shabd-logo

అంశుమతి రెండవ అధ్యాయము

13 January 2024

1 చూడబడింది 1

కృష్ణాతీరమున నుత్తమక్షేత్రములలో నొకటియగు విజయ వాటికయందు సర్వమల్లి కేశ్వరుని అర్చించుటకై సకుటుంబ ముగా విడిది చేసి యుండెను. మహారాజుక్న నెలదినములును నా నగరవాసులును పరిసర గ్రామప్రజలును మహోత్సవము లొనరించుకొనుచుండిరి,

ఎచ్చట జూచినను వీధినాటకములు, తోలుబొమ్మలు, పుణ్యకథా కాలక్షేపములును జరిగినవి, మహారాజు నగర వాసులకు బరిసర ప్రాంతవాసులకును గూడ పంచభక్ష్య పర మాన్నములు పెట్టించుచుండెను. ఇంటింట దోరణములు వీథివీథుల నూరేగింపులును, దేవాలయముల, జైనాలయముల బౌద్ధ సంఘారామముల దేవతల పూజలు, భిక్కుల యర్చ నలు వైభవముగ జరుగుచుండెను. పానశాలలయందు వివిధ పరిమళయుక్తములు రుచ్యములు నగు పానీయములను వివిధ మధ్యములను సేనాధికారులు, రాజబంధువులు, రాజసభ్యులు సేవించుచు, నర్తకీబృంద నృత్యవినోదముల యందును, మధుర సంగీత సమారోహముల యందును గాలము నానందమయ మొనర్చుకొనుచుండిరి.

యువరాజు బ్రహ్మణ్యుడును, ఉత్తమవ్రతుడే అయి నను, విధినిర్ణీతమై కాబోలు, దేవాలయముల జరుగు బూజల బాల్గొనక, విలాస లాలసుడై పాసగృహముల నుండి అనేక వర్ణములచే ధళధళలాడు నవియు, వివిధ పరీమళముల చే ఘుమఘుమలాడుచున్న వియు, జక్కనిరుచులచే నోరూరించు నవియు, మధురమత్తతచే నానందమును గల్గించునవియునగు నా మద్యములం దన భననమునకు దెప్పించుకొని యిష్ట జనముల గలసి యవి సేవించు చుండెను. రాజకుల మర్యాద లను మీఱి యాతడు భ్రష్టబుద్ధి యయ్యెను.

ఒక నాడు యువరాజు దేవవర్మ తీక్ష మైన మద్యమును సేవించి యతిమత్తతతో లోకమునుమఱచి, రెండు తమాశ్వ మాల బూన్చిన తన విహారరథ మెక్కి సూతుని వెనుక నుండుమని తానే రథము నడపుచు విహారాయ త్త చిత్తుడై కన్నుమిన్నుల గానని మహావేగమున విజయవాటికా వీధుల బోసాగినాడు. అంగరక్షకులు లేరు. త్రోవలందు జన సమ్మర్దమును సర్దునాశ్వికులు ముండులేరు, సూతుడు వెనుక నుండి “భద్రము మహాప్రభూ! భద్రము మహాప్రభూ!” యని యరచినను దేవవర్మ చెవి కెక్కుట లేదు.

దేవవర్మ యట్టహాసము చేయుచు, ప్రజలు భీతచిత్తులై హాహాకారములు సేయుచు బారిపోవుచుండ, మత్తుతో మఱియు నుప్పొంగి, కశచే జురుక్కుమని యశ్వములకు రెండాఘాతము లంటించెను. ఆయుత్తమాశ్వము లదలించుట యేని సహింపనివి, ఆ కులీనములు క్రోధముచే గట్టుతప్పి మహావేగమున బరుగిడజొచ్చెను, ఆ వేగమున కింకను బొంగి, "ఇంకను 'వేగ మింకను వేగ" మని ఆ యువ జరవ జొచ్చెను,

