shabd-logo

కన్యాశుల్కం - తృతీయాంకము

8 November 2023

10 చూడబడింది 10

1-వ స్థలము. రామచంద్రపురం అగ్రహారంలో రామప్పంతులు యింట్లో సావిట్లో గది.

(మధురవాణి ప్రవేశించును)

మధు:- ఈ రామప్పంతులు కథ పైకి పటారం లోపల లొటా రంలా కనిపిస్తూంది. భూవుఁలన్నీ తాకట్టుపడి వున్నాయట: మరి రుణం కూడా పుట్టదట. వాళ్ళకి, వీళ్ళకి జుట్టు ముడేసి జీవనం జేస్తూన్నాడు. ఈ వూరు వేగం సవరించి చెయ్ చిక్కినంత సొమ్ము చిక్కించుకొని పెందరాళే మరో కొమ్మ పట్టుకోవాలి. [పాడును] "తెలియక మోస పోతినే, తెలియక" (పాడుతుండగా రామప్పంతులు ప్రవేశించును.)

రామః - యేవిఁటో ఆ మోసపోవడం? తరవాత ముక్కేవిఁటి, పాడూ.

మధు:- తరవాత ముక్కేవుంది? మిమ్మల్ని నమ్మి మోసపోయి నాను.

రామ:- ఆదేం అలా అంటున్నావు? నిన్ను మోసపుచ్చలేదే? నిర్ణయం ప్రకారం రెండొందలూ పట్నంలో యిచ్చాను. నెల జీతం నెలకు ముందే ఇచ్చాను. యిహ మోసవేఁవుంది?

మధు :- యేం చిత్రంగా మాట్లాడుతారు పంతులుగారూ! నాకు డబ్బే ప్రధానవై (నట్టు మీ మనసుకు పొడగడుతుంది కాబోలు.నాకు డబ్బు కన్యా-[5] గడ్డిపరక. భూపుఁలు రుణాక్రాంతవై (నాయని అప్పట్లో నాకు తెలిసుంటే మీ దగ్గర రెండొందలూ పుచ్చుకొందునా? మీరు ఖర్చువెచ్చాలు తగ్గించు కొని సంసారం బాగుచేసుకోక పోతే నేను మాత్రం వొప్పేదాన్ని కాను. ఫలానా పంతులుగారు ఫలానా సాన్నుంచుకొని బాగుపడ్డారంటేనే నాక ప్రతిష్ట, మా ఇంటి సాంప్రదాయం ఇది. పంతులుగారూ! అంతే గాని లోకంలో సాన్ల మచ్చని వూహించకండి.

రామ:- భూఁవులు తణఖా అన్నమాట శుద్ధ అబద్ధం. రన్నారోగాని; నేను మహారాజులా ఉన్నాను.

మధు:- నా కంటికి మహారాజులా కనపడబట్టే ఇట్లా ఇల్లూ వాకిలీ వొదిలి మానం ప్రా'ణం మీ పాలు చేసి నమ్మి మీ వెంట వొచ్చా"ను. నన్ను మోసం మాత్రం చెయ్యకండి. మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది.

రామ:- నేను మోసం చేసే మనిషినేనా?

మధు:- అలాగయితే లుబ్ధావధాన్లు గారికి పెళ్ళెందుకు కుదిర్చారు? నాకు తెలియదనుకున్నారా యేవిఁటి? ఆ ముసలాడికి పెళ్ళెందుకు? మీ కోసవేఁ ఈ యెత్తంతాను.

రామః - ఆహా! హా! హా! యిదా అనుమానం. కొంచెం గెడ్డం నెరుస్తూంది. నన్ను కూడా ముసలాణ్నంటావా యేవిఁటి?

మధు:- చట్లకి చావ నలుపు. మనిషికి చావ తెలుపూ, అనగా చీకట్లో నక్షత్రాల్లాగా అక్కడక్కడ తెల్లవెంట్రుక తగిలేనే చమక్,

రామ:- స్వారస్యం మా చమత్కారంగా తీశావ్! యేదీ ముద్దు (మధురవాణిని ముద్దెట్టుకోబోవును.)

మధు:- (చేతులతో అడ్డి ముఖము ఓర జేసుకొని) వేళాపాళాలేదా?' లుద్దావధాన్లు పెళ్ళి తప్పించేస్తేగాని నేను ముద్దు బెట్టుకోనివ్వను.

రాము:- అంతా సిద్ధవైఁం తరువాత నా శక్యమా ఆపడానికి? (బలత్కారంగా ముద్దు పెట్టుకొనును.)

మధు:- సత్తా వుందనా మోటుతనం?

రామః- నా సత్తు విప్పుడేం జూశావ్! నా చిన్నతనంలో ధ్వజ స్తంభం దండతో కొడితే గణగణమని గంటలన్నీ ఒక గడియ వాగేవి. నాకు జబ్బు చేసిందగ్గర్నించీ డీలా అయిపోయినాను.

మధు యిదా లా? నా చేయి చూడండి, యలా కందిపోయిందో! మోటుతనం. అన్నా.

రామః - చాప చిరిగినా చదరంతని, నీ ప్రాణానికి ఇప్పటి సత్తువే ఉడ్డలంలా కనబడుతూంది.

మధు:— ఈ పెళ్ళి మాన్పించకపోతే నేను మీతో మాట్లాడను.

రామ:- వెర్రి కుదిరింది. రోకలి తలకి చుట్టమన్నాట్ట! రెండేళ్లాయి. ఆ ముసలి గాడిద'కొడుకు మీద నా లౌక్యప్ర'జ్ఞంతా వినియోగపర్చి పెళ్ళి సిద్దంచేసి యిప్పుడెలా తప్పించడం?

మధు: ఏం లౌక్యం చేశారు?

రాము:- అలా అడుగు. నా బుద్ధి సత్తువ కూడా నీకు తెలుస్తుంది. లుబ్ధావధాన్లు పరమ లోభి. వాడి గుణం ఇలా వుండబోతుందని పోల్చా రేమో అన్నట్టు చిన్నతనంలోనే వాడికి పేరు పెట్టారు. పెళ్ళాడితే వొల్ల మాల్ని ధనం వస్తుందని ఆశ పెట్టించాను.

మధు:- యలా చేశా రీ మహాచిత్రం? పెళ్ళయితే ధనం ఖర్చౌ తుంది గాని, రావడ వెఁలాగ?

రామ:- లౌక్యవంటే మరేఁవి టనుకున్నావు? అసాధ్యాలు సాధ్యం సాధ్యాలు అసాధ్యం చేయదవేఁ కదూ! మన సిద్ధాంతిని దువ్వేటప్పటికి వాడేం జేశాడనుకున్నావు? లుద్దావధాన్లు జాతకం యగాదిగా చూసి శీఘ్రంలో వివాహయోగ వుఁందన్నాడు. ఆ వివాహం వల్ల ధన యోగ పుఁందన్నాడు. దాంతో ముసలాడికి డబ్బొస్తుందన్న ఆశ ముందుకి, డబ్బు ఖర్చౌతుందన్న భయం వెనక్కి లాగడం ఆరంభించింది. ఇంతట్లో పండాగారిక్కడికొచ్చారు. ఆయన్ని కూడా తయారుచేశాను. లుద్దావధాన్లు అనుమానం తీర్చుకుందావఁని ఆయనకి జాతకం చూపించేసరికి పండాగారు యేమన్నారూ? వివాహ ధనయోగాలు విగా వున్నాయి. అయితే, మీరు పెద్దవాళ్ళు. ఇప్పుడు మీకు పిల్లనెవరిస్తారు? పెళ్ళెలా అవుతుంది? ఇలాంటివి జరగడానికి వీల్లేని మహా యోగాలు, జాతకాల్లో పట్టినప్పుడు గొప్ప మేలుకు బదులుగా గొప్ప కీడు సంభవిస్తుంది. అనగా మీకు మార్కవోఁ, ధననష్టవోఁ సంభవిస్తుంది. గ్రహశాంతి చేసి బ్రాహ్మణ భోజనం బాహుళ్యంగా చెయ్యండి. కొంత జబ్బో గిబ్బో చేసి అంతటితో అరిష్టం పోతుంది. మంచిరోజు చూసి సూర్య నమస్కారాలు ఆరం భించండి" అని చెప్పేసరికి అవుధాన్లు గుండ' రెండుచెక్కలై వివాహ ప్రయత్నం ఆరంభించాడు. ఇదీ కథ.

మధుః - యేమి కల్పన!

రామ: ఇంకా వుంది. ఇహన కృష్ణారాయపురంలో అగ్ని హోత్రావధాన్లు కూతురు జాతక వెఁలా వుందట? చెప్పడానికి అలవిలేదు. అది కాలు పెట్టిన యిల్లు పదియిళ్ళాతుందట. అది పట్టిందల్లా బంగార వౌఁతుందట.

మధు:- నిజవేనాఁ లేక అది మీ బనాయింపేనా?

రామః - అది మట్టుకు నా బనాయింపు కాదు. ఆగ్నిహోత్రావధాన్లే జాతకం అలా బనాయించాడు. మా బ్రాహ్మల్లో ఇది పరిపాటే. పెళ్ళిళ్ళలో పంపించేది ఒహ జాతకవూఁ నిజం వుండదు.

మధు:- యేమ్మోసం!

రామ:- లౌక్యం, లౌక్యవఁను.

మధు:- రెండింటికీ యేవిఁటో భేదం?

రామః - నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్య వూఁను.

మధు:- తానుచేస్తే లౌక్యం! మరోడు చేస్తే మోసం అనరాదా? అబద్ధానికి అర్థవేఁవిఁటి?

రామ: - యావఁన్నావూ? అబద్ధవఁనా? ఉద్యోగ ధర్మం లౌక్య వృత్తి అని, అది ఒక వృత్తి భగవంతుడు కల్పించాడు. ఆ లౌక్య వృత్తి యెటువంటిదీ? నిజాన్ని పోలిన అబద్దవాఁడి ద్రవ్యాకర్షణ చేసేది. ఖర్మనీ తెలుస్తాయి ?

మధు:- నాకెలా తెలుస్తాయి, నిజ'వేగాని, ద్రవ్యాకర్ష యలాగ పెళ్ళివల్ల?

రామ:- (తనలో) క్రా సెగ్జామినేషను చేస్తూందోయి. దీం తస్సా గొయ్యా! (పైకి)నీకు మేజువాణి నిర్ణయించుకున్నాను కానూ, నీకు పది రూపాయల సొమ్ము దొరకడం ద్రవ్యాకర్షణ కాదా! మధుః- యేం చిత్రమైన మనుష్యులు పంతులుగారూ!(తమలపాకు

చుట్టతో కొట్టి) నేను రాబోతానని రెండేళ్ళ కిందట కలగని, యీ కాబోయే మేజువాణి బుద్ధిలో వుంచుకుని ఈ పెళ్ళి కావడానికి విశ్వ ప్రయత్నం చేశారూ? ద్రవ్యాకర్షణ యలాగో నాకు బోధపడ్డది. పెళ్ళి కూతుర్ని యిలాకా చేసుకుని దాంద్వారా ముసలాడి మూటా, ముళ్ళా లాగేస్తారు. యంత సత్యకాలపదాన్నయినా ఆ మాత్రం ఊహించుకోగల్ను, బతిమా లుకున్నా యీ పెళ్ళి తప్పించకపోవడవేఁవిటిఁ? మీ బుద్ధికి అసాధ్యం వుందంటే నమ్ముతానా?

రామః- ఆమాట్ని ‘జవేఁగాని, అన్ని పనులూ ద్రవ్యాకర్షణకోసవేఁ చా'స్తాననుకున్నావా యేవిఁటి? ఆ ముసలాణ్ని కాపాడుదావఁనే యీ పెళ్ళి తల పెట్టాను”

మధు: "చిత్రం చిత్రం మహాచిత్రం" అని కథుంది. వున్నాయి, మీ చర్యలు. అలా

రామ:- ఆ కథేదో చెబుదూ, నా క్కథలంటే మా సరదా.

