shabd-logo

అధ్యాయం 3

16 January 2024

4 చూడబడింది 4

ఈ యా వు త్తమజాతిజ యని రోదించినాడు. తన కోడె దూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుం బము వారందరు అల్లారుముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆయజమాని పడు వేదనను మేము చూడలేకపోతిమి. అత డా దూడక ళేబరము నెత్తికొని తనయింటికి దీసికొనిపోవుచు 'తల్లీ! నందినీ! రా, అమ్మా!' అని పిలచినాడు. కాని లోచనాధీనవలె కదలినదికా దీయావు. ఇంతలో నీ గోమాతి కోట కభిముఖయై రాసాగినది.

"ముందు నీ యావు, వెనుక నా దూడ శవమును మోయుచు నా యజమాని, అచ్చట జరిగిన దుస్సంఘటన జూడఁ జేరిన మేము, ఇటుల నా యావు దిరిగిన దిక్కునకు నడచుచు వెంటవచ్చితిమి కోటగుమ్మము దాటి, అంతర్ద్వా రము నాటి, యీ గోపురమునొద్ద నున్న ధర్మరజ్జువుకడ కీ తల్లి వచ్చి దానిని గ్రహించి లాగ నారంభించినది. జరిగిన వృత్తాంతమిది మహాప్రభూ!" యని విన్నవించినాడు.

మహారా జాశ్చర్యమును సంభ్రమమును నందినాడు. ఇంతలో నాతని మోము గంభీరత దాల్చెను. “ఇదియే ధర్మసభ ! ఇచ్చట ధర్మము సంస్థాపింపఁ బడుగాక!" యని మహారాజనెను.

“ధర్మమేవ జయతు, ధర్మమేవ జయతు” అని ప్రక్క 66 నున్న పండితులు, దీ ప్రకంఠములతో పలికినారు. “ధర్మసంస్థా పనాదీక్షిత శ్రీవిష్ణుకుండిన మాధవవర్మ సార్వభౌమా! జయతు జయతు!'' అని సభ్యులందరు జయవాక్యములు నిన໖໐໖. ప్రాడ్వివాకులు ముందునకు వచ్చి సాక్ష్యవిచారణ ప్రారంభించిరి, ఒక యర్థఘటిక లో యయినది. విచారణ పూర్తి

యువరాజు దేవవర్మ 'దోషి' యని నిర్ధారింపబడి సది. మహాప్రభువు ధర్మజ్ఞులైన పండితులనై పు చూచినాను.

"యువరాజు దేవవర్మ యొనరించిన యా తప్పిదము నకు మరణమే దండనము, ఈ గోమాత డెక్కలకు వాడి యంచులుగల యుక్కు డెక్కలను తగిలించి శ్రీ యువరాజుల వారిని బరుండబెట్టి, భూమిని బాతిన మేకులకు గట్టి, గోమాతచే దొక్కించి మరణము సర్పించుటయే వానికి శిక్ష!" యని, పండితులు కరుణముగ మనవి చేసి, “తాము దయార్ద్రహృదయులు, యువరా జొనరించిన ఇది మొదటి తప్పిదము, వారికి మహాప్రభువు వేరొక శిక్ష విధించి, యీ యజమానికి దగు పరిహార మిప్పించుట రాజధర్మమును మించిన పరమధర్మమని మనవిచేయుచున్నాము” అని పండి తులు మానము వహించిరి,

యువమహారాజును క్షమించుటే పరమ ధర్మమని మే మందరమును దమకు మనవి చేయు చున్నా” మని అక్కడ జేరిన ప్రజ లందరు నేకకంఠమున నరచిరి.

సార్వభౌముడు చలించలేదు, “రేపు ఉదయము విష్ణుకుండిన వంశజుడు, దేవవర్మకు మరణశిక్ష పురబాహ్య స్థలమున విధింపబడును, ఇది మా ఆజ్ఞ ! మహాదండనాయకులు నూ విధించిన ఈ శిక్ష దేవవర్మ తల్లిదండ్రుల సమక్ష మున నిర్వహింప మేము ఆనతి నిచ్చుచున్నాము” అని గంభీర ధ్వనుల పలికి తలవంచుకొని, వెనుకకు తిరిగి, తిన్నగ నభ్యంతర మందిరములోనికి వెడలిపోయెను.

