shabd-logo

అంశుమతి పదవ భాగం

18 January 2024

2 చూడబడింది 2

లను దీవ్రముగ బ్రశ్నించితిని. గాంగులకు విష్ణుకుండిన రాజ్యము నంతను గబళింపవలెనను దురాశ గలిగినది.

విష్ణు : ఆ దురాశ యీనాటిది కాదుగదా!

కాల: విష్ణుకుండిన మహారాజున కీమె యొక్కతయే సంతానము. ఈ బాలికను వివాహమాడినచో నల్లుడైన కళింగునకు ఆంధ్రసామ్రాజ్య మంతయు దత్తమగును గదా ?

విష్ణు : అయినచో రాకుమారి హస్తమును కళింగ నగర మహారాజర్థించి యుండవచ్చునుగదా !

కాల : ఈ రాకుమారి కళింగ యువరాజు చిత్రము చూచి తన కా యువకుడు తగిన వరుడు గాడని నిస్సంశయ ముగ దెలిపివై చెనట.

రాజవైద్యు : అదే కారణము మహాప్రభూ! తన్ను వరించదని యెప్పుడు నిర్ధాహితమయ్యెనో, కళింగ యువరా జప్పుడే యీ బాలికను దస్కరించి కొనిపోయి, బలాత్క రించి వివాహము చేసికొని నిశ్చయించి, యీ దౌ మున కొడిగట్టినాడు.

విష్ణు : కాలకంపన ప్రభూ! విష్ణుకుండిన రాజకుమారి స్వస్థత నొందగ నే, వారిని సగౌరవముగా గోవూరు కంపి వేయుడు. మూడు దినములలో మన సైన్యములు కళింగ నగరాభిముఖములై యజేయ్యములై జైత్రయాత్రను సాగించుగాక!

కాల : చిత్తము మహాప్రభూ !విష్ణువర్ధనుడు ప్రతియుషస్సునను దప్పక లేచి తన యుత్తమాశ్వము సధిరోహించి, కొన్ని గోరుతముల దవ్వు అశ్వయానముచేసి తిరిగివచ్చి, యోగాసనాదు లొనరించి, యా వెనుక స్నానము సలిపి సంధ్యావందన మాచరించు కొనును, ఆపై నాతఁ డుద్యాన వనవిహారము సేయును. పిష్ట పుర మాతని హ స్తగతమైన నాల్గవ నాడాతడు తన యల వాటు చొప్పున రాజోద్యానమున విహరించుచు, నా వన మధ్యస్థమైన కృత్రిమ సరోవర సోపానమున గూర్చుండి అల వోకగా నేదియో పాడుకొనుచుండెను. ను డెంత విష్ణువర్ధను వీరవిక్రముడో యాతని కంఠమంటే మధురమై బాలకుని కంఠమువలె పంచమ శృతు లీనుచుండును.

ఆరోగ్యము పూర్తిగ గోలుకొన్న అంశుమతీ రాజ కుమారి నిత్యాభ్యస్తమైన యుదయకాల విహారమునకై అప్పు డొంటరిగ నా ప్రదేశమునకే విచ్చేసెను

ఎవరో యొక బాలుడు, చాళుక్య మహారాజు పరి వారములోని వాడు, వనవిహారమునకై వచ్చి యానందమున బాడుకొనుచున్నాడని యాబాలిక యనుకొన్నది. ఆమె కదలక యచ్చటనే నిలుచుండి యా మనోహర గాంధర్వము నాలకించుచు నానందము ననుభవించుచుండెను.

ఏమి యా బాలుని భక్తి పారవశ్యము! ఎంత సుందర ముగ నున్నాడు! ఈతని జూచినంతనే తన హృదయ మేలనో యార్ద్రతనొందుచున్నదని తలపోయుచు నటనే నిలుచున్నది. పాట ముగించుచునే విష్ణువర్ధనుడు తనసమీపమున నెవరో నిలుచుండిరని గ్రహించి యావైపునకు జూపులు పర పెను, అప్రతిమాన సౌందర్యవతియగు బాలిక యోర్త చట నిలుచుండు టాతడు చూచి. తాను కూరుచుండిన మెట్టుపైనుండి లేచి—

'ఎవరు మీరు ! ఇచ్చటికి వచ్చినారు ?' ప్రశ్నించినాడు.

