shabd-logo

ఆరవ భాగము

17 January 2024

2 చూడబడింది 2

లతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతులైన సాలంకాయనులతోడను, క్రముక రాష్ట్ర ప్రభులైన బృహత్పలాయనులతోడను, పూంగీ రాష్ట్రాధిపతు లైన పూంగీయులతోడను, ఇంక్ష్వాకులకు సామంతులై చాళు క్యులు వృద్ధిపొందుచుండిరి.

ఇక్ష్వాకుల రాజ్య మంతరించగనే పల్లవులు విజృం సామంతు లందఱును స్వతంత్రులైరి. చాళుక్యు ໖໐໖. లును తమ స్వాతంత్ర్యమును బ్రకటించుకొను మహారాజ చిహ్నమగు 'భట్టారక' శబ్దమును వహించిరి. వారికిని పల్లవులకును యుద్ధములు సాగినవి. చివఱకు త్రినయన పల్లవమహారాజును' చాళుక్యమహారాజు ఓడించెను. కాని యాతడు యుద్ధరంగమున వీరమరణము నందెను, చాళుక్య మహారాజ్ఞి వనవాసి కదంబుల యాడుపడుచు. ఆమె యప్పుడు నిండుచూలాలు. విష్ణుశర్మయను రాజపురోహితు డా మహారాణి సహగమనము సేయ నుద్యమింప దత్ప్ర యత్నమును మాన్పించి, రహస్యముగ 'నామెను గొనిపోయి వాతాపినగరమున దన బందుగుల యింట దాచెను. ఆమెకు చాళుక్య విష్ణువర్ధను డుద్భవించినాడు.

బాల్యమునుండియు విష్ణువర్ధనుఁడు వీర విక్రమ విహా రుడై, విష్ణుశర్మ గుప్తముగా "గొనీ తెచ్చిన రత్నభూషలనుమార్చి ధనము సేకరించుకొని, యా కుంతల దేశమున వాతాపినగరము దనకు ముఖ్యనగరముగ నొనర్చుకొని, సై న్యముల సమకూర్చుకొని, నెమ్మది నెమ్మదిగా రాష్ట్రకూటుల రాజ్యమునుండి జయించిన యా భూభాగమున చాళుక్య రాజ్యము నిర్మించినాడు. చాళుక్య విష్ణువర్ధనుడు పరమ బ్రహ్మణ్యుడై, విష్ణుభక్తుడై, వరాహలాంఛనమును గ్రహించినాడు. తనరాజ్యమును తూర్పు పడమరలకును, దక్షిణోత్తరములకు విస్తరింప జేయసాగెను. వాతాపి నగరమే యాయనకు రాజధానియాయెను. పల్లవ సామ్రా జ్యములోని భాగము లన్నింటిని నాతని వంశీయులు చాళుక్య రాజ్యములో గలుపుకొన సాగిరి.

చాళుక్యరాజ్య మంతకంతకు విస్తరించి ప్రథమ పులకేశి కాలమున, లాట, సౌరాష్ట్ర, అవంతి, ఆశ్మిక, అప రాంత, కుంతల, ములక రాష్ట్రములు మొదలైన సన్నిటిని దనలో విలీనము గావించుకొని, మహాసామ్రాజ్య మైనది. రాష్ట్రకూటులు, వైదర్భులు, ఆంధ్ర చోళులు, ఆంధ్రభోజులు, పుల కేశిచక్రవర్తి పాదముల దమకిరీటముల సమర్పించినారు.

ప్రథమ పులకేశి దివంగతు డైన వెరుక చాళుక్య సామ్రాజ్యమున గొన్ని విపత్తులు సంభవించినను, సామ్రాజ్య బల మిసుమంతయు హీనము కాలేదు.

