మంతయేని దెలియని తలిదండ్రులు నన్ను విష్ణువర్ధన మహా రాజున కీయ సంకల్పించినారట!'
'ఔనమ్మా ఔను, మనము గోవూరునుండివచ్చినది మొద లీవిషయమును గురించి యంతఃపురమునందు భాషించుచున్నారట. రాజుల రహస్యములన్నియు బరి చారికలకు దెలియకుండుటెట్లు! మహారాజున కిది గాటమగు గోర్కెగా బరిణమించినది. మహారాణియు దలయూపిరట, నారసింహభట్టులవారు, మహారాజుగారి యాలోచన లెస్స యనిరట. విష్ణువర్ధనమహారాజు మన నగరమునకు విచ్చేయు టయు నందుకు శుభశకునమట! కాని, వీరందరికి నొక పరమరహస్యము తెలియదు, '
'ఏమిటది ?”
'అది నాకనుమాన మాత్రముసుమా రాజ కుమారీ! నే నది తమకు విన్న వించుట మంచిది కాదేమో యని సందేహించుచున్నాను.’
'మాధవీ! నీవును నేనును జిన్నతనము నుండియు నొక్కచో బెరిగినవారము. ఒక గురువునొద్ద విద్య నేర్చిన వారమును, ఒక చో బండుకొంటి మొక చోట నిదుర గూరి తిమి, నీకును నాకును మధ్య రహస్యము లెక్కడున్నవి!”
'అవునమ్మా అవును. కాని, యెంత 'స్నేహము సల్పిన వారమైనను తమతమ ప్రణయవిషయముల నొకే మార్గమున నెట్లు సంచరించగలము! నాకు దెలిసిన వివ యము నే సనుమానించుచున్న విషయమును నీ హృదయమున నినుపముల్లువలె గ్రుచ్చుకొనునేమోయని భయము సందుచున్నాను.'
'ఆరహస్య మెప్పుడైననూ, నాకు గంటక మగునుగ దా! ఈ పూట దాని బారినుండి నీవు తప్పింతువు. రేపది వేదొక మార్గమున నాకు ఎదురగును. నా ప్రాణమిత్రమ వగు నీ నోటినుండి యా మాటవిని యా బాధ నీసమక్షమున సనుభ వించుటకు నాకు సుకరమగును'.
'ప్రాణసఖీ! ఈ రహస్యము నీకు బాధ గలిగించు నది కాదు. దీని సఁటివచ్చు పరిణామములు నీకు బాధా కరములు గావచ్చును. అదే నా యాలోచన, విష్ణు వర్ధన మహారాజు చాల బొట్టివాడు. తాను చాళుక్య చక్ర వర్తికి దమ్ముడగుటచే నే రాజకన్యయైన దన్ను వివాహ మాడుటకు సమ్మతించునేగాని, ఇసుమంతయు దన్ను బ్రేమించ బోదని భయము వారిని పీడించుచున్నదట. అందుకని ఆ మహారా జింతవరకును వివాహము చేసికొనుటకు నిరాక రించెనట. ఈ విషయము మన పరిచారికలలో గనకాంగి యనునది గ్రహించి నాకు జెప్పినది.
'ఈ విషయము దాని కెట్లు తెలియవచ్చినది?' పిష్టపురము విష్ణువర్ధనుని హస్తగతమైన రెండవ దిన మున మన పరిచారిక లందరును గోవూరునుండి పిష్టపురము నకు వచ్చిరిగదా!
'అవును.''ఆ వచ్చినవారిలో గనకాంగియు నున్నది. విష్ణు వర్ధను సంగరక్షక దళపతులలో నొక డామె కీ రహస్యము తెల్పినాడట.'
'ఇది నిజమైనచో నాకు బాధ యెట్లగును?
