shabd-logo

పదకుండవా భాగం

18 January 2024

2 చూడబడింది 2

'నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు ఆ యీ సం భాషణలలో వా రా భావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్ర మెన్ని యోమారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహాసామ్రాజ్యమును సుస్థిర మొనర్పజాలకు పోతిననియు దుఃఖించితిని, ఏమి రాజ్యములు, ఏమి రాజులు! కాకులపలె గ్రద్దలవలె సైన్యములు సమ కూర్చుకొని యనిత్యమును గశ్మలము నగు కీర్తికై యొకరి తల నొకరు నఱుకుకొనుచు, నొకరి రాజ్య మొకరు హరించు చున్నారు. '

'అవును కన్నతల్లీ ! నీవు బాలకుడవై పుట్టవలెనని వాంఛించిన ట్లీ నాటి నీ వేమమే నిదర్శనము, ఎంత జక్కగ నభినయించితివి. నాకు 'నీవు బాలకుడ వయియే జనించితి వేమో' యని యొక నిమేషమాత్ర మనిపించినది నీవన్నట్లు రాజ్యము లెప్పుడును పాపాకరములు. అహింసావ్రతమే ముక్తికి నిజమైన మార్గము. ఇతరులకు హాని చేయుటకన్న దన్నుదాను హింసించుకొని జిన దేవలోకము నార్జించుట పరమధర్మ మన్నారు...'

'ఏమి టా మాటలు జననీ! నే నీ వారము దీనముల నుండియు నేకారణముసనో ఆనందము నందుచు బొంగిపోవు చున్నాను. నా కీ పొడియారిన వేదాంతపు మాట లెందుకు? నా వివాహము విషయమై మాట్లాడుటకు దీసికొని వచ్చినారు. నే నొక పరమపురుసఃనికై యెన్ని యుగముల నుండి యో యెదురుజూచుచున్నట్లుగ దోచెడిది. నేడు నా మహాభాగుడు పిష్టపురమున దర్శనమిచ్చినాడు. వాతాపి చాళుక్య సామంతులలో నొకప్రభువు కుమారు డాతడు. పిష్టపుర రాణివాసపు టుద్యానమున నా వీరుని దర్శనమును హఠాత్తుగ బొందగలిగితిని."

'ఏమిటి? కన్నతల్లీ ! ఎవరిని దర్శించితే నంటివి?'

'నా చేయిని గ్రహించి, నన్నీ లోకయాత్రలో దివ్యపథములకు గొనిపోగలిగిననా నాయకుని సందర్శించితిని,

'అదేమి తల్లీ ! ఒక సామాన్య సామంతుని నీవు వలచినావా! ప్రేమించినావా!'

'అవును అమ్మగారూ! అవును, అది ప్రేమయో, వలపో నాకు దెలియదు. అతనికి నే నా పవిత్రతక్షణమున నే నా హృదయమును, సర్వస్వము నర్పించుకొంటిని, ఆయన సామాన్యుడగు సామంతుడైనను, చక్రవర్తియైనను నా శాతని స్థితితో నవసరము లేదు. ఆతడు చాళుక్య యువరాజైన విష్ణువర్ధన మహారాజుతో గలసి కళింగ గాంగ మహారాజులపై దాడి వెడలినాడు. నా హృదయ మాతని కర్పించితి సమ్మా.'

ఆ బాలిక మహారాణి కంఠమును బిగియార గౌగి లించి యామె హృదయమున దన మోము గాఢముగ నదిమి కొనుచు 'అమ్మా నా కే మహారాజును, జక్రవర్తియు వలదు. నా కేడుగడయైన యా ప్రియదర్శి నిర్వక్ర పరాక్రములని నా హృదయమున వెంటనే స్ఫురించినది' అని డగ్గుత్తిక పడ్డ మాటలతో నా బాలిక తన హృదయ రహస్యమును వెల్లడించెను.

మహారాణి నిరుత్తరయై యేమియు మాటాడ నేర క తన కూతును హృదయమునకు గాఢముగ హత్తుకొన్నది. మఱునాడు నారసింహ భట్టుపండితులవారిని విష్ణుకుండిన మహారాజు తమయాలోచనా మందిరమునకు రప్పించుకొనిరి,

'గురుదేవా! ఈ నాటి కమ్మాయి హృదయ మా ర్ద్రత నందినది. చాళుక్య యువమహారాజు సనుచరుడైన యొక సామంత యువకు నమ్మాయి వరించినదట. నా యాశలు భగ్నము లైన'వని దీనదృష్టుల జూచుచు మహా రాజు పలికెను,

నారసింహభట్ట పండితు లాశ్చర్యము వెలిబుచ్చుచు 'ఇదేమి మహాప్రభూ! ఈ సంఘటన యెట్లు ఘటిల్లినది 1

