shabd-logo

పేదలు

12 January 2024

15 చూడబడింది 15

అంతేలే, పేదల గుండెలు! అశ్రువులే నిండిన కుండలు!

శ్మశానమున శశికాంతులలో చలిబారిన వెలి రాబండలు! అంతేలే, పేదల మూపులు! అణగార్చిన విధి త్రోద్రోపులు, పయోధితట కుటీరములవలె భరియించవు బాధల మోపులు! అంతేలే, పేదల చేతులు! శ్లథశైశిర పలాశరీతులు! విశుష్కములు, పరిపాండురములు! విచలించెడు విషాదహేతులు!

అంతేలే, పేదల కన్నులు! వినమ్రములు, వెతల వ్రణమ్ములు! తుపానులో తడిసిన, జడిసినగర్జించు రష్యా!

గాండ్రించు రష్యా! పర్జనశంఖం పలికించు రష్యా! దౌర్జన్యరాజ్యం ధ్వంసించు రష్యా! లేలే, రష్యా! రా రా, రష్యా! రష్యా! రష్యా ! రష్యా! ఓ రష్యా! వ్యక్తి స్వతస్సిద్ధ స్వాతంత్ర్యదాతా! పతిత నిర్ణీతిక ప్రపంచదాతా! భావికాల స్వర్ణభావన నిర్మాతా! లేలేలే రష్యా! రా రా రా రష్యా! రష్యా! రష్యా! రష్యా! రష్యా పుష్కిన్, గోగోల్, షెకోవ్, టాల్ స్టాయ్,

డోస్టోయ్ వస్కీ, గోర్కీ, కూప్రిన్ఈ అగ్ని వర్షాలు,

ఈ రక్తపాతాలు, ఎలాగూ వచ్చాయి, ఏమయితే కానీ! ఈ సవన రంగంలో ఎగరనీ జీవాలు! ఈ సమరం తుది చూడక ఇక నిలిచి పోరాదు! తిరుగులేని ప్రతిజ్ఞ తీసుకో రష్యా! పెట్టుబడి కూటాలు కట్టుకడుతున్నాయి! కుట్రలు, కూహకం చెలరేగుతున్నాయి! అసత్య ప్రచారపు రేడియో బాకా,

రాజకీయాలలో రంకు వేషాలు, మరఫిరంగులు తెచ్చి మందిచ్చి, రష్యా! విమాన బాహువులు విసురుతూ, రష్యా! అనంత ప్రపంచం అంతటా నీవై నీ గొడుగు నీడల్ని సాగించు రష్యా! స్వతంత్రత, సమానత సాధించు రష్యా! రష్యా ! రష్యా ! రష్యా! ఓ రష్యా!

సుప్తకంకాళాలు మేలుకొంటున్నాయి!నిజంగానే నిఖిలలోకం

నిండుహర్షం వహిస్తుందా?

మానవాళికి నిజంగానే

మంచికాలం రహిస్తుందా?

నిజంగానే, నిజంగానే

నిఖిలలోకం హసిస్తుందా?

దారుణ ద్వేషాగ్ని పెంచే

దానవత్వం నశిస్తుందా?

బానిసల సంకెళ్ళు బిగిసే

పాడుకాలం లయిస్తుందా?

సాధుసత్వపు సోదరత్వపు

స్వాదుతత్త్వం జయిస్తుందా?

జడలు విచ్చిన, సుడులు రెచ్చిన

కడలి నృత్యం శమిస్తుందా?

