ధము చెప్పెదవు. గాని వారుచున్నావు. ధర్మా: ఇన్ని యేండ్లకు వచ్చితిని గనుకనే మీయరుంధతి

నిట్లుమాచితిని. అనః నీమోస్తరంతయుఁ జూచినచో నీక్రమాయ రుం ధతిని వలచినట్లున్న.. ధర్మా: అంతదూరము రాలేదు, ఆమెను వలచుటతో నా కేమిపని! వలసినచో నామెయే సన్న వలచు నేమో! అన: మాపిల్ల నీ వనుకొన్నంత లేఁతగుండెది కాదు. పశు: సరే ప్రణమాము సోమవారమనియేకదా! అని అంతే. వారు ప్రమాణ మాపుకొనిరి. వసంతకాలము మూన్నాళ్ళ క్రిందకన్న మజీయు విజృంభించినది. పశుపతికి మామిడితో ఁట్రయున్నది. సాయం వేళ వాహ్యాళిగా నందఱును చోటకు బోయిరి. మిగిలినదొక్క పశు పతి తల్లియే. మామిడితోట యెకరము మేరనున్నది. చిన్నది. కోరడి వెంటఁ గొబ్బరి చెట్లున్నవి. వధ్యరకమున కొకటి రెండుగా ఒత్తాయిలు, నారింజలు, నిమ్మలు కలవు. నిమ్మచెట్లు వడ్డీ పిందెలు వేసెను. అందుఁ గొన్ని చెట్లక్రిందఁబడి యుండెను.

ధర్మా: తోటకు నీరు పెట్టుటలేదా? పశు; ఉన్నాడు మాకొక దేశ్యము. వాఁడు దున్నఁబోయినదూడ, మేయఁబోయిన నెద్దు. వాఁదు సరిగాఁ బని సేయఁడు. మావితరువులు చివర్యు వేసి గాలిచేఁ గదలి యతిధులను సమాహ్వానించు చున్నట్లుండెను. గున్నమామికులు నేలకు వాలుచుండుట చేతిఁ జిన్న్్న యరుంధతి యొక చివురుజొంపమును ద్రుంచెను. పశు: చివురుద్రుంచితి వెందు లకే! ధర్మా: దానికి లేతవయసుననే యనుభవించుట యిష్టము కాఁబోలు. ఆరు; లేతవయసేమి? చివురు కొంచెము ముదిరినది. మఱియు లేతగా లేదు. చేతికి శోభగా నుండవలయు ననిసల జివురాకు గాక నూమిడిమండ పుచ్చుకొనెదరా! మండనుండి

ఫలము మాత్రమే వచ్చును. యును లేదు. పశు: ఆఁడబిడ్డ యంతమాత్రమైన ననకపోయిన నెట్లు? - తోఁటియంతయుఁ గ్రోత్తగాదున్ని చెట్లకు నీరు పెట్టిరి. ధర్మా: ఇక్కడ నీకు తోడి రేకి 'పశు: నిమ్మచెట్లకు వానికిఁ దోడ లేదు. దున్ని చాళ్ళలో మట్టితో బోదెలు చేసి నీరు పెట్టిరి. నేట యంతయు వదలుగా నుండుటచేత బోదెగట్టు తడిసి ప్రక్కన

