shabd-logo

3వ భాగము

15 December 2023

1 చూడబడింది 1
గడియారం ఒక గంట కొట్టింది.

రాజగోపాలరావుగారు హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నారు.

ఆయన మాటి మాటికీ వీధి గుమ్మంవైపు చూస్తున్నారు.

"ఇదుగో శాయన్నా! శాయన్నా!" అంటూ పిలిచారు.

"అయ్యా!" అంటూ శాయన్న పరుగెత్తుకు వచ్చాడు.

"ఈ శేషారత్నం ఇలా చేశాడేమిటి? సరిగ్గా 12 గంటలకి భోజనానికి వస్తానని చెప్పి ఇంకా రాలేదు.”

"ఏమోనయ్యా! ఇంటికి మేనేజరుగారు ఫోన్ చేస్తే, బయలుదేరి చాలాసేపు అయింది. అన్నారు."

"మధ్యలో ఏ క్లయింటో కనిపించి వుంటాడు. ఈ భోజనం సంగతే మర్చిపోయాడేమో.....?" ఆయన అంటుండగానే పోర్టికోలోకి కారు వచ్చి ఆగింది.

"అరుగో రానే వచ్చారు" అన్నాడు శాయన్న.

ఆగిన కారులోనుంచి నల్లగా, పొట్టిగా, హిట్లర్ మీసాలు వున్న ఒకాయన దిగి వచ్చాడు.

రాజగోపాలరావుగారు ఆయన్ను చూడగానే ముఖం సీరియస్గా పెట్టుకున్నారు. "ఏరా! 12 గంటలకు వస్తానన్న పెద్దమనిషివి - ఇప్పుడా రాక.....? ఇప్పటివరకూ నీ కోసం చూసి చూసి, భోజనం చేసి యిప్పుడే లేచాను."

శేషారత్నం ముఖం వెలవెలా పోయింది.

"త్వరగా వద్దామని బయలుదేరుతుంటే, అర్జెంటు ఫోన్ ఒకటి వచ్చింది" నొచ్చుకుంటున్నట్లు చూస్తూ అన్నారు.

"సంపాయించింది చాలదూ ఇంకా ఎంత కావాలిరా నీకు?"

"అబ్బా...... క్లయింట్స్ కారయ్యా బాబూ! హిమాలయాల నుంచి స్వాములవారు ఒకాయన వచ్చాడు. ఆయన అస్థమా పేషెంట్స్కి ఏవో మూలికలు ఇస్తున్నాడు అంటే వెళ్ళాను. ఆయన రేపు మళ్ళీ వెళ్ళిపోతున్నాడట!" కూర్చుంటూ అన్నారు.
రాజగోపాలరావుగారు స్నేహితుడివైపు జాలిగా చూశారు. “శేషూ! నీకు ఆ అస్థమా తగ్గుతుందనే ఇంకా నమ్మకమా?"

“ప్రయత్నించటంలో తప్పులేదు కదరా!"

"30 సంవత్సరాలనుంచి చెయ్యని ప్రయత్నం లేదు, తినని మందు లేదు. నీకు ఆ ఉబ్బసం, నాకు బ్లడ్ ప్రెషరు - ఈ రెండూ యీ జన్మకి ఇక తగ్గవు. ఇప్పుడు నీ వయసు 208?"

"ఏభయ్ ఎనిమిది"

"మరి ఇంకా ఎందుకురా వయసుతో పెనుగులాడుతావు? నువ్వు జుట్టుకి, మీసాలకి రంగు వేసుకున్నంత మాత్రాన చిన్నవాడివి అవుతావా?"

"నాన్సెన్స్. నీ వేదాంతం నాకు నచ్చదురా గోపాలం. మగవాళ్ళకు వయసు మళ్ళడం అనేది లేదని నా నమ్మకం. ఫారినర్స్ చూడు. 50 ఏళ్ళు వయసు వచ్చినా ఎంత హుషారుగా వుంటారో. మనకేమో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తారు. పిల్లలు త్వరగా పుడతారు. వాళ్ళేమో ఇట్టే ఎదిగి కూర్చుని, మనల్ని పెద్దవాళ్ళని చేసేస్తారు. నువ్వే చూడు అంత చక్కని క్రాఫ్, రంగువేస్తే కనీసం 15 సంవత్సరాలయినా చిన్నగా కనిపిస్తావు."

