కొందరి జీవితాల్లో ఆనందం నింగిలో నెలవంక లాంటిది. వారి రూపం నిండు చందమామలా అందంగా ఉన్న, వారు నేలపై తిరిగే నెలవంకలా మనోహరంగా ఉన్నా వారి మనసులో ఆనందం అందని చందమామే.
ముఖ్యంగా వేశ్యల జీవితాలలో ఆనందం ఎడారిలో ఎండమావి లాంటిది.
మనం ప్రతి రోజూ పేపర్లలో, టివిలలో ఎన్నో న్యూస్ ఆర్టికల్స్ చూస్తూ ఉంటాము. అలాంటి న్యూస్ ఆర్టికల్ ఆధారంగా రాసిన కథే ఈ "మందాకిని."
*****
ఆమె అందం నిజంగా నేలపై తిరిగే అందమైన నిండు చందమామ చందం. మందాకిని అందమే ఆమెకు శాపమై ఆమె జీవితంలో సుఖ సంతోషాలను దూరంచేసి, ఆమె జీవితంలో ఎలాంటి మలుపులు తీసుకువచ్చిందో తెలిపే కథే "మందాకిని".
******
"రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది! పట్టపగలే రోడ్డు మీద కి జనాలు రావటం లేదు.. ఇక ఈ రాత్రి సమయంలో ఈ ఎవరు వస్తారు. ఈ ఆకలి భరించలేకపోతున్నాను. అన్నం తిని రెండు రోజులవుతుంది. ఈరోజు అయినా ఎవరైనా వస్తే బాగుండు. ప్రస్తుతానికి నీళ్లు తాగితే ఈ ఈ ఆకలి బాధ కొంచమైనా తగ్గుతుంద." బస్ స్టాప్ పక్కనే ఉన్న నల్లా లో నీళ్లు తాగి తడిచిపోకుండా ఒక మూలగా నిలబడి ఎవరైనా వస్తారేమో అని ఆశగా రోడ్డు వైపు చూస్తూ నిలబడింది ఆమె.
"ఏమే అర్ధరాత్రి 12 అవుతుంది! మరొక పక్క ఆగకుండా కుండపోత వర్షం కురుస్తోంది. ఇప్పుడు ఎవరు వస్తారు చెప్పు పదా ఇంటికి వెళదాం." అంది వర్షంలో తడుస్తూ పరిగెత్తుకొని వచ్చిన మాలిని.
"ఇంకొక గంట సేపు చూస్తానే! ఈరోజు కూడా డబ్బులు తీసుకు వెళ్ళకుండా ఇంటికి వెళ్తే మా పిన్ని నా చీరేస్తుంది. ఇప్పటికే రెండు రోజుల నుండి డబ్బులు తీసుకు వెళ్లలేదని అన్నం కూడా పెట్టడం లేదు. ఆకలికి కళ్లు తిరుగుతున్నట్లు ఉంది. ఇప్పుడు కూడా ఒట్టి చేతులతో వెళ్తే రేపు కూడా అన్నం పెట్టదు. దెబ్బలు కూడా తప్పవు. నువ్వు వెళ్ళు నేను రాను." ఉబికి వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ చెప్పింది మందాకిని.
మందాకిని మాటలతో ఆలోచనలో పడింది మాలిని.
ఏమైందే ఏం ఆలోచిస్తున్నావ్! నాకు ఎలాగూ ఈ నరకం తప్పదు. ఒకరోజు కస్టమర్ రాకపోయినా మీ అత్త నిన్ను ఏమీ అనదు కదా ఇంకెందుకు ఈ వర్షంలో ఎదురు చూడటం నువ్వు బయలుదేరి వెళ్ళు. మాలిని కదుపుతూ చెప్పింది మందాకిని.