గదముమేక తడి సెరు. పశుపతి కాలు బురదలో దిగఁబడెరు. ధర్మా : అది పప్పుకాదు. ఫరవాలేదు. అప్రసూయ నవ్వెము మీ అబ్బాయిని గూడ దింపి నడిపించము. వాండంత లోతు దిగబునో తెలియును. ధర్మా : వాడు నాల్గు మల్లెపూల యెత్తు. వా డసలు నీటిమీఁద గూచి నడచిపోఁగలఁడు. అరుం: అయిపను దింపి చూతునా? ధర్మా : (సర్వా) నిజముగా దింపినవు సుమా! అరుు: ఇన్ని కంతులు కోసిని, నా కంతి యంతనొప్ప లే దన్నాడట. అ: ఏమమ్మా! దింపుకు నంటివి కదా, నెల్ల వానిని. ఏదీ దింపుము. ఆయన యొక్కండే కన్నాఁడా? — కోకిల 'కహూ' యనెను. చిన్న యరుంధతి' మ జల 'గుహూ' యనను. కోకిల మఱల 'గుహూ' యనెను చిన్న యరుంధతియు గోకిలము నొకరినొకరు రెట్టించుకొనిరి. అసూయ: ఎందుకే నీవు దాని సంత రెట్టించెదవు? ధర్మా : రెట్టించుకొనుటయేకాదు. అది కూత్త మానివేసిన తరువాత గూడె గూయుచున్నది. అన : అంతేనమ్మా యీపిల్ల! తేపు మగవాఁడు నాకు వల దనినను నీవే' కావలయు సిని వాని మెటఁబడును. పశు పతివ్రతలంతియేకదా! అసః శారదా చట్టము వచ్చినతరువాత నింకను బాతివ్రత్య మేమిటి? పశు: మన యిండ్లలో స్త్రీలసందఱిని జదువు చెప్పక వట్టిచాదస్తపు మనుసులుగా ద యారు చేయుదురు. ధర్మా : చదువుకొనిన వారి కన్న చాకలి మేడట. ఆమె యనినదానిలోనే యెక్కువ యధార్థ మున్నదేమో!' పశు : నీవు ధర్మారావు వాయెను.

వధుమాసవుఁ జిఱువెచ్చని యావిరులు చెట్లసందులనుండి దూఱి మొగములమీఁద, చెవులలో దూఱి యెండ బెట్టెను. 'అరుంధతి పిల్లవాని నెత్తుకొని నడువలేకపోయినది. ఆమెకు గొంచె ముగా వడకొట్టినది. ఆమె కుఱ్ఱవానిని ధర్మారావు చేతికి చ్చెను. ఇచ్చుటలో నిరువురి మేనులు తాకినవి. యొడళ్ళు పులకిత బ్రహ్మానంద పథమున సడి చెరు, ఇరువురకును మనసులలో నొకరి నొకర నెడబాయలే మనిపించెను. ఇంతలో బిల్లవానిని నేను తీసికొన నని చిన్న యరుంధతీ వారి యిద్దఱినడుమకు వచ్చెను. అరుంధతి చిన్న యరుంధతిని నివ్వెజిపోయి చూచెను... ధర్మారావుపసివాని నామె చేతి కిచ్చెను. అరుంధతి మోట వద్దకుఁ బోయి తొట్టెవద్ద నున్న నీళ్ళతో మొగము కడుగుకొనెను. ఆమె వెంట ధర్మారావును బోయెను. పశుపత్య సూయలు ముగ్గురు పిల్లలు తోఁటకు నొక వైపున నుండిరి. అరుంధతీధర్మారావు లొకవైపున నుండిరి.

ధర్మారావు: వడగొట్టినదా యేమి? ఆరుం: రోజురోజుకు నా యోపిక పోవుచున్నది. నా కేమైన మందిప్పించుఁడు. నే నింశ నెన్నాళ్ళో బ్రతుకను, నావలన మీకేమైన సుఖమా బండలా ధర్మా : ఛీఛీ! అట్లనకుము నీ వున్నావన్న నదియే చాలు.

మహకవి యన్నట్లు 'నిబ్బరముగ శేత్రి నిదురపొయ్యేను ' అరుం: నేను నిజముగాఁ జాల రోజులు బ్రతుకను. ధర్మా: నీవు లేకున్న నేనుమాత్రము బ్రతుకుదునా? ఆరుం: లోకమలో సందఱును బ్రతుకుటలేదా! అయినను నేను మిమ్ము వదలిపోను - ధర్మారా వామె వద్దకుల బోఁ బోయెను. పదఁడు, పోవుదము. అరుం: వారు చూచెన రేమో!

వసంతకోకిల మావి వళ్ళు గీచుకొనిపోయి యాఁపిన కుహూ నిస్వానము మex బ్రారంభించెను. మఱలఁబోయి, వారును వీరును గలసినిన తరువాత నససూయ యాన్నిది- 'ఇప్పుడు కాదమ్మా, మామిడి పండ్లు కాఁపు వేసిందరువాత మీరు రావలయును.'