మధు:- పొగటిపూట కఁథలేవిటి! ముందు ఈ చిత్ర కథేవిఁటో శలవియ్యండి.

రామ:- అది చెప్పేదికాదు, చెప్పను.

మధు:- చప్పకపోతే వొప్పను.

రామ :- ఒప్పకేం జేస్తావు?

మధు:- యేం జేస్తానా? యీ జడతో కొడతాను. శాస్త్రంలో కాముకులకు జెప్పిన ఆయుధ విఁది.

రామః- నేను దెబ్బలకు మనిషినికాదు. శాస్త్రం, గీస్త్రం వొకపక్క నుంచి మోట సరసం మాను. చెప్పమంటే చెబుతాను గాని అలాంటి కబుర్లు నువ్వు వినకూడదు. మరేంలేదు, లుద్దావధాన్లు వెధవ కూతురు మీనాక్షి ప్రవర్తన మంచిదికాదు. నాల్రోజులకొహమారు అది పీకలమీదికి తెస్తూంటుంది. పోలీసువాళ్ళుబెదిరించి పది డబ్బుల సొమ్ములు లాగేస్తూం టారు. డబ్బు ఖర్చంచే ముసలాడికి ప్రాణపోకట. సంసారం కూడా మీనాక్షి దూబర చేస్తుందంటాడు. పెళ్ళయితే దాడి ఆట కడుతుంది.

మధుః - మీనాక్షి ప్రవర్తన బాగుంది కాదంటూ మీరే చెప్పాలి? కంటపడ్డ తరువాత యే ఆడదాని ప్రవర్తన తిన్నగా వుంటుంది?

రామః - అదుగో చూశావా? అలా అంటావనేకదూ చెప్పనన్నాను.

మధు: - ఈ చిక్కులు నాకేం తెలియవు. పెళ్ళి మానిపించెయ్యండి.

రామ :- యీ పెళ్ళిలో నీ మేజువాణి పెట్టి పది రాళ్ళిప్పిస్తాను. మాటా కూరుకో.

మదు:- (ముక్కుమీద వేలుంచుకుని లుద్దావధాన్లు యదుట నేను మేజువాణీ ఆఁ?

రామః - పేరు వాడుగాని, సభలో పెద్ద న్నేనే కదూ?

(హెడ్ కనిష్టీబు చుట్ట కాలుస్తూ ప్రవేశించి కుర్చీమీద కూర్చుండును.)

హెడ్:- రావఁప్పంతులు! యినన్పెక్టరుకే టోపీ వేశావదే!..... రామ:- ( హెడ్ కానిస్టేబు చెవిలో) గారూ గారూ అనవయ్యా!

హెడ్:- యెప్పుడూలేంది గారేవిఁటి, గారేవిఁటి, చింతగారు?

రామః- ఆడవాళ్ళున్న చోటికి తోసుకు రావట వేఁనా, అన్నా?

హెడ్:- ఆడవాళ్ళంటున్నావు, నువ్వు కూడా అందులోనే జమా యేవిఁటి! అహ! హ !

రామః - హాస్యానికి వేళాపాళా వుండాలి.

హెడ్:- నేను హాస్యం కోసం రాలేదు యినస్పెక్టరు పేరు చెప్పి రావిఁనాయుడిదగ్గర పాతిక రూపాయల్లాగావట. యిలా యందరి దగ్గిర లాగా"డో రామప్పంతుల్ని నిలుచున్న పట్టాన్ని పిలక పట్టుకు యీడ్చుకురా అని నాతో ఖచ్చితంగా చెప్పి ఇనస్పెక్టరు పాలెం వెళ్ళిపోయినాడు.

రామః - చిన్నప్పుడు ఒక బళ్ళో చదువుకున్నాం ఇనస్పెక్టరూ నేనూను. అంచాత అతని పిలక నేనూ, నా పిలక అతనూ లాగినా ఫర్వాలేదు. రావిఁనాయుడి మాట మాత్రం శుద్ధాబద్ధం. మీరు ముందు పదండి. గుర్రం కట్టించుకుని స్టేషను దగ్గిర కలుస్తాను.

హెడ్:- నేనెలా వొస్తాను నీతోటి? నాకు వొల్లమాల్న పనుంది. ఒక కనిస్ట్రీబుని నీతో పంపిస్తాను.

రామ:- (హెడ్ చెవిలో) నా యింట్లో మాత్రం నకార ప్రయోగం చెయ్యకు. నీకు పుణ్య పుఁంటుంది.

హెడ్ :- ఆదా నీ ఘోష! అలాక్కానియి (నిష్క్రమిస్తాడు)

రామ:- (తనలో) ఆదుగో మళ్ళీ ఏకవచనవేఁకూస్తాడు! (పైకి) యవడ్రా అక్కడ.

నౌక:- (ప్రవేశించి) చి త్తం బాబు.

రామః- గుర్రం కట్టమను.

నౌక:- సిత్తంబాబు. (నిష్క్రమించును.)

రాము:- చూశావూ మధురవాణీ? నే న్ని లబడ్డ చోట రూపాయలు గలగల్రాల్తాయి. యీ యిన స్పెక్టరుగాడికి యీ తాలూకాకి వొచ్చిం తర వాత అయిదారువేలు యిప్పించాను, వీధి తలుపు వేసుకొని సంగీత సాధనం చేసుకో. విద్య వంటి వస్తువులేదు. (గుమ్మం దాటి నాలుగడుగులు వెళ్ళి తిరిగివచ్చి) అప్పుడే వీణ తీశావు? మా వూళ్ళో మా దుర్మార్గులు న్నారు. నా స్నేహితులవఁనీ, బంధువులవఁనీ పేరు పెట్టుకొస్తారు. రానీ కుమా! (తలుపు పైనించి వేసి గడియ వేసుకో. (నిష్క్రమించును.)

2-వ స్థలము: రామప్పంతులు యింట్లో పడక గది. [మధురవాణి తివాసీమీద కూచుని వీణ వాయించుచుండును. వాయిద్యం ముగించి]

మధు:- విద్యవంటి వస్తువులేదు. నిజమే—ఒకటి తప్ప. ఆదే విఁటి? విత్తం. డబ్బు తాని విద్య దారిద్ర్య హేతువ, యీ వూళ్ళో నార దుడు వొచ్చి పాడితే నాలుగు దమ్మిడీ లివ్వరు. గనుక యీ వీణ యిటు పెడం, హెడ్డు కనిష్టీబు సౌఁజ్ఞచేసి వెళ్ళాడు. అతడు యిచ్చేదీ, చచ్చేదీ లేదుగానీ, జట్టీలేవైనా వొస్తే ఓ వొడ్డు కాస్తాడు.

[వీధి తలుపు తట్టబడును)

మధు:- వొచ్చా"డు కాబోలు! (తలుపు దగ్గిరికి వచ్చి) యవరు మీరు? బంధువులా?

[తలుపవతల కరటక శాస్తుల్లు, కన్య వా"షంతో శిష్యుడున్నూ]

కరః- ఆపద కడ్డంబడ్డవారే బంధువులు, మేమ్మీకు బంధువులం కావుఁగాని, మీరు మాకు బంధువులు కాగలు.

మధు:-- నా"స్తులా?

కరః- (తనలో) యీ కంఠం విన్నట్టుంది. (పైకి) నా" స్తం కట్టడానికే వొచ్చాం.

మధు: దేంతో కడతారు?

కర:- (తనలో) యీ వేశ్య మధురవాణి కాదుకదా? కంఠాన్ని పోలిన కంఠం ఉండకూడదా? (పైకి) నా" స్తం కట్టడానికల్లా వున్నది వక్క టేగదా-టంకం?

మధు: ఏమిటో ఆ టంకం ?

కరః బంగారం!

మధు:- మా పంతులుగారికి మీరు నా "స్తులూ; బంధువులూ కూడా కాకపోతే తలుపు తియ్యొచ్చును. (తలుపు తీయ్యును.)

కర:- (తనలో) ఆరే! మధురనాణే!

మధుః - (ముక్కుమీద వేలుంచుకుని) చిత్రం!

కరః- యేవిఁటి చిత్రం?

మధుః- యీ వేషం!

కరః- ఉదర నిమిత్తం బహుకృత వేషం! యిది దేవుడిచ్చిన

మధు:- నా దగ్గిరేనా మర్మమం? యీ పిల్లెవరో ?

కరః - నా కొమార్త.

మధు:- నాటకంవల్లా చెడి పొగటి వేషాల్లో దిగిందా? పెట్టి పుట్టారు గదా యేల యీ అవస్థ?

కరః- నీ దయవల్ల దేవుడిచ్చిన స్థితి కేం లోపం రాలేదు. నిన్ను చూద్దావఁని వొచ్చాను.

మధు:- యిన్నాళ్ళకై నా యీ దీనురాలు మీకు జ్ఞాపకం రావడం అదెంతగాదు?

కరః- నీలాంటి మనిషి మళ్ళీ వుందా? నిన్ను చూడ్డం బ్రహ్మా నందంకాదా? నీ దగ్గరికి రావడం లేదనా యిన్నాళ్ళూ రాలేదనుకున్నావు? డిప్టీ కలక్టరుగారి కుమారత్నంగారు నిన్ను చేపట్టారని తండ్రికి తెలిసిం తరువాత నేనుగానీ నీ యింటికి వొస్తే పీక ఉ త్తిరించేస్తాడేమో అనే భయం చాత కొంచెం యడబెట్టి, యితడికి యెప్పుడు బదిలీ అవుతుంది. మా మధురవాణ్ణి యెప్పుడు చూస్తాను, అని దేవుణ్ణి సదా ప్రార్థిస్తూ వుంటిని. నువ్విక్కడెన్నాళ్ళాయి వున్నావు?

మధు:- డిష్టీకలక్టరుగారికుమారత్నంగార్ని తండ్రి, చదువు పేరు పెట్టి, చన్నపట్ల తలిగిన రెండు నెల్లదాకా ఆయన నా'స్తుడు గిరీశంగారి ద్వారా డబ్బు పంపించాడు, - ఆ తరువాత మొన్నటిదాకా గిరీశంగారు నన్ను వుంచారు గాని డబ్బుకి యటాముటీగా వుండేది. నా యింటికి వొచ్చినప్పుడల్లా తన కొడుక్కి దోస్తి అయి వుంటాడని డిష్టీకలక్టరు అనుమానిస్తాడేమో అని పేరుగల వాడెవడూ నాయింటికి రావడం మానేశాడు. సంజీవరావుగారి అల్లరి కొంచెం మరుపొచ్చిందాకా పై నుందావఁని వూరొచ్చాను.

కరః - (ముక్కుమీద వేలుంచుకుని) గిరీశం నిన్నుంచుకున్నాడా మా మేనల్లుడికి చదువు చెప్పడానిక్కుదురుకొని మా వాళ్ళింటో చేరాడు. వాడికి పెందరాళే ఉద్వాసన చెప్పాలి.

మధు:- (ముక్కుమీద వేలుంచుకొని] నా దగ్గిరకు వచ్చినవాడల్లా చెడిపోయినాడో? నా దగ్గిరకు మీరు రాకుండా అవరోధం కలిగిందని యిప్పుడే డిష్టీకలక్టరుగార్ని తిట్టారే ఆయనకంటే మీ న్యాయం యేంబాగా వుంది? నా దగ్గరకు వచ్చినందుకు మీ భార్యగారు ముందు మిమ్మల్ని మెడ పట్టుకొని యింట్లోంచి తరవ్వఁలిసిందు. తనకు రొట్టా'ఒహడికి ముక్కానా?

కరః- క్రియలలో అంతవరకూ జరక్కపోయినా మాటలో ఆ మర్యాద అమేషా నాకు జరుపుతూనే వున్నది.

