shabd-logo

తొమ్మిదొవ భాగము

18 January 2024

2 చూడబడింది 2

విష్ణువర్ధనుడు : కంపనప్రభూ! బలముచే నీకోటను పట్టుకొనవలెనన్న చో నన్నగా రుపయోగించిన బలము నంతను ఉపయోగించవలసి యుండును. మన సై న్యముతో నీ కోటను జయింప యత్నించుట, కొండద్రవ్వి నెత్తి నెత్తు కొన జూచుటవంటిది.

కాలకంపనుడు : అగును, మహాప్రభూ! దీనికి దగు నుపాయమును దామే పన్నవలయును.

కుబ్జ : ఈ పృథ్వీమహారాజు కాలనేమివంటివాడు. జత్తులమారి, స్వామిద్రోహియు, ఈతనివలన నటు కళింగ రాజ్యమును, ఇటు విష్ణుకుండిన రాజ్యమును రెండును మోస గింపబడినవి.

జయనంది : మహాప్రభూ! ఇంతవరకు నొక పెద్ద యుద్ధమైన చవిచూచి యెరుగను. మా చేతులు నిదుర పోవుచున్నవి. మాకు సెలనిండు, మూడు కోట గోడలు గలిగిన యీ త్రిపురమునకు మేము పురహరులమయ్యెదము.

కుబ్జ : త్వరపడకుమయ్యా ! గుమ్మడికాయంత పండు నిచ్చి మ్రింగమందును, అపు డేమి సేతువు?

జయ : అది మెత్తనిపండా, గట్టిపండా మహాప్రభూ !

కుబ్జ : పండు మెత్తనిదగుటలోనను, గట్టి దగుట లోనను నేమున్నది?

జయ : మెత్తని దగుచో ముక్కలు చేసి మ్రింగ వచ్చును.

కుబ్జ : గట్టిదయినచో ?జయ : దానిని ముక్కలుగా కోసి, నమలి మ్రింగ వలయును.

కుబ్జ : కావున ముక్కలు చేయుట పండు ఎట్టిదైనను సమాన మన్నమాట!

బయ : చిత్తము,

కాల : కావున నీ కోటను బట్టుటకు, గోట సంరంక్ష కుని ఏకాగ్రతను జెదరగొట్ట వలెనని మహాప్రభువులు...

కుబ్జ : అదియే నా త్రిప్పికొట్టు తంత్రప్రయోగము, కోట బాహిరముననున్న మనపైశత్రువుల దృష్టి కేంద్రీకరింప బడియున్నది. మన మేమి పన్నాగములు పన్నిసను, శత్రు వులు దానికి ప్రతిని బన్ను చునేయుందురు. కావున, కోట లోపల నొక సంక్షోభమునకు వారి దృష్టిని మరల్పగల్గిన చో వారి యేకాగ్రత ద్విముఖమగును, రెండు ముఖములున్న దానిని బహుముఖములుగా మార్చుట యతి సులభము.

జయ : లోన మన మెట్లు సంక్షోభమును సృజింప గలము మహారాజా?

కుబ్జ : ఓపిక పట్టుమ

ఆ రాత్రి చాళుక్యసైన్యము లన్నియు నప్రమత్తత తోనే మహారాజు నాజ్ఞ కొఱకు నెదురు చూచుచుండినవి.

నడికి రేయి యగునప్పటికి బదివేల రెండెడ్ల బండ్లను ఎద్దులవిప్పివైచి ఒకొక బండి నెనిమిదిమంది వీరుల చొప్పున లాగికొనుచు, సార్థ యోజనము చుట్టుకొలతగల కోటచుట్టునుమూడు యోజనముల వృత్తముగా నాక్రమించిన చాళుక్య సైన్యములను కుబ్జవిష్ణువర్ధనుల యాజ్ఞగా జయనంది కొని వచ్చెను, ప్రతిబండి పై నను దిట్టములై సదూలముల నడ్డముగా నిలువుగా గట్టించినాడు జయనంది. చక్రములకు వాని వెడ ల్పునకు సరిపడు పొడుగుగల సన్నని గట్టి దూలములను గట్టించినాడు. ఇవన్నియు విషమసిద్ధి మహాప్రభువు నాజ్ఞ లే! ఒక్కొ కబండి క్రిందుగా నలుగురు విలుకాండ్రును, నెనిమిది మంది బండిని వెనుకనుండి త్రోయుటకును నుండుటకు మహా ప్రభువు నాజ్ఞ.