రాజకుమారుని రథము పోవు వీధిలో పూంగీరాష్ట్ర సంజాతయైన పెద్దజాతి యావు తనవత్సమునుగలసి ఆలమంద లతో గూడి సగరబాహ్య దేశమున బచ్చిక బీళ్ళమేసి, తిరిగియజమాని యింటికి బోవుచుండెను. అందమైన యా కోడె దూడ తెల్లని కాంతులీనుచు గాళ్ళకు గట్టిన గజ్జెలు, మెడ నలంకరించిన చిుమువ్వలు మ్రోగుచుండ, గంతులిడుచు తల్లి కాళులసందున దూరుచు. కెంగున ముందు కురుకుచు బ్రక్కకురుకుచు దన చిన్నగంగడో లాడిపోవ దల్లితో నడుచుచుండెను,

కామధేను వంశమున బుట్టిన యా గోమాత మృదుల మైన తన తేనెకన్నుల బ్రేమ శాంతులు వెలిగిపోవ, ముట్టెతో దన వత్సమును బుణుకుచు. మందగమనమున నడచు చుండెను. ఇంతలో మహాప్రళయమువలె రాజకుమారుని రథ మా వీధిబడినది. ప్రజల గగ్గోలు, పరుగులు, కొందరు పడి దొరలి ప్రాణములు దక్కించుకొనుట, ఇట్లా వీధియం తయు నల్లకల్లోలమై పోవుచుండెను.

వేయి పిడుగుల పాటువలె ఘర్ఘరారవములతో నా రథమువచ్చి మాయమైపోయెను. 'అంబా' యని ఆ కోడె దూడ యరచుచు నేల పడియున్నది. దాని యొడలంతయు రక్తము చిమ్ముకొని వచ్చుచుండెను. వీపును బొట్టయు దెగి మాంసపుగండలు వెలువడి యుండెను. 'అంభా' యని యా వరచుచు గన్నుల నీరుగార నా దూడచుట్టు దిరుగ దొడగినది. ఆ గోమాత తన శిశువు గాయములనుండి స్రవించు, రక్తస్రావము నాప యత్నించును. తన బిడ్డను ముట్టెతో బై కెత్తి యధాపూర్వముగ నడిపింపజూచును. 'అంభా' యని యరచును. తలయె తి రథముపోయినదిక్కు జూచును. తన చుట్టును, పడిపోయిన తన దూడ చుట్టును జేరిన జనసమూహమువైపు దీనదృష్టుల బరపును, ఆ నోరు లేని సాధుజంతువు హృదయమున నేమో ప్రళయము వచ్చిపడినది. “నా బిడ్డ యిట్లు పడిపోయిన దేమి? నాబిడ్డను లేవనెత్తి మఱల నడిపించువారు లేరా” యన్నట్లు “అంబా అంబా” యని అరుచుచునే యున్నది.

ఆ దూడ యఱపు సంతకన్న నంతకన్న సన్నగిల జొచ్చినది. విలవిల కాళ్ళుతన్నుకొని, యా లేగ ప్రాణములు విడిచినది. గర్భనిర్భేద్యకు మహారావము సలుపుచు నా గోపురంధ్రి యా లేగప్రక్కనే కూలబడిపోయినది.