మధు:- (చిరునవ్వుతో) యీవిడ' గుట్టు బట్టబయలౌతుంది. యీ యిల్లాలు మా పంతులు కంటపడితే

కరః - యిల్లా లనేస్తున్నావేఁం అప్పుడేను! కన్నెపిల్లా: దీన్ని పెండ్లి చేయడానికే, నీ దగ్గరికి తీసుకొచ్చాను..

మధు:- మా పంతులకేనా పెళ్ళి?

కర:- “ఏకవారీ సుందరీవా దరివా” అన్నాడు. త్రిలోక సుంద రివి, నువ్వు దొరికిఁం తరువాత నీ పంతులుగారికి యింకా పెళ్ళెందుకు?

మధు: - ఐతే, మరెవరికి పెళ్ళి చెయ్యడం? నాకా యేవిఁటి? అలా గైతే, నైయేఁ! మొగవేషం వేసుకొని, పెళ్ళిపీటమీద కూర్చుంటాను. యిలాంటి పెళ్లాం దొరకడవేఁలాగ. జగత్ప్రఁ సిద్దులైన కరటకశాస్తులుగారి అల్లుణ్ణి కావడం యెలాగ? దివ్యసుందర విగ్రహవఁని పొగడగానే బుజాలు పొంగుతాయనుకున్నారు కాబోలు! యీ పిల్ల దగ్గర నాబోట్లు దివిఁటీ ముందర దీపాలు. ఆడది మెచ్చిందే అందం ! మొగాడి కన్నుమసక మీకేం తెలుసును. మరి నా పెళ్ళాన్ని నాకిచ్చేసి మీ తోవన మీరు వెళ్ళండి. (శిష్యుడి చెయ్యిపట్టి లాగును.)

శిష్యు:- చూశావురా నాన్నా, యలా పట్టుకుందో?

మధు:- (ఆపుకోలేకుండా నవ్వుతూ) శాబాము! యిదేనా పెద్ద మనిషి తరహా! యిరుగు పొరుగమ్మ లేవఁటారో మొగుడు పిలిస్తే వెళ్ళ

శిష్యు:- కొడుతుంది కాబోల్రా నాన్నా, యింటికెళ్ళిపోదాం రా!

మధు:- యేం నంగనాచివే? తరువాత పెళ్ళి చేసుకుంటాను.

అందాకా ముద్దియ్యి. (ముద్దెట్టుకొనును.)

కరః- నేరని పిల్లను చడగొడుతున్నావు.

మధు:- నాలాంటివాళ్ళకి నూరు మందికి నేర్పి చెడగొట్టగలడు. ఎవరి శిష్యుడు? ఈ కన్నెపిల్ల నోరు కొంచెం చుట్టవాసన కొడుతూంది.

కరః- అంచాతే కాబోలు డబ్బీలో చుట్టలు తరుచు మాయవాఁ తూంటాయి. మధురవాణి! - దేవుణ్ణాకు నిన్ను చూపించాడు. పంతుల్లేని సమయం కనిపెట్టి వొచ్చాను. మళ్ళీ అతడొచ్చేలోగా నాలుగూ విని, మాకు వొచ్చిన చిక్కు తప్పించు. నా మాటలు

మధుః - మీ కొచ్చిన చిక్కేవిఁటి నేను చెయ్యగలిగిన సహాయ

కరః- చిక్కన్నా చిక్కు కాదు, విను. యీ వూళ్ళో గిరీశం పెఁతల్లి కొడుకు లుబ్ధపుధాన్లని ఓ ముసలా'డున్నాడు. వాడికి మా మేన గోడల్నివ్వడానికి మా బావ నిశ్చయించాడు. ఈ సంబంధం చేస్తే నా చెల్లెలు నూతులో పడతానని వొట్టేసుకుంది. యేం వుపాయం చా'స్తావో,

దాని ప్రాణం కాపాడాలి.

మధు:- యీ పిల్లని అంతకి తక్కువ సొమ్ముకి అమ్మితే లుబ్ధావు ధాన్లు చంకలు గుద్దుకొని చేసుకుంటాడు. అతనిదాకా యెందుకు? నేనే కొనుక్కుంటాను.

కరః- చూపితే అందుకు పోయేదానికి నీకు మిక్కిలి చెప్పాలా యేమిటి?

మధు:- ఇదివరకే నిర్ణయమైన సమ్మంధం యేమ్మిష పెట్టి తప్పిం చడం?

కరః- నీ బుద్ధి కసాధ్యం వుందా? డబ్బు కసాధ్యం వుందా?

మధు:- బుద్ధికి అంతా అసాధ్యవేఁగాని డబ్బుకి ఎక్కడా అసాధ్యం లేదు. పెళ్ళిలో మా పంతులకో పదిరాళ్ళు దొరుకుతా యనుకుంటున్నాడే?

కరః - నా సంబంధం చేసుకుంటే నేనే యిరవై రాపాషాణాలు యిస్తాను.

మధుః- సరేగాని, నాటకంలో ఎంత హాస్యవైఁనా చెల్లుతుంది. నటనలోకి హాస్యం తెస్తే యేవిఁ మూడుతుందో ఆలోచించారా?

కరః- మధ్య నీ కొచ్చిన ఫర్వా యేవిఁటి, నా కొచ్చిన ఫర్వా యేవిఁటి? యీ క త్తెర మీసం క త్తెర గెడ్డం కడిగేసుకుని నా తోవని నేను వేళతాను. యీ కోక నీ దగ్గిర పారేసి మా శిష్యుడు వెళ్ళతాడు. ఆ తరు వాత యిదేవిఁటమ్మా యీ చిత్రవఁని నువ్వూ నలుగురమ్మలక్కలతో పాటు ఆశ్చర్యపడుదువుగాని, మీ పంతులతో సిఫార్సు చేసి మంత్రం యెలా సాగిస్తావో గట్టి ఆలోచన చెయ్యి.

మధు:- మా పంతులు వక్కడివల్లా యీ పని కానేరదు.

కరః- మరి ఇంకా యెవరి కాళ్ళు పట్టుకోవాలో చెప్పు.

మధు:- మా పంతులుతో మాట్లాడం ఐన తరువాత అవధాన్లు కూతురు మా నా' స్తం మీనాక్షిని తండ్రికి తెలియకుండా చూసి ఓ రెండు కాసులు యిస్తానని చెప్పండి. ఆపైని సిద్ధాంతిని చూసి అతనికి అలాగే ఆశ పెట్టండి. ఈ పనికి సిద్ధాంతే కీలకం. నేను తెర వెనుక నించి సమ యోచితంగా హంగు చాలిస్తాను.

కరః- నీ మాట వేరే నే చెప్పాలా? నిన్ను సంతోష పెట్టడం నా విధి .

మధు: ఆ మాట మీరు శలవివ్వడం నాకు విచారంగా వుంది. వృత్తిచేత వేశ్యని గనుక చెయ్యవలసినచోట్ల ద్రవ్యాకర్షణ చేస్తానుగాని, మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్న అని తలచారా? మీ తోడబుట్టుకి ప్రమాదం వచ్చినప్పుడు నేను డబ్బుకి ఆశిస్తానా? యెటుంచి యెటొచ్చినా కాపాడతాడు, హెడ్ కానిస్టేబుల్కి మాత్రం కొంత నిజం చెబుదాం.. అతగాడు ఇప్పుడే వస్తాడు. మాట్లాడతాను. మీరు యిక్కడ కూర్చోండి.

కర:- స్వాధీనుడేనా! కొంప ముంచడుగదా?

మధు:- గులాం (నిష్క్రమించును)

కర:- కూచుందాం రా.

శిష్యుః- నా పేరేవిఁటండోయి?

కర:- కొంప ముంచుతావు కాబోలు, సుబ్బి! సుబ్బి ! మధురవాణ్ని చూడగానే మతిపోయిందా ఏవిఁటి?

శిష్యుః - దాని నవ్వు పట్టుబడాల'ని నిదానిస్తున్నాను.

కర:- సబ్బు అన్నమాట జ్ఞాపకం వుంచుకుంటే సుబ్బి అనే పేరు జ్ఞాపకం వుంటుంది.

రామప్పపంతులు గుర్రం దూరాన్న దిగి నడిచి వస్తాడు]

[ రామ:- (కరటకశాస్త్రితో మెల్లిగా] లోపలి కెవరైనా వెళ్లారా?

కర:- [గట్టిగా] యవరో యిద్దరు ముగ్గు రొచ్చారుగాని మీ యిల్లాలు గారొచ్చి పైకి పొమ్మని గెంటేశారు.

రామ:- మీరెవరు? యెందుకొచ్చారు?

కర:- మాది కృష్ణాతీరం. నా పేరు గుంటూరు శాస్తుల్లంటారు. తమ దగ్గర రాచకార్యవుఁండి వొచ్చానండి.

వీధిలో (నుంచి జవాను:-యిన స్పెక్టరుగారు నే వొచ్చిందాకా మర్రి చెట్టుకింద గుర్రాన్ని నిలబెట్టుంచుతానఁన్నారు. రూపాయలువేగంఇవ్వండి. (మధురవాణి ప్రవేశించును)

రామ:- యవరు వొచ్చారట?

మధు:- యవరొస్తారు? మీ నా'స్తులట! తగిలా'ను .

జవా:- రూపాయలండోయ్!

రామ:- [మధురవాణితో యేవీ, మొన్న నీకిచ్చిన రూపాయలు? సాయంత్రం మళ్ళీ ఫిరాయిస్తాను. యీ నైతాను ప్రాణం తింటున్నాడు.

మధు:- మీరిచ్చిన రూపాయలు పట్ణంతోలేశాను. నేను డబ్బిక్కడ దాచుకుంటే మా తల్లఁక్కడ కాలక్షేపం చెయ్యడవెఁలాగ?

రామ:- వొట్ట ‘బద్దాలు!

మధు:- (తాళముల గుత్తి మొలలోనుంచి తీసి రామప్పంతులు మీద విసిరి) చూసుకోండి.

రామ:- (భుజం తడుపుఁకుంటూ) దురహంకారం కూడదు! వా యేవిఁటి?

విసిరికొడితే దెబ్బ తగలనుకున్నావా మధుః- దుష్టుమాట లనగా తగిల్తే తప్పా?

జవా:- యేవఁయ్యోయి! పోయి, రూపాయిలిచ్చావు ఇన స్పెక్టరుగారితో చెబుదునా? కావని

మధు:- మెడలో నాను తీసి] ఇది తాకట్టు పెట్టి కావలసిన సొమ్ము తెచ్చుకోండి.

రామ:- (తనలో] ఆహా! యేమి యోగ్యమైన మనిషి! లేనిపోని అనుమానాలు పడకూడదు..

కరః పంతులుగారూ, యెన్ని రూపాయలు కావాలండి? రామః - పాతిక.

కర:- నే దాఖల్చేస్తాను. [జవానుకు యిచ్చును.]

రామః - ధనజాతకానికి డబ్బలా వొస్తూ వుంటుంది. యేవిఁటి మీ రాచకార్యం.

కర:- యిది నా పిల్లండి. దీనికి వివాహం చేయించి ఆ సుకృతం తమరు కట్టుకోవాలి.

రామః - వివాహం చేయించడానికి నేను వైదీకిని కాను! నాకు మంత్రాలు రావే? (చుట్ట జేబులోంచి తీసి కొన కొరికి) యేవఁంటావు మధురవాణీ, అగ్గిపుల్ల.

మధు:- [అగ్గిపుల్ల అందిస్తూ పంతులు నుంచి, శిష్యుడి వేపూ, శిష్యుడు నుంచి పంతులు వేపూ కోపముతో చూచును. )

కర:- మంత్రవఁన్నప్పుడు వై దీకపవాడి దేం మంత్రవఁండి? ఈ రోజుల్లో వై దీర్ఘమంత్రాల మహిమ పోయిందండి. మంత్రవ్వంటే నియ్యోగ ప్రభుపుదే మంత్రం! తమవంటి ప్రయోజకులకు మంత్రం మాట్లాడు తుందండి.

