shabd-logo

పద్నాలుగువా అధ్యయము

18 January 2024

2 చూడబడింది 2

వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగ మునకు 'జలసీమ' యని పేరు. ఆ సరస్సు అతి పురాతనము, భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును బంగారు పంటలు పండుచుండును, ఈ సీమన తను బరిపా లించు సామంతుడు బృహత్పాలాయనుండైన పృథ్వీశవర్మ. పృథ్వీశవర్మ కిరువురు కొమరులును, నొక కొమరితయు గలరు. ఆ కొమరిత యే మాధవీలతాకుమారి,

వేంగీ రాజ్యము నిప్పుడు పాలించుచున్న మంచన భట్టా రక మహారాజు కన్న బృథ్వీశవర్మ యయిదారేడులు పెద్ద. చాళుక్య విష్ణువర్ధనుడు వేంగీనగరము వచ్చునప్పటికి గృష్ణా సముద్ర సంగమతీర సీమలోని సామంతు డొకడు దిరుగు బాటు చేయుటచే పృథ్వీశవర్మ వాని నణచుటకు బోయెను, మాధవీలతాకుమారి కలతీర్థ (కలిదిండి) పట్టణమునకు దన తండ్రి వచ్చినాడని తెలిసి తనకుటుంబముతో గొన్ని దిన ములు గడుపనెంచి కలతీర్థ నగరమునకు బయనమయ్యెను, స్నేహితురాలగు సంశుమతీకుమారిని గౌగిలించుకొని ఆమెచే వల్లె యనిపించుకొని పరివారముతో బడవల నెక్కి కొల్లేటిపై బ్రయాణము సాగించెను. ఆ సరస్సునం దనేక ద్వీపములున్నవి. అందగ్ని కులజులైన పల్లెవారు నివసించుచు జేపలపట్టి వేంగీనగరమున అమ్ము చుందురు. ఆ సరస్సున యానము సల్పుబడవల నన్నిటిని వారే నడపుదురు.మాధవీలత యిరువుర బరిచారికల వెంట దీసికొని నగరము చుట్టునున్న తోటల దిరుగుట కెంతయు ముచ్చట పడును. ఒకనాడా తోటలో నా ఫాల్గుణమాసపు మలయ మారుత మనుభవించుచు సాయంకాలమందు చెలులతో మాధవీలత యొక మామిడి చెట్టు క్రింద గూర్చుండియుండెను, ఏలనో యామెకు జటుక్కున మనోనేత్రముల కొక విగ్ర హము ప్రత్యక్షమయ్యెను. పిష్టపురమునందు దన చెలి మూడు దినము లుపవాసము లొనరించి యొడలు తెలియక పడిపోయినప్పుడు తాను వేగిరపాటుతో భయముతో సిగ్గం తయు విడిచి విష్ణువర్ధన ప్రభువుకడకు బరుగిడిపోయినది.

తాను భర్తృదారిక స్థితిని భయము నిండిన మాట లతో నా మహారాజునకు జెప్పునపు డాతని వీఠముదాపున నిలబడి సమున్న తాంగుడై, గంభీర తేజస్వియై, తన దిక్కు దయార్ద్రదృష్టిని బరసి, తన్ను కులీనయగు బాలిక యని గ్రహించి చూపులు క్రిందికి వాల్చి వేసిన యొక పురుషమూర్తి యీనాడు తన మనో గగనమున దళ్కుమని మెఱసినాడు. ఆ సంభ్రమస్థితిలో నాత డెవడో తనకు దెలియకపోయినను యా పురుష పుంగవు విగ్రహము మాత్రము మనస్సున స్పష్ట ముగ జిత్రింపబడినది. అతనిగూర్చి యాలోచించుట కే యా బాలిక సిగ్గుపడినది. అట్లాలోచించుట తన చెలి గ్రహించు నేమో యని ఆమెం చకిత యగుచుండెడిది, తన రాజకుమా రికి బరిచర్యలు సేకూర్చుటలో నిమగ్నయైన యా బాలికహృదయమునుండి యా పురుష విగ్రహము గుప్తమైపోయి నది. నే డా పూరుషుడు మఱలదో తెంచుటకు గారణమేమి!