ప్రథమ పుల కేశిమహారాజునకు మనుమడైన ద్వితీయ పులకేశి మహారాజును నాతనితమ్ము లిరువురును బాలకులై యున్నదినములలో, మంగ ళేశ మహాప్రభువు రాజప్రతినిధియైరాజ్యమేలినప్పుడు చాళుక్య సామ్రాజ్యమున నెన్ని యో కుట్రలు తలలెత్తినవి. మంగ ళేశుని యనంతరము ద్వితీయ పులకేశి వాతాపినగర సామ్రాజ్యసింహాసన మధిరోహించి, చాళుక్యసామ్రా జ్యరాష్ట్రములన్నియు తిరిగి జయించి, తన రాజ్యముపై దండెత్తివచ్చిన యార్యావర్త చక్రవర్తియైన హర్షసమ్రాట్టును వింధ్యారణ్య ప్రదేశములలో నోడించి, వెనుకకు దరిమి వై చెను, తన విజయమునకై బుద్ధభగవాను స ర్చించుచు వ్యాఘ్రనదీగుహా సంఘారామము లో (అజంతాలో) నొక నూతన గుహను నిర్శించి, సంఘారామ' భిక్కులకు దానమిచ్చెను. తానర్పించిన గుహలో దనవిజయ మును బ్రజ్ఞాపూర్ణులయిన చిత్రకారులచే విన్యసింప జేసెను, ఆ చిత్రమున బారసీక రాయబారులు వచ్చి మహారాజును సందర్శింపుచున్నట్లుగూడ విన్యసింపబడెను.

తూర్పుతీరమున జిన్న చిన్న రాజ్యములు ప్రబలి యంతఃకలహములు. మెండై నవి. కళింగనగరాంధ్రగాంగులు వేంగీనగర విష్ణుకుండినులు, కాంచీపుర పల్లవులు, దక్షిణ కోసలులు నొకరిపై నొకరు తలపడని సంవత్సరమే లేదు. ద్వితీయ పుల కేశి యీయరాజకము నడచుటకు కళింగము పై దండువిడిసినాడు. పిష్టపురమున కళింగుల సామంతుల నోడించి, యా నగరమును స్వాధీనము చేసికొనెను.

అంతటితో నూరుకొనక పులకేశి గాంగ రాజ ధాని దంతనగరము వఱక. బోయి గాంగులను దాసోహ మ్మనిపించి, వారిచే గప్పములు గొని, బ్రాహ్మణు లనేకులకు భూరిదానములిచ్చి దాన శాసనములు వేయించెను.

ఆ వెనుక పుల కేశి మహాప్రభువు వేంగీపురముజొచ్చి, విష్ణుకుండిన మాధవవర్మ కొమరుడు మంచన భట్టారకునిక డ వేంగీనగరమున కప్పముగొని తన సర్వసేనాపతులలో నుత్త ముడగు పృథ్వీథృవ రాజేంద్రవర్మను ప్రతినిధిగా నుంచెను, పుల కేశి పృథ్వీవల్లభచక్రవర్తి చోళ, పాండ్య, గంగవాటి గాంగుల, వనవాసికదంబుల నోడించి సామంత సుంకములు గా ధనరాసులు గొనుచు వాతాపి చేరి అశ్వమేధ మొనరించెను. ఆ అశ్వములో చిన్న తమ్ముడు విష్ణువర్ధన మహారాజు వెడలినాడు.

విష్ణువర్ధనుడు వనవాసినగరమున రాజప్రతినిధియై ప్రజ లన్ని సౌఖ్యము లనుభవించును నానందించుచుండ జల్లని పాలనము సల్పి రాజ్యమేలుచుండెను. ఇంతలో తన ప్రియానుజుడు, విషమసిద్ధి, విష్ణువర్ధన ప్రభువును రాజధానీ నగరమునకు రావలయునని చక్రవర్తి యాహ్వానముపినాడు. విష్ణువర్ధనుడు హుటాహుటి ప్రయాణమై సర్వ కాలముల తన్ను అనుసరించియుండు కాలకంపనుని వెంటబెట్టుకొని వాతాపి నగరము వచ్చి చేరినాడు.

"నీవుదక్క మాతృభూమి యైన యాంధ్రదేశమున శాంతిని నెలకొల్పు వా రింకొకరు లేరు తమ్ముడా!" యని విష్ణువర్ధనుని భుజముపై తన దక్షిణ హస్తమునుంచి పులకేశి బల్కినాడు. తమ్ముని చూడగనె చక్రవర్తికి గన్ను లానందమున జిగురించును. తన పుత్రులకన్న జిన్నతమ్ముని నెక్కువప్రేమతో బెంచుకొన్నాడు చాళుక్య సమ్రాట్టు, అన్న గారి యడుగుజాడలనే పూజించు విష్ణువర్ధనుడు తన కిరువది వేల బలగ ముండిన జాలునని కాలకంపనుని వెంట బెట్టుకొని విజయయాత్రకై వెడలుచుండును.