పశు: మా తోటలో వంచి జాతులన్నియు నున్నవి. జహం గీరు, ఇమాందీను లున్నవి. ఆ మూలనున్న వంకర చెట్టు జహం గీరు దానివైపున నున్న రెండును ఇంమాందినులు. ధర్మా: ఒక రెండు నెలలు పోనిచ్చి మఱల వత్తుముకదా! పశు: అరుంధతిని గూడ దీసికొని రావలయును. అరుం: నీ వెంటనే యుస్నదికదా యరుం ధతి? అన: ఒక్క యరుంధతి పనికిరాదు. మీ రిద్దఱును గూడి యుండనలయను. అప్పు డిమాందీనులు మిక్కిలి రుచి. ధర్మా : ఇమాందీనులు పండిన సంపెంగ, చక్ర కేళీల వాసనయ, మామిడి పండు రుచియుఁ గలవి. అన: మామిడి పండు చిన్న యరుంధతి; సంపెంగ తావి పెద్దయామె ధర్మా: అది చక్ర కేళీ కూడను - సోను వారము వచ్చినది. అరుంధతీ ధర్మారావులును, రామేశ్వరశాస్త్రి

లకు నూన్న వస్త్రములు పెట్టెను. శాస్త్రికి రెండురూశలు చేతిలోఁ బట్టెను. వారు ఒలదనిరి. కాని పుచ్చుకొనక తప్పక వచ్చెను. ~రు ఢతి యన్నది 'సదినె! మా యూరిలో దేవుని కళ్యాణం లు జరుగును. నీ ఎప్పుడు తప్పక రావలయును. శశి రేఖా కిరీటులు కూడ వత్తురు. నీవు శశిరేఖ నిదివఱకు చూడలేదుకదా! బంగారుతల్లి చూతువుగాని.'

బెడవాడ స్టేషనులో దిగిరి. దిగి వంతెన దాటుచుండగా ల బన్నిండేండ్ల పిల్లవాని నొక పోలీసువాఁడు పట్టుకొని కొట్టుచుండెను. వాఁడు 'నే నేమి దొంగిలించితినో చూపించుఁడు. ఊరకే కొట్టుట యేమి న్యాయము?' అనెను. పోలీసు 'వెధవా! నీవు దాచినచోటు నాకుఁ దెలియునా! నీయంత యింద్రజాలవు ముండాకొడు కుండ' డిని కొట్టుచుండెను. ధర్మారావుపోయి 'వానివద్ద నేమియు దొరక నప్పుడు కొట్టుట యెందులు? వానిని వదలి పెట్టు' మనెను. పోలీసు 'అయ్యా! వీఁడు జగ జెంత్రి ముండకొడుకండీ! వీనిని దయఁదల చరా' దనెను. ధర్మారావు 'పోనిద్దూ పాపము! వాఁడును బ్రతుకవల యును గదా!' యనెను. కట్టినాఁడు "అట్లు చెప్పండి బాబూ! నేనొప్పు 'దును నాకుఁ గావలసినదానికన్న నెక్కువ తీసికోను. ఈ పోలీసాయ ననే అడుగుఁడు! మొన్న నొక పెద్దమనిసి జేబులో డబ్బునంచి కొట్టి వేసితిని. అందులోఁ బదిరూపాయ లున్నవి. నాకుఁ గావలసిన దొక్కరూపాయియే. ఆనాడు మా యింటిలో బియ్యములేవు. రెండు నాళ్ళనుండి నాకు, మా అమ్మకుఁ దిండి లేదు. అందుచేత నా రూపాయ తక్కిన తొమ్మిదిరూపాయలు 'మీ సంచి క్రింద పడిపోయినదండీ' యని యాయసికే యిచ్చితిని. ఆయన యొక రూపాయ తక్కువైనదని చూచుచున్నాఁడు. క్రిందనేమో పడిపోయి యుండవచ్చుననుకొని కొంతసేపు వెదకి వెళ్ళిపోయెను. అయ్యా పోలీసువారు నన్ను ఖైదులోను వేయరు. నన్ను సంపాదించు

కోను నీయకు” అని యేడ్వసాగెను. ధర్మా: నిన్ను ఖెములో వేసినచో మీ యమ్మకుఁ దిండి యెట్లు? నాఁడు: అది యేమిచావు చచ్చునో నేరు చూడవచ్చితినా? ఎదురుగా నున్నఁతపటికే మన బాధ్యత. ధర్మా: ఏమి వేదాంతము! నీకున్నంత మాత్రము జ్ఞానము తిండికలనారికి లేదోయి. నీ పేరేమి? వాఁడు 'అసిరి.''