ఆమె కన్ను లర్థనిమీలితము లైనవి; మెల్లగ బూర్ణ నిమీలితము లైనవి. మరల గన్నులు పూర్తిగ దెరచినంత నా బాలిక యెదుట, లోనిమూర్తియే ప్రత్యక్ష మగుట చూచి, పగటికల యనుకొనుచు గలలు దిరుగు కన్నులతోడనే యామూర్తి నామె తిలకించుచుండెను. తన వెనుక కొలది యలికిడి యగుట గ్రహించి, వెనుకకు దిరిగి, పరిచారిక లిరు వురు నిలబడియుండుట నామె కనుగొన్నది. మఱల మోము త్రిప్పి యెదుటజూడ నామూర్తి తన్ను దీక్ష ముగ జూచుచు నిలిచియుండుట గననయ్యెను, ఆమె యాశ్చర్య మందుచు చటుక్కున నిలుచుండెను,

అప్పు డా యువకుడు చిరునవ్వు నవ్వుచు "రాజ కుమారీ! క్షంతవ్యుడను. ఇది శుద్ధాంతజనముల తోటయని అనుకొన లేదు. నన్ను "జయనంది" యందురు, పట్టణపు దోటలు బహుసుందరములును, ఫలపుష్పపూర్ణ ము లును, కనుగొన నా కెంతయో ముచ్చటపుట్టి యొంటిగా నీ తోటలోనికి వచ్చితిని. నేను సెలవుతీసికొనెద” నని యా యువకుడు మనవి చేసినాడు.

“ చేయరాని పనిజేసి క్షమార్పణ వేడుట పశ్చిమదేశ ముల వారి యాచారము కాబోలు" నని మాధవీలత కొంచెము చురుకుగ నే పైకన్నది. ఆ యువకుడు కలత నొందని మోముతో జిరునవ్వునవ్వుచు, “మేము చేయరానిపనుల జేసెడివారమని యేకవి గ్రంథము వ్రాసినాకు?” అని | ప్రత్యు త్తర మిచ్చెను.

“క్షమించదగిన వారెవరో తెలిసికొనక క్షమించు టెట్లు?” అని మాధవీలత తలవంచుకొనియే పలికినది.

"మా జనకులు పట్టవర్ధన కాలకంపన ప్రభువులు. శ్రీ విష్ణువర్ధన మహారాజాధిరాజులకు సర్వసేనాధిపతులు. నే నా మహాప్రభువు ఉపసేనాధిపతులలొ నొకడను.”

"ఓహో ఎంత చరిత్రయున్నది! తోటల దిరుగు టను గూర్చి యావల నాలో చింతము: చాళుక్య సేనాపతు లకు దమ ప్రభువును యుద్ధమున వదలి తోటలు, పేటలు, బాటలును జూచుట యలవాటు కాబోలు!"

"అంతియ కాదు ఆ తోటలో నీటుక తెలగు రా కొమరితిల దర్శించుటయు నలవాటు.”

"మాటలలో గోటలును గోడలును దాటు ఫోటు మానుసులుగూడ నుందురని నేటి కెరిగితిని.”

ఆబాల చటుక్కున దిరిగి చిరునవ్వున పరిచారికలతో నా సందెచీకటులలో విసవిస నడచి మాయమైపోయినది.

శ్రీ చాళుక్య విష్ణువర్ధనుడు తన ద్వితీయోపసేనా పతియైన ఇంద్రదత్తునికి విక్రమసింహపురమున సామంత పట్టాభిషేక మొనర్చి యప్రమత్తుడవై పల్లవుల గనిపెట్టి యుండుమని యానతిచ్చి, తన సైన్యమున నెక్కువభాగము నాతని పాలనమున నుంచి యుత్తరాభిముఖుడయ్యెను.“చిత్తము మహాప్రభూ!"

“భ్రమరాంబికా ద్వితీయ మల్లి కార్జున దేవునకు మనము సర్వపూజలు నొనరింపవలెను, కాని, యాపరమశివు నకు మల్లి కార్జున నామ మెట్లు వచ్చినదో!”

“అది యిచ్చట చరిత్రప్రసిద్ధము మహాప్రభూ! మహా కోసల ప్రభువులైన సోమవంశీయులు తమ అన్నయ్యగారు పృథ్వీవల్ల భసార్వభౌములకు గప్పము గట్టిరిగదా!”

"అవును"

"ఆ కప్పము గట్టినది సోమవంశ చంద్రగుప్తునికొమ రుడైన హర్ష గుప్త మహారాజు. చంద్రగుప్త మహారాజు కొమరిత చంద్రావతి. ఆ దేవి పుట్టిననాటనుండియు మహాశివుని భక్తురాలై, యోగినీ వేషము ధరించి, సర్వకాలములయందు శివపంచాక్షరి జపించుకొనుచు లౌకిక ప్రపంచము మఱచి యుండెడిదట.”

