shabd-logo

ఎనిమిదవ భాగం

17 January 2024

1 చూడబడింది 1

కొకటి కాపుగాయుచుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలు బది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవ నులును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతి కుడ్యోపరి దేశమున నేనుగులు, రథములుగూడ బోగల మార్గములున్నవి. గవనులలో గోటగోడలపైన బృహత్పా ప్రాణ పాతన యంత్రములు, (పెద్ద రాతిబండలను విసరుయం త్రములు) ప్రచండాగ్ని బాణముల విసరుయంత్రములున్నవి.

కుబ్జ విష్ణువర్ధన మహారాజు సైన్యములతో బిష్టపుగ మును ముట్టడించునప్పటికి గోటగోడలపై లక్షలకొలది ధను ర్ధారులైన వీరులు కిటకిటలాడుచుండిరి, మొదటిగోడపై విలు కాండ్రును, కాగిన నూనె పోయువారును, సూరేకారము గంధకముతో సిద్ధము చేసిన యగ్ని బాణముల నుపయోగించు వారును అప్రమత్తులై యుండిరి. రెండవ గోడపైన శత ఘ్నుల (సూరు వాడిగల కత్తులు పొదిగిన పెద్దదూలము) నుపయోగించు సైనికులు, సేనాధిపతి యాజ్ఞకై వేచి మూడవదియగు లోనిగోడపైన భయంకరమైన పాషాణ పాతన యంత్రములు, చిన్న చిన్న కొండలంత రాళ్ళనై నను క్రోశము, రెండు క్రోశముల దూరము విసరి వైచుటకు నాయత్తముగ నున్నవి.

విష్ణువర్ధనుడు తన రెండులక్షల పదాతులను, పది వేల యాశ్వికులను, రెండు వేల రథికులను అయిదువందల యేనుగు లను గోటకు యోజన దూరమున జుట్టును వ్యూహములేర్పరచి, యింత దుర్భేద్యమగు కోటను సులభముగ బట్టు మార్గ మాలోచించుచు, నెక్కిన గుఱ్ఱమును దిగక, కంపన మహారాజుతోడను, ఆయన కొమరుడగు జయనంది తోడను, పిట్టపిడుగగు బుద్ధవర్మతోడను పిష్టపురదుర్గమునకు చక్రబంధమల్లి న స్కంధావారముచుట్టును తిరుగుచుండెను,

ఎట్టి దుర్గమదుర్గమునైనను విష్ణువర్ధను డవలీలగ బట్టగలుగువాడు. నున్నని ప్రపాతములు గలిగి, యనేక కుడ్య సంరక్షితములై మహోన్నతములైన పర్వతములందలి కోటలనైన నా చాళుక్యుడు సుఖముగ బట్టుకొన గలుగు టచే 'విషమసిద్ధి' యను బిరుదమును సముపార్జించెను. విషమసిద్ధి చాళుక్యు నెరిగిన వారెవ్వరును దిట్టములైనకోటలు తమ కున్నవనియు నా కోటలలో దలదాచుకొని, తమ్ము రక్షించుకొనవచ్చుననియు నిసుమంతయేని ధైర్యమువహించి యుండెడివారు కారు.

పుల కేశివల్లభు డేబది వేల యేనుగులను నిరువది వేల శతఘ్ని యంత్రములను, నొకలక్ష యగ్ని బాణ యంత్రము లను బ్రయోగించి పిష్టపురదుర్గమును బట్టుకొనఁగలిగెనట. ఆ పులకేశి వాతాపినగరము చేరినప్పటినుండియు దానార్ణవ గాంగ యువరాజు, చాళుక్య సైన్యములు దక్షిణమునకు బోవగనె, పిష్టపురము తిరిగి పట్టుకొనెను. కోటి కర్షపణ ములు వెచ్చించి మరల నాకోటను బాగు చేయించెను. పృథ్వీ మహారాజునకు "భట్టారక” నామము సమర్పించి, తనతోటి మహారాజని యాతని వేయివిధముల బొగడి, కళింగరాజ్యములోని కొన్ని విషయములను (భూభాగములు) గూడ నాతనికి ధారాదత్త మొనర్చి పృథ్వీమహారాజు కొమరునకు దన చెల్లెలు జాహ్నవీకుమారినిచ్చి, వివాహము చేసి రామ కాశ్య పులకును గాంగులకును గల సంబంధముం నెక్కువచేసెను, తన సైన్యము లనేకముల బృథ్వీమహారాజు సైన్యములతో గలిపి, పిష్టపురసుర్గమును మరియు దుర్గకము చేసెను.