ఈ బండ్ల వెనుక శిలాపాతనయంత్రములు, నగ్ని బాణ యంత్రములు, శిలాచక్రయుక్తము లైనవి రథమువలె బోవుటకుగా సిద్ధము చేయబడినవి.

కోటలో సర్ధరాత్రి భేరీ నినదించిన గడియకు పుర మధ్యమునఁ బెద్ద గగ్గోలు బయలు దేరెను. నిదుర గూరిన ప్రజలందరు నొక్కసారి మేల్కొనిరి. అటనట కొన్ని యిం డ్లంటుకొని పోయినవి. హాహా హాహాకారములు మిన్నుముట్టెను, ఇంతలో శత్రువులు కోటలో బ్రవేశించిరను గందరగోళము నగరమంతయుఁ బ్రాకిపోయినది. కోట గోడలపై నచ్చ టచ్చట 'శత్రువులు ప్రవేశించినారు, శత్రువులు ప్రవేశించి నా' రను కేకలు రణభేరీనినాదములు నొక్కుమ్మడిగ నుద్భ వించినవి. ఎక్కడేమి జరుగుచున్నదియు నేరికిని దెలియ లేదు.

ఉన్నట్లుండి నగర పూర్వగోపుర మహాకవాటములు తెరుచుకొనిపోయినవి. ఆ ద్వారమును శత్రువు లాక్రమించినారని అక్కడకు దొందరపాటుగ వచ్చిన పృథ్వీమహారాజు కనుగొని మజల వేగమున వెనుకకు దానెక్కిన యశ్వమును బరుగెత్తించుచు రాజప్రాసాద గోపురము కడకు జేరెను. ఈ సంక్షోభమునకుఁ గారణ మేమైయుండునో యని తికమక పడుచు దన పట్టపుటేనుగు నెక్కబోవు పృథ్వీమహారాజు నకు ఉపసేనాధిపతి తూర్పుద్వారము శత్రువుల వశమయ్యె సని మనవి చేసినాడు. కోటగోడల పైన అమర్చిన శతఘ్ని యంత్రాదికముల నుపయోగించుడని యాజ్ఞ నిడువారైన లేకపోయిరి, శత్రువుల వైపునుండి యంత్రము నుపయో గించు రంగురంగుల బాణసంచులు వచ్చి కోటగోడమీది సైనికులను ముట్టడించువారికి స్పష్టముగ జూపుచున్నవి.

తూర్పుద్వారమునుండి చాళుక్యసైనికులు తండోప తండములుగ కోటలోనికి గట్టుతెగిన ప్రవాహమువలె రా జొచ్చిరి. ఆ సైన్యమును నడుపుకొనుచు చాళుక్య విష్ణువర్ధ నుఁడు నారాయణహస్త వినిర్ముక్త చక్రమువలె, తూర్పు గోపురద్వారములను మూటిని దాటి నగరములోనికి వచ్చి పడెను. అతనితో సమముగ కేతనముధరించి అంగరక్షక దళాధిపతి బుద్ధవర్మ వచ్చుచుండెను. “కుబ్జవిష్ణువర్ధనుడు!” "కుబ్జవిష్ణువర్ధనుడు!" అను నినాదములు మిన్నుముట్టగనే యాతని వేగము నడ్డగించువారుగూడ నాయుధములు విడిచి, జోహారు లొనర్చిరి,

ఇంతలో నుత్తర గోరపుర ద్వాములు మూడును దెరచుకొని పోయినవి. అవియు చాళుక్యసైనికుల హ స్తగతములైనవి. ఆ ద్వారము నుండి యేనుగుల సడుపు కొనుచు సేనాధిపతి కాలకంపన ప్రభువు, లోనికి జొచ్చుకొని వచ్చినాడు.

యుద్ధ ప్రారంభముు గగ్గోలు బయలు దేరిస ప్రథమ క్షణములందు కోటగోడలమీది సైనికు లేమి చేయుటను దోచక, మ్రాన్పడిపోయినను, శత్రువులమీదికి వారను బాటులోనున్నను, లేకపోయినను సగ్ని బాణములు గండ శిలలు ప్రయోగింపసాగిరి.

