shabd-logo

అంశుమతి

13 January 2024

2 చూడబడింది 2

శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారక దేవుని ఏకై కపుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయు చున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ్రుంకులిడుచున్నది. రాజ పురో హితుడు 'అఖండ గౌతమీస్నా సమహంకరిష్యే' అని ప్రారం భించి, 'దశాప రేషాం దశపూర్వేషాం' అను మంత్రములతో రాజకుమారికను గోదావరీ స్నానము పూర్తిచేయిం చెను,

గట్టుపైన తనకై నిర్మించిన శిబిరములోనికి బోయి, యా బాలిక యుచిత వేషము ధరించి, చెలులు కొలుచుచుండ నీవలికివచ్చి, అక్కడ చేరిన భూదేవు లందరకు సంభావనలు సమర్పించినది. ఆ వెనుక స్యందనమెక్కి, విడిది చేసియున్న మహాభవనమున బ్రవేశించినది.

పదునెనిమిది వత్సరముల ఎలప్రాయమున నున్న ఆ బాలిక లోకోత్తరసుందరి యని ప్రసిద్ధిగాంచినది. ఆనాటి రాజకుమారు లెందరో ఆమెను వివాహమాడ వాంఛించి శ్రీ మంచన భట్టారక మహారాజుకడకు రాయబారము లంపు చుండిరి. కాని యా బాలిక ఏ కారణముననో యా రాయ బారములలో నొక్కటినై నను అంగీకరించ లేదు.అంశుమతీ కుమారి జాతకమున నేదియో గ్రహం దోషము వచ్చినదని రాజజ్యోతిష్కుడు నారసింహభట్ట పండి తులు సెలవిచ్చినారు. అందులకు గోవూరు గోపాదక్షేత్ర మున గోదావరీస్నానము చేయుచు, నుత్తమ బ్రాహ్మణులచే గ్రహజపము లొనరింపజేయుచు, చానాదు లర్పింపవలయు నని నారసింహభట్టు నిర్ణ యించినారు.

'ఆ దోషము గ్రహచారము వలన కలిగినది. తమ రాజ్యమున కే ముప్పు తెచ్చును, గ్రహశాంతి చేయించిన చో నా యుపద్రవము తీరిపోవును' అని రాజగురువు వచించినాడు.

'అటుల దోషము తీరిపోయిన అమ్మాయి జాతక మెట్లుండునందురు గురు దేవా?'

'రాజకుమారి జాతక ముత్కృష్టమైనది. ఆమెకు మహారాజు భర్తగా లభించును. ఆమె గర్భమున కులదీపకు డైన సుపుత్రు డుద్భవించి, సామ్రాజ్యాధిపతి యగును.

రాజగురువే గోవూరునందు రాజకుమారిక చే గోదా వరీ స్నానవ్రతము చేయింప నేర్పాటయ్యెను. వ్రతము నలుబది దినము లొనరింపవలసి యున్నది.

సాగరు లపవిత్రము సలిపిన భూమిని పవిత్రము సేయు టకు భగీరథుడు హిమవన్నగమున దప మాచరించి, ఆకాశ గంగను మెప్పించెను. ఆమె భూమి నవతరించుట కనుగ్ర హించినను, ఆమె దిగివచ్చు నురవడి నాపగల వా రెవ్వరు? కావున భగీరథుడు మరల నుగ్రతప మొనర్చెను. ఆ తపము నకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యెను. ఆ మహేశ్వరుడు తన జటాజూటము విప్పి భూమికి మహావేగమున వ్రాలి వచ్చు మందాకినీ నదిని తన జడలలోనికి గ్రహించినాడు. ఆ దివ్యనదిలో నొక పాయను మాత్రము పరమేశ్వరుడు భూమిని పూత మొనరించుటకై వదలినాడట. అప్పటి నుండియు గంగను జటాజూటమున ధరించి శివుడు గంగాధరు డైనాడు. భగీరథుడు గంగను భూమి నవతరింప జేయుట చే నా దివిజనది భాగీరథియైనది.