విజయవాటి కా నగరమంతయు నా వార్త ప్రాకి పోయెను. ప్రజ లట్టుడికి పోయిగి.

దేవవర్మ నడుపుకొని పోయిన యా రథమట్లు వాయు వేగమున పరుగిడుచుండ, యువరాజు పూర్ణముగ మత్తెక్కి ఆ రథముపైన పడిపోయినాడు. సూతుడశ్వహృద యము నెరిగిన ప్రజ్ఞావంతుడగుటచే, యువరాజొరిగిపోవగ నె ముందున కురికి, యువరాజు చేతులనుండి జారిపోయిన పగ్గ ముల నందుకొని, తీయని మాటల జెప్పుచు, గుఱ్ఱముల సను నయించుచు, అశ్వశాంతి మంత్రముపఠించి, వాని వీపులపై న దక్షిణహస్తతలముచే నిమిరినాడు. నురుగులు గ్రక్కు చున్న యాతురగములు రెండును భయముతీరి వేగముతగ్గించి, నెమ్మ దించి చివర కాగిపోయినవి.

సూతుడు వానిని పూర్తిగ సేదతీర్చి, వెనుకకు త్రిప్పి రథము కోటలోనికి గొనిపోయెను,

రాజకుమారుడు విడిది చేసిన హర్మ్యము మ్రోల నా రథ మాగగనె సర్వ సేనాపతియు, మహాదండనాయకుడును ఇరువురు రక్షక భటులతోవచ్చి, రాజకుమారుని రథమునుండిదింపి లోనికి గొనిపోయిరి, మహాదండనాయకుడు, మహా సేనాపతియు గత్తులు దూసియే యుండిరి.

ఆరాత్రి వారిరువురు యువరాజును ఆయన భవనము ననే బంధించి రాజాజ్ఞను బరిపాలించువారై యప్రమత్తత గావలి కాచిరి.

రాజవైద్యుడు వచ్చి యువరాజునకు వైద్యోపచార ములు చేసినాడు. ఆ యుపచారములచే యువరాజునకు మత్తువీడి పూర్తిగ మెలకువ వచ్చినది. తాను బరుండిన పల్యంకముపై లేచి, కూర్చుండి, ఆ దాపున గత్తులుచూసి నిలుచుండిన మహాదండనాయకుని మహాసేనాధిపతిని నాళ్చ ర్యమున దిలకించుచు "ఏ... ఏ... ఏమిజరిగినది...జరిగినది ...జరిగినది? మహా సేనాధిపతీ! వైద్యులవారు వచ్చి రెందుకు?" అని చేతులును, బెదవులును వడంక ప్రశ్నించినాడు.

రాజకుమారునికి మత్తు వదలిపోయినను, మధుపాన జనితనిస్సారము వీడలేదు. మజల వైద్యుడు నీరసము వదలు టకు దేనెలో నొక కుప్పె నరగదీసి అది తమలపాకున కెత్తి మహారాజకుమారునకు సేవింప నిచ్చెను, మందు కంఠము దిగిన రాజకుమారునకు గొంచెముసత్తువవచ్చినట్లయి నది. తాను దన యభ్యంతర పానశాలయందు మధువు సేవించిన విషయము స్ఫటాస్ఫటముగ గోచరించినది,

రాజకుమారుడు : ఏమి జరిగినది మహాసేనాపతీ ?

మహాసేనా : తాము రథము నెక్కి వీధుల వెంట స్వారి చేయ నారంభించినారు.రాజవైద్యుడు: తామే స్వయముగ గుఱ్ఱముల దోలినారు.

రాజకుమారుడు : అది నా కేమియును దెలియదు.

మహాసేనా : గుఱ్ఱము లవశములై పరుగిడసాగెను.