నడుమ తడబడి, సడలి, ముడుగక

శ్రీరంగ శ్రీనివాసరావు ద్వారా మరిన్ని పుస్తకాలు

27
వ్యాసాలు
మహాప్రస్థానం
0.0
ఇది చాలా ఆసక్తికరమైన పుస్తకం
1

జయభేరీ

28 December 2023
2
0
0

మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది! పడండి త్రోసుకు! పదండి ముందుకు, పోదాం, పోదాం పైపైకి! కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, హృదంతరాళం గర్జిస్తూ- పదండి పోదాం, వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం

2

ఒక రాత్రి

28 December 2023
0
0
0

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను! నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను! నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను! ఎండకాలం మండినప్పుడు గబ్బిలంవలె క్రాగిపోలేదా! వా

3

గంటలు

28 December 2023
0
0
0

గగనమంతా నిండి, పొగలాగు క్రమ్మి- బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను! ఆకాశపు టెడారి నంతటా, అకట! ఈ రేయి రేగింది ఇసుక తుపాను! గాలిలో కానరాని గడుసు దయ్యాలు భూ దివమ్ములమధ్య ఈదుతున్నాయి! నోరెత్తి, హోరెత్త

4

ఋక్కుల

28 December 2023
1
0
0

గదిలో ఎవరూ లేరు, గదినిండా నిశ్శబ్దం.సాయంత్రం ఆరున్నర, గదిలోపల చినుకులవలె చీకట్లు.ఖండపరశుగళ కపాలగణముల కనుకొలకులలో ఒకటివలె చూపులేని చూపులతో తేరి చూస్తున్నది గది.గదిలోపల ఏవేవో ఆవిరులు.దూరాన నింగిమీదతోచిన

5

ఆకాశాదీపం

29 December 2023
0
0
0

గదిలో ఎవరూ లేరు, గదినిండా నిశ్శబ్దం.సాయంత్రం ఆరున్నర, గదిలోపల చినుకులవలె చీకట్లు. ఖండపరశుగళ కపాలగణముల కనుకొలకులలో ఒకటివలె చూపులేని చూపులతో తేరి చూస్తున్నది గది.గదిలోపల ఏవేవో ఆవిరులు.దూరాన నింగిమీదతోచ

6

అవతారం

29 December 2023
0
0
0

యముని మహిషపు లోహ ఘంటలు మబ్బు చాటున ఖణేల్మన్నాయి! నరకలోకపు జాగిలమ్ములు గొలుసు త్రెంచుకు ఉరికిపడ్డాయి! ఉదయ సూర్యుని సప్తహయములు సురుగులెత్తే పరుగు పెట్టేయి! కనకదుర్గా చండ సింహం జూలు దులిపీ, ఆవులించింది

7

బాటసారి

29 December 2023
0
0
0

కూటికోసం, కూలికోసంపట్టణంలో బ్రతుకుదామని-తల్లిమాటలు చెవిని పెట్టకబయలుదేరిన బాటసారికి, మూడురోజులు ఒక్కతీరుగనడుస్తున్నా దిక్కు తెలియక -నడి సముద్రపు నావ రీతిగ సంచరిస్తూ, సంచలిస్తూ, దిగులు పడుతూ, దీనుడౌతూ

8

ఆసాదూతలు

30 December 2023
0
0
0

స్వర్గాలు కరిగించి, స్వప్నాలు పగిలించి, రగిలించి రక్తాలు, రాజ్యాలు కదిపి- ఒకడు తూరుపు దిక్కునకు! పాపాలు పండించి, భావాలు మండించి, కొలిమి నిప్పులు రువ్వి, విలయలయ నవ్వి- ఒకడు దక్షిణ దిక్కు! ప్రాకారముల

9

శైశవగీతి

30 December 2023
0
0
0

పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-- కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ ఏమీ ఎరుగని పూవుల్లారా, అయిదారేడుల పాపల్లారా! మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా! అచ్చటి

10

అవతలి గట్టు

2 January 2024
0
0
0

ఇవేమిటీ వింత భయాలు? ఇంట్లో చీకటి! ఇవేమిటీ అపస్వరాలు? తెగింది తీగ! అవేమిటా రంగుల నీడలుచావూ, బ్రదుకూ! ఎచటికి పోతా వీ రాత్రి? అవతలి గట్టుకు!ఎగిరించకు లోహవిహంగాలను! కదిలించకు సుప్త భుజంగాలను! ఉండనీ, మస్తి