ఉత్తర భరత దేశమునందు ఈమహోత్తమ సంఘటన జరిగిన కొన్ని యుగములకు, పరమశివుని యవతార మొక్కటి వింధ్యపర్వతము దాటి దక్షిణాపథమునకు వచ్చి, పశ్చిమాద్రి యందు ప్రత్యక్షమయ్యెను. అచ్చట నా శంభు దేవుడు త్ర్యంబ కేశ్వరుడై వెలసెను. ఆ దినములందే దండకారణ్యమున నేటి గోవూరు ప్రాంతమున గౌతమమహర్షి తన యాశ్రమము నిర్మించుకొని తపం బాచరించుకొనుచుండెనట. ఆ ప్రదేశ మున మాత్రము వర్ష మెల్లప్పుడు కురియుచుండెనట. వానలే పంటల కాధారములట. కావున ఆ సీమ నాదిమ నివాసులగు ఆంధ్రు లుపాయమును బన్ని గౌతమమహర్షి యాశ్రమములోనికి గోవు నొకదానిని తోలిరట, ఏనాటి కానాడు పండు వరిచేను నాగోవు మేసిపోవుచుండ గౌతముడు దాని తరిమివేయ నొక దర్భపుల్లను విసరినంత మహర్షి తపోబలంబున నా యావు మరణించి నేలఁగూలినది.

గోహత్యా మహాపాతకము గౌతముని జేరవచ్చినది. ఆ పాపమును నాశనము జేసికొనుటకు నా ఋషిసత్తముడుదీక్షతో తపమ్ముసలువ బ్రహ్మ ప్రత్యక్షమైనాడు, త్ర్యంబ కేశ్వరమునకు జని యచ్చట వెలసిన పరమశివునిజటలోనున్న గంగను గొనిరా బ్రహ్మ అతని నియమించెనట. గౌతము డా త్రినేత్రుని వేడి యభ్రగంగలో వేరొక పాయను గొని వచ్చెను. గోహత్యాపాతకము నాశనము జేసినది గావున గోదావరి యనియు, గౌతముడు కొనివచ్చెనుగాన గౌతమి యనియు నా దివ్యనదికి బ్రసిద్ధనామములు వచ్చినవి. గోవు చనిపోయిన ప్రదేశము గోపాదక్షేత్రము. అచ్చట వెలసిన మునిపల్లె గోవూరయినది.

రాజకుమారి గోదావరీస్నాన వ్రతము నిర్విఘ్నముగ సాగుచున్నది. ఆ సాయంకాలమున నొంటిగా భవనోద్యాన మున నాబాల విహరించుచు నూత్న పరీమళమూర్తియై అప్పుడే యా వనవాటికను బ్రవేశించిన వసంత దేవుని నవ్య విలాసముల గమనించి 'మాధవీ! యిటు ర' మ్మని చెలిని బిల చెను. ఆమె మాటలోని తొందరపాటును నానందమును గ్రహించి మాధవీలతయను రాజకుమారి యిష్టసఖి, 'ఏమి రాజకుమారీ ! ఏది యోవింత గనినట్లుంటి' వనుచు బరుగిడి దఱి చేరెను.

'మాధవీ! ఈ మల్లెపొద మొగ్గలు దొడిగినది. గున్నమామిడి లేబూత నలంకరించుకొనుచున్నది. వాయు దేవుడు గంధవహుడగుచున్నాడు చూచితివా?”

'రాజకుమారీ! ఏ సంవత్సరమున శాసంవత్సరము వచ్చు వసంత దేవు డొకడా లేక యనేకు లందువా?”"ఓసి వెట్టిదానా! వసంతుడు నిత్యయౌవనుడు. నిత్యలీలావిలాసుడు, ప్రాతః కాలమున నుదయించి ముప్పది గడి కులు నభోమండలమున బరిభ్రమించి సాయంకాల మస్తాద్రిని జేరు సూర్యభగవాను డొక్క డందువా వేవు రందువా?"

“ఒక్కడే అందును.”

"ఈ నవ్యత్వ మాలోచించియే దివ్యకవులైన కాళి దాసాదులు తమ గీతామృత ధారల మాధవ దేవుని పలు గతుల కీర్తించిరి.”

"ఈ వనీకన్యను వరించి యీ మాధవ దేవుడు వచ్చి నాడు. మా రాజకుమారిని...''

“ఛీ! మూర్ఖురాలా! నోరుమూయుము.”

"క్షంతవ్యను. మాధవ దేవుని రాశ చేగదా ఈనికుం జములు పుష్పభరితము లాయె ననుకొనుచు తొందరలో నటు లంటిని.”

ఆమాటల కారాచకన్నియ కోపము నటించి చెలిపై అవతంస కుసుమము విసరినది. మాధవి కిలకిల నవ్వుచు నా పుష్పవాటిక నెందో మరుగై పోయినది.