నువ్వన్నట్లు కొద్దిరోజులు కస్టమర్లు రాకపోయినా అత్త ఏమి అనదు కానీ, తమ్ముడికి మందులు తీసుకు వెళ్లడం ఎలా? నీకు తెలుసు కదా తమ్ముడు ఆరోగ్యం అంతంత మాత్రమే. ఒక నాలుగైదు రోజులు ఎలాగో ఒకలా ఇల్లు గడిచిపోయినా, మందులు తీసుకు వెళ్లకపోతే తమ్ముడు ఆరోగ్యం మరింత చెడిపోతుంది. ఆపరేషన్ చేసి వాడిని బతికించే స్తోమత నాకు ఎలాగూ లేదు. కనీసం మందులతో అయినా కొన్నాళ్ళు బతికించుకోవాలి అందుకే ఆలోచిస్తున్నాను తమ్ముని తలచుకొని దిగులుగా చెప్పింది మాలిని.
మరిప్పుడు ఏం చేస్తామే? పిన తల్లిని తలచుకొని భయంగా ప్రశ్నించింది మందాకిని.
స్వప్న నువ్వు ఒప్పుకుంటాం అంటే ఒక ఆఫర్ వచ్చిందే, కానీ అది కొంచెం కష్టంతో కూడిన పని. అయినా డబ్బులు ఎక్కువగా ఇస్తారు. సంశయంగా చెప్పింది మాలిని.
మన పరిస్థితి బాగోలేనప్పుడు కష్టమైన తప్పదు కదా మాలిని! డబ్బులు ఎక్కువ ఇస్తారని చెప్తున్నావు డబ్బులు ఎక్కువ ఇస్తే మనకి కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది కదా అసలు ఆ ఆఫర్ ఏంటో చెప్పు ఆశగా అడిగింది మందాకిని.
"ఇందాక వచ్చినప్పుడు ఇద్దరం ఒక దగ్గర ఎందుకని నేను ఆ వీధి చివర కు వెళ్లాను కదా! అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది.
సరిగ్గా గంట క్రితం అక్కడకు ఒక జీప్ వచ్చి ఆగింది. అందులో నుండి ఐదుగురు అబ్బాయిలు (కరణ్, జయ్, రాజా, తేజ, హెచ్ కే) దిగారు.
వాళ్ళ బట్టలు చూస్తేనే అర్థమయింది బాగా గొప్పింటి బిడ్డలని.
నన్ను చూస్తూనే అనుమానంగా నా దగ్గరికి వచ్చి 'నువ్వు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావ్!' అని అడిగారు.
వాళ్ళని చూస్తే నాకు చాలా భయం వేసింది.
అందుకే ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చేయబోయాను.
అందులో పూర్తి పేరు తెలియదు గానీ ఆ అబ్బాయి తన పేరు హెచ్ కే అని చెప్పాడు.. ఆ కుర్రాడే గతంలో నన్ను బుక్ చేసుకున్నాడు.
ఆ అబ్బాయి నన్ను గుర్తుపట్టి, 'ఇదిగో పిల్లా రాత్రికి పార్టీ చేసుకుంటున్నాము. ఈ రాత్రికి మమ్మల్ని సుఖపెడితే నీవు ఊహించనంత డబ్బు ఇస్తాం!' అని చెప్పారు.
కానీ నేనొక్కదానినే ఐదుగురితో అంటే కష్టం కదా. అందుకే నేను అలాంటి అమ్మాయిని కాదనీ బుకాయించి వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే, "ఏ పిల్లా! ఒక్క నిమిషం." ఆగు అని గట్టిగా అరిచారు.
ఒక్క క్షణం నాకు చాలా భయం వేసింది కానీ తర్వాత అర్థమైంది వాళ్లు నా మాట నమ్మలేదని.
కానీ నాతో గడిపిన ఆ కుర్రాడు గట్టిగా అరుస్తూ, "ఏ పిల్లా! అప్పుడే నన్ను మర్చిపోయావా? నెల రోజుల క్రితమే కదా మనం కలిసాము. నువ్వు అందించిన సుఖం నేను జన్మలో మర్చిపోలేను. మరి ఇప్పుడు పెద్ద పతీతులా మాట్లాడుతున్నావ్ ఏంటి?" అని గట్టిగా అరుస్తూ అడిగాడు.