'అమ్మాయిని దుర్మార్గు లెత్తుకొనిపోవుట గోవూరు నందున్న తా మెఱుగుదురుగదా! వారు గాంగులై యుండ వలెను. కళింగగాంగ యువరాజుపై నాకు బూర్తిగ నను మాన మున్నది. పిష్టపురమునుండి గాంగుల దరిమి, యా నగరమును చాళుక్య విష్ణువర్ధనమహారాజు స్వాధీన మొనర్చు కొన్నప్పుడు అమ్మాయిని చెఱ విడిపించిన కొలది దినములకు నామె చాళుక్య సామంతుడైన యువకు నొకని జూచినదట. ఆ ముహూర్తముననే యాతడే తనకు గాబోవు భర్త యనినిర్ణయించుకొన్నదట. తాము దక్క యితరు లెవ్వరును మాకు సరియగు నాలోచన చెప్పువారు లేరు.'

'మహాప్రభూ! మీరు నన్ను ప్రశ్నించిన యీ సమ యమే మిక్కిలి యుత్తమము. రాజకుమారికి ఆ యువకుడే భర్త యగును, అతడే భావి యాంధ్ర సమ్రాట్టు,

'చాళుక్య విష్ణువర్ధన యువమహారాజు కళింగాధిపు లను బూర్ణముగ నోడించి వారినుండి ప్రాభృతము గైకొని యతి వేగమున వేంగీ రాష్ట్రముపై నెత్తివచ్చుచున్నాడట.'

'మహాప్రభూ! నేను మంత్రాంగముగ నాలోచించి నను, జ్యోతిషపరముగ విచారించినను దమ రాజ్యములో యుద్ధము పొసగ నేరదు. పులకేశి మహారాజు వచ్చినప్పుడును దామువారితో యుద్ధము సేయరైరి, మి మ్మా ప్రభువు పదచ్యుతుని జేయలేదు, సరిగదా, మీ రాజ్యమును సుస్థి రము సేయుటయే తన తలంపనియు మీ సహాయార్థము మాత్రమే తాను తన సేనాపతియగు పృథ్వీరాజేంద్రవర్మ నిచ్చట నుంచితి ననియు దెలిపిరిగదా! ఆ భావమునకు నేడేమియు భంగము జరుగదు.'

' ఏ దెట్లు జరుగునో చిత్రరథస్వామియిచ్ఛ.'

"వేంగీనగర మారుగోరుతముల పొడవును, నాలుగు గోరుతముల వెడల్పును గలిగిన మహానగరము. ఈ నగర మును నిర్మించిన వారు సాలంకాయన ప్రభువులు,కాయనులు శాతవాహనులలో నొక శాఖవారు. సాత వాహన శ్రీముఖ చక్రవర్తి, రాజబంధువగు కాన్హ సాలం కాయనుని ఆంద్ర కళింగ రాజ్యపు టెల్లలకాపాడ, రాజప్రతి నిధిగా నియమించి, గోదావరీతీరమున నొక దుర్గము నిర్మించు కొని, గోదావరీతీరము సంరక్షింప నాజ్ఞాపించెను.

గృధ్రవాడ విషయములో నాలుగు యోజనములు పొడవు, మూడు యోజములు వెడల్పు కలిగిన మహాసర స్సొకటి సొంపారి యున్నది. ఆ సరస్సులో ననేక చిన్న చిన్న నదులు సంగమించుచున్నవి. వేయి జలశకుంత సంతానజాతు లా కొలనులో నివసించుచు నిత్య కలకలారావ సంగీత మాల పించుచుండును, పోడశపత్రములు ద్వాత్రింశత్ పత్రములు, శతపత్రములు సగు కమలములును, గంగు రంగుల కలువ పూవులును ఆ సరస్సునకు అలంకారములై పరీమళములు వెదజల్లు చుండును,

ఆ కొలని పడమటి తీరమున పద్మానది సంగమించిన తీరభూమిని రెండు యోజనముల పొడవును, నొక యోజనము వెడల్పును గల నగరమును కాస్ట్ల సాలంకాయనుడు నిర్మించి నాడు.