ఒక యుత్త మాజానేయము నధిరోహించి పడుచువా డొకడు మహావేగముతో వేంగీనగరమునకు బశ్చిమముగా నిరువది యోజనముల దూరమున 'మధ్యదుర్గ' మను గ్రామ మును దాటి వచ్చుచుండెను. ఉత్తమలక్షణ సమన్విత మైనప్రజలనుకొను చుందురు. ఆపొడవునకు సరితూగు నంగములు కలిగి చారుశరీరి యగుటచే విష్ణువర్ధనుడు బాలకునివలె గప్ప ట్టును. ఈతని పూర్వీకులలో విష్ణువర్ధన నామములు గలవా రున్నారు. వాతాపి చక్రవర్తుల మూలపురుషుడే విష్ణువర్ధ నుడు. అందుచే గాబో లీకనిని గుబ్జవిష్ణువర్ధనుం డనీ పిలుచుకొందురు.

పచ్చని బంగారు చాయ, పదునా రేండ్ల వయసు మిసి మిచే వెలుగునాతనిమోముననూగునూగుమాసలు గాంచినవా రాతని బాలకు డనియే యనుకొందురు. అయినను విష్ణువర్ధ నుని శరీరాంగకము లుక్కుతో నిర్మించినవి. ఇనుప గుదియ నైన నాత దుంగరమువలె వంచి వేయనట పొడగరు లై రాక్షసులవంటి దిట్టరులు విష్ణువర్ధను నవలీలగ నోడించవచ్చు నని యాతనితో ముష్టి మల్లయుద్ధముల దలపడి మూడు నిమేషములలో ప్రాణములు కడబట్టి, 'బ్రతుకుజీవుడా' యని దాసోహ మందురట.

ఆతని బాణప్రయోగములు, అతనికత్తివేటులు విద్యు ద్వేగములు, శార్జకోదండ వినిర్ముక్త బాణములవలె తీవ్ర ములు, విష్ణువర్ధనుడు భయమన్న నెఱుంగడు. తానోడిపోదు సన్న సంశయ 'మెన్నడును నాతనికి బొడమలేదు. సైన్యము నడుపుటలో, వ్యూహమును బన్నుటలో, నెదిరిబలములను దాకుటలో కుబ్జవిష్ణువర్ధనుడు నుడు ప్రజ్ఞావంతుడు సేనాపతి, తన బలముకన్న శత్రువుల సైన్య మెంత యధిక మైనను యుద్థ నిర్వహణమునందు బగతురు తన కెప్పుడును తక్కువవారను నమ్మక ముండుట చేతనే విష్ణువర్ధనుడు మేకల మందపై బడు సింహమువలె బ్రళయప్రభంజనమై వైరులపై విరుచుకొని పడును.

కాలకంపనుడు : మహాప్రభూ! సార్వభౌములు తమ చిన్నన్నగారైన సత్యాశ్రయ శ్రీ జయసింహ మహారాజును సురాష్ట్ర, కుకర, ఆనర్త, అనుప అపరాంత దేశములకు మహారాజుగా జేసి పట్టము గట్టినారు. తాము కుంతల దేశమును జయించినారు, అశ్మక నడంచినారు. రాష్ట్ర కూటులను బాదాక్రాంతులుగ జేసినారు. వనవాసి దేశము నకు దాము ప్రతినిధులై యుండిరి. మరి, అడుగడుగునకును సడ్డుతగులు నీ పూర్వ సముద్రతీర రాజ్యములకు బుద్ధిచెప్పు డని ఇప్పుడేల వారు పంపినో నా కవగత మగుట లేదు మహా مرمتها !

విష్ణువర్ధనుడు : సేనాధిపతీ! అన్నగారు దివ్యప్రతిభా వంతులు, వారి హృదయము అవగతము సేసికొనుటకు బృహస్పతులైన జాలరు. రాజ్యములు సుస్థిరములై ప్రజలు రామరాజ్యము ననుభవింపవలెనిని ఎప్పుడును వారు గోరు చుందురు.

శాల : మహాప్రభూ! నాకు సార్వభౌముల హృదయ మిప్పుడు దిజ్మాత్ర మనగతమైనది. చిన్నచిన్న రాజ్యములు దురాశ చేతను, గర్వముచేతను సంతతమును దమలోదాము యుద్ధములు సలుపుచుండును. అందువలన బ్రజలకు నష్టములు కలుగును, సార్వభౌముల క దియిష్టము లేదు, 

అడవి బాపిరాజు ద్వారా మరిన్ని పుస్తకాలు

1

అంశుమతి

13 January 2024
0
0
0

శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారక దేవుని ఏకై కపుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయు చున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ

2

అంశుమతి రెండవ అధ్యాయము

13 January 2024
0
0
0

కృష్ణాతీరమున నుత్తమక్షేత్రములలో నొకటియగు విజయ వాటికయందు సర్వమల్లి కేశ్వరుని అర్చించుటకై సకుటుంబ ముగా విడిది చేసి యుండెను. మహారాజుక్న నెలదినములును నా నగరవాసులును పరిసర గ్రామప్రజలును మహోత్సవము లొనరించుక