11

కళారవి

2 January 2024
0
0
0

పోనీ, పోనీ, పోతే పోనీ! సతుల్, సుతుల్, హితుల్ పోనీ! పోతే పోనీ! రానీ, రానీ, వస్తే రానీ! కష్టాల్, నష్టాల్, కోపాల్, తాపాల్, శాపాల్ రానీ! వస్తే రానీ! తిట్లూ, రాట్లూ, పాట్లూ, రానీ! రానీ, రానీ! హాసం, లాసం!కా

12

ఒక క్షణంలో

3 January 2024
0
0
0

ఒక క్షణంలో మనస్సులో ఎదో స్మృతి తటిన్మణి మణీఘ్రుణి ఎదో మతి వికాసించి, అదే పరుగు క్షణంలో మరేడకో... ఆకులలో చీకటిలో ఇరుల ఇరుకులలో చినుకులలో ఏడనో మరపులలో మరపుల మడతలలో కనబడక! ఒక క్షణంలోపూర్వపు సఖుని ము

13

పరాజితులు

3 January 2024
0
0
0

అలసిన కన్నులు కాంచేదేమిటి? తొణకిన స్వప్నం, తొలగిన స్వర్గం! చెదిరిన గుండెల నదిమే దేమిటి? అవతల, ఇవతల అరులై ఇరులే! విసిగిన ప్రాణుల పిలిచే దెవ్వరు? దుర్హతి, దుర్గతి, దుర్మతి, దుర్మృతి!నిప్పులు చిమ్ముకుం

14

ఉన్మాది

4 January 2024
0
0
0

అలకలన్నీ అట్టకట్టిన, బొమికలన్నీ ప్రోవుపట్టిన, కాగితంవలె పలచబారిన వెర్రివాడా! కుర్రవాడా! వీథికంతా వెక్కిరింతగ, ఊరికంతా దిష్టిబొమ్మగ, తూముప్రక్కన ధూళిలోనే తూలుతున్నావా! నీవు చూసే వెకిలిచూపూ, నీవు తీసే క

15

అద్వైతం

4 January 2024
0
0
0

ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే అనురాగపు టంచులు చూస్తాం, ఆనందపు లోతులు తీస్తాం. నీ కంకణ నిక్వాణంలో, నా జీవన నిర్వాణంలో- నీ మదిలో డోలలు తూగీ, నా హృదిలో జ్వాలలు రేగీ- నీ తలపున రేకులు పూస్తే, న

16

వాడు

5 January 2024
0
0
0

అందరం కలిసి చేసిన ఈ అందమైన వస్తుసముదాయం అంతా ఎక్కడో ఒక్కడే వచ్చి ఎత్తుకు పోతూ ఉంటే చూచి, "అన్యాయం, అన్యాయం?" అని మేమంటే- "అనుభవించాలి మీ కర్మం" అంటాడు. పొద్దుపొడిచి పొద్దుగడిచేదాకా ఎద్దుల్లాగు పనిచ

17

అభ్యుదయం

5 January 2024
0
0
0

ఏవో, ఏవేవో, ఏవేవో ఘోషలు వినబడుతున్నాయ్! గుండెలు విడిపోతున్నాయ్! ఎవరో, ఎవరెవరో, ఎవరెవరో తల విరబోసుకు నగ్నంగా నర్తిస్తున్నారు! భయో ద్విగ్నంగా వర్తిస్తున్నారు! అవిగో! అవి గవిగో! అవి గవిగో! ఇంకిన, తెగిపోయ

18

వ్యత్యాసం

6 January 2024
0
0
0

అదృష్టవంతులు మీరు, వెలుగును ప్రేమిస్తారు, ఇతరులను ద్వేషిస్తారు, మంచికీ చెడ్డకీ నడుమ కంచుగోడలున్నాయి మీకు. మంచి గదిలోనే సంచరిస్తాయి మీ ఊహలు. ఇదివరకే ఏర్పడిందా గది. అందుకే వడ్డించిన విస్తరి మీ జీవిత

19

మిథ్యయవాది

6 January 2024
0
0
0

మాయంటావా? అంతా మిథ్యంటావా? నా ముద్దుల వేదాంతీ? ఏ మంటావు? మాయంటావూ? లోకం మిథ్యంటావూ? కనబడినది కనబడదని వినబడినది వినబడదని జగతి మరపు, స్వప్నం, ని శ్శబ్దం, ఇది మాయ! మాయ! మాయంటావూ? అంతా! మిథ్యంటావూ?