కావున బృథ్వీమహారాజు తన కోటను ముట్టడించిన కుబ్జవిష్ణువర్ధనుని సైన్యమును జూచి, పకపక నవ్వుకొనెను. అంతటి మహాసైన్యములతో వచ్చిన పులకేశి చాళుక్యుడు పదునైదు దినములకుగాని పిష్టపురమును పట్ట లేకపోయినాడు. "ఈ మట్టగిడస పొట్టివాడు ఈ యీఁగ సైన్యముల దెచ్చి, యుక్కు గుండును తినదలచినాడు కాబోలు” నని తనకడ నున్న దానార్ణవ సేనాపతి కుంభకర్ణునివంటి కుంభమిత్రునితో నవ్వుచు బలికెను.

పృథ్వీ : కుంభమిత్రా ! కుబ్జవిష్ణువర్ధనుడు సూదులను బాణములుగ వేయునట కాదా!

కుంభ : మహాప్రభూ! సూదుల నెట్లు బాణములుగ వేయుదురు !

పృథ్వీ. నీవు ధనువున్నర పొడుగువాడవు. పొడగ రుల మైన మేము నీకడ పొట్టివారముగ గన్పింతుము. నీ పుపయోగించు గద ఒక ముప్పాతిక ధనువు పొడవుగలది. నే నుపయోగించు గద నీదానికన్న చిన్నది. నీ జానెడంత మనిషి యెంతగద నుపయోగించును ?కుంభ : ఆలాగునా అండీ! వ్రేలెకంత గద నుప యోగింపవచ్చును.

పృథ్వీ : కావుననే కుబ్జ విష్ణువర్ధనుడు సూదులను బాణములుగ నుపయోగించునని వింటిని.

కుంభ : ఆ సూదు లెంతదూరము పోవునో మహా

పృథ్వీ : మూరెడు దూరము పోవును.

కుంభ: అయినచో ఆ మహారాజు వానినుపయో గింప నేల ?

పృథ్వీ : ఆతడు పిల్ల వాడు గావున ఆటకై యవి యుప యోగించునఁట

కుంభ : అంత చిన్నపిల్ల వాడు యుద్ధమున కెట్లు వచ్చెను మహాప్రభూ!

ఈ రీతిగ పృథ్వీమహారాజు కుబ్జ విష్ణువర్ధనుని కుంభ మిత్రుని యెదుట హేళన చేసెను.

ఆవగింజంత మాత్రమె మెదడున్న కుంభమిత్రునకు ఆ అవహేళన మర్థము కాలేదు.

పృథ్వీమహారాజుసకు కుంభమిత్రునకు సంభాషణ కోట లోపలి గోడపై జరుగుచున్నప్పుడే, అశ్వారూఢులై కుబ్జవిష్ణు వర్ధనుడును, ఆయన ననుగమించిన కాలకంపన ప్రభువును, ఆతని కొమరుడు జయనందియు దమసైన్యముల వెనక నొక తోటలో నిలుచుండి యింకొక సంభాషణ నెరపుచుండిరి,

అడవి బాపిరాజు ద్వారా మరిన్ని పుస్తకాలు

1

అంశుమతి

13 January 2024
0
0
0

శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారక దేవుని ఏకై కపుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయు చున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ

2

అంశుమతి రెండవ అధ్యాయము

13 January 2024
0
0
0

కృష్ణాతీరమున నుత్తమక్షేత్రములలో నొకటియగు విజయ వాటికయందు సర్వమల్లి కేశ్వరుని అర్చించుటకై సకుటుంబ ముగా విడిది చేసి యుండెను. మహారాజుక్న నెలదినములును నా నగరవాసులును పరిసర గ్రామప్రజలును మహోత్సవము లొనరించుక

3

అధ్యాయం 3

16 January 2024
1
0
0

ఈ యా వు త్తమజాతిజ యని రోదించినాడు. తన కోడె దూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుం బము వారందరు అల్లారుముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆయజమాని పడు వేదనను మేము చూడలేకపోతిమి. అత డా దూడక ళేబరము నెత్తికొని తనయ