ధర్మారావు వానిని వదలించెను. పోలీసువాఁడు వానిని వదలి పెట్టిపోయెను. ధర్మారావు, పశుపత్యాదులు నడచుచుండిరి. కొంత దూరముపోయి బండకట్టించుకొని దానిలో నెక్కిరి. అసిరి వెనుకనే వచ్చుచుండెను. ధర్మారావు బండి యాపువిని, 'యెందుకురామా వెంట వచ్చెద?" వని యడిగెను.

వాడు: మీ యిల్లు చూచిపోయెదను బాబూ! ధర్మా: మా యిల్లెందుకురా? ఏమైనా చేతిదెబ్బ కొట్టవలయుననియా! అసిరి: మీకంత యనుమాసమైనచోఁ దిరిగి పోవుచున్నాను.

ధర్మారావు 'కాదులే ర'మ్మని బండి యెక్కించుకొనెను. నూర్యపతి యింటికిఁ బోయిరి. సూర్యపతి వారిని కలిసికొని మహా నందనివ గ్నుఁడయ్యెను. ధర్మారా వరుంధతితో సహా వచ్చినందుకు న్యూపతి యానందము పట్టలేకపోయెను. అతని భాగ్యవచ్చి యరుం ఢతిని లోనికిఁ దీసికొనిపోయెను. హోటలు నుండి యన్నము తెచ్చి యరుంధతికిఁ బెట్టిరి. వారిద్దకును భోధనము చేసిరి. స్నే హితులు మువ్వకును జిత్రవిచిత్రవుఁ గబుకులతో మధ్యాహ్నము గడిపిన తను వాత ధర్మారావు 'పోవుడు' సని ప్రయాణమయ్యిను.

సూర్యపతి: చాలు లేవయ్యా? మహా వెళ్ళినావు? ఇప్పుడే వచ్చి యిప్పుడే వెళ్ళెదవా ఏమిటి? సాయంకాలము కొండ యెక్కు దము, ధర్మా: దొంగ! కొండయన్నచో నేనుందునుకదా యని కొండ యనుచున్నాఁడు. సూర్య: మావాండ్రుకూడ కనకదుర్గగుడికి బోసిన మనుచున్నారు, కలసిపోదము, ఉందువా, ఉండవా? పశు

ఇంక వెచ్చటికి వేళ్ళునులే. ధర్మా: రాఘవరావుసకు ఖైదిం కెన్నాళ్ళున్నది? సూర్య ఇంక రెండు మూడు నెలలలో వచ్చునను కొంచును. . సంవత్సరముపైని కాలేదా వెళ్ళి? ధర్మా: అసిరి కన్నము పెట్టిరా? సూర్యః వాని దీ యూరే. దొంగ వెధవ నెచ్చట నుండి తెచ్చితివి? వీడొచనాఁకు నా కేబులో సర్ధరూపాయ కొట్టి వేసినాఁడు. ధర్మా: నీ యూరికి ప్రాతకా పన్నమాట. సూర్య:

అధ్యాయము

వీని కాణేండ్లు వచ్చినప్పటి నుండియు నిదియే వృత్తి. అప్పుడే రెండు 'సార్లు రెండు నెలలు వెళ్ళి వచ్చినాఁడు. పశు నాలుగున్నర యైనది. కొండకుఁ బోదమురండు. సూర్య : మా గుఱ్ఱపువాఁ డింకను రాలేదు. ధర్మా : వాండ్రు, గుఱ్ఱవుబండిమీద వత్తుకులే, మనము నడువవచ్చును.