“విష్ణువర్ధనా! పిష్టపురదుర్గము కొండపై నిర్మింప బడకపోయినను 'స భేద్యమగునోట కావున నా నగరమున నే నీవు రాజధానీనగరము సేసికొని యాంధ్ర సామ్రాజ్య మొకటి పునర్నిర్మాణము సేయుమని నిన్నాశీర్వదించు చున్నాను.”

”మహాప్రభూ! పరమమా హేశ్వరులైన మాలజ్ఞ యే నాకు శ్రీరామరక్షయు, మంత్రప్రసాదమును,”

" తమ్ముడా? నీవు రూపమున జిన్నవాడ వయిసను విక్రమమున, విజ్ఞానమున బెద్దవాడవు. నాయనా! నీ వేల నింతవఱకు వివాహము చేసికొన నిరాకరించినాడవో నా కేమాత్రమును రహస్యము గోచరింపలేదు రాజన్యులు సురూపలై, యుత్తమగుణాన్వితలైన తమబాలికల నీ కర్పింప నాకు బంపు రాయబారములు లెక్కింప నలవిగాదు గదా! నీ వన్నింటికి బెడమొగము బెట్టితివి. నీ యిష్టానిష్టము లన్నియు హృదయమునకు సంబంధించినవి. అందు నేనేమి జోక్యము గలుగ జేసికొనగలను ! ""అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీలు లేక పోయినది. హృదయగతమగు ఆ వ్రత మేనాటికి సఫలమగునో ఆనాడు నా పాణిగ్రణ మహోత్సవము తామే పెద్దలై జరిపింప సంభవింప గలదు. అంతవరకును నన్ను క్షమింపుడని మాత్రము వేడుకొను చున్నాను.”

పాదముల కెఱగిన తమ్ముని సార్వభౌముఁడు భుజముల బట్టి లేవనెత్తి గాటముగ గవుగలించుకొనెను.

“సత్వరమున విజయుడవై నాకు వార్త పంపుము విష్ణువర్ధనా!” అని పులకేశి తమ్ముని కళలలోనికి దీక్ష మైన చూపులు పరపి, మందహాసవదనుఁడై మాశీర్వదించెను. విష్ణువర్ధనుడు సైన్యముల నడుపుకొనుచు బూర్వ దిశాభిముఖుడై యాత్ర సాగించినాడు.

మధ్యదుర్గ గ్రామమువీడి, యాంధ్రమహా దేశము పలు తావులనుండి వేగుల రప్పించుకొనుచు, నచ్చటచ్చట స్కంధావారముల నిర్మింపించి, సైన్యముల నిలుపుచు బ్రయా ణమున వేగము తగ్గింపకయు, సైన్యముల నలసట నొందింప కయు నాతడు జైత్రయాత్ర సాగించుచుండెను.

వేంగీ రాష్ట్ర పశ్చిమారణ్యముల జొచ్చి విష్ణువర్ధనుడు తన సైన్యము నుత్తరదిక్కునకు మరలించినాడు. పిష్టపుర

అడవి బాపిరాజు ద్వారా మరిన్ని పుస్తకాలు

1

అంశుమతి

13 January 2024
0
0
0

శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారక దేవుని ఏకై కపుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయు చున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ

2

అంశుమతి రెండవ అధ్యాయము

13 January 2024
0
0
0

కృష్ణాతీరమున నుత్తమక్షేత్రములలో నొకటియగు విజయ వాటికయందు సర్వమల్లి కేశ్వరుని అర్చించుటకై సకుటుంబ ముగా విడిది చేసి యుండెను. మహారాజుక్న నెలదినములును నా నగరవాసులును పరిసర గ్రామప్రజలును మహోత్సవము లొనరించుక

3

అధ్యాయం 3

16 January 2024
1
0
0

ఈ యా వు త్తమజాతిజ యని రోదించినాడు. తన కోడె దూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుం బము వారందరు అల్లారుముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆయజమాని పడు వేదనను మేము చూడలేకపోతిమి. అత డా దూడక ళేబరము నెత్తికొని తనయ