3

అధ్యాయం 3

16 January 2024
1
0
0

ఈ యా వు త్తమజాతిజ యని రోదించినాడు. తన కోడె దూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుం బము వారందరు అల్లారుముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆయజమాని పడు వేదనను మేము చూడలేకపోతిమి. అత డా దూడక ళేబరము నెత్తికొని తనయ

4

4 అధ్యాయము

16 January 2024
0
0
0

రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను, “నే నెట్టి దండమునకై నను బాత్రుడను. నన్ను మహా రాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది, మహాదండ : ప్రభూ! ధర్మవిచారణ జరిగినది. రాజకు : ఆ

5

ఐదవ భాగం

16 January 2024
0
0
0

గొల్చుచుండిన విష్ణుకుండిననగరవాసులైన యాజ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట. ఈవిధమున నాలో చించుకొనుచున్న అంశుమతిని 'ఏమమ్మా, భర్తృదారికా ! ఏ మాలోచించు చుంటి' నని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను 'ఏమని చె

6

ఆరవ భాగము

17 January 2024
0
0
0

లతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతుల

7

అంశుమతి ఏడవ అధ్యాయము

17 January 2024
0
0
0

"అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీ

8

ఎనిమిదవ భాగం

17 January 2024
0
0
0

కొకటి కాపుగాయుచుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలు బది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవ నులును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతి కుడ్యోప

9

తొమ్మిదొవ భాగము

18 January 2024
0
0
0

విష్ణువర్ధనుడు : కంపనప్రభూ! బలముచే నీకోటను పట్టుకొనవలెనన్న చో నన్నగా రుపయోగించిన బలము నంతను ఉపయోగించవలసి యుండును. మన సై న్యముతో నీ కోటను జయింప యత్నించుట, కొండద్రవ్వి నెత్తి నెత్తు కొన జూచుటవంటిది. కా

10

అంశుమతి పదవ భాగం

18 January 2024
1
0
0

లను దీవ్రముగ బ్రశ్నించితిని. గాంగులకు విష్ణుకుండిన రాజ్యము నంతను గబళింపవలెనను దురాశ గలిగినది. విష్ణు : ఆ దురాశ యీనాటిది కాదుగదా! కాల: విష్ణుకుండిన మహారాజున కీమె యొక్కతయే సంతానము. ఈ బాలికను వివాహమాడి

11

పదకుండవా భాగం

18 January 2024
0
0
0

'నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు ఆ యీ సం భాషణలలో వా రా భావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్ర మెన్ని యోమారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహా

12

పన్నెండవ అధ్యయము

18 January 2024
0
0
0

ఆ సాయంకాలము చాళుక్య విష్ణువర్థనుడు తన సైన్య ములతో గోదావరిని దాటి, గోపాదక్షేత్రమున దండు విడిసి యున్నాడనియు కోన రాష్ట్రమునుండి హైహయు లాయువ రాజును సందర్శించి, సామంత ప్రాభృతములను సమర్పించినా రనియు, మంచనభట

13

పదమూడవ భాగం

18 January 2024
0
0
0

మంతయేని దెలియని తలిదండ్రులు నన్ను విష్ణువర్ధన మహా రాజున కీయ సంకల్పించినారట!' 'ఔనమ్మా ఔను, మనము గోవూరునుండివచ్చినది మొద లీవిషయమును గురించి యంతఃపురమునందు భాషించుచున్నారట. రాజుల రహస్యములన్నియు బరి చారిక

14

పద్నాలుగువా అధ్యయము

18 January 2024
0
0
0

వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగ మునకు 'జలసీమ' యని పేరు. ఆ సరస్సు అతి పురాతనము, భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును బంగారు పంటలు పండుచుండును, ఈ సీమన తను బరిపా లించు సామంతుడు బృహత్ప

15

పదియాదవ భాగం

18 January 2024
0
0
0

సామంతులు కావచ్చును గదా! అదియును గాక, నేనొక సామంతుడను, సైనికుడను. ' 'ప్రభూ ! సామంతత్వముగాని, మహారాజాధికారము గాని అంతఃకరణవృత్తికి నుద్దీపన మెట్లగును? నిజమును గోచ రింప జేయునది అంతస్సాక్ష్యము. నాకా పిష్ట

16

పదహారవ అధ్యయము

18 January 2024
0
0
0

శ్రీ సత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహే శ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువని రాజన్యకిరీటాంచిత రత్న కాంతి నీరాజిత పాదసరో రహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ధి పుల కేశి పృథ్వీవల్ల భ చక్ర వర్తి

---

ఒక పుస్తకం చదవండి