"రంగులు వేసి బయట లోకాన్ని మోసం చేయగలమేమో గాని మనల్ని మనం మోసం చేసుకోలేం కదా. ఏమో బాబూ! నాకయితే వయసు మళ్ళినపుడు అలాగే కన్పించటం మర్యాదగా, హుందాగా వుంటుందనిపిస్తుంది."

శాయన్న వచ్చి టేబిల్ మీద అన్నీ సిద్ధం చేశానని అన్నాడు.

"ఇదేమిటి? నువ్వు భోజనం చేయలేదా?" శేషారత్నం ఆశ్చర్యంగా చూశాడు.

“నిన్ను పిలిచి నేను తినేస్తానట్రా" అన్నారాయన.

మిత్రులిద్దరూ లేచి డైనింగ్ హాలులోకి వచ్చారు. అక్కడికి రాగానే ముక్కుపుటాలు ఎగబీల్చారు. వంటకాలు ఘుమఘుమలాడుతూ టేబిల్ నిండా ఉన్నాయి. రెండు స్వీట్లు, పాయసం, గారెలు, ఆవడలు, పనసకాయ కూర, కొబ్బరి పెరుగు పచ్చడి.

శేషారత్నం టేబిల్ దగ్గర కూర్చుని వాటినన్నింటినీ పరీక్షగా చూశాడు. మిత్రుడి వంక చూస్తూ, "ఒరేయ్ నన్ను నువ్వు భోజనానికి పిలిచి ఇలా చిత్రహింస చేస్తావా?"

"లేకపోతే ఏమిటిదంతా? నేను అస్తమా పేషెంటునని తెలుసుగా. నిన్ననే బాగా ఎటాక్ వచ్చిందని తెలుసు. రాను అంటే కొద్దిగా తిందువుగాని రా అని బలవంతం చేశావు. డాక్టరేమో, రెండురోజులు తేలికగా జీర్ణం అయ్యే ఆహారం తినమన్నాడు. నువ్వేమో నాకిష్టమైనవన్నీ చేయించి నోరు వూరేట్టు చేస్తావా? నరకానికి పోతావులే."

“నువ్వేనా ఏమిటి? నాకుమాత్రం బాధ లేదా? నిన్ను వదలి ఇవన్నీ నేను తింటే కదా! నేనసలే బ్లడ్షర్ మనిషిని, షుగర్ కంప్లయింట్ కూడా వుంది. ఆ ఆకుకూర తప్ప ఇంకేం ముట్టలేను."

"మరి ఇవన్నీ ఎందుకు చేసినట్టు?"

"అదే నాకూ తెలియదు. శాయన్నా! ఇవన్నీ చేయమని ఎవరు చెప్పారు?"

"మేనేజరుగారండీ. మీరేమో చెందూ పుట్టినరోజు, స్పెషల్స్ చేయించు అన్నారటకదా."

"స్పెషల్స్ అనలేదు. స్పెషల్ అన్నాను. ఏదో ఒకటి తేలికగా జీర్ణం అయ్యేది చేస్తారని."

"ఇవన్నీ ఎవరు తింటారు?" శేషారత్నం బాధగా చూశాడు.

"ఎవరేమిటి? మనం తినకపోతే ఇంట్లో మనుష్యులు లేరా? మేనేజరుతో కలిపి, ఆరుగురు భోజనం చేయాలి." ఇద్దరూ కొద్దిగా అన్నం పెట్టుకొని ఆకుకూర మాత్రం వేసుకున్నారు.

శాయన్న వచ్చి అవన్నీ తీసేయబోతుంటే, రాజగోపాలరావు వారించారు. "ఉండనీ శాయన్నా! అలా చూస్తూ తింటే, కొద్దిరోజులకే జిహ్వ చాపల్యం

తగ్గిపోతుంది.

