దీపావళి పండుగ ఈ 2023వ సంవత్సరంలో 5 రోజుల పండుగ సందడిగా ప్రారంభం అయింది. ఈ ఐదు రోజుల పండుగలు అందరి జీవితాలలో ఎన్నో సంతోషాలు, సరి కొత్త ప్రారంభలకు మొదలు దేవుళ్ళ ఆశీస్సులు తో ఇరుగు పొరుగు మరియు కుటుంబ సభ్యులు అందరితో కలిసి మెలిసి పండుగను ఆహ్లాదంగా జరుపుకుంటారు. ఈ ఐదు రోజుల పండుగలు ఏమిటో తెలియజేదాం.
మొదటి రోజు ధన త్రాయోదశి నవంబర్ 10వ తేదిన శుక్రవారం వచ్చింది. రెండవ రోజు నరక చతుర్దశి నవంబర్ 11వ తేదిన శనివారం. మూడవ రోజు లక్ష్మి పూజ నవంబర్ 12వ తేదిన ఆదివారం. నాలుగవ రోజు గోవర్ధన్ పూజ నవంబర్ 14వ తేదిన మంగళవారం. ఐదవ రోజు భాయ్ దూజ్ నవంబర్ 15వ తేదిన బుధవారం.
ధనవంతరి త్రయోదశి(ధనతేరాస్) మొదటి పండుగ. ఈ పండుగ రోజు కుభేరాస్వామికి అలాగే లక్ష్మి దేవికి ఘనంగా పూజలు చేస్తారు. బంగారం మరియు వెండి వంటి విలువైన వస్తువులు కొంటారు. ఆలా కొనడం వాల్ల దేవుళ్ళ అనుగ్రహం తో రెట్టింపు లాభాలు మన జీవితం లో లభిస్తాయి అని నమ్ముతారు.
నరక చతుర్దశి రెండవ రోజు ప్రాముఖ్యత అనగా శ్రీ కృష్ణుడు నరకాసుర అనే రాక్షషుడిని వాదించిన రోజు సందర్బంగా కార్తీకమాసం లో వచ్చే కృష్ణ పక్ష రోజు ను నరక చతుర్దశి పండుగగా జరుపుకుంటారు.
లక్ష్మి పూజ మూడవ రోజు పండుగ. ఈ పండుగ అమావాస్య రోజున వస్తుంది. ఆ రోజున ప్రజలు అందరు ఇళ్ళల్లో దీపములతో అలంకరిస్తారు. అమావాస్య రోజు దీపాల వెలుగులతో అలంకరణ చేస్తారు. పశ్చిమ భారత దేశం లో అనగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, మరియూ అస్సాం లో శక్తి మా కాళీ దేవతకు పూజ చేస్తారు.
గోవర్ధన్ పూజ నాలుగవా రోజు పండుగ. ఈ రోజున గోవర్ధన్ పూజ మరియు బలి ప్రతిపద చేస్తారు. దానికి గల కారణం భగవంతుడు శ్రీ కృష్ణుడు ఇంద్ర దేవుని పై విజయవంతంగా ప్రజలతో ప్రకృతిని దైవంగా పూజించండి అని చాటిచెప్పారు. ఈ పూజ ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, మధ్య ప్రదేశ్, హర్యానా మరియు బీహార్ వాళ్లందరు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గుజరాత్ ప్రజలకు కొత్త సంవత్సరంగా మొదలు అవుతుంది.
భాయ్ దూజ్ (విశ్వకర్మ) పూజ ఐదవ రోజు పండుగ. దీనికి మరో మూడు పేర్లు ఉన్నాయి. అవి యమ ద్వితీయ, భాయ్ టీకా, భాయ్ బిజ్. ఈ పండుగ రోజున అక్కలు చెల్లెలు వాళ్ల అన్నయ్య తమ్ముళ్ళకి తిలకం పెట్టి వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్లు ఎల్లపుడు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటు పూజ చేస్తారు.
ఈ ఐదు రోజుల పండుగలను కొత్త బట్టలు ధరించి, బంధుమిత్రులతో కలిసి, పూజ చేసుకొని, మిఠాయిలు తినిపించుకుంటూ, దీపాలను వెలిగించి బాణసంచా టపాసులు అధికంగా కాకుండా ప్రకృతిని కాలుష్యం జరగకుండా దృష్టిలో పెట్టుకుని సంతోషంగా జాగ్రత్తగా జరుపుకోవాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్కుంటునాం.