సాలంకాయనుల కులదైవము చిత్రరథస్వామి, సొత వాహన సామ్రాజ్య మంతరించిన వెనుక యిక్ష్వాకులతో బాటు సాలంకాయనులు రాజ చిహ్నమైన 'భట్టారక' శబ్ద మును వహించిరి.విష్ణుకుండిన మంచన భట్టారక మహారాజు, కొమరిత అంశుమతి శత్రువుల బారినుండి తప్పించుకొని క్షేమముగ వేంగీపురము చేరినందులకు చిత్రకథస్వామిని స్వయ ముగ సర్చింప సకల సామంత సేనాధిప రాజోద్యోగి సహితముగ పాదచారియై దేవాలయమునకు బయలు దేరెను. సింహలాంఛిత విష్ణుకుండిన పతాక మెగురుచుండ, నా ధ్వజ మును మోయుచు పట్టపుటేనుగు ముందునడువ, వంది మాగధులు, నా వెనుక వేత్రహస్తులు 'జయజయ' ధ్వాన ములు సలుపుచు బారులుతీర్చి సడుచుచుండిరి.

వారివెనుక గంగా గోదావరీ కృష్ణాజలములు గల స్వర్ణ కుంభముల వహించిన ధవళవృషభముల నడిపించుచు, వేదమంత్రములు పఠించుచు బ్రాహ్మణులు నడుచుచుండిరి. వారి ననుసరించి, ముఖపతులు, దళపతులు, సేనాపతులు నడచుచుండిరి. సకల రత్నాలంకారయుక్తమైన సామ్రాజ్య శ్వేతచ్ఛత్రము పట్టి ఛత్రధారులు నడచుచుండ నా ఛత్రము క్రింద మహారాజు, రాజగురువు కై దండగొని, మదగజమువ లె గంభీరమున నడచుచుండెను. మహారాజు వెనుక సామంతులును, రాజబంధువులును ననుగమించుచుండిరి. పూజాద్రవ్యములు గ్రహించి బ్రాహ్మణపుణ్యస్త్రీ లావెనుక వచ్చుచుండిరి, ఎద్దులబండ్లు శతపత్రములు మోసికొనుచు వచ్చుచున్నవి.

మహారాణీయు రాజకుమారి అంశుమతియు శిబికలపై బరిచారికాజనములు గొలిచిరా జిత్రరథస్వామి కొలువునకువెడలుచుండిరి. దేవాలయ ప్రాంగణము, ప్రదక్షిణపథము, కల్యాణ మండపము, ముఖమండపము, గర్భాలయమును మనోహరాలంకారములతో ధగధగ వెలిగిపోవుచుండెను. నాగస్వర కాహళ, ముఖవీణ భే భౌంకారాది మంగళవాద్య ములు, దశదిశల నింపి వేయుచున్నవి. ఒక వైపున నాట్యాంగ నలు నాట్యకళావైదుష్యమును బ్రదర్శించుచుండిరి.

మూలవిరాటైన చిత్రరథస్వామి నవగ్రహ, అష్ట ది కాలాది ' పరివార దేవతలతో ఛాయాసంజ్ఞాసమేతుడై యా దేవాలయమున వేంచేసియుండెను. క్షేత్రపాలకుడై న కొలని భట్టారకేశ్వరుని యుపదేవాలయ మామహాక్షేత్రము సందున్నది. ఒక చో గొందరు బ్రాహ్మణు లాదిత్య మంత్ర మును జపించుచుండిరి.

దేవాలయమంతయు నొక మహారథమువలె నిర్మింప బడినది. ముఖమండపము ముందు నేనుగులంత పెద్దవియైన యేడు రాతిగుఱ్ఱములు గంభీర శిల్పాకృతిగలవి, ఆకాశమున నెగిరి పోవుచున్నట్లు విశ్వసింప బడినవి. వాని దోలబోవు చున్నట్లు గరుడాకృతిని ససూరుడు ముఖమండప పురోభాగస్థ మగు నొక చిరు వేదిక పై అధివసించి యున్నాడు.

చిత్రరథస్వామికి వైభవముగ బూజలు జరిగిపోయి నవి. ఆ దినమున మహారాజు రాజబంధుల కందరకు విందు చేసినాడు. బ్రాహ్మణులకు షోడశోపచారములును పోడళ మహాదానములు సలిపినాడు. ఆ మహానగరమునం దుండు జినాలయ సంఘారామాదులలో, బౌద్ధ సంఘారామ చైత్యా

అడవి బాపిరాజు ద్వారా మరిన్ని పుస్తకాలు

1

అంశుమతి

13 January 2024
0
0
0

శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారక దేవుని ఏకై కపుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయు చున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ

2

అంశుమతి రెండవ అధ్యాయము

13 January 2024
0
0
0

కృష్ణాతీరమున నుత్తమక్షేత్రములలో నొకటియగు విజయ వాటికయందు సర్వమల్లి కేశ్వరుని అర్చించుటకై సకుటుంబ ముగా విడిది చేసి యుండెను. మహారాజుక్న నెలదినములును నా నగరవాసులును పరిసర గ్రామప్రజలును మహోత్సవము లొనరించుక