ఇద్దరూ భోజనాలు చేస్తున్నారు.

"ఏమంటున్నాడు సూరి?” అని అడిగారాయన.

"ఏమంటాడు? వేరే కాపురం పెట్టమని వాడి భార్య రోజూ గొడవే. ఎరక్కపోయి చేశాననుకో పెళ్ళి. వాడిని నా దగ్గర ప్రాక్టీస్ మానేసి, వేరే వూరు వెళ్ళి ఉద్యోగం చేసుకుందాం అంటుంది. అబ్బ! మా ఇల్లు రణరంగం అనుకో. ఎవరైనా పొరపాటుగా చుట్టాలు వస్తే, దెబ్బతో పారిపోతారు. నిన్న సాయంత్రం నేను కోర్టునుంచి ఇంటికి వచ్చాను. సూరి ముందుగదిలోనే ఉన్నాడు. ఇంట్లోంచి కేకలు వినిపిస్తున్నాయి. “ఏమిట్రా గౌడవ" అంటే "ఏముంది! నా భార్యా, నీ భార్యా పోట్లాడుకుంటున్నారు డాడీ, మధ్యలో వెళ్ళి కల్పించుకుంటే
ఇప్పుడు ఇద్దరూ నామీద ఎగురుతారు. ఆ పోట్లాట ఇప్పుడు అయేటట్లు లేదు. ఇప్పుడే ప్రారంభం అయింది" అన్నాడు. “సరే, అయితే సినిమాకి పోదాం రా" అన్నాను. సినిమా నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు ప్రశాంతంగా ఉన్నమాట నిజమే కానీ మమ్మల్ని చూడగానే మళ్ళీ మొదలుపెట్టారు.

"నీకో ఉపాయం చెప్పనా?"

"ఏమిటది?"

"బాగానే వుంది."

"ఇదివరకు నా ఒక్క గదిలోనే మా ఆవిడ సణుగుడుతో డిస్టర్బెన్స్ ఉండేది. ఇప్పుడు పక్కగదిలో కూడా మొదలు అయింది. సినిమాకు సూరి ఒక్కడే వెళ్ళాడంటే భార్య వాడిని పీకపిసికి చంపినంత పనిచేస్తుంది. పోనీ భార్యాభర్తలు ఇద్దరు బయలుదేరుతారు మరి. నా భార్యని రమ్మంటే ఈవిడ రానంటుంది. రానంది కదా అని వాళ్ళిద్దరూ వెళితే ఇక సాధించి చంపుతుంది. చిన్నవాళ్ళు వాళ్ళేదో సరదా పడుతున్నారు అంటే మీరెప్పుడైనా అంత బాగా చూశారా అంటూ నామీద విరుచుకుపడుతుంది. నా కోడలు చదువుకుంది. ప్రతిదానికీ తర్కం తీస్తుంది అంటే, నా భార్య ఏ చదువులు లేకుండానే, ప్రశ్నలతో చంపేస్తుంది. సిల్లీ విషయానికి అంతర్జాతీయ సమస్యలంత తీవ్రంచేసి, కయ్యానికి కాలు దువ్వటం వారికి అలవాటు. ఇద్దరికీ పనీ పాటా లేదు. సంపాయించేటందుకు మేమిద్దరం వున్నాం. పనిపాటలు చూసేటందుకు నౌకర్లు వున్నారు. మధ్యలో మా అమ్మ ఒకత్తె. కాసేపు అటొక మాట, ఇదొక మాట వేసి వినోదం చూస్తుంది. నేను బయట ఏ కేసైనా గెలవగలనుగాని, ఇంటిలో మాత్రం అట్టర్ ఫెయిల్యూరనుకో."

రాజగోపాలరావుగారు సానుభూతిగా వింటున్నారు.

