shabd-logo

పదియాదవ భాగం

18 January 2024

3 చూడబడింది 3

సామంతులు కావచ్చును గదా! అదియును గాక, నేనొక సామంతుడను, సైనికుడను. '

'ప్రభూ ! సామంతత్వముగాని, మహారాజాధికారము గాని అంతఃకరణవృత్తికి నుద్దీపన మెట్లగును? నిజమును గోచ రింప జేయునది అంతస్సాక్ష్యము. నాకా పిష్టపురమున నే సత్యము దర్శనమిచ్చినది. నే నచ్చటనుండి నా తలిదండ్రుల కడకు వచ్చిన తోడనే వారికి బ్రభువులగురించి నివేదించితిని. వారి యనుమతి పొందితిని. మా కులగురువు నారసింహ భట్టువారును సందులకనుమతించి సన్నాశీర్వదించినారు.'

'ఎవరు రాకుమారీ! నీ తల్లిదండ్రులు? నేను దిగ్ర్భమ సందుచున్నాను.'

'ఏమీ! మీరు మహారాజ తనయ అంశుమతీ కుమా

అత డొక్కనిమేష మక్కడుండ లేక, వేగమున మోము వెనుకకు ద్రిప్పి చూడకయే వెడలిపోయినాడు. అంశుమతీ కుమారి తెల్లబోయి, రిచ్చవడి యచటనే నిలు చుండిపోయెను,

అప్పుడు మాధవీలత పకపక నవ్వుచు నామె కడకు వచ్చి 'దొంగా! ఎంతపని చేసితివమ్మా? నా కిసుమంత యేని జెప్పక నీహృదయచోరుని గలియుటకు దొంగవలె నిచటకు వచ్చితివా ?'సామాన్య సామంతు డనుకొనియే ఆయనను బ్రెమించిన దనియు, నాప్రేమకు విష్ణువర్ధన చాళుక్యుడును సుముఖుడై యున్నట్లు భావించవచ్చుననియు, నాతడును సంశుమతి యొక సామంతుని కొమరితయని తెలిసియు ననుకూలుడుగ నుండెననియు నాసాయంతనమే తాను విష్ణుకుండిన మహా రాజు పుత్రికనని యంశుమతి విష్ణువర్ధనునికి దెలిపెననియు జెప్పెను.

మహారాజు నానందమునకు మేర లేకపోయెను. వెంటనే యా మహారాజు తన దేవేరీ మందిరమునకు బోయి 'దేవీ ! నే నింత కాలమును వృధాభయములకు లోనై గురువుగారిని జాతకము లడుగుచుంటిని, అమ్మాయి ప్రేమించినది విష్ణు వర్ధన మహారాజునే' అని తెలిపెను.

협?" “మహాప్రభూ! విష్ణువర్ధనమహారా ందుకు సుముఖు

“సుముఖుడై నట్లు సౌభాగ్యవతి మాధవీలత చెప్పు చున్నది.”

"మహారాణి యంతఃపురపు బరిచారికలకు సంతోష మున బహుమతు లర్పించినది. మంచెన భట్టారక మహా ప్రభువు ఉదయమున సకలాలయము లందును నర్చనలు జరిపింపుమని తన యాంతరంగికుడగు గంచుకికి నానతి యిచ్చెను. ఆ రాత్రి యెవరికినీ నిదుర పట్టలేదు.

మరునాడు సాయంకాలము బంగారు నీరెండలు తోట స్త్రీలలో దోబూచులాడుచు బరుగులిడుచున్నవి. ఆక సమునవిష్ణువర్ధనుడు సింహమువలె మారిపోయినాడు. ఆతడు నిరాయుధుడు. మొలనున్న రతనాల పిడిగల ఛురిక తప్ప వేరాయుధము ప్రభువుకడ లేదు. బాలిక లిరువురు నాయన ప్రక్కకురికిరి. విష్ణువర్ధనుడు కన్నుల నగ్నివర్షము కురిపిం చుచు 'ఎవరు మీరు? ఈ రాజాంతః పురోద్యానమున కేల వచ్చితిరి?' అని తిరిగిన లోహపుధారవంటి వాక్కుల బ్రశ్నించినాడు. అవి యెంత మెల్లగ నుస్నవో అంత భయంకరములు.

'నీవా కుబ్జవిష్ణువర్ధనుడవా ! మా మహారాజు దానార్ణవు నిరోధవా! ఆవునురా! నేనీ మాధవీలతను బెండ్లి యాడెదను. ఆమెను భగవంతుడు నాకోసము సృష్టిం చెనని మాప్రభువాసతీ యిచ్చినాడు' అని యెనిమిదడుగుల పొడవున కొండవలె నున్న దానార్ల వునిబంటు కుంభమిత్రుడు పలికినాడు.

