దీపావళి అనగా దీపోత్సవం అని కూడా అంటారు. దీప అంటే దీపం మరియు ఆవలి అంటే దీపాల వరుసతో పేర్కొన్నది. దీపావళి విశిష్ఠత ఏంటి అంటే చెడు పై మంచి గెలుపు పొందింది అని అర్ధం. ఈ దీపావళి ఉత్సవం యొక్క కారణం వెనుకు మన చరిత్రలో ఎల్లపుడు గుర్తుండిపోయే అనేక సంఘటనలు ఉన్నాయి. వీటిని తరతరాలుగా మన సంస్కృతి సాంప్రదాయాలుతో పాటు పండుగలు రూపం లో ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులు తో బంధుమిత్రువులతో కలిసి ఆ ప్రాముఖ్యతను నిలుపుకుంటూ దీపావళి ని జరుపుకుంటారు.
దీపావళి పండుగకు గల చరిత్ర లో జరిగిన సందర్భాలు, శ్రీ రాముడు రావణుడినితో పది రోజులు యుద్ధం చేసి రావణుడిని సంహారించి విజయవంతంగా సీతామతల్లిని తిరిగి అయోధ్యకు తీస్కువచారు. శ్రీ రాముడు పదనాలుగేళ్ల వనవాసం పూర్తి చేసారు. ఈ సందర్భాన్ని మంచి పై చెడు గెలిచినా రోజుగా సంబరాలు చేసుకుంటారు. శ్రీ మహా విష్ణు లక్ష్మీ దేవిని వివాహం చేసుకున్న సందర్బంగా దీపావళి జరుపుకుంటారు. మరో సందర్బం ఏంటంటే మా కాళీ అమ్మవారు భూమి ని కాపడుటకై రాక్షషులను సంహారించి ఉగ్రరూపం దాల్చారు. అమ్మవారిని శాంతింప చేయడానికి మహాదేవ్ (శివుడు)మాత్రం వాలే అవుతుంది అందు చేత అమ్మవారి ఉగ్రరూపంలో ఎర్రటి నాలుకను బైట పెట్టి శివుడినిపై పాదాలతో అడుగు వేస్తారు. కనుక బెంగల్ లో మా కాళీ అమ్మవారికి అంకితంగా ఈ దీపావళి పండుగను జరుపుకుంటారు.
దీపావళి హిందూ క్యాలెండరు ప్రకారం ప్రతి ఏడాది కార్తీకమాసం 15వ రోజున దీపావళి వస్తుంది. ప్రమిధుల్లో దీపాలు వెలిగించి పూజ చేసుకుని ఘనంగా దీపావళి పండుగను బాణసంచలు కలుస్తారు. మన భారతీదేశం లో రకరకాలుగా ఈ దీపావళి పండుగని జరుపుకుంటారు. దీపావళి పండుగకు చేసే పూజలు యొక్క ఫలితంగా అందరి ఇళ్లల్లో ఆనందాలు, ఆరోగ్యం, జ్ఞానం, సంపద, శిరి, శాంతి ని పొందుతారు. ఈ పండుగ కుటుంబ సభ్యులతో ఎన్నో నవ్వులు సందళ్ళు తో ఆహ్లాదంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. అంతేకాక మారెన్ని జాగ్రత్తులతో బాణాసంచా వేడుకలు చేస్కుంటూ దీపావళి పండుగ ని ఘనంగా జరుపుకోవాల్సిందిగా తెలియజేస్కుంటున్నాము.