4

4 అధ్యాయము

16 January 2024
0
0
0

రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను, “నే నెట్టి దండమునకై నను బాత్రుడను. నన్ను మహా రాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది, మహాదండ : ప్రభూ! ధర్మవిచారణ జరిగినది. రాజకు : ఆ

5

ఐదవ భాగం

16 January 2024
0
0
0

గొల్చుచుండిన విష్ణుకుండిననగరవాసులైన యాజ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట. ఈవిధమున నాలో చించుకొనుచున్న అంశుమతిని 'ఏమమ్మా, భర్తృదారికా ! ఏ మాలోచించు చుంటి' నని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను 'ఏమని చె

6

ఆరవ భాగము

17 January 2024
0
0
0

లతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతుల

7

అంశుమతి ఏడవ అధ్యాయము

17 January 2024
0
0
0

"అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీ

8

ఎనిమిదవ భాగం

17 January 2024
0
0
0

కొకటి కాపుగాయుచుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలు బది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవ నులును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతి కుడ్యోప

9

తొమ్మిదొవ భాగము

18 January 2024
0
0
0

విష్ణువర్ధనుడు : కంపనప్రభూ! బలముచే నీకోటను పట్టుకొనవలెనన్న చో నన్నగా రుపయోగించిన బలము నంతను ఉపయోగించవలసి యుండును. మన సై న్యముతో నీ కోటను జయింప యత్నించుట, కొండద్రవ్వి నెత్తి నెత్తు కొన జూచుటవంటిది. కా

10

అంశుమతి పదవ భాగం

18 January 2024
1
0
0

లను దీవ్రముగ బ్రశ్నించితిని. గాంగులకు విష్ణుకుండిన రాజ్యము నంతను గబళింపవలెనను దురాశ గలిగినది. విష్ణు : ఆ దురాశ యీనాటిది కాదుగదా! కాల: విష్ణుకుండిన మహారాజున కీమె యొక్కతయే సంతానము. ఈ బాలికను వివాహమాడి

11

పదకుండవా భాగం

18 January 2024
0
0
0

'నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు ఆ యీ సం భాషణలలో వా రా భావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్ర మెన్ని యోమారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహా

12

పన్నెండవ అధ్యయము

18 January 2024
0
0
0

ఆ సాయంకాలము చాళుక్య విష్ణువర్థనుడు తన సైన్య ములతో గోదావరిని దాటి, గోపాదక్షేత్రమున దండు విడిసి యున్నాడనియు కోన రాష్ట్రమునుండి హైహయు లాయువ రాజును సందర్శించి, సామంత ప్రాభృతములను సమర్పించినా రనియు, మంచనభట

13

పదమూడవ భాగం

18 January 2024
0
0
0

మంతయేని దెలియని తలిదండ్రులు నన్ను విష్ణువర్ధన మహా రాజున కీయ సంకల్పించినారట!' 'ఔనమ్మా ఔను, మనము గోవూరునుండివచ్చినది మొద లీవిషయమును గురించి యంతఃపురమునందు భాషించుచున్నారట. రాజుల రహస్యములన్నియు బరి చారిక

14

పద్నాలుగువా అధ్యయము

18 January 2024
0
0
0

వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగ మునకు 'జలసీమ' యని పేరు. ఆ సరస్సు అతి పురాతనము, భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును బంగారు పంటలు పండుచుండును, ఈ సీమన తను బరిపా లించు సామంతుడు బృహత్ప

15

పదియాదవ భాగం

18 January 2024
0
0
0

సామంతులు కావచ్చును గదా! అదియును గాక, నేనొక సామంతుడను, సైనికుడను. ' 'ప్రభూ ! సామంతత్వముగాని, మహారాజాధికారము గాని అంతఃకరణవృత్తికి నుద్దీపన మెట్లగును? నిజమును గోచ రింప జేయునది అంతస్సాక్ష్యము. నాకా పిష్ట

16

పదహారవ అధ్యయము

18 January 2024
0
0
0

శ్రీ సత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహే శ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువని రాజన్యకిరీటాంచిత రత్న కాంతి నీరాజిత పాదసరో రహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ధి పుల కేశి పృథ్వీవల్ల భ చక్ర వర్తి

---

ఒక పుస్తకం చదవండి