రామ:- మధురం! కుందునా? ఈ పిల్లన్నే పెళ్ళి చేసు

మధు: - [రామప్పంతులు వేపూ, శిష్యుడివేపూ చుర చుర చూసి నిష్క్రమించును.]

రామ:- సొగసుక త్తెలకి అలక కూడా ఆదో శృంరగాం సుమండి, శాస్తుల్లుగారూ!

కర:- వై దీకపాళ్ళం మాకా శృంగారాలు యలా అనుభవఁవౌఁతా యండి? మా యిల్లాళ్ళక్కోపం వొస్తే చీపురుకట్టలు యెరుగుతాయండి. సరసవఁన్నది పుస్తకాల్లో చదవటవేఁగాని మాకు అనుభవ వేద్యంకాదండి. శ్రీ కృష్ణమూర్తి వారు రాధికతో శలవిస్తున్నారు: “ఓ రాధికా? నీ కోపం తీర్చుకోవాలన్న షాయనా ఘటయ భుజబంధనం రచయ రదఖండనం యేనవా భవతి సుఖజాలం." అనగా యేవఁంచున్నాడంటే కవీశ్వరుఁడు. చేతుల్తోటి ఉక్కిరిబిక్కిరి అయ్యేటట్లుగా కౌగిలించుకో. మరిన్నీ పెదవఁలు రక్తాలొచ్చేటట్లు కొరికెయ్యి అంచున్నాడు.

రామ:- [మధురవాణి వెళ్ళిన గుమ్మమువేపు చూసి ఉప్పు లేకనే ముప్పందుం. మధురవాణికి మాత్రం ఈ వెర్రి మొర్రి కవిత్వాలు చెప్ప కండి. నాలాంటి మృదువర్లు మోట సరసం సహించరు.

కర:- ఆమె మీ భార్య కారండీ? సంసారికన్నా మర్యాదగా ఉంది. ఈ వేశ్య! మీది యేవఁదృష్టం!

రామ:- యెంపిక, యెంపికలో వుందండి! చెప్పారుకారు? మీ రాచకార్యం

కర:- లుద్దావధాన్లుగారికి, తమకి చాలా స్నేహవఁని విన్నాను. ఆయన తమ మాట అడుగుదాటరట?

రామః - ఆ గాడిద కొడుక్కి ఒకరితో స్నేహం యేమిటండీ? వాడి ప్రాణానికి డబ్బుకి లంకె. డబ్బుకి వాడికే స్నేహంగాని మరి యవరితోనూ స్నేహం లేదు. అయితే వాడికి వ్యవహార జ్ఞానం లాఁక పోవడంచేత, కోర్టు లంటే భయంచాతా, నా సలహా లాఁక బతకలేడు. వాడే అన్నమాదేవిఁటి. ఈ తాలూకాలో సివిలు మేజిస్ట్రేట్లు యెక్క డొచ్చినా రామప్పంతులు పప్పులేని పులగం వుండదు.

కర:- ఆ మాట వినే తాము నియ్యోగ ప్రభువులు, మంత్రబలం చాత చక్రం అడ్డేస్తారని తమర్ని వెతుకొచ్చాను. మా పింతల్లి కొడుకు బియ్యేబియ్యల్ పాఁసయినాడండి. డిప్టీకలక్టరీ చేస్తున్నాడు. బంధువులకి అతని వల్ల గడ్డిపరకంత సాయం లేదుగదా, మీదిమిక్కిలి కూరానారా యవళ్ళయినా గృహస్థులు గృహస్థుమర్యాదకి పంపించి, తల్లయినా, అవి పుచ్చుకుంటే తిరకగొట్టిందాకా అభోజనం కూచుంటాడు! పెట్టడానికి, పుచ్చుకోవడానికి నియ్యోగ ప్రభువులు, తమకి చెల్లిందిగాని, మా వాళ్ళ ఉద్యోగాలు మంటిగడ్డ ఉద్యోగాలండి. "ఇయ్యా ఇప్పించగల ఆయ్యలకేగాని మీస మన్యులకేలా రొయ్యకి లేవా బారెడు" అని కవీశ్వరుడన్నాడు.

రామ:- యీ యింగిలీషు చదువులు లావై నకొద్దీ వైదీకులే అన్న మాటేవిఁటి అడ్డవైఁన జాతుల వాళ్ళకి ఉద్యోగాలవుతున్నాయిగాని యంత చదువుకున్నా మీ వైదీక ప్పంతుళ్ళవారికి మా చాకచక్యాలబ్బుతాయండీ? మా లౌక్యం మాతో స్వతహాగా పుట్టినది. తెచ్చి పెట్టుకున్నది. యెరువు సరుకు యెరుపు సరుకే. విన్నారా? మీ వాళ్ళు లంచాలు పుచ్చు కోవడం చాతకాక, పతివ్రతలమని బాఁషం వేస్తారు.

కర:- అదే పతకవై (తే అది అమ్ముకు బతకనా అన్నట్టు మా వాళ్ళకే చాతయితే నాకు యీ అవ సేవఁండి? మా వాడు పదిమంది పార్టీలతో చెబితే పది రాళ్ళ సొమ్ము దొరుకును, యీ చిక్కులు లాఁక పోవును.

ఆ బండికి రెండు చక్రాలు. ఒకటి విధవా వివాహం, రెండు నాచ్చికొశ్చన్, అనగా సానివాళ్ళని హతవాఁర్చడమున్నూ యీ రెండే రాజ మార్గాలు,

బు:- మనవాళ్ళు

దురాచారాలేవిఁటో నాకు బోధ పడలేదు.

గిరీ:- ఐతే చెబుతాను వినండి. ముసలాళ్ళకి చిన్న పిల్లల్నిచ్చి పెళ్ళి చెయ్యడం ఒకటి, డబ్బుకి పిల్లల్ని అమ్ముకోవడం ఒకటి. అవునం టారా, కాదంటారా?

బుచ్చ: అవును.

గిరీ:- ఆ ముసలాళ్ళు చస్తే కష్టం, సుఖం యరుగని పసి పిల్లలు వేధవలు అవుతారు. ఉప్పూ, పులుసు తినడంచేత యేమీ యరగని పసి పిల్లలు పూర్ణ యవ్వనం వొచ్చిన తరువాత మనసు పట్టలేకబోతే వాళ్ళదా తప్పు: “వెధవ వివాహం కూడదు, గిధవ వివాహం కూడదు.” అని ఓర్వలేని మాటలు చెబుతూ, డబ్బు కాసించి, ముసలి పెళ్లిళ్ళు చేనే మూర్ఖులా తప్పు? వూరుకుంటారేం?

బుచ్ఛ:- నాకు తెలియదు..

గిరీః- ఆవుఁను మరి మీరేవఁనగలు? తల్లిని, తండ్రినీ యేఁవను కున్నా మనసులో అనుకుని జీర్ణించుకోవాలిగాని, మీలాంటి మంచివాళ్ళు పైకంటారా? నాలాంటివాణ్ణి యేవఁండి మావఁగారూ, పిల్లల్ని రూప వంతుడూ, యవ్వనవంతుడూ, బుద్ధిమంతుడూ అయిన కుర్రవాడికి యిమ్మని శాస్త్రంలో ఉందిగద, శాస్త్రానికి విరుద్ధంగా యెందుచేత డబ్బు క్కక్కూర్తిపడిముసలాళ్ళకి కట్టబెడుతున్నారయ్యా, శాస్త్రంలో "వెద వలకి పెళ్ళి చెయ్యవలసినది" అని శాసించి చెప్పివుండగా ఎందుకు చెయ్యరయ్యా అని అడిగితినట్టాయినా అర్ధచంద్రప్ర’యోగంచేసి అవతలికి

గెంటుతారు. అంచాత “శాంతం బోషాణ

పెట్టె" అనుకొని నోరు

మూసుకు వూరుకున్నాను. యిహ నాచ్చికొశ్చన్ మాట వినండి. సాని

వాళ్ళని హత(వార్చడం మంచిదంటారా, కాదంటారా?

బుచ్ఛ:- వాళ్ళని చం చేస్తారా ఏవిఁటి?

రామః - యేవిఁటా చిక్కులు?

కరః- ఋణబాధ చాలా లావుగా వుండండి. రేపటి పున్నంలోగా ఒక దస్తావేజు తాలూకు రూపాయలు చెల్లకపోతే దావా పడిపోతుందండి. యీ పిల్లని నల్లబిల్లిలో వెంకట దీక్షితులుగారికి పదహారు వందలకి అమ్మ నిశ్చయించుకొని తీరా వొచ్చేసరికి యిప్పట్లో రూపాయలివ్వలేం, పెళ్ళ యిన నెలరోజుల్లో యిస్తావఁన్నారండి. అందుచేత అది వొదులుకొవి లుబ్దావధాన్లుగారు వివాహ ప్రయత్నంలో వున్నారని విని తమ దర్శనా నికి వొచ్చా'నండి. యిదిగాని తాము సమకూరిస్తే పదివరహాల సొమ్ము దాఖలు చేసుకుంటాను.

రామః- నేను నలభై, యాభై రూపాయల వ్యవహారాల్లో జొరబడే వాణ్ని కాను.

కరః- తాము చేసే సదుపాయాన్ని బట్టి యంతయినా దాఖలు చేసే వాణ్ణినండి. నా రుణాలు పదహారువంద లుంటాయండి, ఆ పైని యే వొఁచ్చినా తాము దాఖలు చేసుకోండి.

రామ:- "ఐతే గియే" బేరాలు మా కవసరం లేదు.

హోత్రావధాన్లకి పద్దెనిమిది వందలిస్తున్నాడు గదా, అందుకు సగానికి తగ్గితేనేగాని అవుధాన్లు ఆ సంబంధం మాని మీ సంబంధం చేసుకోడు. అందులో మీ రుణాలు తీరేదేవిఁటి? నాకిచ్చే దేవిఁటి? యేఁవై తేనేవి? ఆ వ్యవహారం యలాగా మించిపోయింది. పది రోజులకిందటొస్తే ఫొక్తు పరు స్తును. ఆ సంబంధం భోగట్టా మొదట నేనే తెచ్చాను. నా చేతుల్లోంచి ఆ వ్యవహారం పోలిశెట్టి లాగేశాడు. కృత్యాద్యవస్థమీద మధురవాణి

మేజువాణీకి వాణ్ణప్పించేసరికి నా తాతలు దిగొచ్చా'రు, మరివక ఉపాయం

చెబుతాను వినండి. మీకు మయినరు కొమాళ్ళున్నారా! కరః- చిన్నవాడికి మయినారిటీ దాటి మూడేళ్ళయిందండి.

రామః - యేవిఁటా చిక్కులు?

కరః- ఋణబాధ చాలా లావుగా వుండండి. రేపటి పున్నంలోగా ఒక దస్తావేజు తాలూకు రూపాయలు చెల్లకపోతే దావా పడిపోతుందండి. యీ పిల్లని నల్లబిల్లిలో వెంకట దీక్షితులుగారికి పదహారు వందలకి అమ్మ నిశ్చయించుకొని తీరా వొచ్చేసరికి యిప్పట్లో రూపాయలివ్వలేం, పెళ్ళ యిన నెలరోజుల్లో యిస్తావఁన్నారండి. అందుచేత అది వొదులుకొవి లుబ్దావధాన్లుగారు వివాహ ప్రయత్నంలో వున్నారని విని తమ దర్శనా నికి వొచ్చా'నండి. యిదిగాని తాము సమకూరిస్తే పదివరహాల సొమ్ము దాఖలు చేసుకుంటాను.

రామః- నేను నలభై, యాభై రూపాయల వ్యవహారాల్లో జొరబడే వాణ్ని కాను.

కరః- తాము చేసే సదుపాయాన్ని బట్టి యంతయినా దాఖలు చేసే వాణ్ణినండి. నా రుణాలు పదహారువంద లుంటాయండి, ఆ పైని యే వొఁచ్చినా తాము దాఖలు చేసుకోండి.