వీరు మున్వరును గవర్నరుపేఁటలో బయలు దేఱి వంతెన వద్దకు అసిరి వెనుక వచ్చుచుండెను. ధర్మారా వాఁగి యసిరినిఁ గలిసికొని 'ఏమిరా, ఏమైనను గావలయునా యేమి? జేబులోనుండి మాత్రము లాగివేయకుము!' అనెను.

అసిరి : ఒక్క టేమాట బాబూ! మీ దగ్గఱ నేమియుఁగాఁజే యను. ధర్మా : తెలియకుండ నెట్లు కాజేసెదవురా? అసిరి : మీరు ప్రక్క జేబులో డబ్బు వేసికొనుఁడు! నా మాట మఱచిపోయి నడము చుండుఁడు. నేను లాగి వేసెదను చూడుఁడు! ధర్మా : వారిద్దఱిలో నా పొడుగాయసకాక, పొట్టిగుమ్మటములా న్నెడు. ఆయన ఖద్దరు చొక్కా, ప్రక్క జేబులో డబ్బున్నది. నేను వారితో ఁజెప్పను. ఇంక రా! అసిరి : మీరును నా వంక నటునిటు చూడరాదు. అట్లు చేసినచో వారనుమానపడెదరు. ధర్మా: చూడనులే. మవ్వును గలిసి కొండదాకఁ బోయిరి. అప్పటికి గుఱ్ఱపు

బండిమీఁద సూర్య పతియు యిక్వురు కూతుండ్రును, నతని భార్య ఛాయాదేవియు, సరుంధతీయు, నాను కుమారుఁడును వచ్చిరి. సూర్య పతి 'కొబ్బరికాయలు, హారతికర్పూరము, పసుపుకుంకుమలను గొని పోవుదము, దుర్గగుడికి' అని డబ్బుఁ దీయుటకు జేబులోఁజేయి పెట్టెను. పశుపతికూడ జేబులోఁ జేయి పెట్టి డబ్బునంచిలేక చటునిటు చూచి గల్లంతు పడుచుండెను. ధర్మారా 'వేమి' టనెను. పశుపతి 'డబ్బు సంచిలేదోయి!' యనెను. ధర్మా: నీ వెంత ధనవంతుడ వైనను సంత యశ్రద్ధ వేమి? ప్రక్కజేబులో వేసికొందురా? అందులో నీ యెడ లేనీకుఁ దెలియదాయెను. పశు అంత తెలియకుండ లేను గాని, యేదో పొరపాటు వచ్చెను.

అసిరి నెమ్మదిగా వెనుక వెనుకనే వచ్చుచుండెను. సూర్యపతి వానిని ఁజూచి 'యడుగో! దొంగ కుంక! యిట్లురా! డబ్బుసంచిసంచి పశుపతి కిచ్చి వేసెను. అసిరి డబబ్బ

పశుపతి : నీకెంత కావలయునో తీసికొని యీయరా, అసిరి : తీసికొన్నాను బాబూ! బీడీల కర్ధణా తీసికొన్నాను. ధర్మా: ఇంటిలో బియ్యమున్న వటరా? అసిరి : నేఁటి కున్నవి. ధర్మా : వఱి తేపటికో? అసిరి: తేపింకను రాలేదు కదండీ! తేపటి మాట, తే) (ప్రొద్దున మరెవరో దొరకరా? పశుపతినిఁ జూపించి అయ్యగారే యుండినచో మఱలఁ గాఁజేసెనను. మువ్వ రురు విఱుగఁబడ సవ్వరి. పశు: నేనొక రూపాయి యిచ్చెను. తీసికొనుము. రెన్నాళ్ళిపఱకు దొంగతనము చేయక్కఱలేదుకదా ! అసిరి: దొంగతనము చేయకున్నచో నాకుఁ దోచదండీ! ఆ రోజున నాకు సయించదు. మీరూరకేయిచ్చినచో నది బిచ్చము వంటిది. నేను సంపాదించుకొనియే తిందును. ధర్మా: దొంగతనము సంపాదనఁటరా! అసిరి : చిత్తము ! చిత్తు! పెద్ద పెద్ద జీత గాంశ్రందఱును జేసెడి దేమిటండి? నేను న్యాయముగా సంపాదిం చున్నాను. వారన్యాయముగా సంపాదించుచున్నారు. సూర్య : నీది న్యాయము ; వారి దన్యాయమా? ఆసిరి: నేను నా కున్న విద్యవలని నెవ్వరికిఁ దెలియకుండ, నెవరికిని నష్టములేకుండ, నాకు జాలినంత మాత్రమే తీసికొని తృప్తిపడుచున్నాను. వా రందలును విద్యవలసఁగాక సిఫారసులు, లంచాలు పెట్టి యందఱికినిఁ దెలిసిన యన్యాయవృత్తి చేత బోలెడంతమంది పేదవారికిఁ దిండిలేకుండఁ జేసి సంపాదించుచున్నారు, నేయి యన్నముఁ దిను మహాజులు మీరు చెప్పుఁడు. ఎవరిది న్యాయము? ధర్మా: వానికిఁ జూచితిరా!