"నన్నడిగితే ఈరోజుల్లో పిల్లలు లేనివాళ్ళు మహా అదృష్టవంతులు అంటాను" ఆయన గులాబ్ జామ్ తీసి వేసుకోబోతూంటే, రాజగోపాలరావుగారు చప్పున చేయిపట్టి ఆపు చేశారు.

శేషారత్నం గులాబ్ జామ్ వంక దీనంగా చూశాడు.

"ఒక్కటి తింటే ఫర్వాలేదురా! మందులు జేబులోనే వున్నాయి."

"వద్దురా! సాయంత్రం వరకు నీతో కబుర్లు చెప్పాలని ఉంది. అంత కావాలంటే సాయంత్రం మీ ఇంటికి పంపిస్తానులే."

"నా భార్య నన్ను వాటి వాసనకూడా చూడనీయదు. ప్స్! నేనెంత జాగ్రత్తగా ఉన్నా, ఆ రోగం నామీద దాడిచేస్తూనే వుంటుంది. ఎప్పుడు ఎక్కడ వస్తుందోనని నా

"నీకసలు ఆ వ్యాధి ఉందనే సంగతి మర్చిపో."

"మర్చిపోవాలనే అనుకుంటాను. పని గొడవలో మర్చిపోతుంటాను కూడా, కానీ నా భార్య 24 గంటలూ గుర్తుచేస్తూనే వుంటుంది. ఎవరు ఫోన్ చేసినా, ఇంటికి చుట్టాలు వచ్చినా, వాళ్ళు అడిగే మొదటి మాట ఇదే. "నీ ఒంట్లో ఎలా వుంది?" అంటారు. నేను రోగిష్టివాడిని అనే ఫీలింగ్ నాలో జీర్ణించుకుపోయిందనుకో". ఇద్దరి భోజనాలు అయినాయి.

"పుట్టినరోజునాడు కూడా చెందూ ఇంట్లో లేకపోవడం ఏమిటి?"

"అదేగా విశేషం."

"నన్నడిగితే అసలు తప్పంతా నీదేనంటాను."

"నేనేం చేశానురా?"

"చిన్నప్పటినుంచి వాడు నీమాట వినటం కంటే, వాడి మాట నువ్వు వినే అలవాటు బాగా చేశావు. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం?"

రాజగోపాలరావుగారు నిట్టూర్చారు. "ఏమోరా! నాకు తెలియలేదు. నాకేకాదు, చాలామంది తల్లిదండ్రులకి తెలియదేమో! చిన్నప్పుడు పిల్లల్ని మురిపెం చేస్తున్నాం అనుకుంటాం. అదే పెద్దయ్యేసరికి మన తప్పుగా తేలుతుంది. అప్పుడు తెలిసి కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. శేషూ! ఈ సమస్య తీరే మార్గం చెప్పరా."

"ఏమిటది?"

"ఇంకేముంది? చెండూ పెళ్ళి విషయం. వాడు పెళ్ళి చేసుకునే ఉపాయం ఏదయినా

"ఉపాయానికేం బోలెడున్నాయి. ముందు పిల్లని చూడు. నీకు నచ్చాలి కదా."

"నేను వెతుకుతూనే వున్నాను."

"నా మాట విను - ఆ పెళ్ళేదో కాలేదు కాబట్టి వాడు నువ్వు సుఖంగా ఉన్నారు. ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా వుంది. నీ నౌకర్లు నువ్వు చెప్పిన మాటలు వింటున్నారు. వాడికి పెళ్ళిచేశావా సమస్యలు, బాధలు, మీ కిటికీలు, దర్వాజాలు పట్టుకుని వేళ్ళాడుతాయి." "ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు."
"వాడికి నచ్చిన అమ్మాయిని చూడు."

“దానికోసమే ఇన్నాళ్లూ ఓపికగా చూశాను - లాభం లేదు. ఆడపిల్లలను దూరంగా వుంచుతాడు. తనని ఎక్కడ పెళ్ళిలోకి దించుతారో అని భయం."

"అయితే నీకు నచ్చిన అమ్మాయిని చూడు. ముడిపెట్టేద్దాం."

