shabd-logo

49 వ ఒడిఐ సెంచరి కైవసం చేసుకున్న విరాట్ కోహ్లి

7 November 2023

2 చూడబడింది 2

2023 వన్ డే ప్రపంచ కప్ మొదలైన దగ్గర నుంచి ఎంతో ఆసక్తి తో ప్రజల ఎదురు చూపులు రానే వచ్చాయి. ఈడెన్ గార్డెన్స్ లోసౌతాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లి సెంచరి చేసి తన సత్తా ని చాటుకున్నాడు. అదే రోజు తన బర్త్ డే అవ్వటం విశేషం గా నిలిచింది తన ఫాన్స్ కి. 


article-image


ఇది ఇలా ఉంటె పిచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడి తనకంటూ ఒక బోర్డర్ ని ఫిక్స్ చేసిన స్టార్ క్రికెటర్ సచిన్ యొక్క రికార్డు ని ఢీ కొట్టి చూపించాడు విరాట్. మొత్తం 119 బాల్స్ లో 10 ఫోర్స్ కొట్టి సెంచరీ ముగించాడు కోహ్లీ. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే, వన్ డే మ్యాచ్ లు మరియు టి20 లు కలిపి 50 సెంచరీలు సాధించిన మొట్ట మొదటి క్రికెటర్ గా పేరు గాంచి ప్రసిద్ధి కి ఎక్కాడు విరాట్.  

ఇక సచిన్ కి మరియు విరాట్ మధ్య తేడా గమనించినట్లయితే సచిన్ తన కెరీర్ లో 463 మ్యాచ్లకి 452 ఇన్నింగ్స్ కి 49 సెంటరీలను పూర్తి చేసాడు. కానీ విరాట్ 289 మ్యాచ్లకి 277 ఇన్నింగ్స్ లో 49 సెంచరీలని పూర్తి చేయడం ఒక రికార్డు గా నిలిచింది. ఈ రికార్డు వల్ల విరాట్ తనకు ఎంతో ఇష్టం అయిన సచిన్ రికార్డు కి చేరడం చాలా ఆనంద దాయకం అయ్యింది. ఇక మరో చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే పుట్టిన రోజునాడు ఇలాంటి ఘనత దక్కిన వాళ్లలో విరాట్ 3వ వాడు.  

ఇక మ్యాచ్ చూసినట్లయితే 121 బాల్స్ లో 110 పరుగులు మరియు 10 ఫోర్స్ చేయడం జరిగింది. మిగతా ఆట గాళ్ళు అయిన రోహిత్ మరియు శ్రేయస్ తోడవటం తో 5 వికెట్ ల నష్టానికి 50 ఓవర్ లలో 326 పరుగులు చేసింది. 

ఇక ఫాన్స్ విషయం చెప్పనవసరం లేదు. విరాట్ కైవసం చేసుకున్న ఈ విజయానికి ఫాన్స్ సంబరాలలో మునిగి తేలారు. క్రికెట్ స్టేడియం ని ఉత్సాహం తో ముంచెత్తారు.  
 

అంజనీ శ్రీసాయి ప్రసన్న ద్వారా మరిన్ని పుస్తకాలు

ఒక పుస్తకం చదవండి