చాళుక్య సైన్యములనుండి యెడ్లులేని బండ్లు వానియం తటనవే నడుచుచు వచ్చుచున్నట్లు వానిలో మండు కాగడాల వెలుతురులో గోటగోడలమీది సైనికులకు గన్పడి ఈవిచిత్ర మేమని వారు చూచుచుండగనే వానికి నాతిదూరమున శిలలు సగ్ని బాణములు విసరివేయు యంత్రములు వచ్చు చుండెను.

నగరములో గగ్గో లెక్కువైనది. లోపలనుండియే చాళుక్యసై నికులు కోటగోడలపై వచ్చిపడుచుండిరి. చాళుక్య సైనిక లాక్రమించుకొన్న ప్రతి కుడ్యగోపురమునను రంగుల బాణసంచులు వెలుగ నారంభించినవి. ఎడ్లులేని బండ్లు మఱియు దగ్గరకు వచ్చినవి. రాళ్ళగట్టిన నిచ్చెనత్రాళ్ళను యంత్రములద్వారా చాళుక్యసైనికులు కోటగోడలపైకి విసరి వై చిరి, పృథ్వీమహారాజు సైస్యములుగాని, కళింగ సైన్య ములుగాని, కోటగోడలనుండి, యా వచ్చు బండ్లపైన నెన్ని యస్త్రప్రయోగములు చేసినను ప్రయోజనములేక పోయినది.విష్ణువర్ధనుడు నవ్వుచు జయనందితో, 'ఓయి వెట్టి వాడా! నేను వాతాపి నగరమునుండి బయలు దేరినప్పుడు పిష్టపురదుర్గ వ్యవహారము నేమియు నెఱుగక బయలు దేరితి ననుకొంటివా ! అన్నగారు ఈ దుర్గమ దుర్గమును బట్టలేదా! అన్నగారి సేనాధిపతుల కీ కోటసంగతి పూర్తిగా దెలియదా! ఈ దుర్గమునందున్న ప్రత్యంగుళ భాగమును, అందలి రహ స్యము లన్నింటిని, మున్నే తెలిసికొంటిని. అన్నగారు బహు పరాక్రమముచే దీని గెలిచిరి. నేను గంభీర రహస్యోపాయ ముదే దీని సాధింపదలచితిని, వాతాపి నగరమునుండి సైన్య ములతో యుద్ధయాత్ర సాగించుటకు మున్నే వేవురు జైన సన్యాసులు, నాలుగు వేల భిక్షుకులు, రెండుమూడు వేల పల్లె ప్రజలు వచ్చిరి. ఒక వేయిమంది వర్తకులు, మూడువేల గుఱ్ఱముల గొని ఆశ్విక వణిజు లటుల వచ్చిరి. వివిధ వేష ములతో బది వేలమంది దిట్టరులైన మనసైనికు లాయా వేషములతో నీ నగరమున వచ్చి చేరిరి. ఆటగాండ్రుగా దళవాయులు వచ్చిరి. తోలుబొమ్మల యాటకాండ్రుగా సేనాపతులు చేరిరి. శివదాసులుగా గూఢచారులు వచ్చి యుండిరి. కొందరు విరోధుల సైనికుల మన పక్షమునకు ద్రిప్పి వేసి, మన సైనికులు చాలమంది, పృథ్వీ మహా రాజు సైన్యములో జేరవచ్చినట్లు వచ్చిరి. అన్న గారితో చేసిన యుద్ధములో బిష్టపుర సైన్యము లెన్ని యో మడిసినవి Xw!మజల గుట్రలు తలయెత్తుచుండును. విడివిడిగా నోడిపోయిన శత్రువులు మడ ముందరము గలిసినచో, విజయము మనదే యై యుండెడిదని యా శోచించుకొందురు, రాజ్యమున సంక్షోభ ములు తప్పవు.”

శాకంపనుడు తన ప్రభువు యుద్ధనీతికి నాశ్చర్య మందెను, ఆ మరునాడు కుమార విష్ణువర్ధన ప్రభువు నిండు పేరోలగంబున గొలువుదీర్చి ముండ దీనవదనయగు నొక బాలిక సింహాసన వేది శాసోపాన పాదపీఠము కడకు పరుగిడి వచ్చి సాష్టాంగముపడి 'దేవా! రక్షించుము! రక్షించుము!' అని యరచి, మూర్ఛపోయెను.