"వాడు అంత తేలికగా ఒప్పుకుంటాడా అని."

"ఒప్పుకునే ఉపాయమేదో నేను చెబుతానుగా!"

"వాడికి నచ్చిన పిల్లనిచ్చి చేయడమే నాకు చాలా తేలిక. నాకు నచ్చినపిల్ల అంటే నామీద రెట్టింపు బాధ్యత వుంటుంది. వాడిని ప్రేమగా చూసే పిల్లని చూడాలి" అన్నారాయన.

"వెతకటం ప్రారంభించు. ఎక్కడో అక్కడ దొరక్కపోదు" అన్నాడు శేషారత్నం.

యద్దనపూడి సులోచనారాణి ద్వారా మరిన్ని పుస్తకాలు

ఇతర కుటుంబపరమైన పుస్తకాలు

5
వ్యాసాలు
గిరిజా కళ్యాణం
0.0
నవలాదేశపు రాణి బిరుదు పొందిన యద్దనపూడి సులోచనారాణి గిరిజా కళ్యాణం నవల రచించగా అనంతరం ఆగస్టు 2005, ఆగస్టు 2011ల్లో పునర్ముద్రణలు పొందింది. పునర్ముద్రణలకు ఎమెస్కో బుక్స్ సంస్థ ప్రచురణ చేసింది. యద్దనపూడి సులోచనారాణి తన కూతురికి నా జీవితంలో ఆశాదీపం అయిన ప్రియమైన శైలూకి ప్రేమతో - అమ్మ అంటూ అంకితమిచ్చారు.
1

1వ భాగము

15 December 2023
0
1
0

గిరిజా కళ్యాణంచాలా విశాలంగా, అధునాతనంగా వున్న గది అది! ఆ గదిలో ఆ మంచంమీద వున్న మల్లెపువ్వులాంటి తెల్లటి పక్క మినహా, మిగతా సామాను అంతా పింక్ కలర్లో వుంది. ఆ పక్కమీద సిల్కు చారల పైజామా, షర్టుతో సొమ్మసిల

2

2వ భాగము

15 December 2023
0
1
0

క్రింద విశాలమైన హాలు వుంది! దానిలో మధ్యగా ఖరీదయిన సోఫాసెట్ వుంది. అక్కడ నేలమీద పరిచివున్న కార్పెట్ బజారులో సాధారణంగా అమ్మకానికి కనిపించనటువంటి అందంగా వుంది. గోడవారగా, వరసగా వేసి వున్న కుర్చీలు ఆ యింటి

3

3వ భాగము

15 December 2023
0
1
0

గడియారం ఒక గంట కొట్టింది.రాజగోపాలరావుగారు హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నారు.ఆయన మాటి మాటికీ వీధి గుమ్మంవైపు చూస్తున్నారు."ఇదుగో శాయన్నా! శాయన్నా!" అంటూ పిలిచారు."అయ్యా!" అంటూ శాయన్న పరుగెత్తుకు వచ్చాడు."ఈ

4

4వ భాగము

15 December 2023
0
1
0

సూర్యాస్తమయం అవుతోంది.ఆరుబైట గాలి చల్లగా, హాయిగా వుంది. హిమాయత్నాగర్లో బోట్లు తిరుగుతున్నాయి. వాటిల్లో చెందూతో వచ్చిన ఫ్రెండ్స్ వున్నారు. చెందూ బ్రిడ్జిదగ్గర నిలబడి వున్నాడు. అతని చేతుల్లో బైనాక్యులర్

5

5వ భాగము

15 December 2023
0
0
0

మధ్యాహ్నం ఎండ ఎంతో తీక్షణంగా వుంది. విజయవాడలో గ్రీష్మ ఋతువు అప్పుడే తన అధికారం నెలకొలుపుకోవటానికి తాపత్రయ పడుతున్నట్లుగా వుంది. నాలుగు కుటుంబాలు కాపురముంటున్న ఆవరణ అది. ఒక వాటాలో ఏది మాట్లాడినా, రెండో

---

ఒక పుస్తకం చదవండి