ఆనాటి సమారాధన లన్నియు నిర్వర్తించి, తానును భోజనాదికము గావించుకొని, యొక ముహూర్తము విశ్ర మించి, తృతీయ యామాంతమున దాను నివసించుచున్న సామంతుని కోటలోని సభాభవనమున శ్రీవిష్ణుకుండిన మాధవ వర్మ సార్వభౌముడు గొలువుదీరినాడు. సామంతులు నితర రాష్ట్రముల రాయబారులు పరివేష్టించి యున్నారు. వేద పారాయణ, ధర్మార్థ నిర్వచన, పురాణపఠన, కవిప్రశంస లయిన పిదప గాయకులు పాడిరి, ఆటకత్తె లాడిరి. మహా మంత్రి యేవియో రాజకీయ విషయములు సార్వభౌమునితో మనవి చేయుచుండిరి.ఆ సమయమున సభాప్రాంగణ మంటపమునందు ధర్మ ఘంటిక "ఖంగు” “ఖంగు" మని మ్రోగ నారంభించెను. ఆ ధర్మఘంటికకుఁ గట్టిన రజ్జువు ధర్మ స్తంభము మీదనుండి, ప్రాకార కుడ్యము మీదనుండి, సభాభవన గోపురము ప్రక్కగ వ్రేలాడుచుండును, రాజోద్యోగు లెవరైన సన్యా యము చేసినచో, ధర్మమునకు గ్లాని వాటిల్లినపుడు తనకు ధర్మము దయచేయింపవలసినదని యెవరైనను ప్రభువునకు ఆ ఘంటారావముచే విన్నవించుకొనవచ్చును.

ఆ విన్నపమునకు గాలనియమములేదు రాత్రియైన బగలైనఁ బ్రభువు కొలువుదీరి యున్నను లేకపోయినను నా రాష్ట్ర ప్రభువులైనను, ఆతడు లేనిచో ఆ రాష్ట్ర రాజ ప్రతినిధియైనను వెంటనే యా విన్నప మందికొనుటకుగాను మాధవవర్మ మహారాజు ధర్మఘంటిక నిట్లు మ్రోగించుట కేర్పాటు చేసినాఁడు. తన సామంతులందరును దన నలెనే యావిధాన మవలంబింప వలయును, తాను ధర్మపాలన మున నప్రమత్తుడు. ఈ రీతిని బూర్వప్రభువు లనేకులు ధర్మపాలన జేయుచుండిరట,

నే డా ఘంటానినాద మొక్క సారిగ సభయంతట మారుమ్రోగగనే, సభాభవనము చిటుక్కున నిశ్శబ్దత వహించినది. ఘంట మ్రోగుచునే యున్నది. మాధవవర్మ మహారాజు సింహాసనమునుండి లేచినాడు. సభయంతియు లేచినది. సింహాసనవితర్దికా సోపానములనుండి దిగి, మహా రాజు విసవిస నడచుచు సభాసింహద్వారము దాటి, ధర్మఘంటికా మంటపముకడ నిల్చినాడు. "ధర్మమును నిల బెట్టు” మన్నట్లాఘంట మ్రోగుచుండెను. ఎత్తినతల దించి, మాధవవర్మ మహాప్రభువు గోపురముదిక్కునకు నడచినాడు, ప్రభువు వెంట మహామంత్రి, అతని సనుసరించి సేనాపతులు, వారి వెనుక రాయబారులు, మహారాజున కీవల నావల బండి తులు, వారికిటునటు సంగరక్షకులు, అందరి వెనుక తక్కుం గల సభ యంతయు నిలబడినది.

మహారాజు గోపురము దాటి భవన ముఖస్థలమునకు వచ్చెను. ఆ విశాల ప్రదేశమున వేలకు వేలు ప్రజలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, శిశువులు. కన్నులనీరునిఁచుచు జేతులు జోడించి నిలచియున్నారు. ధర్మఘంటికా రజ్జువును లాగుచు నుత్తమకులఙయైన గోవొకటి నిలచియున్నది. ఆగోవు వెనుక ర క్తసిక్తాంగ మైన కోడెదూడ శవమును మోయుచున్న ఒక గృహస్థు నిలచియున్నాఁడు. మహాప్రభు పట్లునిలుచుండి, "ఏమిది! గోమాతయే, త్రాటిని లాగుచుండుట! ఆ తల్లి కేమి ధర్మహాని సంఘటిల్లి నది ? గోమాత కెవ్వరు నేర్పిరి?” అని ప్రశ్న పరంపరల బ్రజల నుద్దేశించి పలికినాదు. 3 ఈ త్రాడు లాగ నా