'మీరెవరు ? ఇది శుద్ధాంతోద్యానవసము. ఇందు పరపురుషు లెవ్వరు ప్రవేశింపడే ఆమె యతడు బాలకు డనియే యెంచెను.

'రాణివాసము వా రెవ్వ రిచట లేరుగదా యని ధైర్యమున నిటకు వాహ్యాళికై వచ్చితిని'

'మీ మహారాజు రాణివాస మింకను రాలేదా!'

'మా మహారాజనగా?'

'మీరు చాళుక్య శ్రీవిష్ణువర్ధన మహారాజు పరి వారములోని వారు కారా?'

'అవును! అవును! అయినను పరివారములోని వాడను కాను'

'అవును, పరివారములోని వాడనే కావి, గట్టిగ నాలోచించిన కానుకూడను'

200 మాటలు స్వవచనవ్యాఘాత దోషయుక్త

ములు'మరి - మరి – మరి నేను రాజబంధువుడను. -

'అదియా! అందుకనియా! మీరింత గజిబిజిపడినారు?' 'మీ రెవ్వరు? శ్రీగాంగ రాణివాసమువారా? పర స్త్రీతో నిర్భయముగ మాట్లాడుచుంటిని, క్షంతవ్యుడను.'

'మీరు కాదు, మాటలు ప్రారంభించినది నేను. అయినను నేను గాంగ రాణి వాసపు బాలికను గాను. నేను - నేను - నేను శ్రీ విష్ణుకుండిన రాజకుమారిక చెలియను, శ్రీ విష్ణుకుండిన మహారాజులకు నేను సవిూప బంధువను,”

'క్షమింపుడు. నే నెంతయో తప్పిద మొనరించితిని.'

'ఇందు దప్పేమి యున్నది? నిూరును నేనును రాజ బంధువుల మైనను పరివారజనములోని వారము మీ నామ ధేయము నాకు దెలియవచ్చునా?'

'నన్ను ప్రియదర్శి అని మీరు పిలువవచ్చును. మీ మహారాజకుమారి క్షేమముగ నున్నారా? సంపూర్ణారో గ్యము నందినారా?'

'వారు సంపూర్ణారోగ్యము నందినారు. గౌతమీస్నాన వ్రతమునకు దొందరగ బోవలయునట. ఈ యైదారు దినములు వారు వ్రతము మాని వేయవలసి వచ్చినందుకు ప్రాయశ్చిత్తములు బరుపుకొనవలయు నేమో ! శ్రీ విష్ణువర్ధన మహారాజ కుమారుల ప్రతాపముచే నరకము వంటి యీ కారాగారమునుండి మాకు విముక్తి ప్రసాదింప బడినది. ఆ మహారాజునకు మా రాకుమారి యెంతయు గృతజ్ఞురాలు.'“మామహారాజు కళింగనగరముపై జైత్రయాత్రకు పోవుచున్నాడు. మీ రాజకుమారిని సర్వ మర్యాదలతో గోవూరు పురమునకు గొనిపోవ రాజ్ఞ యిచ్చిరి.'

ఇంతలో దూరమునుండి 'మహారాజకుమారీ! మహా "రాజకుమారీ!' యని మాధవి కేకలు వినవచ్చినవి.

'ప్రభూ! ఇక సెలవు. మహారాజకుమారిని మాధవి కాబోలు పిలుచుచున్నది. నన్ను కిరణవతి యని మీరు పిలువవచ్చును' అని అంశుమతి చిరునవ్వు నవ్వుచు 'మీకు నాయీడు ఉండునని అనుకొందును, భగవంతుడు మిమహా రాజును సర్వవిధముల రక్షించుగాక !' అనుచు సంశుమతి విసవిస నడిచిపోయినది.