రామ:- "ఐతే గియే" బేరాలు మా కవసరం లేదు.

హోత్రావధాన్లకి పద్దెనిమిది వందలిస్తున్నాడు గదా, అందుకు సగానికి తగ్గితేనేగాని అవుధాన్లు ఆ సంబంధం మాని మీ సంబంధం చేసుకోడు. అందులో మీ రుణాలు తీరేదేవిఁటి? నాకిచ్చే దేవిఁటి? యేఁవై తేనేవి? ఆ వ్యవహారం యలాగా మించిపోయింది. పది రోజులకిందటొస్తే ఫొక్తు పరు స్తును. ఆ సంబంధం భోగట్టా మొదట నేనే తెచ్చాను. నా చేతుల్లోంచి ఆ వ్యవహారం పోలిశెట్టి లాగేశాడు. కృత్యాద్యవస్థమీద మధురవాణి

మేజువాణీకి వాణ్ణప్పించేసరికి నా తాతలు దిగొచ్చా'రు, మరివక ఉపాయం

చెబుతాను వినండి. మీకు మయినరు కొమాళ్ళున్నారా! కరః- చిన్నవాడికి మయినారిటీ దాటి మూడేళ్ళయిందండి.

రామః - యేవిఁటా చిక్కులు?

కరః- ఋణబాధ చాలా లావుగా వుండండి. రేపటి పున్నంలోగా ఒక దస్తావేజు తాలూకు రూపాయలు చెల్లకపోతే దావా పడిపోతుందండి. యీ పిల్లని నల్లబిల్లిలో వెంకట దీక్షితులుగారికి పదహారు వందలకి అమ్మ నిశ్చయించుకొని తీరా వొచ్చేసరికి యిప్పట్లో రూపాయలివ్వలేం, పెళ్ళ యిన నెలరోజుల్లో యిస్తావఁన్నారండి. అందుచేత అది వొదులుకొవి లుబ్దావధాన్లుగారు వివాహ ప్రయత్నంలో వున్నారని విని తమ దర్శనా నికి వొచ్చా'నండి. యిదిగాని తాము సమకూరిస్తే పదివరహాల సొమ్ము దాఖలు చేసుకుంటాను.

రామః- నేను నలభై, యాభై రూపాయల వ్యవహారాల్లో జొరబడే వాణ్ని కాను.

కరః- తాము చేసే సదుపాయాన్ని బట్టి యంతయినా దాఖలు చేసే వాణ్ణినండి. నా రుణాలు పదహారువంద లుంటాయండి, ఆ పైని యే వొఁచ్చినా తాము దాఖలు చేసుకోండి.

రామ:- "ఐతే గియే" బేరాలు మా కవసరం లేదు.

హోత్రావధాన్లకి పద్దెనిమిది వందలిస్తున్నాడు గదా, అందుకు సగానికి తగ్గితేనేగాని అవుధాన్లు ఆ సంబంధం మాని మీ సంబంధం చేసుకోడు. అందులో మీ రుణాలు తీరేదేవిఁటి? నాకిచ్చే దేవిఁటి? యేఁవై తేనేవి? ఆ వ్యవహారం యలాగా మించిపోయింది. పది రోజులకిందటొస్తే ఫొక్తు పరు స్తును. ఆ సంబంధం భోగట్టా మొదట నేనే తెచ్చాను. నా చేతుల్లోంచి ఆ వ్యవహారం పోలిశెట్టి లాగేశాడు. కృత్యాద్యవస్థమీద మధురవాణి

మేజువాణీకి వాణ్ణప్పించేసరికి నా తాతలు దిగొచ్చా'రు, మరివక ఉపాయం

చెబుతాను వినండి. మీకు మయినరు కొమాళ్ళున్నారా! కరః- చిన్నవాడికి మయినారిటీ దాటి మూడేళ్ళయిందండి.

కర: సంగోరు మీకిస్తే మరి నేను ఋణాలేం తీర్చుకోను?

రామ:- ఋణా తీర్చుకో అబ్ఖర్లేకుండా గ్రంథం జరిగిస్తాంకదూ? అప్పుడే మీ చేతుల్లో రూపాయలు పడడానికి సిద్ధంగా వున్నట్లు మాట్లాడు తారేవిఁటి నేను యంత శ్రమపడ్డ పైనిసతనం తిరగాలి? అది ఆలోచించారా?

కర:- తాము అలా అంటే నేనేం మనవి చెయ్నండి? రక్తం మాంసం అమ్ముకుంటూన్నప్పుడు ఆ కాని కూడయినా సంతుష్టిగా దొర కడం న్యాయం గదండి? వ్యవహారాల తొట్రుబాటుచాతనూ, పిల్ల కట్టు దప్పి వుండడం చాతనూ తొందరబడుతున్నాను గానండి. కొంచెం వ్యవధి వుంటే రెండువేలకి పైగా అమ్ముకుందునండి.

రామః- “అయితే గియితేలు” అనుకున్న లాభం లేదని చెప్పాను కానా? ఐదో వొంతుకు యేవంటారు?

కర:- ఈ పాపపు సొమ్ముకే తమరు ఆశించాలా అండి?

రామ:- పాపపు సొమ్ము మా దగ్గరకి రాగానే పవిత్రవైఁపో తుంది. ఒకర్ల కివ్వడం కోసవేఁగాని నాక్కావాలా ఏవిఁటి?

కర:- ఐతే కానియ్యండి.

రామః - ఇక నా ప్రయోజకత్వం చూడండి. మధురం! మధురం! కాకితం, కలం, సిరాబుడ్డి తీసుకురా. మామూలు సిరాబుడ్డి కాక గూళ్లోది పెద్ద సిరాబుడ్డి తే.

మధు:- [అవతల నుంచి] నా కంటే మధురం కంటబడతరవాత నేనెందుకు?

రామ:- ఆడవాళ్ళకి అనుమానం లావండి, వింటున్నారా? అదో ముచ్చట

కరః- కేవలం వజ్రాన్ని సంపాదించారు.

రామః - వజ్రవేఁగానండి. పట్టణవాసపు అలవాటుచేత పదిమందితో మాట్లాడితేగాని దానికి వూసుబోదు.

కరః- ఆ మాత్రం స్వేచ్ఛ యివ్వడం మంచిదండి; ఆడదాన్నా ట్టే రొకాయించకూడదండి.

రామః- రొకాయిస్తే యేంజేస్తుందేవిఁటండీ?

కర:- యిలాంటి మానంగల మనిషైతే నూతులో, గోతులో పడ తుందండి.

రామ:- అలాగనా అండి.

కర:- అందుకు సందేహ మేమిటండి? నాజూకైన మనస్సుగల శ్రీని మల్లెపూవులాగ వాడుకోవాలండి.

రామః - ఆ నాజూకులూ, గీజూకులూ మీకేం తెలుసునండి?

కర:- పుస్తకాల్లో చదువుకున్న ముక్కలు, నాయకుడు నిరా కరిస్తే నాయక ఉద్యానాల్లో పుండుకున్నమువంటి లతలతో ఉరిపోసు కుంటుందండి. మహాకవులు నాటకాల్లో అప్లాగే జరిగినట్లు రాశారండి.

రామ:- మరెవళ్ళతో మాట్లాడినా తప్పులేదుగాని, హెడ్కనిష్టిబుతో మాత్రం మాట్లాడవద్దని బుద్ధిచెప్పండి. మీరు తండ్రిలాంటి వారుగదా!

కర:- ప్చు! అంత అదృష్టవాఁ అండి. అట్లాంటి పిల్లే నాకు వుందే మూడు నాలుగువేల కమ్ముకుని ఋణాలూ, పణాలూ లేకుండా క్షేపం చేసి వుందును. దీన్నయినా నాలుగు దిక్కులా అమ్మజూపితే రెండుమూడువేలు యిదివరకే చేతులో పడివుండునండి. మేనరికం చెయ్యా లని దీంతల్లి భీష్మించుక్కూచోబట్టి యీ దురావస్థ మాకొచ్చింది. యీ దేశంలో అంచా తనే యింట్లో చెప్పకుండా యీ పిల్లని వెంట తీసుకొచ్చి పెళ్ళికి చూపుతున్నాను.

రామః - నా సహాయలోపం వుండబోదు.

కర:- ఐతే కార్యవఁయిందే!

రామః - యెదీ పిల్లా, యిలారా, చెయి చూపించూ.

[శిష్యుడు భయం నటించి వెనక్కి తగ్గును]

కర:- చూపించమ్మా, భయంలే చ్చూపించు.

[కరటకశాస్తుల్లు, శిష్యుణ్ణి రామప్పంతులు దగ్గిరికి తోయును.రామ స్పంతులు చెయ్యిపట్టుకుని అరిచెయ్యి చూచుచుండును. శిష్యుడు చెయ్యి,లాక్కొంటున్నట్టు నటించును. మధురవాణి సిరాబుడ్డి, కలం, కాగితం పట్టుకు వచ్చి రామప్పంతులు వెనక నిలుచుండును.]

రామ :- ఆహా! యేం ధనరేఖా! సంతాన యోగ్యత బాగా వుంది.

మధు:- మీరు చేపట్టిం తరువాత, అందుకు లోపం వుంటుందా? (నిరా బుడ్డిలోని సిరా రామప్పంతులు ముఖంమీద పోసి చర్రున వెళ్ళి పోవును.)

3.వ స్థలము: కృష్ణారాయపురం అగ్రహారంలో, అగ్నిహోత్రావధాన్లు గారి యిల్లు.

[వీధిగుమ్మం యదట గిరీశం నిలిచి సన్నని గొంతుకతో పాడును]

గిరి: "కాముని విరిశరముల బారికి నే నేమని సహింతునే, చెలీ, యేమని సహింతునే!",

వీడి తస్సాగొయ్యా, వీడి బాణాలు పువ్వులటోయి? ఆ మాట యవడు నమ్ముతాడు? వెర్రికుట్టే యెవడైనా నమ్మాలిగాని? అనుభవవేద్యవైన దీని నిజం యేవిఁటంటే.... మంచి పదును బట్టిన లోహం మండ్ పోయింట్ వేసి పోయిజన్ లో ముంచి కంటికి మొనకి డయ కనబడకుండా మంత్రించి విసురుతాడు. అంచేతనే పైకి గాయం కనపడదుగాని పోలీసు వాళ్ళ దెబ్బల్లా లోపల తహతహపుట్టిస్తాయి. యీ విడో బ్యూటీ చూస్తే ఏమీతోచకుండా వున్నది. అయితే ఇది చెప్పినట్టల్లా వశమయ్యే మనిషి కాదు. పాతరస్తాలేం పనికిరాకుండా వున్నాయి. నా యక్స్పరియన్సూ, నా శృంగార చేష్టలూ గుడ్డిగవ్వంత పనిచేయకుండా వున్నాయి.

యింత సింప్లిసిటీ యక్కడా కానలేదు. దీనికి లవ్ సిగ్నల్సు, రామరామా, యేవీఁ తెలియవు. చమత్కారం మాటలు ఆడితే ఏమిన్నీ అర్థం చేసుకోలేక ఆ లేడి కళ్ళతో తెల్లబోయి చూస్తుంది. అయామ్ డ్రెడ్ఫుల్లీ యిన్ లవ్ విత్ హర్. దీన్ని చూసిన దగ్గరుంచీ టౌన్ లవ్ నూ, డాన్సింగర్లనూ మీద పరమాసహ్యం పుట్టింది. పోజిటివ్ యబహరెన్స్. వాళ్ళ పెంకెమాటలూ, పెడర్థాలూ, దొంగవేషాలూ, డామిట్! అంతా యిన్సిన్సియారిటీ ఏ గదా? ఇన్నాళ్ళు మధురవాణి వల్లోపడి యెలాగు, యాస్ని అయిపోయినానో నాకు నా మట్టుకే ఆశ్చర్యంగా వుంది. మధురవాణికి, యీ మనిషికీ కం' పారిజన్ వున్నదా? అది రంగువేసిన గాజుపూస. యిదిఫ్యూర్ డైమండ్! కాదని యవడైనా అభాజనుడు అంటే అమాంతంగా వాడి పిల కూడదీ స్తాను. దీనిని చెడగొట్టడానికి ప్రయత్నం చెయ్యకూడదు; చేసినా సాగేది కాదు. 'గనక కొత్తదారీ, కొంత న్యాయమైన దారీ తొక్కాలి. ఏవిటయ్యా అది? మాయోపాయంచేసి దీన్ని లేవదీసుకుపోయి విడో మా'రియేజి చేసు కుంటినట్టయనా కీర్తి, సుఖం కూడా దక్కుతాయి.