'నిజమైనచో నీకు బాధగలుగదు. ఇది వట్టియూహ జనితమైనచో నీ మనస్సంకటమునకు బరిమితి యుండదు,'
“విష్ణువర్ధన మహారా జంత పొట్టివాడా!'
'అవును! అందుకనియే వానికి కుబ్జవిష్ణువర్ధనుడని పేరు వచ్చినదట.'
'అందుకనియే శాబోలు-'
“ఏమి టందుకనియే కాబోలు! నాతో జెప్పగూడదు. -
కాబోలు'
'నీకు జెప్పక దాచగలనా ! పిష్టపురమును చాళుక్యు లాక్రమించిన నాలుగు దినములకు గదా నాకు బూర్తిగా బలము కలిగిసది! ఒక దినమున నే నంతఃపురోద్యానమున విహరించుచుంటిని, అప్పుడొక యిరువది యిరువదొక సం వత్సరముల యీడుగల యువకు నొకని దర్శించితిని, ఆయన నామము 'ప్రియదర్శి' యట.
'ఇదంలేయు నాకు దెల్పితివి కాదటమ్మా!'
'ఆతనియందు నా మనస్సు లగ్నమైనదని చెప్పితిని, ఆ మహాభాగుడును దన యీడుకు దగిన పొడగరి కాదు. అదియే నేను తెల్పునది. 'గొండతూర్పు రాజ్యమును, పోక రాష్ట్రమును, జయించు కొనుచు, దక్షిణమునకు సాగినాడు. విష్ణువర్ధను నెదురు లేని యావేగమున సామంతు లొకరి వెనుక నొక రాతనికి పాదాక్రాంతులగుటయు, బల్లవ మహారాజగు రాజేంద్రవర్మ కెప్పటికప్పుడు వేగు వచ్చుచునే యున్నది. మహేంద్ర వర్మ రెండవ పులకేశి నెటరించి యోకిపోయినాడు. పుల కేశి పృథ్వీవల్ల భునకు దాను గప్పము గట్టినాకు. ఆతడు మహా విక్రముడు. ఇప్పుడు మ హేంద్రవర్మ కుమారుడు యువమహా రాజు నరసింహవర్మ యనేక దిగ్విజయములు గాంచును దక్షి ణమున జోళులను, పడమట గాంగువాడి రాష్ట్రమున దక్షిణ గాంగులును, వనవాసి కదంబులను, వాతాపి చాళ్యులను, ఉత్తరమున విష్ణుకుండినులను దమదమ రాజ్యపు టెల్లలలో నిలువరించి, తండ్రిమ హేంద్రవర్మ మహారాజు కాంచీపురమున సుఖ సంవిధానమున రాజ్యముసేయు మనువు చేసినాడు.
యువమహారాజు చాళుక్య విష్ణువర్ధనుడు కృష్ణదాటి పల్లవ సామ్రాజ్యమును బ్రవేశించి నిరవరోధవేగమున వర దలు పొంగిన గంగవలె బ్రవహించి వచ్చు చున్నాడు. రాష్ట్రములకు నగరక్షకదళాధిపతి బుద్ధవర్మను సామంత పట్టాభిషిక్తుని చేసినా డతడు. వనవాసి కదంబులును, కందనోలు చాళుక్య రాజప్రతినిధి పులకేశి వృథ్వీవల్ల భ మహారాజు మూడవ కుమారు డాదిత్యవర్మమును గలసి పల్లవరాజ్యముపై నెత్తిరాగా, యువరాజు నరసింహవర్మవారి నెదిరించుటకు వెడలియుండెను. ఆ సమయమున నే పిట్టపిడుగుగొండతూర్పు రాజ్యమును, పోక రాష్ట్రమును, జయించు కొనుచు, దక్షిణమునకు సాగినాడు. విష్ణువర్ధను నెదురు లేని యావేగమున సామంతు లొకరి వెనుక నొక రాతనికి పాదాక్రాంతులగుటయు, బల్లవ మహారాజగు రాజేంద్రవర్మ కెప్పటికప్పుడు వేగు వచ్చుచునే యున్నది. మహేంద్ర వర్మ రెండవ పులకేశి నెటరించి యోకిపోయినాడు. పుల కేశి పృథ్వీవల్ల భునకు దాను గప్పము గట్టినాకు. ఆతడు మహా విక్రముడు. ఇప్పుడు మ హేంద్రవర్మ కుమారుడు యువమహా రాజు నరసింహవర్మ యనేక దిగ్విజయములు గాంచును దక్షి ణమున జోళులను, పడమట గాంగువాడి రాష్ట్రమున దక్షిణ గాంగులును, వనవాసి కదంబులను, వాతాపి చాళ్యులను, ఉత్తరమున విష్ణుకుండినులను దమదమ రాజ్యపు టెల్లలలో నిలువరించి, తండ్రిమ హేంద్రవర్మ మహారాజు కాంచీపురమున సుఖ సంవిధానమున రాజ్యముసేయు మనువు చేసినాడు.