“ఓరీ! గౌడ మహిషమా” విష్ణువర్ధనుని మాటలు పిడుగులవలె జ్వలించినవి,

"ఈ కుంభమిత్రు డవరఘటోత్కచుడు అని మా ప్రభువు వలికెనే! ఈమాటకు నిన్ను నా యెడమ చేతితో బురుగును నలిపినట్లు సలిపెదను.”

వారింకను చుట్టుమట్టిరి. కుంభమిత్రుడు చెట్టువలె నున్న తన గద నెత్తి విష్ణువర్ధనునిపై కురికెను.

"మీరు వాత పట్టుకొనినను గడబిడ పడకుడు” అనితల త్రిప్పకుండగనే నిష్ణువర్ధను డా బాలికలకు చెప్పి మొల నున్న ఛురికను దీసి, ఆ భయంకర నిశాచరునితో బోరు సలుప నిలచినాడు.

ఆ కిరాతులలో నలుగురు చటుక్కున వచ్చి విష్ణువర్ధ

నుని వెనుకనున్న యా బాలికల చేతులను బట్టుకొనినారు. విష్ణువర్ధనుని కుంభమిత్రుడు గదతో ముక్కలు చేయు టకు దాని నెత్తిన క్షణమునినే 'ఛీ! రాక్షసుడా! నా ప్రభువు పైనే గద నెత్తుట' అని అంశుమతీకుమారి యాడు పులియై యొక్క విదల్పున తన్నదిమిపట్టిన చేతులు విదల్చుకొని, విష్ణువర్ధనుని ముందున కురికి, యా ప్రభువును వెనుకకు నెట్టి వేసినది. కుంభమిత్రుడు కన్ను లింతలు చేసికొని, 'ఆఁ! నిన్ను బూవులలో బెట్టి కొనిరమ్మని నా ప్రభువు సెలవిచ్చి నాడు. ఒక్క క్షణమున్నచో నీవు తుత్తునియలై పోయి యుందువు' అని యరచి యెత్తినగద నట్లనే యుంచినాడు, ఆ క్షణికమాత్రసమయములో విష్ణువర్ధనుడు ఛంగున కుంభ మిత్రుని కంఠముకడ కురికి, తన ఛురికను నాతని భుజమున బిడివరకును దింపి వేసినాడు.

'అమ్మో' యని, చేతిగద జారిపోవ, నెడమచేతితో కుంభమిత్రుడు కుబ్జవిష్ణుని బట్టుకొనపోయినాడు. విష్ణువర్ధను డచటలేడు. కుంభమిత్రుని నడుమున గట్టిన మహాఖడ్గము విష్ణువర్థనుడు చఱునలాగి వేసి, యెంత వేగమున ముందున కురికెనో, యంత వేగమున వెనుక కురికినాడు. ఆ ఖడ్గము విష్ణు వర్ధను నంతయున్నది, ఆ మహావీరుడు రెండు చేతుల నా ఖడ్గ మును మెఱుపు వేగమున బ్రయోగించుచు, దిరిగి యంశుమతిని బట్టుకొని యెత్తుకొని పరుగిడిపోవు ముష్కరుల వెన్నా డెను.

అంత కొక్కక్షణము ముందుగ నే మాధవీలతకు నోట గుడ్డలు గ్రుక్కి నలుగురు ముష్కరు లెత్తుకొని పారిపోవు చుండిరి. విష్ణువర్ధనుని వేగము నిరుపమానము, అంశుమతిని బట్టిన యొకని తల డుల్లిపడిపోయెను. తక్కిన యిరువు రామెను క్రిందజారవిడచి, పలాయనమంత్రమును పఠింప నుద్యుక్తులైరి. కాని యొకని చేయి తెగిపడినది. రెండవ వాడు రెండు తుండెములై పడిపోయినాడు.

ఆ ఖడ్గమును భుజమునధరించి మరుక్షణమున చిందువు వలె నాప్రభువు తోటద్వారమును దాటి ప్రక్కతోటలో బరుగిడిపోవు ముష్కరులను సమీపించినాడు. విష్ణువర్ధను నిరువదిమంది విరోధులు ముట్టడించిరి. అచ్చట

పడిపోయిన యంశుమతి చివ్వున లేచి విష్ణువర్ధనమహా రాజు విడిది చేసిన భవనము దిశకు బరుగెత్తెను.' ఆమె కేకలు విని, జయనందియు, గొంద రంగరక్షకులును దోట లోనికి బరుగిడి వచ్చిరి. 'మహాప్రభూ! - దొంగలు-రక్తము ఎ త్తికొనిపోయిరి' అని చెప్పుచునే అంశుమతి మూర్ఛ పోయినది.

