మానవ శరీరం అనే వింత యంత్రాన్ని గురించి, ఒక్కొక్క భాగం, వ్యవస్థ ప్రకారం నిజంగా సులభమయిన ధోరణిలో బ్రైసన్ రాసిన ఈ పుస్తకం ప్రపంచమంతట పేరు గాంచింది. ఇప్పుడది తెలుగులో రావడం సంతోషం. మన శరీరం గురించి మనం తెలుసుకోవడానికి ఇంత సరదాగా, ఎన్నో వివరాలుతో పుస్తకం మరొకటి నిజంగా దొరకదు. బ్రైసన్ రచన సైన్స్ చెపుతున్నట్టుగాక కథలాగ సాగుతుంది. మన శరీరంలోని అద్భుతమయిన వివరాలు కళ్లకు కట్టినట్టు తెలుస్తాయి. పుస్తకంలో ఎక్కడా తలకెక్కని అంశాలు కనిపించవు. పుస్తకాలు చదివికాక, పరిశోధకులతో చర్చించి రాసిన ఈ రచన చివరివరకు ఆసక్తికరంగా సాగుతుంది. పట్టి చదివిస్తుంది కూడా. Read more