ఓహో! ఏమి యీబాలిక సౌందర్యము. జగన్మో హిని. విష్ణుకుండిన మహారాజునకు సామంతుడైన ప్రభువెవ్వ రికో యీమె తనయయై యుండవచ్చును. ఏమి మధుర కంఠము! ఆమె మాటలు కోకిల పులుగు కువకువలువ లె దేని యలు చెమరించినవి. తానింతవరకును స్త్రీల నెవ్వరి నిటుల పలుకరించి యుండ లేదు ఈ బాలికకు వివాహమై యుండ నేరదు. అయినచో రాజకుమారికి సఖిగా నెట్లు రాగలుగును?

అందరివలెనే యీ బాలయు దన్ను బాలకుడనుకొని 68. ఆమె యీడెంత యైయుండును! పదునేడు పదునెని మీది వర్షముల పడుచుప్రాయము. ఈ బాలిక దన్ను బదు నేనిమిది వత్సరముల బాలుడని యెంచినది కాబోలు, అని ఆ యువరాజు మనస్సు కొంచెము భిన్నమయ్యెను,తన వశమున నేరును బొట్టినారు ఉద్భవించ లేదట. తాను బూర్వజన్మమునందే కుబుని జూచి పరిహసించెనో యీ జన్మమున నిట్లుద్భవించినాడు. కాని తాను మరుగుజ్జు మంత్రము గాదు. బాలకునివలె గన్పించును. అయినను తన పూర్వకర్మము వలసనో, భగవంతుని కృపవల్లనో సంభ వించిన ఈ వామనత్వమున కీ పది సంవత్సరములనుండియు తనమనస్సు అప్పుడప్పుడు దుఃఖము నందుచు దన్ను గుజ్జువా నిగ నెంచిన వారి నెల్లరను ద్వేషించుచు నానాటికి గర్కశత్వ మును దాల్చినది.

తనలోని క్రోధమునకు దానే భయపడి పోవువాడు. ఆక్రోధము తన్నే దహించివేయు సనుకొన్నాడు. మసహ్య మయిపోయినది. లోకప్రఖ్యాతినంది, చతుస్స ముద్ర వేలాయిత మహాసామ్రాజ్యమును పాలించుచున్న పరమ బ్రహ్మణ్యుడైన తన అన్నగారు తన్న పరిమిత ప్రేమ తో హృదయమునకు హత్తుకొని నప్పు డా ప్రేమ కరుణచే జనించిన దనుకొని తా నెంత యో బాధ నందినాడు. తన పెద్దతమ్మునికన్న జిన్నతమ్మునిపై నెక్కుడు ప్రేమగలుగుట కీ మరుగుజ్జుతనమె కారణమని యాతడు పొందిన వేదన వర్ణనాతీతమైపోయినది. అన్నగారు, చిన్నన్న గారు నిరువురు దసపై జూపు ప్రేమకుగారణము, జాలిగాదని యెన్ని యో సారులు నిర్ధారిత మైనను ఆ యనుమాన మప్పుడప్పుడు వీడించుచునే యున్నది.కాని, యీ బాలిక, యీ పరమసుందరి, దివ్యగాత్ర తన కారీతి ప్రత్యక్ష మైన మఱుక్షణమునుండి తన జీవితమున నేదియో అమృత శాంతి యలముకొన్నట్లయినది. ఏ సామం తుని కొమరిత యో యీ బాలిక !