జయనంది అంగరక్షకు నొకని జూచి రాకుమారి కుప చారము సేయ బరిచారికల బిలువుమని చెప్పి శంఖ మూదుమని దళవాయి నొక్కని కాజ్ఞ యిడెను. ఆత డప్పుడే శంఖము తీయుచున్నాడు.

"భోం, భోం, భోం" అని శంఖధ్వానము దెసలు నిండినది. అచ్చట కావలి యున్న అంగరక్షక సైనికులు జయనందికడ కురికిరి. జయనంది వేగముగ మామిడితోట వైపునకు బరుగిడ నారంభించెను. అతని వెనుక అంగరక్షక సైనికు లర్ధచంద్రవ్యూహముగ బరుగిడ నారంభించిరి,

శంఖధ్వానము లొకటి కొకటి యుప్పందించుకొని నట్లు ఆతోటల నావరించి, మహికుడ్యమున కావలను 'భోం భోం' అని నినదింప సాగినవి. ఎచ్చోటు జూచినను సంగ రక్షక సైన్యములు నిండిపోయినవి.

७४

మాధవీలతాకుమారి నెత్తుకొనిపోవు ముష్కరులు తాము నిర్దేశించుకొన్న స్థలముకడకు పరుగిడి పోవుచుండిరి. వా రా బాలిక కదలకుండ రజ్జువులచే గట్టివేసిరి. నోట గుడ్డను గ్రుక్కి 8,

సరిగ వా రచ్చట చేరబోవునప్పటికి చాళుక్యాంగ రక్షక దళములు వారిని చుట్టుముట్టినవి. వారు తమ ఆయుధ ముల బార వేసి, తలలు వాల్చి నిలిచిపోయిరి. మాధవీలతా కుమారి కట్ల నొక్క వృద్ధ సేనాపతి విప్పి, నోటి గుడ్డ లాగి వేసినాడు.విష్ణువర్ధన ప్రభువు బల మెట్టిదియో కాని కుంభ మిత్రుని మహాఖడ్గమును తూలికవలె త్రిప్పుచు, ఏటుకొక ముష్కరుని తీతకొక రాక్షసుని ఆవీరాధివీరుడు హతమార్చు చుండెను.

కుంభమిత్రు డెడమ చేత, కుడిభుజమున దిగిన విష్ణువర్ధ నుని ఛురికను లాగి వేసి, రక్తము చిమ్మన ప్రవహింపుచు దన్ను తడిపి వేయుచున్నను లెక్క జేయక రోజుకొనుచు, నెడమ చేత గదను ధరించి, విష్ణువర్ధనునికడకు బరువిడి వచ్చెను.

విష్ణువర్ధనుని జుట్టుముట్టిన వారు నలుగురైదుగురు హత . మారినారు. ఆప్రభువునకు రెండుచోట్ల గాయములుతగిలినవి.

కుంభమిత్రుడా ప్రభువును వెనుకనుండి పొడిపొడి చేయ గదనెత్తినాడు. ఆ గండరగండ డక్కడ లేనేలేడు, తన కున్న బలమంతయు నుపయోగించి ఒక్క యురుకున ఒక మామిడిచెట్టు మొగ కావీరు దురికినాడు. చెట్టునకు వీ పాన్చి రోజుచు ఖడ్గమునెత్తి తనకడకు వచ్చు ప్రతివానిని తెగటార్బ సిద్ధముగ నుండెను. కుంభమిత్రుడు తన గదను గిరగిర నెడమచేతితో త్రిప్పుచు, పాముచూపులు విష్ణు వర్ధనునిపై బరుపుచు, నొక్కొక్క అడుగున నా ప్రభువును దరియుచుండెను,

ఆ సమయమున సింహగర్జన మొనరించుచు జయనంది వరుగున వచ్చినాడు. “ఎవడురా నా రాజును ఎద కొన్నది" అని జయనంది అరచి వజ్రపాతమువలె కుంభమిత్రుని దాకి నాడు.

అడవి బాపిరాజు ద్వారా మరిన్ని పుస్తకాలు

1

అంశుమతి

13 January 2024
0
0
0

శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారక దేవుని ఏకై కపుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయు చున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ

2

అంశుమతి రెండవ అధ్యాయము

13 January 2024
0
0
0

కృష్ణాతీరమున నుత్తమక్షేత్రములలో నొకటియగు విజయ వాటికయందు సర్వమల్లి కేశ్వరుని అర్చించుటకై సకుటుంబ ముగా విడిది చేసి యుండెను. మహారాజుక్న నెలదినములును నా నగరవాసులును పరిసర గ్రామప్రజలును మహోత్సవము లొనరించుక

3

అధ్యాయం 3

16 January 2024
1
0
0

ఈ యా వు త్తమజాతిజ యని రోదించినాడు. తన కోడె దూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుం బము వారందరు అల్లారుముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆయజమాని పడు వేదనను మేము చూడలేకపోతిమి. అత డా దూడక ళేబరము నెత్తికొని తనయ

4

4 అధ్యాయము

16 January 2024
0
0
0

రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను, “నే నెట్టి దండమునకై నను బాత్రుడను. నన్ను మహా రాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది, మహాదండ : ప్రభూ! ధర్మవిచారణ జరిగినది. రాజకు : ఆ

5

ఐదవ భాగం

16 January 2024
0
0
0

గొల్చుచుండిన విష్ణుకుండిననగరవాసులైన యాజ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట. ఈవిధమున నాలో చించుకొనుచున్న అంశుమతిని 'ఏమమ్మా, భర్తృదారికా ! ఏ మాలోచించు చుంటి' నని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను 'ఏమని చె

6

ఆరవ భాగము

17 January 2024
0
0
0

లతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతుల

7

అంశుమతి ఏడవ అధ్యాయము

17 January 2024
0
0
0

"అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీ

8

ఎనిమిదవ భాగం

17 January 2024
0
0
0

కొకటి కాపుగాయుచుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలు బది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవ నులును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతి కుడ్యోప

9

తొమ్మిదొవ భాగము

18 January 2024
0
0
0

విష్ణువర్ధనుడు : కంపనప్రభూ! బలముచే నీకోటను పట్టుకొనవలెనన్న చో నన్నగా రుపయోగించిన బలము నంతను ఉపయోగించవలసి యుండును. మన సై న్యముతో నీ కోటను జయింప యత్నించుట, కొండద్రవ్వి నెత్తి నెత్తు కొన జూచుటవంటిది. కా

10

అంశుమతి పదవ భాగం

18 January 2024
1
0
0

లను దీవ్రముగ బ్రశ్నించితిని. గాంగులకు విష్ణుకుండిన రాజ్యము నంతను గబళింపవలెనను దురాశ గలిగినది. విష్ణు : ఆ దురాశ యీనాటిది కాదుగదా! కాల: విష్ణుకుండిన మహారాజున కీమె యొక్కతయే సంతానము. ఈ బాలికను వివాహమాడి

11

పదకుండవా భాగం

18 January 2024
0
0
0

'నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు ఆ యీ సం భాషణలలో వా రా భావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్ర మెన్ని యోమారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహా

12

పన్నెండవ అధ్యయము

18 January 2024
0
0
0

ఆ సాయంకాలము చాళుక్య విష్ణువర్థనుడు తన సైన్య ములతో గోదావరిని దాటి, గోపాదక్షేత్రమున దండు విడిసి యున్నాడనియు కోన రాష్ట్రమునుండి హైహయు లాయువ రాజును సందర్శించి, సామంత ప్రాభృతములను సమర్పించినా రనియు, మంచనభట

13

పదమూడవ భాగం

18 January 2024
0
0
0

మంతయేని దెలియని తలిదండ్రులు నన్ను విష్ణువర్ధన మహా రాజున కీయ సంకల్పించినారట!' 'ఔనమ్మా ఔను, మనము గోవూరునుండివచ్చినది మొద లీవిషయమును గురించి యంతఃపురమునందు భాషించుచున్నారట. రాజుల రహస్యములన్నియు బరి చారిక

14

పద్నాలుగువా అధ్యయము

18 January 2024
0
0
0

వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగ మునకు 'జలసీమ' యని పేరు. ఆ సరస్సు అతి పురాతనము, భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును బంగారు పంటలు పండుచుండును, ఈ సీమన తను బరిపా లించు సామంతుడు బృహత్ప

15

పదియాదవ భాగం

18 January 2024
0
0
0

సామంతులు కావచ్చును గదా! అదియును గాక, నేనొక సామంతుడను, సైనికుడను. ' 'ప్రభూ ! సామంతత్వముగాని, మహారాజాధికారము గాని అంతఃకరణవృత్తికి నుద్దీపన మెట్లగును? నిజమును గోచ రింప జేయునది అంతస్సాక్ష్యము. నాకా పిష్ట

16

పదహారవ అధ్యయము

18 January 2024
0
0
0

శ్రీ సత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహే శ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువని రాజన్యకిరీటాంచిత రత్న కాంతి నీరాజిత పాదసరో రహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ధి పుల కేశి పృథ్వీవల్ల భ చక్ర వర్తి

---

ఒక పుస్తకం చదవండి