 "టూ బర్డ్స్ యట్ వన్ షాట్!" ఇలాంటి ఆట ఇన్నోసెంటు నిడోని వొప్పించి తీసుకు పోయి పెళ్ళాడితే మజా, ప్రయోజకత్వమునాని, రెండేసి మూడేసి సంతా నాలు కలిగి తురకాడితోనో, దూదేకులాడితోనో లేచిపోవడానికి సిద్ధంగా వున్న దండముండల్ని విడో మా'రియేజి చేసుకుంటే హెల్! పూటకూ ళ్ళమ్మలాంటి ముండని పెళ్ళాడ్డం విడోనూ'రియేజి అనిపించుకోదు. ఆది దొంగముండా మా'రిఏజి. ఇదేవిఁటయ్యా. ఇది, మా బుచ్చమ్మ? సాక్షాత్తూ పరమపవిత్రమైన విడో విత్ గిల్ట్ లెటర్స్. అయితే మ.రా.రా. శ్రీ యన్.

గిరీశంగారు విడో మా'రియేజి చేసుకోవడమేనా? టు మా 'రీ యె విడో, ఆర్. నాట్ టు మా'రియేజ్ ది క్వొశ్చన్! `షేక్స్పియర్ పడ్డ అవస్థలోపడ్డా “తొందరపడి హాణీ సాహేబు తురకల్లో కలిసిపోయినా ' డన్నట్లు నా వంటి బుద్ధిమంతుడు ఏ పనీ చెయ్యకూడదు. దాని లాభ నష్టాలు బేరీజువేసి, జమా ఖర్చు చేసుకుని మరీ డిసైడ్ చెయ్యాలి. లెటస్ నీ. యింప్రిమిస్. ఒకటో పద్దు డెబిట్ (నష్టం), విడో మా'రియేజ్ చేసు కుంటే మా వాళ్ళు అక్కర చెయ్యరు అందుకు క్రెడిట్ (లాభం) – వాళ్ళి ప్పుడు చేస్తున్న అక్కరేఁ వుంది? గనుక బా'లెక్స్కి (గాక బాకీ)-నిల్, బండి సున్నా! రెండో పద్దు డెబిట్ (ఖర్చు) లోకం నన్ను బహిష్కారం చేస్తారు. అందుకు క్రెడిట్ (జమ) లోకంలో కల్లా విలువైన వస్తువును నేను అంకించుకుని, పసలేని ఆ లోకానికే నేను బహిష్కారం వేస్తాను.

గనుక క్రెడిట్ బా'లెన్సు (నిలవ) ఏవిఁటయా? నెగిటివ్ యడ్వాంటేజి, హా'వింగ్ నథింగ్ టుడూ వితేప్రాపర్ వరల్డు, పోజిటివ్ యడ్వాంటేజి, ప్రొజెసింగ్ ఆలిట్స్ వెల్తు, మూడో పద్దు డెబిట్ (నష్టం) “వీడి పెళ్ళాం వెదవముండ" అంటారు - నోటా బీని పద్దు నిజంగా డెబిటే. డిపార్టుమెంటు వార్నడిగి ఈ సంశయం తీర్చుకోవాలి. అందాకా మ.రా. రా. శ్రీ గిరీశంగారి అభిప్రాయం ఏమంటే విడో అనేది ఏవిఁటి! ఏ నేమ్! ఓ పేరు. ఆ పేరు మనిషి మొహమ్మీద రాసుందా? మనిషిని ముస్తాబు చేసి యదట నిలబెడితే యిది పునిస్త్రీ, యిది విడో అని చెప్పగలిగిన పెద్ద మనిషి యవడు? ఒహడూలేడు. గనక విదో అనే వస్తువు యక్కడుం దయ్యా? వెక్కిరించే వెధవల నోళ్ళలో ఉంది.

దీనికి క్రెడిట్ (లాభం) ఏమనగా-విడో పెళ్ళాడిందంటే ఆశుభం, వోగాయిత్యం అని ఆడెవడూ కన్నెయడు:యిక డెబిట్లేనిశుద్ధ క్రెడిట్, నంబర్ ఫోర్, “చుక్కలవలె, కర్పూరపు ముక్కలవలె దుకీర్తిముల్లోకములన్ క్రిక్కిరిసి పిక్కటిల్లెను” అన్నట్లు గిరీశంగారికి కీర్తి మిన్ను మిట్టుతుంది. గిరీశంగారి విధవా వివాహ మహోత్సవం కథ న్యూస్ పాపర్లలో పెద్దక్షరాల్తో పడుతుంది. క్రెడిట్ నంబరు వైవ్. విడో మారిఏజి యసోని వీషన్ వారు ఒక తృణం యిస్తారు. బుచ్చమ్మ క్కూడా కొంచెం డబ్బుంది. డెబిట్ దావా తెస్తేగాని అవధాన్లు మావఁగారు దాన్లో దమ్మిడీ యివ్వడు.

ప్రొజెండ్ కాన్సన్నీ విచారించగా అవశ్యం విడో మా'రియేజి చేసు కుని తీరవలసిందే. అయితే సాధనవేఁవిటి? ఏదైనా యాసెన్ బ్రిడ్జికట్టివొడ్డు చేరాలి. (పైకి ముఖం యెత్తి ఆలోచించి) వెంకమ్మ, మొగుడితో దెబ్బ లాడి నూతిలో పడ్డప్పుడు నేను సాహసించి వురికి పైకి తీసిందగ్గర్నుంచీ పూరంతా నేను సాక్షాత్తూ సత్యహరిశ్చంద్రుణ్ణిగా భావిస్తున్నారు. ఆడు గడుక్కి బుద్ధి దాట్లేస్తూంటుంది కాని, నే నంతవాణ్ణి కానాయేవిఁటి? స్నేహ కిచ్చేస్తారే గిరీశంగారూ! సాధారణులా? గనుక బుచ్చమ్మని మనం లావు చనుంచేసినా సుతిమించేవరకూ యవరూ తప్పు బట్టబోరు. రాత్రిళ్ళు అరబ్బీనైట్లు, కాశీ మజిలీలు, మదనకామరాజుకథలూ చెబుతూ వుంటే యంతో సర్దాగా పక్కని కూచుని వింటుంది.

లవ్ స్టోరీస్ బుర్రకెక్కించాను. కొంత గ్రౌండ్ ప్రిపేరయింది గనుక, యిహ విడో మారియేజి మంచిదని బోధపరుద్దాం. పాచిక పారినట్టయినా, రామవరం చలో, విడో మా'రియేజి కరో! లెట్ మీ బిగిన్ ది కాం'పైన్ ఎట్ వన్స్ (తలుపు కన్నములోనుంచి తొంగి చూచి) నడవలో కూర్చుని విస్తళ్ళు కుడుతున్నది. మొట్టమొదట కొంచెం మ్యూజిక్ విసురుదాము. ('ఎటు లోర్తునో చెలియా' అను జావళీ కూనురాగముతోపాడి) బుచ్చమ్మ వదిన గారూ, తలుపు తీయండి [బుచ్చమ్మ తలుపు తీయును] వదినా....వెల్! వెంక టేశం` ఏమి చేస్తున్నాడు?

బుచ్చ: - పెరట్లో గొట్టికాయలాడుతున్నాడు.

గిరీ:- ఈ వూరు వస్తే మరి చదువు చెడిపోతుంది. పట్నంలో వున్నప్పుడు డస్కు దగ్గరనుంచి కదిపితేవొ ప్పేవాడనుకాను.... ఒకఘాటు పి.... పిలుస్తారా, పాఠం చెబుతాను,

గిరీ:- ఆహా! దీని తస్సాగొయ్యా, మొహం యదటికి వచ్చేటప్ప కొంచెం బ్లింగ్ పట్టుకుంటుంది. వకటి అనవలెనని మరివకటి అనేస్తూవుంటాను. మరెవళ్ళూ లేరు. వంటరిగా దొరికిందిగదా యిలాం టప్పుడు నా మనస్సులో మాట చెప్పేస్తే తీరిపోవునా! ఆ కోతి వెధవని తీసుకురమ్మనమని చెప్పాను. కానీ పాఠాలలో లెక్చరు వేతాము. [వెంక దేశ్వరులు, బుచ్చమ్మ ప్రవేశింతురు. ఏమివాయి, మైడియర్ బ్రదరిన్లా వెంకటేశం, పాఠాలు చదవడం శుభ్రంగా మానివేశావు? ఇక్కడ మరి మాసం రోజులు వుం వచ్చింది కూడా మరిచిపోతావు. యేదీ టెక్స్టు బుక్కు పట్టుకురా (వెంకటేశము పుస్తకము పట్టుకొని వచ్చును.) గాడ్స్ వర్క్స్ అనే పాఠం తియ్యి. రీడ్ ఆన్ మై గుడ్జ్బోయ్!

వెంక:- [తడుముకుంటూ] దేర్ యిన్నాట్ ఏన్ అబ్జక్ట్ ఇన్ క్రియేషన్ పుచ్ డజ్ నాట్ సర్వ్ సమ్ యూసఫుల్ పర్ పజ్.

గిరీ:- అద్దె! అట్టె! అక్కడ నిలువు క్రియేషన్ అనగా ఏమిటి?

వెంకః– క్రియేషన్ అనగా.... అనగా.... ఆవులు.

గిరీ:- నాన్సెన్స్, చదవేస్తే వున్నమతి కూడా పోతున్నది. ఆవులు యెదుట వున్నాయనా ఆవులంటున్నావు. మళ్ళీ ఆలోచించి చెప్పు.

వెంక:- యే మాటకి అర్థం అడిగారండి?

గిరీ:- క్రియేషన్.

వెంక:- అదా! క్రియేషన్ అంటే ప్రపంచం. నేను యెదట | ఆవులు కనబడితే యీ ఆవు పెరుగు నెలరోజులే కదా తినడవఁని ఆలో చిస్తున్నాను.

గిరీ- వన్ థింగ్ ఎట్ ఏ టెమ్, యిప్పుడు పాఠం మాట ఆలో చించు. క్రియేషను అనే వక్కమాట పైనే వక్క ఘంట లెక్చరు యివ్వ వచ్చును. ప్రపంచం యెలాగున్నది? కపిద్ధాకార భూగోళా అని మను ధర్మశాస్త్రంలో చెప్పినాడు. కపిద్దమంటే ఏమిటి?

వెంక: నారింజపండు.

గిరీ: వెరీగుడ్. అందుకు అమర నిఘంటువులో పద్యం నీకు వచ్చునా?

వెంక రాదు, చెప్పండి రాసుకుంటాను.

- బదరీ ఫలములు. యింతలు మారేడుపళ్ళు యీడుకు జోడై, బంతులు తామర మొగ్గలు, దంతీకుచకుంభములుబోలు తరుణీ కుచముల్. ప్రపంచంలో ఏమి వస్తువులుంటవి?

వెంక: ఆవులు.

గిరీ:- డా'మ్ నాన్సెన్స్. యెంత సేపూ ఆవులేనా? బాగా ఆలోచించి చెప్పు.

వెంక:- గేదెలు.

గిరీ:- దట్ విల్ నాట్ డు. మళ్ళీ ఆలోచించి చెప్పు.

వెంక అయితే నాకు తెలియదు.