గౌతమీ శార్తిక స్నాన వ్రతమును సమాప్తము గావించి విష్ణుకుండిన రాజకుమారి అంశుమతి వేంగీ పురము చేరుకొన్నది. స్నానవ్రత మాహాత్మ్యమో, మరి యే కారణమో అంశుమతి గోవూరునుండి వచ్చిన నాటనుం డియు నానందముచే గలకలలాడిపోవు చుండెను. యెప్పుడును నేవియో పాటలు పాడుచునేయుండును నేర్చిన నాట్యకళావైదుష్య మంతయు వెల్లి విరియ తా నా డును, చెలిక త్తియల నాడించును. సన్నిహిత బాంధవియగు మాధవిచే నుషాబాల వేషము వేయించి, తా ననిరుద్ధుడై యవరోధజనము నెదుట నుషాపరిణయ నాటకమును బ్రద ర్శించినది. ఉష యాంధ్రుల యాడుబడుచు, ఉషకు బడ మటి నుండి యనిరుద్ధుడు వేంచేసినాడు! ఆమె తనలో నవ్వు కొన్నది. ఏమి తన కీ యానందము! ఆమె

ఆనాటక మెంతయో రక్తిగట్టినది. మహారాణి తన కొమరిత నాట్య కౌశలమున కెంతయో పొంగిపోయినది. సంజ్ఞాదేవి హైహయుల యాడుబడుచు. కోన దేశాధిపతి యగు హైహయ మాధవవర్మ మహారాజు సూర్యోపాసకుడు, బిడ్డలకై సూర్యునారాధించి, కొమరితయగు సంజ్ఞాదేవిని,కొమరు డాదిత్యవర్మను బడసెను. హైహయులు విష్ణుకుండి నులును దగ్గఱి బంధువులు, సంజ్ఞాదేవి విష్ణుకుండిన యువ మహారాజు మంచన భట్టారకున కుద్వాహము గావింపబడి యువరాణి యయినది. నేడు రాణి,

మహారాణి కొమరిత నంతఃపురమునకు గొనిపోయి తన మాంగళ్య మందిరమున గాశ్మీర దుకులాంబర రత్న కంబళముపై నదివసించి, వయుధానముల నానుకొని, కొమరి తను దగ్గఱగ గూర్చుండ బెట్టుకొన్నది.

'తల్లీ ! మహారాజు నీ వివాహవిషయమున బెంగ గొని యున్నారు. అనువైన సంబంధముల నన్నింటిని వలదం టివి. కళింగ గాంగులు, కాంచీపుర పల్లవులు, వాతాపి చాళుక్యులు బలవంతులై విష్ణుకుండిన వేంగీ రాష్ట్రములకు శత్రువులై యీ రాజ్యమును హరింప గంకణము ధరించి నారు' అని కొమరిత వైపు విచారము కుములును తన మోమును తిప్పినది.

అమ్మగారూ! నాయనగారు ధీర శాంతులు. వారికి యుద్ధమున విముఖత్వము. వారు స్వధర్మప్రియులు, తాము చిత్రరథస్వామి భ క్తులయ్యు, జైనులను, బౌద్ధులను, శైవు లను, బూర్వమీమాంసకులను సమాన ప్రేమతో నాదరించు చున్నారు. వివిధ ధర్మావలంబములైన సంస్థలకెల్లను నెన్ని గ్రామములు ధనరాసులు దానము లీయలేదు!'

'అవును తల్లీ! వారు నీకొరకై తమ రాజ్యమునే దానమిచ్చుటకు సంసిద్ధులుగా నున్నారు గదా!''నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు ఆ యీ సం భాషణలలో వా రా భావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్ర మెన్ని యోమారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహాసామ్రాజ్యమును సుస్థిర మొనర్పజాలకు పోతిననియు దుఃఖించితిని, ఏమి రాజ్యములు, ఏమి రాజులు! కాకులపలె గ్రద్దలవలె సైన్యములు సమ కూర్చుకొని యనిత్యమును గశ్మలము నగు కీర్తికై యొకరి తల నొకరు నఱుకుకొనుచు, నొకరి రాజ్య మొకరు హరించు చున్నారు. '

'అవును కన్నతల్లీ ! నీవు బాలకుడవై పుట్టవలెనని వాంఛించిన ట్లీ నాటి నీ వేమమే నిదర్శనము, ఎంత జక్కగ నభినయించితివి. నాకు 'నీవు బాలకుడ వయియే జనించితి వేమో' యని యొక నిమేషమాత్ర మనిపించినది నీవన్నట్లు రాజ్యము లెప్పుడును పాపాకరములు. అహింసావ్రతమే ముక్తికి నిజమైన మార్గము. ఇతరులకు హాని చేయుటకన్న దన్నుదాను హింసించుకొని జిన దేవలోకము నార్జించుట పరమధర్మ మన్నారు...'