తమ కష్టముల నివేదించుకొనుటకు రాజదర్శనార్థ మెవరు రాఁదలచు కొన్నను వారికెట్టి యాటంక ముండ రాదని విష్ణువర్ధను నాజ్ఞ. కాలకంపన ప్రభువు తన యాస నము నుండి దిగ్గున లేచి, యా బాలికకడకు బోయి, మోక రించి “బాలిక మూర్ఛపోయినది, మహాప్రభూ!" యని విన్నవించి వెంటనే పన్నీరము కొనిరండని దౌహరికుల కాజ్ఞ యిచ్చెను.

విష్ణువర్ధనుని చిన్నతనమునుండియు బెంచిన వారిలో నొకడగు రాజవైద్యు డింతలో నచటకువచ్చి, యా బాలిక సనాయాసమున నెత్తుకొని, రాజసభామందిరమునకు వెనుక నున్న యాలోచనా మందిరమునకు గొంపోయి, యచట నొక మంచాసనముపై బరుండబెట్టి నాడి పరీక్ష సేయు చుండెను. వైద్యని వెనుక నే విష్ణువర్ధనుడు కాలకంపన ప్రభుప్రార్ధ సాధనమునకై తమ జీవితములు సమర్పించు మానవు లేపాటి గలగు! దురాశాపిశాచగ్రస్తుడైన మనుష్యుడు హీనాతిహీనముగ సంచరించును. యాలోచించు కొనుచు నా బాలిక స్థితి యెట్లున్నదో తెలిసికొనుటకై తొందర పడుచుండెను,

ఇంతలో రాజవైద్యుడును, కాలకంపన ప్రభువును నచ్చటకు విచ్చేసినారు,

వైద్యుడు : మహారాజా! ఆ బాలిక వేంగీపుర విష్ణం

కుండిన మహారాజు నేక పుత్రిక. అంశుమత్యభిధాన. ఆమె జాతకమునందు గొన్ని గ్రహదోషముల బరిహరింప వారి రాజగురు వామెను మాఘస్నానవ్రతిశీను జేసెనట. ఆ రాకుమారి నాలుగు ఉనమఃల పూర్వమువఱకు గోవూరు నందు వీడిది తీర్చి గౌతమ్ులో స్నానవతమును సంపూర్ణము సేయుచుండినది. ఆ సాయంకాలము కోటిలింగాల క్షేత్రమున నున్న సర్వబ్రాహ్మణ్యమునకు వివిధదానము లర్పించి, తిరిగి, తన రాజనౌకపై గోవూరు జేరబోవు సమయమున నామెను, చెలియైన నీ బాలికను ఎత్తుకొని, యిచ్చటకు దెచ్చి, రాజాంతఃపురాంతర కారాగారము బంధించిరట!

విష్ణు : ఎవరా సరరూప నిశాచరులు ? కంపనప్రభూ! మీ రీ విషయమతియు నామూలాగ్రముగ విచారించి, యా దుర్మార్గు లెవరో కనుంగొనుడు

కాలకంప : మహాప్రభూ! ఆ బాలికను గొనివచ్చిన నీచులు కాళింగులే! నే నప్పుడే యీరాణివాస పరిచారకు

అడవి బాపిరాజు ద్వారా మరిన్ని పుస్తకాలు

1

అంశుమతి

13 January 2024
0
0
0

శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారక దేవుని ఏకై కపుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయు చున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ

2

అంశుమతి రెండవ అధ్యాయము

13 January 2024
0
0
0

కృష్ణాతీరమున నుత్తమక్షేత్రములలో నొకటియగు విజయ వాటికయందు సర్వమల్లి కేశ్వరుని అర్చించుటకై సకుటుంబ ముగా విడిది చేసి యుండెను. మహారాజుక్న నెలదినములును నా నగరవాసులును పరిసర గ్రామప్రజలును మహోత్సవము లొనరించుక

3

అధ్యాయం 3

16 January 2024
1
0
0

ఈ యా వు త్తమజాతిజ యని రోదించినాడు. తన కోడె దూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుం బము వారందరు అల్లారుముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆయజమాని పడు వేదనను మేము చూడలేకపోతిమి. అత డా దూడక ళేబరము నెత్తికొని తనయ

4

4 అధ్యాయము

16 January 2024
0
0
0

రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను, “నే నెట్టి దండమునకై నను బాత్రుడను. నన్ను మహా రాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది, మహాదండ : ప్రభూ! ధర్మవిచారణ జరిగినది. రాజకు : ఆ

5

ఐదవ భాగం

16 January 2024
0
0
0

గొల్చుచుండిన విష్ణుకుండిననగరవాసులైన యాజ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట. ఈవిధమున నాలో చించుకొనుచున్న అంశుమతిని 'ఏమమ్మా, భర్తృదారికా ! ఏ మాలోచించు చుంటి' నని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను 'ఏమని చె

6

ఆరవ భాగము

17 January 2024
0
0
0

లతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతుల

7

అంశుమతి ఏడవ అధ్యాయము

17 January 2024
0
0
0

"అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీ

8

ఎనిమిదవ భాగం

17 January 2024
0
0
0

కొకటి కాపుగాయుచుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలు బది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవ నులును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతి కుడ్యోప

9

తొమ్మిదొవ భాగము

18 January 2024
0
0
0

విష్ణువర్ధనుడు : కంపనప్రభూ! బలముచే నీకోటను పట్టుకొనవలెనన్న చో నన్నగా రుపయోగించిన బలము నంతను ఉపయోగించవలసి యుండును. మన సై న్యముతో నీ కోటను జయింప యత్నించుట, కొండద్రవ్వి నెత్తి నెత్తు కొన జూచుటవంటిది. కా

10

అంశుమతి పదవ భాగం

18 January 2024
1
0
0

లను దీవ్రముగ బ్రశ్నించితిని. గాంగులకు విష్ణుకుండిన రాజ్యము నంతను గబళింపవలెనను దురాశ గలిగినది. విష్ణు : ఆ దురాశ యీనాటిది కాదుగదా! కాల: విష్ణుకుండిన మహారాజున కీమె యొక్కతయే సంతానము. ఈ బాలికను వివాహమాడి

11

పదకుండవా భాగం

18 January 2024
0
0
0

'నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు ఆ యీ సం భాషణలలో వా రా భావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్ర మెన్ని యోమారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహా

12

పన్నెండవ అధ్యయము

18 January 2024
0
0
0

ఆ సాయంకాలము చాళుక్య విష్ణువర్థనుడు తన సైన్య ములతో గోదావరిని దాటి, గోపాదక్షేత్రమున దండు విడిసి యున్నాడనియు కోన రాష్ట్రమునుండి హైహయు లాయువ రాజును సందర్శించి, సామంత ప్రాభృతములను సమర్పించినా రనియు, మంచనభట

13

పదమూడవ భాగం

18 January 2024
0
0
0

మంతయేని దెలియని తలిదండ్రులు నన్ను విష్ణువర్ధన మహా రాజున కీయ సంకల్పించినారట!' 'ఔనమ్మా ఔను, మనము గోవూరునుండివచ్చినది మొద లీవిషయమును గురించి యంతఃపురమునందు భాషించుచున్నారట. రాజుల రహస్యములన్నియు బరి చారిక

14

పద్నాలుగువా అధ్యయము

18 January 2024
0
0
0

వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగ మునకు 'జలసీమ' యని పేరు. ఆ సరస్సు అతి పురాతనము, భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును బంగారు పంటలు పండుచుండును, ఈ సీమన తను బరిపా లించు సామంతుడు బృహత్ప

15

పదియాదవ భాగం

18 January 2024
0
0
0

సామంతులు కావచ్చును గదా! అదియును గాక, నేనొక సామంతుడను, సైనికుడను. ' 'ప్రభూ ! సామంతత్వముగాని, మహారాజాధికారము గాని అంతఃకరణవృత్తికి నుద్దీపన మెట్లగును? నిజమును గోచ రింప జేయునది అంతస్సాక్ష్యము. నాకా పిష్ట

16

పదహారవ అధ్యయము

18 January 2024
0
0
0

శ్రీ సత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహే శ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువని రాజన్యకిరీటాంచిత రత్న కాంతి నీరాజిత పాదసరో రహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ధి పుల కేశి పృథ్వీవల్ల భ చక్ర వర్తి

---

ఒక పుస్తకం చదవండి