"అంత యనన్యభ క్తి యుండవలెను. అప్పుడే జన్మము తరించును.”

"ఆ చంద్రావతికి సర్వకాలములయందును శ్రీశైల దేవుడైన యజ్ఙునేశ్వరస్వామి ప్రత్యక్ష మగుచుండెడివాడట. చంద్రగు ప్తమహారాజు ఆంధ్రసార్వభౌముడైన శ్రీ విక్రమా శ్రయ గోవిందవర్మ విష్ణుకుండిన మహారాజునకు దన కొమరిత నిత్యము నర్జునేశ్వరు నర్చించుట కనుమతిని వేడుచు రాయ భార మం పెనట,"జయనంది తాను మాధవీల తాకుకూరి వరించి నట్లును, ఆమె తల్లి దండ్రులు నా రాజకుమారియ తము సంబంధ మున కత్యంతహర్షితులై యామోదించిరనీయః దండ్రికి రహస్య లేఖలు పంపినాడు. అరువదియైదు వర్షముల వృద్ధు డైన కాలకంపన ప్రభువు తన కీసంబంధ మత్యంతము నభీష్ట మనియు, నైనను మహారాజు విష్ణువర్ధను నామోద మత్యవ సం మనియు దాను మహారాజు ననుమతిని వేరును నుత్త రము పంపుచుంటిననియు, గొమరునికి వార్తపడినాడు.

పట్టవర్ధన రాజ పురోహితుడు లేఖలుగొని వేంగీపురము నకు వచ్చినాడు. ఆతడు వచ్చిన మూడు దినములకు గుబ్బ విష్ణువర్ధన మహారాజు ససైన్యముగ వేంగీపురమును కేరినాడు.

తన ప్రాణహితుడగు జయనంది బృహత్పలాయన రాజకన్యకను వివాహమాడుట తనకు నత్యానందమును సమకూర్చు విషయమని, విష్ణువర్ధనుడు జయనందిని తన సమ్ముఖమునకు రావించుకొని యాతని నాశీర్వదించెను.

జయ : మహాప్రభూ! రాజకన్యను జూచియున్నారు. తాము బృహత్పలాయన

విష్ణు : అవును, పిష్టపురమున నామెను జూచితిని గదా! ఆమె పేరు, మాధవీలతాకుమారి కాదా?

జయ : చిత్తము,

విష్ణు : మిత్రమా! నీ వెంతయో అదృష్ట శాలివి.ఆ బాలిక గుణరూపసమన్విత, ఆమెకు విష్ణుకుండిన రాకు మారి యనిన నెంతభక్తి!

జయ : ప్రభూ! చాళుక్య కులదీపకులు తమరు...

విష్ణు: అయినచో...

జయ: చాళుక్యవంశము, చంద్రవంశము.

విష్ణు : మంచిది !

జయ : ఆ చంద్రవంశమున బూర్ణ చంద్రులు మీరు,

విష్ణు : నా చుట్టును చంద్రికలు లేవుకదా!

జయ : మహాప్రభూ! ఆ చంద్రికా దేవికై లోక మెల్ల నెదురుచూచుచున్నది.

విష్ణు : నేను అమావాస్య చంద్రుడను.

జయ పాపము శమించుగాక ! మహాప్రభూ! తాము రాకాచంద్రులగుట కొక అంశువుమాత్రము లోటైనది,

విష్ణు : ఆ యంశువును శివుని జటాజూటమునుండి కొనివత్తువా?

జయ : మీ శిష్యులము కైలాసమునకై న బోగలము, జయనంది విష్ణువర్ధకడ సెలవు గైకొని వెడలి పోయెను. విష్ణువర్ధను డా సంభాషణమునే తలచుకొనుచు దన జన్మము రాకాపూర్ణిమగ నెట్లు మారునని యను కొన్నాడు. చంద్రావతీదేవి గాథ యెంత పవిత్రమైనది! విజయవాటిక నింద్రకీలమున దపమాచరించిన యర్జునునకు బ్రత్యక్ష మైన పరమేశ్వరుడు 'అర్జునేశ్వరు' డై నాడు. చంద్రావతీ దేవి మల్లీ పుష్పముల బూజించిన యా శ్రీశై లేశ్వరుడు మల్లి కార్జనుడై నాడు. భగవంతు డెంత భక్తవత్సలుడు! ఆలోచనాధీనుడై విష్ణువర్ధనుడు తన భవనోద్యాన వాటిక బ్రవేశించినాడు. ఒంటిగా నుద్యానవనమున సంచ రించుచు నా సాయంకాలము విరియబూచిన మల్లెపొదలను జూచి యొక్క నిట్టూర్పు విడిచినాడు. చంద్రకిరణములు భూమిని వ్రాభి, మల్లికాకుసుమములైనవట! కవులెంత మతి లేనివారో యని యనుకొనినాడు. ఒక బొడ్డుమల్లె నతడు కోసి, కన్ను లరమూతలువడ నాఘ్రాణించుచుండెను, తన వెనుక నెవరో వచ్చినట్లు పదముల చప్పుడు కాగా నాతడు చటుక్కున వెనుదిరి గెను, తాను జూచిన బాలిక యెదుట నిలిచియున్నది. పిష్టపురమున

"20000!"

"!!"

“చాళుక్యమహారాజు వచ్చెను, గాస మీరు తప్పక దర్శన మీయగలరనియే నేనిచ్చటకు వచ్చితిని.”

“అదెట్లు సంభవము?”

“తమకు దోటలన్న నిష్టమని గ్రహించితిని.”

“అవును, నా కిష్టమె! రాజసేవకులకు మాకు వన విహార మొనర్చుటకు దీరిక యెక్కడిది!

"ప్రభూ! పూవులు పూయని ప్రదేశము లోకమున నుండునా !"

"ఆ! మరుభూములు, నా బ్రతుకే మరుభూమి.”"అట్లనకుడు ప్రభూ! అంతర్విచారణోన్ముఖులైన వారి కొక్కొకపు డిట్టి విషాద భావములు గ్రమ్ముకొను చుండును.”

"రాజకుమారీ! మీ మహారాజకుమారి సేవను వదలి నీ వెట్లు రాగలిగితివి ?”

"ప్రభూ! మహారాజకుమారి నా కత్యంతాప్తురాలు, మా హృదయములు నాత్మలు నొక్కటే,”

“దుఃఖభూయిష్టమైన యీ లోకములో నిట్టి యుత్తమ స్నేహములే యానందము నిచ్చునవి. మనుష్యుడు స్నేహ మును వాంఛించును. అందుకై పరితపించును.”

“తమ తల్లిదండ్రు లెవరు ?”

“నాకు తల్లి దండ్రులు లేరు. అన్నగార లిరువు ున్నారు. వారు వారి పనులలో నిమగ్నులై యుందురు, నేను ''దేశమ్మకాకి'నై యిట్లు తిరుగుచుందును.”

"అదేమి ప్రభూ! విష్ణువర్ధన ప్రేమార్ణవులని చెప్పుకొందురే!” మహారాజులు

"అది నా కేమి లాభము! వారు నాకింత యాశ్రయ మిచ్చిరి. వారితో వచ్చుటవలన నా యావేదన తీరునట్లు దేశము తిరుగుట కనువైనది.”

సర్వసౌందర్యములును రూపొందిన యా బాలిక మోము చంద్రకాంతులు ప్రసరించి, యామె నొక దివ్య .భామిని యనిపించినవి. ఆమె పెదవుల వ్రీడాభరిత మంద హాసములు విరిసినవి. ఆమె దోసెడు మల్లికా కుసుమములు

అడవి బాపిరాజు ద్వారా మరిన్ని పుస్తకాలు

1

అంశుమతి

13 January 2024
2
0
0

శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారక దేవుని ఏకై కపుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయు చున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ

2

అంశుమతి రెండవ అధ్యాయము

13 January 2024
1
0
0

కృష్ణాతీరమున నుత్తమక్షేత్రములలో నొకటియగు విజయ వాటికయందు సర్వమల్లి కేశ్వరుని అర్చించుటకై సకుటుంబ ముగా విడిది చేసి యుండెను. మహారాజుక్న నెలదినములును నా నగరవాసులును పరిసర గ్రామప్రజలును మహోత్సవము లొనరించుక

3

అధ్యాయం 3

16 January 2024
1
0
0

ఈ యా వు త్తమజాతిజ యని రోదించినాడు. తన కోడె దూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుం బము వారందరు అల్లారుముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆయజమాని పడు వేదనను మేము చూడలేకపోతిమి. అత డా దూడక ళేబరము నెత్తికొని తనయ

4

4 అధ్యాయము

16 January 2024
0
0
0

రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను, “నే నెట్టి దండమునకై నను బాత్రుడను. నన్ను మహా రాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది, మహాదండ : ప్రభూ! ధర్మవిచారణ జరిగినది. రాజకు : ఆ

5

ఐదవ భాగం

16 January 2024
0
0
0

గొల్చుచుండిన విష్ణుకుండిననగరవాసులైన యాజ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట. ఈవిధమున నాలో చించుకొనుచున్న అంశుమతిని 'ఏమమ్మా, భర్తృదారికా ! ఏ మాలోచించు చుంటి' నని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను 'ఏమని చె

6

ఆరవ భాగము

17 January 2024
0
0
0

లతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతుల

7

అంశుమతి ఏడవ అధ్యాయము

17 January 2024
0
0
0

"అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీ

8

ఎనిమిదవ భాగం

17 January 2024
0
0
0

కొకటి కాపుగాయుచుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలు బది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవ నులును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతి కుడ్యోప

9

తొమ్మిదొవ భాగము

18 January 2024
0
0
0

విష్ణువర్ధనుడు : కంపనప్రభూ! బలముచే నీకోటను పట్టుకొనవలెనన్న చో నన్నగా రుపయోగించిన బలము నంతను ఉపయోగించవలసి యుండును. మన సై న్యముతో నీ కోటను జయింప యత్నించుట, కొండద్రవ్వి నెత్తి నెత్తు కొన జూచుటవంటిది. కా

10

అంశుమతి పదవ భాగం

18 January 2024
1
0
0

లను దీవ్రముగ బ్రశ్నించితిని. గాంగులకు విష్ణుకుండిన రాజ్యము నంతను గబళింపవలెనను దురాశ గలిగినది. విష్ణు : ఆ దురాశ యీనాటిది కాదుగదా! కాల: విష్ణుకుండిన మహారాజున కీమె యొక్కతయే సంతానము. ఈ బాలికను వివాహమాడి

11

పదకుండవా భాగం

18 January 2024
0
0
0

'నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు ఆ యీ సం భాషణలలో వా రా భావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్ర మెన్ని యోమారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహా

12

పన్నెండవ అధ్యయము

18 January 2024
0
0
0

ఆ సాయంకాలము చాళుక్య విష్ణువర్థనుడు తన సైన్య ములతో గోదావరిని దాటి, గోపాదక్షేత్రమున దండు విడిసి యున్నాడనియు కోన రాష్ట్రమునుండి హైహయు లాయువ రాజును సందర్శించి, సామంత ప్రాభృతములను సమర్పించినా రనియు, మంచనభట

13

పదమూడవ భాగం

18 January 2024
0
0
0

మంతయేని దెలియని తలిదండ్రులు నన్ను విష్ణువర్ధన మహా రాజున కీయ సంకల్పించినారట!' 'ఔనమ్మా ఔను, మనము గోవూరునుండివచ్చినది మొద లీవిషయమును గురించి యంతఃపురమునందు భాషించుచున్నారట. రాజుల రహస్యములన్నియు బరి చారిక

14

పద్నాలుగువా అధ్యయము

18 January 2024
0
0
0

వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగ మునకు 'జలసీమ' యని పేరు. ఆ సరస్సు అతి పురాతనము, భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును బంగారు పంటలు పండుచుండును, ఈ సీమన తను బరిపా లించు సామంతుడు బృహత్ప

15

పదియాదవ భాగం

18 January 2024
0
0
0

సామంతులు కావచ్చును గదా! అదియును గాక, నేనొక సామంతుడను, సైనికుడను. ' 'ప్రభూ ! సామంతత్వముగాని, మహారాజాధికారము గాని అంతఃకరణవృత్తికి నుద్దీపన మెట్లగును? నిజమును గోచ రింప జేయునది అంతస్సాక్ష్యము. నాకా పిష్ట

16

పదహారవ అధ్యయము

18 January 2024
0
0
0

శ్రీ సత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహే శ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువని రాజన్యకిరీటాంచిత రత్న కాంతి నీరాజిత పాదసరో రహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ధి పుల కేశి పృథ్వీవల్ల భ చక్ర వర్తి

---

ఒక పుస్తకం చదవండి