'ఏమి టా మాటలు జననీ! నే నీ వారము దీనముల నుండియు నేకారణముసనో ఆనందము నందుచు బొంగిపోవు చున్నాను. నా కీ పొడియారిన వేదాంతపు మాట లెందుకు? నా వివాహము విషయమై మాట్లాడుటకు దీసికొని వచ్చినారు. నే నొక పరమపురుసఃనికై యెన్ని యుగముల నుండి యో యెదురుజూచుచున్నట్లుగ దోచెడిది. నేడు నా మహాభాగుడు పిష్టపురమున దర్శనమిచ్చినాడు. వాతాపి చాళుక్య సామంతులలో నొకప్రభువు కుమారు డాతడు. పిష్టపుర రాణివాసపు టుద్యానమున నా వీరుని దర్శనమును హఠాత్తుగ బొందగలిగితిని."

'ఏమిటి? కన్నతల్లీ ! ఎవరిని దర్శించితే నంటివి?'

'నా చేయిని గ్రహించి, నన్నీ లోకయాత్రలో దివ్యపథములకు గొనిపోగలిగిననా నాయకుని సందర్శించితిని,

'అదేమి తల్లీ ! ఒక సామాన్య సామంతుని నీవు వలచినావా! ప్రేమించినావా!'

'అవును అమ్మగారూ! అవును, అది ప్రేమయో, వలపో నాకు దెలియదు. అతనికి నే నా పవిత్రతక్షణమున నే నా హృదయమును, సర్వస్వము నర్పించుకొంటిని, ఆయన సామాన్యుడగు సామంతుడైనను, చక్రవర్తియైనను నా శాతని స్థితితో నవసరము లేదు. ఆతడు చాళుక్య యువరాజైన విష్ణువర్ధన మహారాజుతో గలసి కళింగ గాంగ మహారాజులపై దాడి వెడలినాడు. నా హృదయ మాతని కర్పించితి సమ్మా.'

ఆ బాలిక మహారాణి కంఠమును బిగియార గౌగి లించి యామె హృదయమున దన మోము గాఢముగ నదిమి కొనుచు 'అమ్మా నా కే మహారాజును, జక్రవర్తియు వలదు. నా కేడుగడయైన యా ప్రియదర్శి నిర్వక్ర పరా

అడవి బాపిరాజు ద్వారా మరిన్ని పుస్తకాలు

1

అంశుమతి

13 January 2024
0
0
0

శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారక దేవుని ఏకై కపుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయు చున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ

2

అంశుమతి రెండవ అధ్యాయము

13 January 2024
0
0
0

కృష్ణాతీరమున నుత్తమక్షేత్రములలో నొకటియగు విజయ వాటికయందు సర్వమల్లి కేశ్వరుని అర్చించుటకై సకుటుంబ ముగా విడిది చేసి యుండెను. మహారాజుక్న నెలదినములును నా నగరవాసులును పరిసర గ్రామప్రజలును మహోత్సవము లొనరించుక

3

అధ్యాయం 3

16 January 2024
1
0
0

ఈ యా వు త్తమజాతిజ యని రోదించినాడు. తన కోడె దూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుం బము వారందరు అల్లారుముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆయజమాని పడు వేదనను మేము చూడలేకపోతిమి. అత డా దూడక ళేబరము నెత్తికొని తనయ

4

4 అధ్యాయము

16 January 2024
0
0
0

రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను, “నే నెట్టి దండమునకై నను బాత్రుడను. నన్ను మహా రాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది, మహాదండ : ప్రభూ! ధర్మవిచారణ జరిగినది. రాజకు : ఆ