రాజకుమారుడు : అయ్యయ్యో ! ఎంత తెలివితక్కువ పని! మహారాజు పరమశివారాధన సేయుచుండ నాబుద్ధి పెడ దారినిబట్టి మధువు సేవించితిని, జైత్రోత్సవములదప్ప నెన్న డును నట్టి పని చేసి యెరుగను. మహాసేనాపతీ! నామూర్ఖత వలన నెవరికై స బ్రమాదము వాటిల్ల లేదుగదా?

మహాసేనా : ప్రమాదమే సంభవించినది ప్రభూ !

రాజకు : ఆ! ఏమిటా ప్రమాదము? ఎలాటి దా ప్రమాదము ?

మహాదండ : ఒక యావుదూడ తమ రథము క్రింద బడి మరణించినది.

రాజకు : అయ్యయ్యో ! ఎంతదోష మెంతదోషము!

రాజవై : ప్రభువులు కొంచెము శాంతింతురు గాక, తాము ధర్మనిర్వహణము సేయు సమయ మాసన్నమైనది.

రాజకు : నేనేమి ప్రాయశ్చిత్తము చేసికొన్న, ఆ దోషము శాంతించును ? నేను పశువుకన్న నీచుడనై పోతిని. క్రూరమృగము లాహారమునకై ఇతర జంతువుల దినును, నేను రాక్షసుడనై నిష్కారణముగ గోవధ చేసినాను.

మహాసేనా : ప్రభూ! ఎన్నడు జరుగనివింత యేమన నాగోవు స్వయముగ వచ్చి ధర్మరజ్జువును లాగినది!రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను, “నే నెట్టి దండమునకై నను బాత్రుడను. నన్ను మహా రాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది,

మహాదండ : ప్రభూ! ధర్మవిచారణ జరిగినది.

రాజకు : ఆ! జరిగినదా! శుభము. శిక్ష నందుకొను టకు ద్వరపడుచున్నాను,

రాజవై : శాంతింపుడు ప్రభూ! తమకు నిర్ణ యింప బడిన శిక్ష యుదయమే నిర్వహింపబడును. సర్వప్రజాసమంక్ష మున, తన సుతుని గోల్పోయిన యాగోవే తమకు శిక్ష విధించును.

మహాదం : గో సమక్షమున దాము నేర మొనరిం చుటచే మహారాజు, మహారాణులవారి సమక్షమున, నా గోవు తమకు దండన నిర్వహించును.

రాజకు : అయ్యయ్యో ! నే జేసిన తప్పునకు నాయన గారును, అమ్మగారును గూడ బాధ నొందవలసి వచ్చిన దే! దీనికి నివృత్తి లేదు. ఈ పాపముసకు మరణ మే దండనము.

మహాసే : మహాప్రభూ! తమకు...తమకు... ఆ... ఆ దండన మే విధించినారు,

రాజకు : ధన్యోస్మి ! ధన్యోస్మి !

ఆ మఱునా డుదయము నగరబాహ్యస్థలమున నగర వాసులును పరిసర గ్రామవాసులును వేనవేలు చేరిరి. అనే

అడవి బాపిరాజు ద్వారా మరిన్ని పుస్తకాలు

1

అంశుమతి

13 January 2024
0
0
0

శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారక దేవుని ఏకై కపుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయు చున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ

2

అంశుమతి రెండవ అధ్యాయము

13 January 2024
0
0
0

కృష్ణాతీరమున నుత్తమక్షేత్రములలో నొకటియగు విజయ వాటికయందు సర్వమల్లి కేశ్వరుని అర్చించుటకై సకుటుంబ ముగా విడిది చేసి యుండెను. మహారాజుక్న నెలదినములును నా నగరవాసులును పరిసర గ్రామప్రజలును మహోత్సవము లొనరించుక

3

అధ్యాయం 3

16 January 2024
1
0
0

ఈ యా వు త్తమజాతిజ యని రోదించినాడు. తన కోడె దూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుం బము వారందరు అల్లారుముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆయజమాని పడు వేదనను మేము చూడలేకపోతిమి. అత డా దూడక ళేబరము నెత్తికొని తనయ

4

4 అధ్యాయము

16 January 2024
0
0
0

రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను, “నే నెట్టి దండమునకై నను బాత్రుడను. నన్ను మహా రాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది, మహాదండ : ప్రభూ! ధర్మవిచారణ జరిగినది. రాజకు : ఆ