ఇంతలో మరొక అబ్బాయి చిల్ యార్! మనం అంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళ దగ్గరకు వెళ్తాము కాబట్టి గుర్తుపెట్టుకుంటాము. కానీ ఈ నెల రోజుల్లో ఈ పాప తో పక్క పంచుకున్నది ఎంతమందో! ఎంతమందిని అని గుర్తు పెట్టుకుంటుంది. అని వెకిలిగా నవ్వాడు.
వెంటనే మొదటి అబ్బాయి వీడు చెప్పింది కూడా నిజమే అయినా పర్వాలేదు లే నీ పని అదే కదా అయినా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు కానీ ఒకవేళ నీ మనసు మార్చుకుంటే నేరుగా గెస్ట్ హౌస్ లోకి వచ్చేయ్ నిన్ను ఎవ్వరూ అడ్డుపెట్టరు మేము ఈ రాత్రంతా ఇక్కడే ఉంటాము అని చెప్పి వాళ్ళు ఐదుగురు లోపలికి వెళ్లిపోయారు.
అసలే పార్టీ అంటున్నారు ఫుల్ గా తాగి ఉంటారు. అలాంటి సమయంలో నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే పెద్దపులి చిక్కిన జింకపిల్లలా అయిపోతుంది నా పరిస్థితి. అందుకే ఇంటికి వెళ్ళిపోదామని వచ్చాను కానీ నీ పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు అక్కడికి వెళ్లడమే నీకు, నాకు ఇద్దరికీ మంచిది అనిపిస్తుంది. నువ్వేమంటావ్ మొత్తం విషయం అంతా వివరంగా చెప్పి అడిగింది మాలిని.
రెండు నిమిషాలు ఆలోచించిన మందాకిని నువ్వు చెప్పింది కూడా నిజమే ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరకు వెళ్లడమంటే పులి బోనులోకి వెళ్లడమే, కానీ ఇప్పుడు మన కష్టం తీరడానికి ఇంతకంటే మంచి అవకాశం లేదు కదా! కాబట్టి వెళ్లక తప్పదు. అందుకే నేను వెళ్లడానికి నిర్ణయించుకున్నాను. తర్వాత నీ ఇష్టం లేచి చీర నడుము కిందకు దించి సర్దుకొని గెస్ట్హౌస్కు వెళ్లడానికి సిద్ధపడింది మందాకిని.
నేను కూడా వస్తానే! వాళ్లు కూడా డబ్బులు ఇస్తే తమ్ముడు ఆపరేషన్ కి పనికి వచ్చే అవకాశం ఉంది కదా. అంటూ తాను కూడా సిద్ధపడింది మాలిని.
బస్టాండ్ లో ఒక మూల వున్న చిరిగిపోయిన ప్లాస్టిక్ గోనె సంచిని తీసుకొని వాళ్లిద్దరి తలల మీదుగా వేసి, వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి గెస్ట్ హౌస్ వైపు వడివడిగా అడుగులు వేసారు మాలిని, మందాకిని.
వీళ్ళిద్దరూ గెస్ట్హౌస్కు వెళ్లేసరికి ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం గా ఉండటంతో, నా పరిస్థితి చూస్తే నీకు కూడా ఎగతాళిగా ఉంది కదా మాలిని. ఇక్కడ చూస్తుంటే అసలు మనిషి ఉన్న అలికిడి కూడా లేదు. నువ్వేమో ఇక్కడ అయిదుగురు అబ్బాయిలు పార్టీ చేసుకుంటున్నారు అని చెప్పావు. నువ్వు కూడా ఇలా చేస్తావని అనుకోలేదు. నన్ను ఆట పట్టించడానికి ఇక్కడకు తీసుకు వచ్చావు కదా! తన పరిస్థితి గుర్తొచ్చి దిగులుతో నిరాశగా అడిగింది మందాకిని.
మాలిని నిజంగానే స్వప్న ను ఆట పట్టించడానికి గెస్ట్ హౌస్ దగ్గరకు తీసుకు వచ్చిందా?
మందాకిని పిన తల్లి ఆకృత్యాలను ఆపే వారు లేరా?
తరువాయి భాగంలో చదువుదాం....
సశేషం....