5

ఐదవ భాగం

16 January 2024
0
0
0

గొల్చుచుండిన విష్ణుకుండిననగరవాసులైన యాజ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట. ఈవిధమున నాలో చించుకొనుచున్న అంశుమతిని 'ఏమమ్మా, భర్తృదారికా ! ఏ మాలోచించు చుంటి' నని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను 'ఏమని చె

6

ఆరవ భాగము

17 January 2024
0
0
0

లతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతుల

7

అంశుమతి ఏడవ అధ్యాయము

17 January 2024
0
0
0

"అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీ

8

ఎనిమిదవ భాగం

17 January 2024
0
0
0

కొకటి కాపుగాయుచుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలు బది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవ నులును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతి కుడ్యోప

9

తొమ్మిదొవ భాగము

18 January 2024
0
0
0

విష్ణువర్ధనుడు : కంపనప్రభూ! బలముచే నీకోటను పట్టుకొనవలెనన్న చో నన్నగా రుపయోగించిన బలము నంతను ఉపయోగించవలసి యుండును. మన సై న్యముతో నీ కోటను జయింప యత్నించుట, కొండద్రవ్వి నెత్తి నెత్తు కొన జూచుటవంటిది. కా

10

అంశుమతి పదవ భాగం

18 January 2024
1
0
0

లను దీవ్రముగ బ్రశ్నించితిని. గాంగులకు విష్ణుకుండిన రాజ్యము నంతను గబళింపవలెనను దురాశ గలిగినది. విష్ణు : ఆ దురాశ యీనాటిది కాదుగదా! కాల: విష్ణుకుండిన మహారాజున కీమె యొక్కతయే సంతానము. ఈ బాలికను వివాహమాడి

11

పదకుండవా భాగం

18 January 2024
0
0
0

'నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు ఆ యీ సం భాషణలలో వా రా భావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్ర మెన్ని యోమారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహా

12

పన్నెండవ అధ్యయము

18 January 2024
0
0
0

ఆ సాయంకాలము చాళుక్య విష్ణువర్థనుడు తన సైన్య ములతో గోదావరిని దాటి, గోపాదక్షేత్రమున దండు విడిసి యున్నాడనియు కోన రాష్ట్రమునుండి హైహయు లాయువ రాజును సందర్శించి, సామంత ప్రాభృతములను సమర్పించినా రనియు, మంచనభట

13

పదమూడవ భాగం

18 January 2024
0
0
0

మంతయేని దెలియని తలిదండ్రులు నన్ను విష్ణువర్ధన మహా రాజున కీయ సంకల్పించినారట!' 'ఔనమ్మా ఔను, మనము గోవూరునుండివచ్చినది మొద లీవిషయమును గురించి యంతఃపురమునందు భాషించుచున్నారట. రాజుల రహస్యములన్నియు బరి చారిక

14

పద్నాలుగువా అధ్యయము

18 January 2024
0
0
0

వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగ మునకు 'జలసీమ' యని పేరు. ఆ సరస్సు అతి పురాతనము, భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును బంగారు పంటలు పండుచుండును, ఈ సీమన తను బరిపా లించు సామంతుడు బృహత్ప

15

పదియాదవ భాగం

18 January 2024
0
0
0

సామంతులు కావచ్చును గదా! అదియును గాక, నేనొక సామంతుడను, సైనికుడను. ' 'ప్రభూ ! సామంతత్వముగాని, మహారాజాధికారము గాని అంతఃకరణవృత్తికి నుద్దీపన మెట్లగును? నిజమును గోచ రింప జేయునది అంతస్సాక్ష్యము. నాకా పిష్ట

16

పదహారవ అధ్యయము

18 January 2024
0
0
0

శ్రీ సత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహే శ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువని రాజన్యకిరీటాంచిత రత్న కాంతి నీరాజిత పాదసరో రహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ధి పుల కేశి పృథ్వీవల్ల భ చక్ర వర్తి

---

ఒక పుస్తకం చదవండి