3

అధ్యాయం 3

16 January 2024
1
0
0

ఈ యా వు త్తమజాతిజ యని రోదించినాడు. తన కోడె దూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుం బము వారందరు అల్లారుముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆయజమాని పడు వేదనను మేము చూడలేకపోతిమి. అత డా దూడక ళేబరము నెత్తికొని తనయ

4

4 అధ్యాయము

16 January 2024
0
0
0

రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను, “నే నెట్టి దండమునకై నను బాత్రుడను. నన్ను మహా రాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది, మహాదండ : ప్రభూ! ధర్మవిచారణ జరిగినది. రాజకు : ఆ

5

ఐదవ భాగం

16 January 2024
0
0
0

గొల్చుచుండిన విష్ణుకుండిననగరవాసులైన యాజ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట. ఈవిధమున నాలో చించుకొనుచున్న అంశుమతిని 'ఏమమ్మా, భర్తృదారికా ! ఏ మాలోచించు చుంటి' నని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను 'ఏమని చె

6

ఆరవ భాగము

17 January 2024
0
0
0

లతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్ల వుల తోడను కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానం దుల తోడను, ధాన్యకటక ప్రభువులైన ధనికులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రాధిపతుల

7

అంశుమతి ఏడవ అధ్యాయము

17 January 2024
0
0
0

"అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీ

8

ఎనిమిదవ భాగం

17 January 2024
0
0
0

కొకటి కాపుగాయుచుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలు బది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవ నులును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతి కుడ్యోప

9

తొమ్మిదొవ భాగము

18 January 2024
0
0
0

విష్ణువర్ధనుడు : కంపనప్రభూ! బలముచే నీకోటను పట్టుకొనవలెనన్న చో నన్నగా రుపయోగించిన బలము నంతను ఉపయోగించవలసి యుండును. మన సై న్యముతో నీ కోటను జయింప యత్నించుట, కొండద్రవ్వి నెత్తి నెత్తు కొన జూచుటవంటిది. కా

10

అంశుమతి పదవ భాగం

18 January 2024
1
0
0

లను దీవ్రముగ బ్రశ్నించితిని. గాంగులకు విష్ణుకుండిన రాజ్యము నంతను గబళింపవలెనను దురాశ గలిగినది. విష్ణు : ఆ దురాశ యీనాటిది కాదుగదా! కాల: విష్ణుకుండిన మహారాజున కీమె యొక్కతయే సంతానము. ఈ బాలికను వివాహమాడి

11

పదకుండవా భాగం

18 January 2024
0
0
0

'నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు ఆ యీ సం భాషణలలో వా రా భావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్ర మెన్ని యోమారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహా

12

పన్నెండవ అధ్యయము

18 January 2024
0
0
0

ఆ సాయంకాలము చాళుక్య విష్ణువర్థనుడు తన సైన్య ములతో గోదావరిని దాటి, గోపాదక్షేత్రమున దండు విడిసి యున్నాడనియు కోన రాష్ట్రమునుండి హైహయు లాయువ రాజును సందర్శించి, సామంత ప్రాభృతములను సమర్పించినా రనియు, మంచనభట

13

పదమూడవ భాగం

18 January 2024
0
0
0

మంతయేని దెలియని తలిదండ్రులు నన్ను విష్ణువర్ధన మహా రాజున కీయ సంకల్పించినారట!' 'ఔనమ్మా ఔను, మనము గోవూరునుండివచ్చినది మొద లీవిషయమును గురించి యంతఃపురమునందు భాషించుచున్నారట. రాజుల రహస్యములన్నియు బరి చారిక

14

పద్నాలుగువా అధ్యయము

18 January 2024
0
0
0

వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగ మునకు 'జలసీమ' యని పేరు. ఆ సరస్సు అతి పురాతనము, భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును బంగారు పంటలు పండుచుండును, ఈ సీమన తను బరిపా లించు సామంతుడు బృహత్ప

15

పదియాదవ భాగం

18 January 2024
0
0
0

సామంతులు కావచ్చును గదా! అదియును గాక, నేనొక సామంతుడను, సైనికుడను. ' 'ప్రభూ ! సామంతత్వముగాని, మహారాజాధికారము గాని అంతఃకరణవృత్తికి నుద్దీపన మెట్లగును? నిజమును గోచ రింప జేయునది అంతస్సాక్ష్యము. నాకా పిష్ట

16

పదహారవ అధ్యయము

18 January 2024
0
0
0

శ్రీ సత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహే శ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువని రాజన్యకిరీటాంచిత రత్న కాంతి నీరాజిత పాదసరో రహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ధి పుల కేశి పృథ్వీవల్ల భ చక్ర వర్తి

---

ఒక పుస్తకం చదవండి