గిరీ:- విడోస్. ఇంత చిన్న ప్రశ్నకు నీకు జవాబు తెలియదు. ప్రపంచమందుండే వస్తువులన్నిటిలోకి ముఖ్యమైనవి విధవలు. దాని విషయమై పెద్ద లెక్చరు ఇవ్వవచ్చును. మనదేశములో ఒక దురాచారము వున్నది. మొగవాడికి పెళ్ళాము చచ్చిపోతే తిరిగి పెళ్ళాడతాడు. ఆడదానికి మొగుడు చచ్చిపోతే, యంత యవ్వనంలో వున్నా, యంత సొగసుగా వున్నా, మరి వకడికి పెళ్ళా'డ వల్లలేదు. ఇది అన్నాయవంటావా, కాదంటావా?

వెంక:- తప్పకుండా అన్యాయమే.

బుచ్ఛ:- యేవండి గిరీశంగారూ, వెధవలు పెళ్ళాడడం పాపం.

గిరీ:- ఆహా! మీ సత్యకాలం చూస్తే నాకు విచారంగా వున్నది. వెధవలు పెండ్లా'డవలసినదని పరాశరస్మృతిలో స్పష్టంగా వున్నది. వేదంలో కూడా వున్నది. రాజమహేంద్రవరంలో యిదంతా పండితులు సిద్ధాంతం చేసినారు. పూర్వకాలంలో వెధవలు పెండ్లాడేవారు. వెంకటేశం నలచరిత్రలో దమయంతి రెండో పెండ్లి సాటించిన పద్యం చదు.

వెంక నాకు రాదు.

గిరీ: ఇంత ముఖ్యమైన పద్యం రాకపోవడం ఎంత తప్పూ! నోటుబుక్కు తీసిరాసుకో “దమయంతి రెండో పెళ్ళికి ధర నుండే రాజు లెల దడదడ వచ్చిరీ", చూశావా! లోకంలో ఉండే రాజులంతా విధవని పెళ్ళాడడానికి వచ్చారట. (బుచ్చమ్మవైపు జూచి) చూశారా? శాస్త్రాలన్నీ వొప్పుకోవడమే కాకుండా మీది మిక్కిలి విధవలు పెళ్ళా'డకుండా వుండిపోతే దోషమని కూడా చెప్పుతూ ఉన్నాయి. ఇందు విషయమై శంకరాచార్యులవారు పత్రిక కూడా యిచ్చి వున్నారు.

బుచ్చః - అయితే మన వాళ్ళంతా విధవల్ని పెళ్ళి చేసుకోకూడ దంటారే?

గిరీ:- అదంతా ఇంట్లో చాకిరీ చేయించుకోవడము కోసరము గాని మరేమీ కాదు. ఝామురాత్రి ఉందనగా లేచి మరునాడు రెండు ఝాముల దాకా యెద్దులాగా పనిచేయిస్తారుకదా! ఒక పూటకంటే ఎక్కువ భోజనం చెయ్యనివ్వరుగదా! అప్సరసలాగున ఎంత సొగసుగావున్నా మంచి గుడ్డ కట్టుకోనివ్వరు. సరుకు పెట్టుకోనివ్వరు. తుమ్మెద పంక్తుల్లా వుండేజుత్తు తీనేస్తారుకదా? ఫర్ ఎగ్జాంపిల్, మీ అక్కయ్యకు ఆ చంద్రబింబము వంటి ముఖము పైని ఒక కుంకుమబొట్టుంటే త్రినేత్రుడికైనా చూడడానికి ఆలవి వుండునా? ! యీ అవస్థ చూస్తే నా హృదయం కరిగి పోతున్నది. ఆల్ రైట్ ! ప్రపంచంలో ఇంకా యేమి వస్తువులున్నవి?

వెంక: చేగోడీలు.

గిరీ:- డా'మ్ నాన్సెన్స్! ఎంత సేపూ తిండి విషయమయ్యే అలో చిస్తావు, బా'చిలర్స్—బ్రహ్మచారులు కూడా వున్నారు. వాండ్లు చెయ్య వలసిన పని ఏమిటి?

వెంక: వేదం చదువుకోవడం; పెయ్యలకి గడ్డి తా'వడం,

గిరీ:- నాన్సెన్స్—ఆది మీ తండ్రి దగ్గిర చదువుకునే విద్యార్థుల మాట. బ్రహ్మచారి యొక్క రియల్ డ్యూటీ అంటే విధింపబడిన పని ఏమనగా, విధవలను పెండ్లాడడమే. ఇంకా క్రియేషన్లో ఏమున్నది? వెంక నాకు తెలియదు.

గిరి: రామవరంలో విధవా వివాహం చేసుకున్న వాళ్ళకల్లా నెల వక్కంటికి నూరురూపాయలు ఇచ్చి పోషించడమునకు విడోమా 'రేజి సభ వకటివున్నది. ఇదివరకు అయిదువేలమంది విధవలకు వివాహములు అయి పునిస్త్రీలు అయిపోయినారు. ఆల్ రైట్! క్రియేషన్ అనే మాట- అయినది. ఆ సెంటెన్సు అంతకూ అర్ధం చెప్పు.

వెంక: మీ రొకమాటు చెప్పిన తరువాత నే చెబుతాను.

గిరీ:- ఆల్ రైట్ ! ప్రపంచంలో దేవుడు ప్రతివస్తువునూ ఏదో ఒక ఉపయోగము కొరకు చేసియున్నాడు. చేగోడీ యెందుకు చేసినాడూ?

వెంక: తినడముకు.

గిరీ:- దట్ ఈజ్ రైట్! ఆవుల నెందుకు చేశాడు?

వెంక:- పాలు యివ్వడమునకు.

గిరీ:- పెర్ ఫెక్టలీ రైట్! ఆడవాళ్ళ నెందుకు చేశాడు?

వెంక: వంట చెయ్యడానికి.

గిరీ:- నాన్సెన్స్! పెండ్లాడడమునకూ, పిల్లలు కనడముకున్నూ, గనుక పెండ్లా'డకుండా వున్న విధవ పిల్లలు దేవుని ఆజ్ఞను అతిక్రమిం చిన పాపమును చేస్తున్నారు.

[అగ్నిహోత్రావధానులు ప్రవేశించును]

 

అగ్ని:- ఏమండీ గిరీశంగారూ. మా కుర్రాడికి చదువు చెప్పు -తున్నారూ?

గిరీ:- ఘంట నేపాయి చెబుతున్నానండి.

అగ్ని:-యేదీ, నే కూడా వించాను. కొద్దిగా చెప్పండి.

గిరీ:- మైడియర్ బోయ్, గాడ్ మేడ్ క్రియేషన్. సృష్టి ఎవడు చేసినాడు?

వెంక దేవుడు.

గిరీ:- ఫాదర్ ఈజ్ నెక్ టు గాడ్. దేవుని తరువాత ముఖ్యం.

యెవరు? నే దర్.

వెంక:- తండ్రి.

అగ్ని:- మొత్తంమీద మీ ఇంగ్లీషు చదువు మంచిదిలాగానే కన బడుతూన్నది. భాష భేదంగాని మనముక్కలే వాళ్ళవిన్నీ..

గిరీ:- వెంక టేశం! దేవుడు సృజించిన ప్రపంచంలో ఏమి వస్తువులున్నవి? సే కోర్ట్స్,

వెంక:- గొప్పవారంటే అలా యిలాగా అనుకున్నావా యేవిఁటి? సురేంద్రనాథ్ బా'నర్జీ అంత గొప్పవారు.

బుచ్చ :- అతగా డెవరు?

వెంక :- అందరికంటే మరీ గొప్పవాడు.

బుచ్చ :- అయితే గిరీశంగారికి వుద్యోగం కాలేదేమి?

వెంక :- నాన్సెన్స్! నువ్ ఆడదానివి; నీకేం తెలియదు. ఉద్యోగ వఁండే గొప్పనుకుంటున్నావు. ఉద్యోగవఁంటే యేమిటో తెలిసిందా? సర్వెంట్ అన్నమాట.

బుచ్చ :- అనగా యేమిటి?

వెంక:- సర్వెంటనగానా? నౌఖర్ అన్నమాట. మన గేదెని కానే అసిరిగాడు ఒక సర్వెంట్. మన యిల్లు తుడిచే అంకి ఒక సర్వెంట్. వీళ్లు మన నౌఖర్లు. పోలీసూ, మునసబూ తెల్లవాడి నౌకర్లు. జీతం లావురాగానే గొప్పనుకున్నావా యేవిఁటి? సురేంద్రనాథ్ బా'నర్జీ, గిరీశంగారు లాంటి గొప్పవాళ్ళు తెల్లవాడి దగ్గిర కాదు దేవుఁడి దగ్గిరైనా నౌఖరీ చెయ్యమంటే చెయ్యరు. కలక్ట్ రేవంఁటాడో తెలిసిందా? పోలీసు వెళితే “స్టాండ్!” నిలుచో అంటాడు. గిరీశంగారు వొచ్చారంటే షేక్ హాండ్ చేసి "కుర్చీ మీద కూడోండి" అంటాడు. ఆయనకి హైదరాబాదు నవాబు వెయ్యి రూపాయల పని యిస్తామంటే, నీ పనెవడిక్కావాలి పొమ్మన్నాడు.

బ :- ఆయనకి పెళ్ళైందిరా?

వెంక - లేదు. బుచ తమ్ముడూ, విధవలు పెళ్ళాడ్డం మంచిదంటారు గదా. ఆయ నెందుకు పెళ్ళాడారు కార్రా?

వెంక :- నీకు యంత చెప్పినా తెలియదు. (గట్టిగా) ఆయన ఉద్యోగం చెయ్యకపోవడం, పెళ్ళిమానుకోవడం లోకం మరమత్తు చెయ్య డానికట! యిప్పుడు తెలిసిందా?

బుచ్చ :- యలా మరమ్మత్తు చేస్తున్నారా?

వెంక :– నా వంటి కుర్రాళ్ళకి చదువు చెప్పడం. (నిమ్మళంగా) చుట్టనేర్పటం, (గట్టిగా) నాచ్చి కొశ్చన్, అనగా సానివాళ్ళందర్నీ దేశం లోంచి వెళ్ళగొట్టడం ఒహటి. నేషనల్ కాంగ్రెస్, అనగా దివాన్గిరీ చాలా యించడం- ఒహటి. యిప్పుడు తెలిసిందా?

బుచ్చ :- ఉద్యోగం చెయ్యరన్నావే? దివాన్గిరీ యే రాజు దగ్గిరా?

వెంక:- యే రాజు దగ్గిరా?.... ఆడడానివి నీ కెందుకూ ఈ భోగట్టా అంతాను?

బుచ్చ: - నువ్వు కూడా లోకం మరమ్మత్తు చా'స్తావు.? వెంక ఓ!

బుచ్ఛ:- ఐతే వెధవముందని కూడా పెళ్ళాడతావురా?

వెంక:- నాన్న తన్నకుండా వుంటే తప్పకుండా పెళ్ళాడతాను. కాని బోడిగుండు చేస్తేమాత్రం నా కక్టరలేదు.

[గిరీశం ప్రవేశించును]

ఈ చెట్టుకింద నిలబడితే మీరు వనలక్ష్మిలా వదినావున్నారు. (బుచ్చమ్మవైపు తేరి చూచును]

బుచ్చ: - విన్నారా? తమ్ముడు వెధవని పెళ్ళాడతా!

గిరీ:- నా ప్రియశిష్యుడూ, మీకు ప్రియసోదరుడూ అయిన వెంక దేశం విధవావిహవేఁ చేసుకొంటే మేం యావన్మందివిన్నీ బ్రహ్మరథం పట్ట గురువులుగదా. ముందు మీరెందుకు చేసుకోరు?