4

4 అధ్యాయము

16 January 2024
0
0
0

రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను, “నే నెట్టి దండమునకై నను బాత్రుడను. నన్ను మహా రాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది, మహాదండ : ప్రభూ! ధర్మవిచారణ జరిగినది. రాజకు : ఆ

5

ఐదవ భాగం

16 January 2024
0
0
0

గొల్చుచుండిన విష్ణుకుండిననగరవాసులైన యాజ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట. ఈవిధమున నాలో చించుకొనుచున్న అంశుమతిని 'ఏమమ్మా, భర్తృదారికా ! ఏ మాలోచించు చుంటి' నని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను 'ఏమని చె

6

ఆరవ భాగము

17 January 2024
0
0
0

లతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతుల

7

అంశుమతి ఏడవ అధ్యాయము

17 January 2024
0
0
0

"అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీ

8

ఎనిమిదవ భాగం

17 January 2024
0
0
0

కొకటి కాపుగాయుచుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలు బది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవ నులును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతి కుడ్యోప

9

తొమ్మిదొవ భాగము

18 January 2024
0
0
0

విష్ణువర్ధనుడు : కంపనప్రభూ! బలముచే నీకోటను పట్టుకొనవలెనన్న చో నన్నగా రుపయోగించిన బలము నంతను ఉపయోగించవలసి యుండును. మన సై న్యముతో నీ కోటను జయింప యత్నించుట, కొండద్రవ్వి నెత్తి నెత్తు కొన జూచుటవంటిది. కా

10

అంశుమతి పదవ భాగం

18 January 2024
1
0
0

లను దీవ్రముగ బ్రశ్నించితిని. గాంగులకు విష్ణుకుండిన రాజ్యము నంతను గబళింపవలెనను దురాశ గలిగినది. విష్ణు : ఆ దురాశ యీనాటిది కాదుగదా! కాల: విష్ణుకుండిన మహారాజున కీమె యొక్కతయే సంతానము. ఈ బాలికను వివాహమాడి

11

పదకుండవా భాగం

18 January 2024
0
0
0

'నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు ఆ యీ సం భాషణలలో వా రా భావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్ర మెన్ని యోమారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహా

12

పన్నెండవ అధ్యయము

18 January 2024
0
0
0

ఆ సాయంకాలము చాళుక్య విష్ణువర్థనుడు తన సైన్య ములతో గోదావరిని దాటి, గోపాదక్షేత్రమున దండు విడిసి యున్నాడనియు కోన రాష్ట్రమునుండి హైహయు లాయువ రాజును సందర్శించి, సామంత ప్రాభృతములను సమర్పించినా రనియు, మంచనభట

13

పదమూడవ భాగం

18 January 2024
0
0
0

మంతయేని దెలియని తలిదండ్రులు నన్ను విష్ణువర్ధన మహా రాజున కీయ సంకల్పించినారట!' 'ఔనమ్మా ఔను, మనము గోవూరునుండివచ్చినది మొద లీవిషయమును గురించి యంతఃపురమునందు భాషించుచున్నారట. రాజుల రహస్యములన్నియు బరి చారిక

14

పద్నాలుగువా అధ్యయము

18 January 2024
0
0
0

వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగ మునకు 'జలసీమ' యని పేరు. ఆ సరస్సు అతి పురాతనము, భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును బంగారు పంటలు పండుచుండును, ఈ సీమన తను బరిపా లించు సామంతుడు బృహత్ప

15

పదియాదవ భాగం

18 January 2024
0
0
0

సామంతులు కావచ్చును గదా! అదియును గాక, నేనొక సామంతుడను, సైనికుడను. ' 'ప్రభూ ! సామంతత్వముగాని, మహారాజాధికారము గాని అంతఃకరణవృత్తికి నుద్దీపన మెట్లగును? నిజమును గోచ రింప జేయునది అంతస్సాక్ష్యము. నాకా పిష్ట

16

పదహారవ అధ్యయము

18 January 2024
0
0
0

శ్రీ సత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహే శ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువని రాజన్యకిరీటాంచిత రత్న కాంతి నీరాజిత పాదసరో రహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ధి పుల కేశి పృథ్వీవల్ల భ చక్ర వర్తి

---

ఒక పుస్తకం చదవండి