యువమహారాజు చాళుక్య విష్ణువర్ధనుడు కృష్ణదాటి పల్లవ సామ్రాజ్యమును బ్రవేశించి నిరవరోధవేగమున వర దలు పొంగిన గంగవలె బ్రవహించి వచ్చు చున్నాడు. రాష్ట్రములకు నగరక్షకదళాధిపతి బుద్ధవర్మను సామంత పట్టాభిషిక్తుని చేసినా డతడు. వనవాసి కదంబులును, కందనోలు చాళుక్య రాజప్రతినిధి పులకేశి వృథ్వీవల్ల భ మహారాజు మూడవ కుమారు డాదిత్యవర్మమును గలసి పల్లవరాజ్యముపై నెత్తిరాగా, యువరాజు నరసింహవర్మవారి నెదిరించుటకు వెడలియుండెను. ఆ సమయమున నే పిట్టపిడుగునరసింహవర్మపై బడుటయే! అనుకొనుట యేమి అత డట్లొనరించినాడు.
నరసింహవర్మ చేయునది లేక పరాజితుడ నైతినని ఖడ్గ మర్పించినాడు. విష్ణువర్ధను డన్నకుమారు నాదిత్య వర్మను గలిసి, యాతని గాఢముగ గౌగిలించుకొని, నరసింహ వర్మ ఖడ్గము నాతనికి బహూకరించెను.
విష్ణువర్ధనుడు తన ద్వితీయోపసేనాధిపతి ఇంద్రదత్తుని సైన్యాధిపతిగ జేసి, విక్రమసింహపురమున (నేటి నెల్లూరు) గాపుంచినాడు. మూడువంతుల సైన్యమును విక్రమపురము ననే యుండ నేర్పాటు చేసినాడు. ఏనుగులు, గుఱ్ఱములు, భూషణములు విష్ణువర్ధనున కర్పించి, నరసింహవర్మ కాంచీ పురమునకు దరలిపోయినాడు. విష్ణువర్ధను డాతని వెనుక నే చళుక రాష్ట్రమున నధిపతియొద్ద కప్పముగొని, పదునైదు దినములలో విక్రమసింహపురము తిరిగివచ్చెను.
పల్లవులతో దనకు విరోధము లేదనియు, పోక రాష్ట్ర మునకు దక్షిణమున పల్లవులు నిరాటంకముగ బరిపాలించ వచ్చుననియు, దనయన్నగారు చాళుక్యచక్రవర్తి తన్నాంధ్ర చాళుక్య రాజ్యమును స్థాపింప నాశీర్వదించి పంపినారనియు, దక్షిణకళింగము, వేంగీ రాష్ట్రము పోక రాష్ట్రము నీమూడు రాష్ట్రములను గలిపి వేంగీపురము రాజధానిగ దన రాజ్య మును స్థాపింప బోవుచుంటిననియు, విష్ణువర్ధనుడు పల్లవులకు సందేశ మంపినాడు.ఉత్తర కళింగ రాజధానియైన కళింగనగరమున కళింగ యువరాజు దానార్ణవు దంశుమతీరాకుమారిని పిష్టపుర మున నా- బాలికకు దెలియకుండగనే తానుజూచిన విషయము నొక్కడు దన యభ్యంతరమందిరమున గూరుచుండి యాలో చించుకొనుచుండెను. ఆమె జగ దేక సుందరి, ఆమె సర్వ కళాభిజ్ఞ. శారదరాకాపూర్ణిమనుగూడ నలుపుసేయగల కాంతిగలది. ఆమెను వివాహమాడ తాను గాఢముగ సంక ల్పించుకొని యుండెను. తాను విన్నది, తాను జూచిన దానిలో సహస్రాంశ మైన లేదని పిష్టపురమున రాణివాస మందు బంధింపబడిన యాబాలికను జూచినప్పుడే యను కొన్నాడు. విష్ణువర్ధనుడు వచ్చి పిష్టపురము ముట్టడించు గడ బిడలో నాతడా దుర్గమునుండి తప్పించుకొని కళింగమునకు పారిపోయినాడు.
విష్ణుకుండిన మంచన భట్టారకునకు గొమరులు లేరు, ఆ ప్రభువునకు దరువాత సింహాసన మెక్కగల సన్నిహిత జ్ఞాతులును నెవ్వరు లేరు, ఒక్కగానొక్క కొమరిత మాత్ర మున్నది. ఆమెను వివాహమాడిన వారి కారాజ్యము హస్త గతమగును. కావుననేకదా పల్లవయువరాజు నరసింహ వర్మయు, నా బాలికను నర్థాంగిని జేసికొన వాంఛించు చున్నాడు. ఆమఱుగుజ్జు విష్ణువర్ధన చాళుక్యుడుగూడ నిట్టి యుండవచ్చును. కాంక్షతోడనే తూర్పుతీరమునకు వచ్చియుండవచ్చును. లేనిచో, సంత పటాటోపముగ పిష్టపురమును బట్టినట్లుభారతీయస్త్రీ దాను వివాహమాడిన భర్తను ప్రేమించి తీరును, బలవంతముగ నైనను సంశుమతీకుమారిని వివాహ మాడగల్గినచో దన యదృష్టము మిన్నుముట్టును,
ఒకనాడు దానార్ణవుడు తన యాంతరంగిక మిత్రు డగు కుంభమిత్రుని బిలచి, 'మిత్రమా! నీవు అంశుమతీ రాకుమారిని పిష్టపురమును జేర్చునపుడామె దగ్గరి బందుగు రాలును, సందమున నామెకు మాత్రమే తీసిపోవు మాధవీ లతికాకుమారిని జూచియంటివి గదా! ఆమెనుగూర్చి నీ వేమాలోచించుచుంటి' వని ప్రశ్న జేసెను.
'నేను ఏమాలోచించుచుంటిని! ప్రభువులయాజ్ఞ నెర వేర్చుటయే నా యాలోచన. '
'అవును, నీవు ప్రభుభక్తిపరాయణుడవు, అయినను నా బాలికను జూచితివిగదా యని యడుగుచున్నాను.
'చూచితిని ప్రభూ! మీరు అంశుమతీ రాకుమారిని బ్రేమించి మీ దేవేరిని జేసికొన దలచినారు గదా! నచో మాధవీకుమారి ప్రసక్తి యేమున్నది?' అయి
“నీవు మాధవుడవు గావలయునయ్యా!' 'నేను గుంభమిత్రుడను మాధవుడుగా నెట్లు కాగ లను ప్రభూ!
“ఓయి కుంభకర్ణబలుడా!'
'ఔను నేను కుంభకర్ణుడనే, నలువురు కుంభకర్ణుల నా భుజముల మోచిని సముద్రమున బారవైచిరాగలను. 'వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగ మునకు 'జలసీమ' యని పేరు. ఆ సరస్సు అతి పురాతనము, భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును బంగారు పంటలు పండుచుండును, ఈ సీమన తను బరిపా లించు సామంతుడు బృహత్పాలాయనుండైన పృథ్వీశవర్మ. పృథ్వీశవర్మ కిరువురు కొమరులును, నొక కొమరితయు గలరు. ఆ కొమరిత యే మాధవీలతాకుమారి,
వేంగీ రాజ్యము నిప్పుడు పాలించుచున్న మంచన భట్టా రక మహారాజు కన్న బృథ్వీశవర్మ యయిదారేడులు పెద్ద. చాళుక్య విష్ణువర్ధనుడు వేంగీనగరము వచ్చునప్పటికి గృష్ణా సముద్ర సంగమతీర సీమలోని సామంతు డొకడు దిరుగు బాటు చేయుటచే పృథ్వీశవర్మ వాని నణచుటకు బోయెను, మాధవీలతాకుమారి కలతీర్థ (కలిదిండి) పట్టణమునకు దన తండ్రి వచ్చినాడని తెలిసి తనకుటుంబముతో గొన్ని దిన ములు గడుపనెంచి కలతీర్థ నగరమునకు బయనమయ్యెను, స్నేహితురాలగు సంశుమతీకుమారిని గౌగిలించుకొని ఆమెచే వల్లె యనిపించుకొని పరివారముతో బడవల నెక్కి కొల్లేటిపై బ్రయాణము సాగించెను. ఆ సరస్సునం దనేక ద్వీపములున్నవి. అందగ్ని కులజులైన పల్లెవారు నివసించుచు జేపలపట్టి వేంగీనగరమున అమ్ము చుందురు. ఆ సరస్సున యానము సల్పుబడవల నన్నిటిని వారే నడపుదురు.యగ్నికులజు లందఱకు గడు గూర్చువాడు పృథ్వీళవర్మ మండ లేశుడు.
మాధవీలతా కుమారి యట్లు ప్రయాణము చేసి "జల కంఠేశ్వరుడు” వెలసిన ద్వీపమును జేరెను. ఆ దేవుని దేవేరి జలదుర్గ. ఆ దేవి దేవాలయ మాప్రక్కనే యున్నది. సూధవీలత యచటికి వచ్చునప్పటికి జెల్లెలికెదురై యామె యన్న త్రిణయనేశ్వరుడు భార్యాపుత్రాదులతో నటకు జే రెను, మాధవీలత వదినగారికిని అన్నగారికిని పాదములకు నమస్క రించినది. వదినగా రా బాలికను దన హృదయమున కద్దు కొన్నది. మేనల్లుండ్ర నిరువురను మేనగోడలిని నామె యెత్తు కొని ముద్దాడుచుండ బెద్దమేనగోడలు జలదుర్గాంబిక "అత్త య్యగారూ! వేంగీపురములో బిన్ని గారు, అమ్మగారు, తాతయ్యగారును క్షేమనూ?” యని పలకరించెను.
మాధవీలత పక్కున నవ్వుచు, "ఎంత జాణవమ్మా! ఈ యొప్పిద మెవరు నేర్పిరమ్మా నీకు!" అనుసంత, నా యెనిమిదేదుల బాలికయు నత్తగారిని జూచి చిరునవ్వు నవ్వుచు “నేను మీకోడలనుగానా?” అని యెదురు ప్రశ్న వేసెను. అందఱును పకపక నవ్విరి.
దేవాలయమునబూజలైన వెనుక యందఱునుగలసి కలతీర్థపట్టణమునకు బోయి చేరిరి. ఆ పట్టణము చుట్టును తోటలే. పండ్లతోటలు, కాయగూరల తోటలు, పూవుల తోటలును,