యెంత యర్థశాస్త్రము తెలియునో! అందలు గొండ మెట్లెక్కుచుండిరి. అసిరియు నెక్కు చుండెను. ధర్మారావు అసిరితోఁ గలసికొనెను.

ధర్మా : మఱి నీ వింత జాగ్రత్తగాఁ జేయుచుండఁగా బోలీసువాఁడ్రు నిన్నెట్లు పట్టుకొందురు? అసిరి: వెధవ లిప్పుడు సన్ను పట్టుకొనలేదు. చిన్నప్పు డొకటి రెండు తెలివి తక్కువగాఁ జేసితిని. అప్పుడు నన్ను ఖైదులో వేసిరి. అప్పటినుండి వారికి

నామీదఁ గన్న. అంతేశాని వారు నన్నుఁ బట్టుకొనియేడ్చిరా ! పట్టుకొని మాత్రము నాకేమి నష్టము? ఇక్కడకన్న నా కక్కడనే బాగుండును. దిగులు లేకుండ గవర్నమెంటువారు పోషింతుకు. ధర్మా: దొంగతనమ లో మెలఁకువలన్నియుఁ దెలియునా నీకు? అసిరి: నేను జేబుదొంగనుమాత్రమేనండి. నాకీవిద్య సంపూర్ణముగాఁ దెలియును. పెద్దవాండ్రుకూడ సిసలు పెద్దదొంగతనము చేయరండి ! ఎవరో ధనవంతులు, నుద్యోగస్థులే చేయించెదరు. ఒక్క టమాట వినుఁడు! వేదవాని కావూఁట్ర గడచినఁ జాలును. రేపటి సంగతివాఁడు చూచుకొనఁడు. ఒక్కటిచూడండి. లోకములో నిన్ని దొంగతన ములు జరుగున్నువికదా ! బాగుపడినదొంగ యెవఁడు? ధన మంతయుఁ జేయించినవాని యింటికిఁ జేరును. కల్లుదుకాణమునకుఁ గావలసినంతమాత్రమే ఏఁడు తీసికొనును. రెండేండ్ల కఠినపునరకము వీరికి. ఇది మన దేశములో మాట. లండనులోనటండీ, దొంగతనము చేసి ధనవంతులగుదురఁట. వారు టార్చిలైట్లు, అద్దాలు కో సెడి సాధ సములు, తాళములు కరఁగించు లైట్లువుచ్చుకొని దొంగతనము చేయుదురఁట. హస్తలాఘవము వారికేమి తెలియును? అది వన దేశములోని విద్య. ధర్మా: నీ కీ వర్తమానములన్నియు నెట్లు తెలి యుము? అసిరి: సూలోఁ బత్రికలు చదివి వార్తలు చెప్పెడివారు కొంద ఱున్నారు. ధర్మా: మీ దొక పెద్ద సంస్థ రా! ఆసిరి: అనఁగా? ధర్మా: ఏమియును లేదు లే.