5

ఐదవ భాగం

16 January 2024
0
0
0

గొల్చుచుండిన విష్ణుకుండిననగరవాసులైన యాజ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట. ఈవిధమున నాలో చించుకొనుచున్న అంశుమతిని 'ఏమమ్మా, భర్తృదారికా ! ఏ మాలోచించు చుంటి' నని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను 'ఏమని చె

6

ఆరవ భాగము

17 January 2024
0
0
0

లతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతుల

7

అంశుమతి ఏడవ అధ్యాయము

17 January 2024
0
0
0

"అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీ

8

ఎనిమిదవ భాగం

17 January 2024
0
0
0

కొకటి కాపుగాయుచుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలు బది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవ నులును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతి కుడ్యోప

9

తొమ్మిదొవ భాగము

18 January 2024
0
0
0

విష్ణువర్ధనుడు : కంపనప్రభూ! బలముచే నీకోటను పట్టుకొనవలెనన్న చో నన్నగా రుపయోగించిన బలము నంతను ఉపయోగించవలసి యుండును. మన సై న్యముతో నీ కోటను జయింప యత్నించుట, కొండద్రవ్వి నెత్తి నెత్తు కొన జూచుటవంటిది. కా

10

అంశుమతి పదవ భాగం

18 January 2024
1
0
0

లను దీవ్రముగ బ్రశ్నించితిని. గాంగులకు విష్ణుకుండిన రాజ్యము నంతను గబళింపవలెనను దురాశ గలిగినది. విష్ణు : ఆ దురాశ యీనాటిది కాదుగదా! కాల: విష్ణుకుండిన మహారాజున కీమె యొక్కతయే సంతానము. ఈ బాలికను వివాహమాడి

11

పదకుండవా భాగం

18 January 2024
0
0
0

'నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు ఆ యీ సం భాషణలలో వా రా భావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్ర మెన్ని యోమారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహా

12

పన్నెండవ అధ్యయము

18 January 2024
0
0
0

ఆ సాయంకాలము చాళుక్య విష్ణువర్థనుడు తన సైన్య ములతో గోదావరిని దాటి, గోపాదక్షేత్రమున దండు విడిసి యున్నాడనియు కోన రాష్ట్రమునుండి హైహయు లాయువ రాజును సందర్శించి, సామంత ప్రాభృతములను సమర్పించినా రనియు, మంచనభట

13

పదమూడవ భాగం

18 January 2024
0
0
0

మంతయేని దెలియని తలిదండ్రులు నన్ను విష్ణువర్ధన మహా రాజున కీయ సంకల్పించినారట!' 'ఔనమ్మా ఔను, మనము గోవూరునుండివచ్చినది మొద లీవిషయమును గురించి యంతఃపురమునందు భాషించుచున్నారట. రాజుల రహస్యములన్నియు బరి చారిక

14

పద్నాలుగువా అధ్యయము

18 January 2024
0
0
0

వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగ మునకు 'జలసీమ' యని పేరు. ఆ సరస్సు అతి పురాతనము, భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును బంగారు పంటలు పండుచుండును, ఈ సీమన తను బరిపా లించు సామంతుడు బృహత్ప

15

పదియాదవ భాగం

18 January 2024
0
0
0

సామంతులు కావచ్చును గదా! అదియును గాక, నేనొక సామంతుడను, సైనికుడను. ' 'ప్రభూ ! సామంతత్వముగాని, మహారాజాధికారము గాని అంతఃకరణవృత్తికి నుద్దీపన మెట్లగును? నిజమును గోచ రింప జేయునది అంతస్సాక్ష్యము. నాకా పిష్ట

16

పదహారవ అధ్యయము

18 January 2024
0
0
0

శ్రీ సత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహే శ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువని రాజన్యకిరీటాంచిత రత్న కాంతి నీరాజిత పాదసరో రహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ధి పుల కేశి పృథ్వీవల్ల భ చక్ర వర్తి

---

ఒక పుస్తకం చదవండి