అప్పుడొక పెద్ద ముందుకు వచ్చి, "ఆ త్రాటినిలాగ సీ గోమాత కెవరును నేర్పలేదు మహాప్రభూ! ఈ యావు ఇచ్చటకు వచ్చుననియేని మే మనుకొనలేదు. ఈ దూడ రథ ముక్రింద బడి ప్రాణము కోల్పోయినది. ఈయావు పడిన బాధ వర్ణ నాతీతము. ఇంతలో నాగోవుయజమాని వచ్చినాడు.ఈ యా వుత్తమజాతిజ యని రోదించినాడు. తన కోడె దూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుం బము వారందరు అల్లారుముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆయజమాని పడు వేదనను మేము చూడలేకపోతిమి. ఆత డా దూడక ళేబరము నెత్తికొని తపయింటికి దీసికొనిపోవుచు 'తల్లీ! నందినీ! రా, అమ్మా!' అని పిలచినాడు, కాని యాలోచనాధీనవలె కదలినదికా డియావు. ఇంతలో నీ గోమాతి కోట కభిముఖయై రాసాగినది.

"ముందు నీ యావు, వెనుక నా దూడ శవమును మోయుచు నా యజమాని, అచ్చట జరిగిన దుస్సంఘటన జూడఁ జేరిన మేము, ఇటుల నా యావు దిరిగిన దిక్కునకు నడచుచు వెంటవచ్చితిమి. కోటగుమ్మము దాటి, అంతర్ద్వాం రము దాటి, యీ గోపురమునొద్ద నున్న ధర్మరజ్జువుకడకీ తల్లి వచ్చి దానిని గ్రహించి లాగ నారంభించినది. జరిగిన వృత్తాంతమిది మహాప్రభూ!” యని విన్నవించినాడు.

మహారా జాశ్చర్యమును సంభ్రమమును నందినాడు. ఇంతలో నాతని మోము గంభీరత దాల్చెను. “ఇదియే ధర్మసభ ! ఇచ్చట ధర్మము సంస్థాపింపఁ బడుగాక!" యని మహారాజ నెను,

“ధర్మమేవ జయతు, ధర్మమేవ జయతు ” అని ప్రక్క నున్న పండితులు, దీ ప్తకంఠములతో పలికినారు. “ఢ “ధర్మసంస్థా పనాదీక్షిత శ్రీవిష్ణుకుండిన మాధవవర్మ సార్వభౌమా! జయతు జయతు!” అని సభ్యులందరు జయవాక్యములు నిన

అడవి బాపిరాజు ద్వారా మరిన్ని పుస్తకాలు

1

అంశుమతి

13 January 2024
0
0
0

శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారక దేవుని ఏకై కపుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయు చున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ

2

అంశుమతి రెండవ అధ్యాయము

13 January 2024
0
0
0

కృష్ణాతీరమున నుత్తమక్షేత్రములలో నొకటియగు విజయ వాటికయందు సర్వమల్లి కేశ్వరుని అర్చించుటకై సకుటుంబ ముగా విడిది చేసి యుండెను. మహారాజుక్న నెలదినములును నా నగరవాసులును పరిసర గ్రామప్రజలును మహోత్సవము లొనరించుక

3

అధ్యాయం 3

16 January 2024
1
0
0

ఈ యా వు త్తమజాతిజ యని రోదించినాడు. తన కోడె దూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుం బము వారందరు అల్లారుముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆయజమాని పడు వేదనను మేము చూడలేకపోతిమి. అత డా దూడక ళేబరము నెత్తికొని తనయ

4

4 అధ్యాయము

16 January 2024
0
0
0

రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను, “నే నెట్టి దండమునకై నను బాత్రుడను. నన్ను మహా రాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది, మహాదండ : ప్రభూ! ధర్మవిచారణ జరిగినది. రాజకు : ఆ