దుర్గగుడికి సందఱును బ్రదక్షిణము చేసిరి. అసిరియుఁడ్రిగాను. కొబ్బరికాయలు కొట్టిరి. బలహీనురాలైన యరుంధతి పిల్ల వాని నెత్తు కొన లేకపోయెను. ఛాయాదేవి కొడపిల్ల నాలుగేండ్లది. ఆమె యామెను దించి రామేశ్వరశాస్త్రి నెత్తుకొన్నది. సూర్య: ఆమె చాల చిక్కి పోవుచున్న దయ్యా! మునుపు నేను చూచినప్పటి కిప్ప టికీఁ జాల భేదమున్నది. పశు: మం దేమైన తప్పక యిప్పించనల యును సుమా! ధర్మా; మీ యిర్వురితో గోలగా నున్నది. దగ్గఱ డబ్బెక్కడ నున్నది? ఉండికి పదిరూపాయ లప్పుచేసి వచ్చిఅందఱును దేవీ ప్రసాదము తినుచుండిరి. ఆసిరికొక రెండు కొబ్బరి చిప్పలిచ్చిరి. ఎల్లరునుబోయి మల్లికార్జునస్వామినిఁ గూనె దర్శించి, ఎఱి కొండపై కిఁ బోవు మార్గమునొద్దఁ గొంత పై కిఁబోయి మువ్వకును గూర్చుండిరి. ఆత్రోవ మొదట ఛాయారుుధతులు, పిల్లలు.

ధర్మా : ఒరేయి! అసిరీ! పెద్దదొంగలను బట్టుకొనినచో దొంగలు మేము చేయలేదు, వారు చేయించిరని యెంచుకుఁ జెప్పరు? అసిరి : అది కులవిద్య. తాను చేసితినినిగాని, యితరులు చేసిరనిగాని చేయించిరనిగాని చెప్పగూఁడదు. ఇది మొదటనే ప్రమాూణము చేయ వలయును. ధర్మా : అట్లు చేయించిన వారి నెవరినైన నెఱుగుదువా, నీవు? అసిరి : బాబోయి, పేర్లు చెప్పగూడదండీ! ధర్మా : ;- మన మిచట నలువురమేకదా! అసిరి : ఆరోజు వచ్చునప్పటకి గాలికూడ. సాక్ష్యమిచ్చును. ధర్మా: నీకుఁ నీ విద్యలలోని రహస్య ములన్నియుఁ దెలియునురా! అసిరి : లేకపోయిననే నాతల్లియు, నేను నెట్లు బ్రతుకు చున్నాము? ధర్మా : ఎవరినో యొకరిని జెప్పుము. 30: అయ్యా! చెప్పరాదు సరికదా; మీరు తీసికొనిపోయి యెచ్చటను వ్రాయనుఁగూడ రాదు. పశు : ఈయన కవియని నీకుగూడఁ దెలిసిన దియా? ధర్మా : వ్రాసిన చోఁ గుండలీకరణము చేసెదను లెమ్మ, 'దానికి నిన్నేమియుఁ జేయరాదు.' అని క్రింద మరా వ్రాసెదను! చెప్పుము. అసిరి. రహస్యముగా నేదియో చెవిలోఁ జెప్పెను. ధర్మా: ఆహాహా! మతము చెప్పుటలో నిదికూన భాగము కావలయును. ఈ రీతిగాఁగూడ దోచుకొనవలయును! నీ వృత్తిరహస్యములన్నియు నాకుఁ జెప్పునుంటివికదా! నేను పోయి ' పోలీసువారితోఁ జెప్పిన నేమిచేసె దవు? అసిరి : నా వద్ద దొంగసొమ్ము చూపించవలయును. పట్టుకొన వలయును. ఇంకొక మార్గము లేదు. మా కందఱకును "లా" తెలుసు సండీ!

అందఱును గొండదిగి యింటికిఁబోయిరి. అసిరిని బలవంతము చేసి పశుపతి రెండురూక లిచ్చెను. వాఁడు నే నూరకే తీసికొన సనఁగా ధర్మారావు “నీవు మా కీనాఁ డెంతచదువు చెప్పితివి? దాని బదులు తీసి " మ్మనెను. అసిరి : చదు వమ్మి డబ్బుతీసికొనరా

దండి' యనెను. ధర్మారావు 'నే నటువంటివాఁడ నేలే! నా దగ్గఱ బుచ్చుకొన్నచో దోషము లేదని యిచ్చి పంపించెను. మఱునాఁ డరుంధతీ ధర్మారావులు సుబ్బన్న పేఁటకుఁ బ్రయాణమైరి.