20

ప్రతిజ్ఞ

11 January 2024
1
0
0

పొలాల నన్నీ, హలాల దున్నీ, ఇలాతలంలో హేమం పిండగ- జగానికంతా సౌఖ్యం నిండగ- విరామ మెరుగక పరిశ్రమించే, బలం ధరిత్రికి బలి కావించే, కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి, ఘర్మజలానికి, ధర్మజల

21

చేదుపాట

11 January 2024
1
0
0

ఔను నిజం, ఔను నిజం, ఔను నిజం,నీ వన్నది, నీ వన్నది, నీ వన్నది, నీ వన్నది నిజం, నిజం! లేదు సుఖం, లేదు సుఖం, లేదు సుఖం జగత్తులో! బ్రతుకు వృథా, చదువు వృథా, కవిత వృథా! వృథా, వృథా! మనమంతా బానిసలం, గానుగలం,

22

కవిత ఓ కవిత

12 January 2024
0
0
0

కవితా! ఓ కవితా! నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో నిను నే నొక సుముహూర్తంలో, అతిసుందర సుస్యందనమందున దూరంగా వినువీథుల్లో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో, నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలంద

23

నవ కవిత

12 January 2024
0
0
0

సిందూరం, రక్తచందనం, బంధూకం, సంధ్యారాగం, పులిచంపిన లేడి నెత్తురూ, ఎగరేసిన ఎర్రని జెండా, రుద్రాలిక నయన జ్వాలిక, కలకత్తా కాళిక నాలిక కావాలోయ్ నవకవనానికి. ఘాటెక్కిన గంధక ధూమం, పోటెత్తిన సప్త సముద్రా

24

జ్వాలాతోరణం

12 January 2024
0
0
0

స్వర్గనరకముల ఛాయా దేహళి, తెలి, నలి తలుపులు తెరచి, మూసికొని స్వర్గ విలయ హేమంత వసంత ధ్వాంత కాంతి విశ్రాంతి వేళలో, చావు పుట్టుకల పొలిమేరలలో ఆవులించె నొక చితాగ్ని కుండం! అనాథజీవుల సమాధులన్నీ అఘోరించి ఘోషి

25

దేనికొరకు

12 January 2024
0
0
0

వేళకాని వేళలలో, లేనిపోని వాంఛలతో- దారికాని దారులలో, కానరాని కాంక్షలతో- దేనికొరకు పదే పదే దేవులాడుతావ్? ఆకటితో, అలసటతో, ప్రాకులాడుతావ్? శ్రీనివాసరావ్! శ్రీనివాసరావ్! దేనికోసమోయ్? నడిరాతిరి కడలి

26

పేదలు

12 January 2024
0
0
0

అంతేలే, పేదల గుండెలు! అశ్రువులే నిండిన కుండలు! శ్మశానమున శశికాంతులలో చలిబారిన వెలి రాబండలు! అంతేలే, పేదల మూపులు! అణగార్చిన విధి త్రోద్రోపులు, పయోధితట కుటీరములవలె భరియించవు బాధల మోపులు! అంతేలే, పేదల చ

27

నీడలు

12 January 2024
0
0
0

చూడు, చూడు, నీడలు! నీడలు, పొగ మేడలు! యుగ యుగాల దోపిడిలో, నరనరాల రాపిడిలో- వగదూరిన, పొగచూరిన శాసనాల జాడలు! జాలిజార్చు గోడలు! చూడు, చూడు నీడలు! నీడలు, పొగ మేడలు! చూడు, చూడు, నీడలు పేదవాళ్ళ వాడలు! న

---

ఒక పుస్తకం చదవండి