5

ఐదవ భాగం

16 January 2024
0
0
0

గొల్చుచుండిన విష్ణుకుండిననగరవాసులైన యాజ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట. ఈవిధమున నాలో చించుకొనుచున్న అంశుమతిని 'ఏమమ్మా, భర్తృదారికా ! ఏ మాలోచించు చుంటి' నని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను 'ఏమని చె

6

ఆరవ భాగము

17 January 2024
0
0
0

లతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతుల

7

అంశుమతి ఏడవ అధ్యాయము

17 January 2024
0
0
0

"అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీ

8

ఎనిమిదవ భాగం

17 January 2024
0
0
0

కొకటి కాపుగాయుచుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలు బది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవ నులును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతి కుడ్యోప

9

తొమ్మిదొవ భాగము

18 January 2024
0
0
0

విష్ణువర్ధనుడు : కంపనప్రభూ! బలముచే నీకోటను పట్టుకొనవలెనన్న చో నన్నగా రుపయోగించిన బలము నంతను ఉపయోగించవలసి యుండును. మన సై న్యముతో నీ కోటను జయింప యత్నించుట, కొండద్రవ్వి నెత్తి నెత్తు కొన జూచుటవంటిది. కా

10

అంశుమతి పదవ భాగం

18 January 2024
1
0
0

లను దీవ్రముగ బ్రశ్నించితిని. గాంగులకు విష్ణుకుండిన రాజ్యము నంతను గబళింపవలెనను దురాశ గలిగినది. విష్ణు : ఆ దురాశ యీనాటిది కాదుగదా! కాల: విష్ణుకుండిన మహారాజున కీమె యొక్కతయే సంతానము. ఈ బాలికను వివాహమాడి

11

పదకుండవా భాగం

18 January 2024
0
0
0

'నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు ఆ యీ సం భాషణలలో వా రా భావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్ర మెన్ని యోమారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహా

12

పన్నెండవ అధ్యయము

18 January 2024
0
0
0

ఆ సాయంకాలము చాళుక్య విష్ణువర్థనుడు తన సైన్య ములతో గోదావరిని దాటి, గోపాదక్షేత్రమున దండు విడిసి యున్నాడనియు కోన రాష్ట్రమునుండి హైహయు లాయువ రాజును సందర్శించి, సామంత ప్రాభృతములను సమర్పించినా రనియు, మంచనభట

13

పదమూడవ భాగం

18 January 2024
0
0
0

మంతయేని దెలియని తలిదండ్రులు నన్ను విష్ణువర్ధన మహా రాజున కీయ సంకల్పించినారట!' 'ఔనమ్మా ఔను, మనము గోవూరునుండివచ్చినది మొద లీవిషయమును గురించి యంతఃపురమునందు భాషించుచున్నారట. రాజుల రహస్యములన్నియు బరి చారిక

14

పద్నాలుగువా అధ్యయము

18 January 2024
0
0
0

వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగ మునకు 'జలసీమ' యని పేరు. ఆ సరస్సు అతి పురాతనము, భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును బంగారు పంటలు పండుచుండును, ఈ సీమన తను బరిపా లించు సామంతుడు బృహత్ప

15

పదియాదవ భాగం

18 January 2024
0
0
0

సామంతులు కావచ్చును గదా! అదియును గాక, నేనొక సామంతుడను, సైనికుడను. ' 'ప్రభూ ! సామంతత్వముగాని, మహారాజాధికారము గాని అంతఃకరణవృత్తికి నుద్దీపన మెట్లగును? నిజమును గోచ రింప జేయునది అంతస్సాక్ష్యము. నాకా పిష్ట

16

పదహారవ అధ్యయము

18 January 2024
0
0
0

శ్రీ సత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహే శ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువని రాజన్యకిరీటాంచిత రత్న కాంతి నీరాజిత పాదసరో రహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ధి పుల కేశి పృథ్వీవల్ల భ చక్ర వర్తి

---

ఒక పుస్తకం చదవండి