పశు: జేబులో డబ్బుజాగ్రత్త. ధర్మా: సుబ్బన్న పేఁటదాఁక రైలుఛార్జి మాత్రమే యున్నది. పశు: కా దిక్కువ యున్న దేమో చూడుము! ధర్మా : నీ వేమైన వేసితివా యేమి? అని చూడ కొనఁగా హైదు పదిరూపాయల నోట్లుండెను. ధర్మా : ఇదా ? ఏమిటా బరువుగా నున్న దనుకొంటిని. ఎందు కీ డబ్బు నా జేబులోఁ బెట్టితివి? పశు: నేను పట్టలేను. ధర్మారావు దానిని మఱలఁ జశు పతి కీఁబోయెను. సూర్య: వద్దులే! జేబులో నుంచవయ్యా! వఱలఁ జూచినచో వైదికుఁడవు. నియోగులవలెఁ బెట్టు పోయెదవు అని గద్దిం చెను. ధర్మా: అతిని డబ్బుకు నీ యధికార మేమిటి? సూర్య : పశుపతిగారు నీ కంతమాత్రి మీయవచ్చునులే…రైలు కదలిపోవు చుండఁగా సూర్యపతి పశుపతులక మహాపురుషుఁ డొకఁడు తమ్మ వదలిపోవుచుండె సనిపించెను. ధర్మారావునకుఁ దాను పశుపతిడబ్బు తీసికొనినట్లేలేదు. రైలులో మధ్యమధ్య సతీపతులుమాట్లాడుకొనిరి. అరుం: అరుంధతి వత్తుని యేడ్చినది. తల్లి కోపపడెను. బుద్ధి తెలిసిన పిల్ల గనుక నూరకున్నది. ధర్మా: తీసికొని రాకపోతివా! నీ పనికొంత యదియుఁ జేసెడిది. అకుం: బాగుగానున్నది. స్నేహము పేరుచెప్పి ధనవంతుల పిల్ల చేతను గూడఁ బని చేయించుకొనవలయును. ధర్మా: వచ్చెడి మగఁడామెను సుఖ పెట్టు పనిఐహ్మశమేమిటి? అరుం: మీవంటి వారే యైనచో సంతే రైలు మఱికొంతదూరముపోయెను. అరుం: ఒక్క తెయు నత్తయ్య యెటుండెనో! ధర్మా: ఎంత యత్తింటి కోడలివే! ఇప్పుడు జ్ఞప్తికి వచ్చిన దత్తగారు!

రైలు దిగిరి. కుమారస్వామి యెదురుగా వచ్చెను. ధర్మా రావు చేతిలోనుండి పెట్టె తాను తీసికొనెను. ధర్మారావు కొడుకు నెత్తు నేను. వాఁడు బుస్సలు కొట్టును తండ్రిమీఁది కురికెను.

అరు: అంతసే పెత్తుకొనిన దానిని నేను పోయినాను. అరుంధతి బండిలో నెక్కెను. కుమారస్వామి ధర్మారావులు నడచు చుండిరి. కుమా: చక్రవర్తి ఉడాయించె నండోయి, ఆరోజున మీరు వెళ్ళిన తరువాత మఱల మిమ్ముఁగూర్చి పెద్దచర్చ. మీరంత చెప్పకుండ వెళ్ళితి రేమి? మరునాఁడు మీ యింటికి వచ్చితిని. మీరు లేరు. ప్రతిరోజును, ప్రతిరైలుసకు మీ కొఱకు వచ్చు చుంటిని, ధర్మా; నేను వచ్చినతరువాత నే మన్నా రేమి? కుమారః లక్షయున్నవి. ఒకటి ధ్రువము మంగమ్మ మనపక్షము. సావిత్రమ్మ గారు బండి యాగినంతనే మనుమనికిఁ బేడ దృష్టితీసి, కోడలికి గాళ్ళమీద నీళ్ళుపోసి, లోనికిఁ దీసికొనిపోయెను.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి