shabd-logo

పన్నెండవ అధ్యయము

18 January 2024

1 చూడబడింది 1

ఆ సాయంకాలము చాళుక్య విష్ణువర్థనుడు తన సైన్య ములతో గోదావరిని దాటి, గోపాదక్షేత్రమున దండు విడిసి యున్నాడనియు కోన రాష్ట్రమునుండి హైహయు లాయువ రాజును సందర్శించి, సామంత ప్రాభృతములను సమర్పించినా రనియు, మంచనభట్టారక మహారాజునకు వార్త వచ్చినది. ఆ విష్ణుకుండిన మహారాజు చాళుక్య యువరాజు రాకకు దమ యానందము వెలిబుచ్చుచు, నగర మంతయు బ్రజలలంకరింప వలెనని యాజ్ఞ దయచేసినాడు. చిత్రరథస్వామి మహోత్సవ ముల కొఱకు ఓట్టణ మిదివరకే సుందరతరముగా నలంక రించుకొన్నారు నగర ప్రజలు,

ఆ మరునాటి యుదయముననే వేంగీపురమునకు తర గోపురముకడకు విష్ణువర్ధనుడు తన సైన్యముల నడిపించుకొని వచ్చెను. నగర బాహిరోద్యాసముల సైన్యములకన్నింటికి శిబిరము లేర్పరుపబడినవి. యువమహారాజు సంగరక్షక బలముమాత్రము విష్ణువర్ధనునితో సగరము బ్రవేశించినది.

గోపుర ద్వారముకడనే విష్ణుకుండిన రాజ్యమహామంత్రి ఆదిత్యకీర్తియు, రాజగురువగు నారసింహభట్టులవారును, సర్వసేనాధిపతియగువిజయేంద్రగోపుడును, రాజోద్యోగులతో సామంతులతో నెదుర్కొని జయములు బలికినారు. బ్రాహ్మమహారాజా! మీరు మా వేంగీనగరమును దమ యావాస నగరముగ జేసికొనుడు. ఇచ్చటనుండి యే తా మటు ఈ శా స్యమున గళింగ గాంగులను, దక్షిణమున పల్లవులను అడచి యుంచవచ్చును.

'కృతజ్ఞుడను మహాప్రభూ! విష్ణుకుండిన సామంతులే కొందరు తిరుగుబాటులు చేయుచున్నారు. గృధ్రవాడ రాష్ట్రాధిపతి పల్లవ వంశీయుడు. తాను కాంచీపుర పల్లవ మహారాజునకును, నీటు తమకును గప్పము కట్టక, తాను భట్టారకశబ్దము వహించి, స్వాతంత్ర్యము బ్రకటించుకొన్నా డని వేగువచ్చినది. అట్టివారందరు తిరిగి తమకు గప్పము గట్టగలరు.

ఈ విధముగ గుశల ప్రశ్నము లనేకములు జరిగినవి. ఆ వెనుక విష్ణువర్ధనునకు మహారాజు సగౌరవముగ వీడ్కో లిచ్చెను ఆ రాత్రి విష్ణువర్ధనుడు తన విడివియందొంటరిగ గూర్చుండి వివిధాలోచనములకు లోనయ్యెను తాను విష్ణు కుండిన మహారాజుకడ గప్పము గైకొనుటయా, మాను టయా? తాను పిష్టపురమునా లేక విష్ణుకుండిన నగరమునా స్థిరనివాసము చేసికొనుట పల్లవులకు బుద్ధిగరపుటకు దాను కాంచీపురమువఱకు బోవలయునా, లేదా? అప్పటి కైదు సంవత్సరములకు పూర్వము పల్లవులు, చోళులు, పాండ్యులు సందరును 'దాసోహ' మ్మని కప్పములు గట్టుకొన్నారు తన అన్నగారికిఅన్నగారు 'తమ్ముడా! ఎప్పుడో యొకనాడు ఆంధ్ర మహాసామ్రాజ్య భాగమైన చళుక రాష్ట్రమునుండి వచ్చిన వారమే మనము, ఆంధ్రరాజులు పౌరువనంతులు, వాతాపి నగరమునుండి ఆంధ్రరాజ్యములను లోబరుచుకొని యుం డుట యెంతటి వీరుడైన వానికిని దుస్సాధ్య మగుచున్నది. పెద్దతమ్ముడు జయసింహ ప్రభువు ఘూర్జరమున సుస్థిరమగు రాజ్యమును నెలకొల్పియున్నాడు. నీవు తూర్పు తీరమున మూడవ చళుక్య రాజ్యమును స్థాపింపుమయ్యా ! నీకు శ్రేయ మగును' అనుచు ద న్నాశీర్వదించినారు. తా నట్టి రాజ్య మును నిర్మింపగలుగునా !

తనకు సరియైన సైన్యమున్నచో, నెదిరి యెట్టి దిట్ట యైనను యుద్ధమున దా నసమాన విజయ మొందగలడని యాతని కెప్పుడును ధైర్యమే. తానింతదనుక నన్న గారికి ప్రతినిధిగ మాత్రమున్నాడు. రాజప్రతినిధిగనుండి పాలించుట వేరు, స్వతంత్ర రాజ్యమును స్థాపించి పరిపాటించుట వేరు. ఇంతలో నాతనికి బిష్టపుర రాజోద్యానమున గన బడిన బాలిక స్మృతికి వచ్చెను, అతడు పొట్టివాడై యెప్పు దును బాలకుడుగ గన్పించుటచే దన బందుగులు తనయందు గనబరుచు బాలభావమువలన నాతని హృదయమున నాలో చన లెప్పుడును సుడిగుండములు తిరుగుచుండును. ఈ భావ సంఘాతముల వలస నే యొకరిద్దరనిని తప్ప మనుష్యులన్న నాత నికి బరమ జుగుప్స, ఇంక స్త్రీలన్న నాతనికి మరియు నేవము.

సాధారణ రాజకుమారులు పరిచర్యలన్నియు దాసీ

జనముల వలననే పొందుదురు. విలాసవతులును, నందకత్తెలును నగు పరిచారిక లా రాజకుమారుల కనుసన్నల మెలగు చుందురు. కాకి విష్ణువర్ధనుడు శైశవమునందే తన్ను బెంచు దాదులను ని+సించువాడు. ఆదువా రాతని కంట బడగూ డదు. అట్లని యాతడు స్త్రీని ద్వేషి యు

ఇట్టి చిత్తవృత్తి గలిగిన విష్ణువర్ధను డెటుల పిష్టపుర మున నా బాలికను బలుకరింపగలిగినాడో యాతని కే ఆశ్చర్య మొదవినది. కళింగ జైత్రయాత్రా దినములలో, నప్పు డప్పుడా బాలిక యాతని మనఃపధమున బ్రత్యక్ష మగుచుం డెడిది. ఆ భావము నాతడు వెంటనే సాలెగూటి దారము లను దలిపి పేసినట్లు దులిపి వేసుకొనువాడు. నేడు వేంగీపుర ముసకు వచ్చుటచే గాబోలు తన యంతర్వృత్తియం దట్లు చొచ్చుకొని యా బాలికను గూర్చిన తలపులువచ్చు చున్నవి. ఆ బాలిక యిప్పు డేమి సేయుచుండును? రాజకుమారితో మంతనము సలుపుచుండును గాబోలు, మహారాజులకు మాత్రమే అసన్య సౌందర్యవతులగు బాలిక లుద్భవింతును కొన సక్కర లేదు. తక్కువలోతుగల సముద్రభాగములం దే అనన్యమైన ముత్తెములు దొరకును,

ఏమిటిరో యీ యాలోచనలు తసకు! తనకును నా బాలికకును నేమి సంబంధము? తూర్పుతీర రాజ్యములలో బలవత్తరము పల్లవ సామ్రాజ్యము, అది యెప్పటి కప్పు డుప్పొంగుచు నుప్పెనవలె బై కెగయుచు, బ్రాంతీయ రాజ్య ములపై విరుచుకొని పడుచుండును, పల్లవుల వలన నెన్నిరాజ్యము ల స్తమించి పోలేదు ! త్రినయన పల్లవుడుగదా తన ముత్తాత తాతగారైన విజయాదిత్యునితో యుద్ధములు చేసి యనేక పర్యాయములోడి తుద శాతని జంపివేసెను. ఏమై నను బల్లవులు దండార్హులు, వారిని గాంచీపుర రాజ్యము లోనే బంధించి వేయవలసి యున్నది. ఆతడొక నిట్టూరుపు విడిచినాడు.

చాళుక్యవిష్ణువర్ధనుడు రాజోద్యానమున వివిధాలోచ నల పాలయిన సమయముననే, అంశుమతీ కుమారి తన యంతఃపుర సౌధోపరి భాగమునందు రత్నకంబళముపై నది వసించి దిండ్ల నానుకొని, యా ఫాల్గుణ శుద్ధ దశమిచంద్రు నవలోకించుచు, వెన్నెలలు చెట్లకొమ్మలపై ఆకుల పై నృత్యము చేయుటగనుగొనుచు నాలోచనాధీన యైనది.

"తండ్రిగారికి విష్ణువర్ధన మహారాజును జూడగనే మన స్సార్ద్రత చెందినదట! ఈమహావిక్రముడు తన కల్లుడై నచో విష్ణుకుండిన చాళుక్య వంశ సంజాతులైన మహాపురుషు లుద్భవించి లోకోత్తరమైన మహదాంధ్ర సామ్రాజ్యము నిర్మింతురని యాశించుచుండిరట!

అందుకు దల్లి గారు 'ఒక నాడు యావదాంధ్ర సామ్రా జ్యము జగ ద్వైభవముగ నేలిన విష్ణుకుండిన వంశమునకు జీవరికొమ్మగ నుద్భవించిన అంశుమతి యొక సాధారణ సామంత బాలుని పరిణయమాడుట తమ రాజవంశమునకు దీరని కళంక' మని పలికిరట.ఈ సంభాషణ మంతయు దన యాంతరంగికు లగు చేటిక యోర్తు తనకు నివేదించినది, ప్రత్యూషము నుండియు దా నానందముచే నుప్పొ: గిపోయినది. ఏదియో శుభము తనకు సన్నిహిత మగుచున్నదని దినమంతయు దన కంత ర్వాణి బోధించినట్లయినది. చిత్రరథస్వామి పూజలో దివ్య తేజస్స్వరూపుడై న యా దేవుడు జాజ్వల్యమాన కాంతులు ప్రసరించుచు దనకు బత్యక్షమైనట్లైనది. ఇంతలో జలిపిడుగువలె దన తల్లి దండ్రుల సంభాషణ తెలియవచ్చినది, ధర్మహృదయ యగు స్త్రీకి దవకు గారాని పురుషుని మందు మనస్సు లగ్నమగుటెట్లు!

'రాజకుమారీ! ఒక్కరు నేమి సేయుచున్నారమ్మా! పరిచారిక లెవ్వరు నుండరాదని యాజ్ఞ పెట్టితిరట' యనుచు చెలి మాధవీలత యచటకు వచ్చినది.'

'మాధవీ ! వచ్చితివా ! పరిచారికల పొడిమాటలు నాకు విసువు గలిగించుచున్నవి. ఆకాశమును, జంద్రుడును మన కందిచ్చు భావములు నిశ్శబ్దములయ్యు మధురములు గదా!'

విష్ణువర్ధనమహారాజు మన మహాసభకు వచ్చినప్పటి వైభవమును జూచుటకు మీరు రాకపోతిరి !"

'అవును మాధవీ ! విష్ణువర్ధనమహారాజుతో గలిసి యా బాలకుడు వచ్చునో రాడో! నా హృదయమంతయు నీకు సంపూర్ణముగ దెలిపికొని యుంటిని, నా హృదయ మిసుయమున నినుపముల్లువలె గ్రుచ్చుకొనునేమోయని భయము సందుచున్నాను.'

'ఆరహస్య మెప్పుడైననూ, నాకు గంటక మగునుగ దా! ఈ పూట దాని బారినుండి నీవు తప్పింతువు. రేపది వేదొక మార్గమున నాకు ఎదురగును. నా ప్రాణమిత్రమ వగు నీ నోటినుండి యా మాటవిని యా బాధ నీసమక్షమున సనుభ వించుటకు నాకు సుకరమగును'.

'ప్రాణసఖీ! ఈ రహస్యము నీకు బాధ గలిగించు నది కాదు. దీని సఁటివచ్చు పరిణామములు నీకు బాధా కరములు గావచ్చును. అదే నా యాలోచన, విష్ణు వర్ధన మహారాజు చాల బొట్టివాడు. తాను చాళుక్య చక్ర వర్తికి దమ్ముడగుటచే నే రాజకన్యయైన దన్ను వివాహ మాడుటకు సమ్మతించునేగాని, ఇసుమంతయు దన్ను బ్రేమించ బోదని భయము వారిని పీడించుచున్నదట. అందుకని ఆ మహారా జింతవరకును వివాహము చేసికొనుటకు నిరాక రించెనట. ఈ విషయము మన పరిచారికలలో గనకాంగి యనునది గ్రహించి నాకు జెప్పినది.

'ఈ విషయము దాని కెట్లు తెలియవచ్చినది?' పిష్టపురము విష్ణువర్ధనుని హస్తగతమైన రెండవ దిన మున మన పరిచారిక లందరును గోవూరునుండి పిష్టపురము నకు వచ్చిరిగదా!

'అవును.'

అడవి బాపిరాజు ద్వారా మరిన్ని పుస్తకాలు

1

అంశుమతి

13 January 2024
0
0
0

శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారక దేవుని ఏకై కపుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయు చున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ

2

అంశుమతి రెండవ అధ్యాయము

13 January 2024
0
0
0

కృష్ణాతీరమున నుత్తమక్షేత్రములలో నొకటియగు విజయ వాటికయందు సర్వమల్లి కేశ్వరుని అర్చించుటకై సకుటుంబ ముగా విడిది చేసి యుండెను. మహారాజుక్న నెలదినములును నా నగరవాసులును పరిసర గ్రామప్రజలును మహోత్సవము లొనరించుక

3

అధ్యాయం 3

16 January 2024
1
0
0

ఈ యా వు త్తమజాతిజ యని రోదించినాడు. తన కోడె దూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుం బము వారందరు అల్లారుముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆయజమాని పడు వేదనను మేము చూడలేకపోతిమి. అత డా దూడక ళేబరము నెత్తికొని తనయ

4

4 అధ్యాయము

16 January 2024
0
0
0

రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను, “నే నెట్టి దండమునకై నను బాత్రుడను. నన్ను మహా రాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది, మహాదండ : ప్రభూ! ధర్మవిచారణ జరిగినది. రాజకు : ఆ

5

ఐదవ భాగం

16 January 2024
0
0
0

గొల్చుచుండిన విష్ణుకుండిననగరవాసులైన యాజ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట. ఈవిధమున నాలో చించుకొనుచున్న అంశుమతిని 'ఏమమ్మా, భర్తృదారికా ! ఏ మాలోచించు చుంటి' నని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను 'ఏమని చె

6

ఆరవ భాగము

17 January 2024
0
0
0

లతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతుల

7

అంశుమతి ఏడవ అధ్యాయము

17 January 2024
0
0
0

"అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీ

8

ఎనిమిదవ భాగం

17 January 2024
0
0
0

కొకటి కాపుగాయుచుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలు బది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవ నులును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతి కుడ్యోప

9

తొమ్మిదొవ భాగము

18 January 2024
0
0
0

విష్ణువర్ధనుడు : కంపనప్రభూ! బలముచే నీకోటను పట్టుకొనవలెనన్న చో నన్నగా రుపయోగించిన బలము నంతను ఉపయోగించవలసి యుండును. మన సై న్యముతో నీ కోటను జయింప యత్నించుట, కొండద్రవ్వి నెత్తి నెత్తు కొన జూచుటవంటిది. కా

10

అంశుమతి పదవ భాగం

18 January 2024
1
0
0

లను దీవ్రముగ బ్రశ్నించితిని. గాంగులకు విష్ణుకుండిన రాజ్యము నంతను గబళింపవలెనను దురాశ గలిగినది. విష్ణు : ఆ దురాశ యీనాటిది కాదుగదా! కాల: విష్ణుకుండిన మహారాజున కీమె యొక్కతయే సంతానము. ఈ బాలికను వివాహమాడి

11

పదకుండవా భాగం

18 January 2024
0
0
0

'నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు ఆ యీ సం భాషణలలో వా రా భావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్ర మెన్ని యోమారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహా

12

పన్నెండవ అధ్యయము

18 January 2024
0
0
0

ఆ సాయంకాలము చాళుక్య విష్ణువర్థనుడు తన సైన్య ములతో గోదావరిని దాటి, గోపాదక్షేత్రమున దండు విడిసి యున్నాడనియు కోన రాష్ట్రమునుండి హైహయు లాయువ రాజును సందర్శించి, సామంత ప్రాభృతములను సమర్పించినా రనియు, మంచనభట

13

పదమూడవ భాగం

18 January 2024
0
0
0

మంతయేని దెలియని తలిదండ్రులు నన్ను విష్ణువర్ధన మహా రాజున కీయ సంకల్పించినారట!' 'ఔనమ్మా ఔను, మనము గోవూరునుండివచ్చినది మొద లీవిషయమును గురించి యంతఃపురమునందు భాషించుచున్నారట. రాజుల రహస్యములన్నియు బరి చారిక

14

పద్నాలుగువా అధ్యయము

18 January 2024
0
0
0

వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగ మునకు 'జలసీమ' యని పేరు. ఆ సరస్సు అతి పురాతనము, భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును బంగారు పంటలు పండుచుండును, ఈ సీమన తను బరిపా లించు సామంతుడు బృహత్ప

15

పదియాదవ భాగం

18 January 2024
0
0
0

సామంతులు కావచ్చును గదా! అదియును గాక, నేనొక సామంతుడను, సైనికుడను. ' 'ప్రభూ ! సామంతత్వముగాని, మహారాజాధికారము గాని అంతఃకరణవృత్తికి నుద్దీపన మెట్లగును? నిజమును గోచ రింప జేయునది అంతస్సాక్ష్యము. నాకా పిష్ట

16

పదహారవ అధ్యయము

18 January 2024
0
0
0

శ్రీ సత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహే శ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువని రాజన్యకిరీటాంచిత రత్న కాంతి నీరాజిత పాదసరో రహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ధి పుల కేశి పృథ్వీవల్ల భ చక్ర వర్తి

---

ఒక పుస్తకం చదవండి