గిరీ:- అడగవలసినమాట అడిగారు. చెప్తాను వినండి. మీ రడిగిన తరవాత చెప్పకపోవడం తప్పని చెబుతున్నానుగాని, ఈ మాటలు చెప్ప వలసినవి కావు. ఏవంటారా? నా గొప్ప నే చెప్పుకోకూడదుగదా? అదొ హటి. అంతకంటే ప్రమాదమైన మాట మరోటుంది. చూశారా వొదినా - మొదట్నించీ విధవ వివాహం కూడదు, కూడదు, అని తప్పు అభిప్రాయ ములో పడిపోయివున్న అత్తగారూ, మావఁగారూలాంటి పెద్దవాళ్ళకి యెన్ని శాస్త్రాలూ, సవబులూ మనం చెప్పినా వాళ్ళకి నెత్తికెక్కవు. యిలాంటి మాటలు వాళ్ళతో మనం చెప్పినట్టయినా, కర్రుచ్చుకుంటారు, మావఁగారు వేదం మటుకే చదువుకున్నారు గాని నేను శాస్త్రాలు అన్నీ చదువుకున్నాను. అబ్బో, నేను మన శాస్త్రాల్లో పుట్డోలుణ్ణి. శాస్త్రకారుడు యేవఁన్నాడూ? “బాలాదపి సుభాషితం" అన్నాడు. అనగా మంచిమాట చంటిపిల్లాడు చెప్పినా విని ఆ ప్రకారం చెయ్యండయ్యా అన్నాడు. అయితే మన పెద్దవాళ్ళు శాస్త్రంలో చెప్పిన ప్రకారం నడుస్తారూ? యంతమాత్రం నడవరు. మనం శాస్త్రమూ, సవబులూ చూపిస్తే, యావఁంటారూ? యీ గుంట వెధవలు చెప్పడం, మనం విండవూఁనా అని కర్రుచ్చుకుంటారు. నా మాట కేవిఁ చప్పకండి నాది యినుంలాంటి శరీరం.... కొడితే కర్ర విరిగిపోవాలి గాని చెక్కూచ 'దరదు. నా ప్రియశిష్యుడికై తేనో, మీ అందరివీ మెత్తని మృదువై న శరీరాలు అపుటచాత యెవికలు విరిగిపోతాయి. గనుక యీ మాటలు మన్లో మనం అనుకోవలసినదిగాని మరొహళ్ళతో .... ప్రాణం పోయినా.... అనవలసినవి కావు. యావఁంటారు?

బుచ్చ: - అవును.

గిరీ:- అవునంటే చాలదు. యెవరితోనూ యీ మాటలు చెప్పనని మీరంటేనేగాని నా మనసులో మాటలు నాలుగూ యెలా చెప్పడం?

బుచ్చ:- యవరితోనూ చెప్పను.

గిరీ:- వొట్టేసుకోవాలి.

బుచ్చః_ యావఁని వొట్టేసుకునేది?

గిరీ- యావఁనా? మీరు యెవరితోటైనా చెబితే నా బు పోవాలని వొట్టేసుకోండి. పగిలి

బుచ్చ:- అహఁ. అలా వొట్టేసుకోను. మీ బుర్ర చల్లగా వుండాలి. చెబితే నా బుర్ర పగిలిపోవాలని వొట్టేసుకున్నాను.

గిరి;- అందుకు నేను వొప్పుతానా యేవిఁటీ? నా తరవాత మీ బుర్రజోలికి ఎవడైనా రావాలిగాని, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వెయ్యనా? నా బుర్ర పగిలి

బుచ్చ: - మా అమ్మని బతికించారు కారా? మీరు అలాంటి వారే. గిరిః- ఆ నూట మీరే అన్నారు గనుక, వినండి - చెప్తాను.. నేను పెళ్లాడి పెళ్ళాం బిడ్డలు నాకుంటే, వాళ్ళని తల్చుకున్న తరువాత ప్రాణా నికి తెగించి మీ అమ్మని తియ్యడానికి నూతిలోకి గెంతగలిగి వుందునా? ఈజన్మవఁంతాలో కోపకారం కింద వినియోగపర్చుకుందావఁనినిశ్చయించు కుని యిదివరదాకా ఏకాకినై వుందిని సత్యమే. మీలాంటి నా మేలు కోరిన వాళ్ళు “పెళ్ళి చేసుకో" అంటే ఆ మాట తో నేయడం కష్టమే; గాని ఒక మాటకి మాత్రం జవాబు న్యాయంగా చెప్పండి. ఒక్కళ్ళకి ఉప కారం చేయడం గొప్పా అందరికి ఉపకారం చేయడం గొప్పా?

బుచ్ఛ:- అందరికీ చెయ్యడవేఁ గొప్పనుకుంటాను.

గిరీ:- సరే! ఆ మాట మీద నిలవండి పెళ్ళా' ఆలుబిడ్డలకి, ముచ్చకాయ ముగ్గురికి ఉపకారం చేయడం కంటే లోకోపకారం కింద యీ ప్రాణం వినియోగపర్చడం పుణ్యం కాదా? చచ్చేకాలానికి స్వర్గం యెదురు గుండా వొస్తుందే?

బుచ్చ: - లోకానికి యేం ఉపకారం చాస్తారు?

గిరీ:- అలా అడగండి. సోషల్ రిఫారమ్ . సోషల్ రిఫారమ్ అంటే సంఘ సంస్కారం. అసలు ఇంగ్లీషు మాట తుందో మీకు, దాని తర్జుమాూ కూడా అంతే అర్థం అవుతుంది. చెప్పాలంటే ఒక సిమిలీ, అనగా ఉపమానం చెప్పి మీకు బోధపరు స్తాను. లోకం తప్పు తోవలో వెళ్ళుతూంటే మంచి తోవలో పెట్టడమనేది సోషల్ రిఫారమ్. ఆ తోవలోంచి మళ్ళించి

బుచ్చ: - యేమిటా తప్పుదోవ?

గిరి: జారూ, బురదా, గట్లూ, గతుకులూ వున్నతోవ యలా వుంటుందో యిప్పుడు మనవాళ్ళ ఆచారాలు అలా వున్నాయి. ఆ తోవ లోంచి బండి తప్పించి, మంచి దిమ్మి సాకొట్టిన హైరోడ్డులోకి మళ్ళించాలి.

కన్యా - (7)

బుచ్చ: - మా అమ్మని బతికించారు కారా? మీరు అలాంటి వారే. గిరిః- ఆ నూట మీరే అన్నారు గనుక, వినండి - చెప్తాను.. నేను పెళ్లాడి పెళ్ళాం బిడ్డలు నాకుంటే, వాళ్ళని తల్చుకున్న తరువాత ప్రాణా నికి తెగించి మీ అమ్మని తియ్యడానికి నూతిలోకి గెంతగలిగి వుందునా? ఈజన్మవఁంతాలో కోపకారం కింద వినియోగపర్చుకుందావఁనినిశ్చయించు కుని యిదివరదాకా ఏకాకినై వుందిని సత్యమే. మీలాంటి నా మేలు కోరిన వాళ్ళు “పెళ్ళి చేసుకో" అంటే ఆ మాట తో నేయడం కష్టమే; గాని ఒక మాటకి మాత్రం జవాబు న్యాయంగా చెప్పండి. ఒక్కళ్ళకి ఉప కారం చేయడం గొప్పా అందరికి ఉపకారం చేయడం గొప్పా?

బుచ్ఛ:- అందరికీ చెయ్యడవేఁ గొప్పనుకుంటాను.

గిరీ:- సరే! ఆ మాట మీద నిలవండి పెళ్ళా' ఆలుబిడ్డలకి, ముచ్చకాయ ముగ్గురికి ఉపకారం చేయడం కంటే లోకోపకారం కింద యీ ప్రాణం వినియోగపర్చడం పుణ్యం కాదా? చచ్చేకాలానికి స్వర్గం యెదురు గుండా వొస్తుందే?

బుచ్చ: - లోకానికి యేం ఉపకారం చాస్తారు?

గిరీ:- అలా అడగండి. సోషల్ రిఫారమ్ . సోషల్ రిఫారమ్ అంటే సంఘ సంస్కారం. అసలు ఇంగ్లీషు మాట తుందో మీకు, దాని తర్జుమాూ కూడా అంతే అర్థం అవుతుంది. చెప్పాలంటే ఒక సిమిలీ, అనగా ఉపమానం చెప్పి మీకు బోధపరు స్తాను. లోకం తప్పు తోవలో వెళ్ళుతూంటే మంచి తోవలో పెట్టడమనేది సోషల్ రిఫారమ్. ఆ తోవలోంచి మళ్ళించి

బుచ్చ: - యేమిటా తప్పుదోవ?

గిరి: జారూ, బురదా, గట్లూ, గతుకులూ వున్నతోవ యలా వుంటుందో యిప్పుడు మనవాళ్ళ ఆచారాలు అలా వున్నాయి. ఆ తోవ లోంచి బండి తప్పించి, మంచి దిమ్మి సాకొట్టిన హైరోడ్డులోకి మళ్ళించాలి.

కన్యా - (7)

గిరీ:- చంపక్కర్లేదు. “పొమ్మనక్కర్లేదు, పొగబెడితే చాలు"

నన్నట్లు సానివాళ్ళని పెళ్ళిళ్లకి పిలవకపోవడం, వాళ్లని ఉంచుకోక పోవడం, పై చెప్పిన పనులు చేసే వాళ్ళని కనబడ్డచోటల్లా తిట్టడం. యిలా నాలాంటి బుద్ధిమంతులంతా ఒహటై కొంతకాలం చేసేసరికి, కలికంలో కైనా మరిసాంది వుండదు. లేకుంటే చూడండి, మన వెంకటేశం పెళ్ళికి తప్పకుండా సానిమా'ళం తెస్తారు. నే యెరుగుదును, కూడదన్న సనల్లా మావఁగారు చా'స్తారు.

కూడినపని మానేస్తారు. సానిమా'ళ్ళ వడమనేది డబ్బిచ్చి తద్దినం కొనుక్కోవడమన్న మాట కాదా? పెళ్ళి నాటికి నా ప్రియ శిష్యుడికి కొంచెం యీడొస్తుందిగదా! ఆ సానిముండలు యర్రగా, బుర్రగా ఉండడం చూసి, పెళ్ళాంమీద అసహ్యం పుట్టి యీ పనిపిల్ల యదగడవెఁప్పుడు, కాపరానికి రావడమెఁప్పుడు, యీ సానివాళ్ళు మా మజా'గా వున్నారని వాళ్ళని వెంక దేశం పుంచుకుంటే కొంప మునిగిపోతుందిగాని తరువాయి వుండి పోతుందా? యేవఁంటారు?

బుచ్చ:- అవును, నిజవేఁ.

గిరి:- గనుక లోకం బాగుపడేటందుకుగాను వెధవలకి పెళ్ళిచెయ్య డానికి, సానివాళ్ళని సాగనంపడానికి వీరకంకణం కట్టా'ను. మరే వచ్చి మీ తమ్ముళ్ళాంటి వాళ్ళకి అనేకులికి విద్యాబుద్ధులు చెప్పుతున్నాను. గణిత గాణ్ణి ఔటచేత నూతుల్లో, గోతుల్లో పడ్డవాళ్ళని పైకితీస్తాను.

ఇంకా నా'ష నల్ కాంగ్రెస్ ఒహటుందిగాని అందులోనే చేసేపని చాంతాడంత వ్యాఖ్యా నం చేస్తేగాని మీకు బోధపడదు. పరిపరివిధాల లోకోపకారం చేస్తున్నాను.

బుచ్ఛ:- యీ పనులన్నీ పెళ్ళి చేసుకుంటే మాత్రం చెయ్య గూడదా?

గిరీ:- యలా జేయడం? లోకవంటే ఏవిఁటి. గంగుంట అను కున్నారా? యేషియా, యూరప్, ఆఫ్రికా, అమెరికా, ఆష్ట్రలేషియా అని బదు ఖండాలు. అందులో అమెరికాలో మనుష్యులు బుర్ర కిందకీ, కాళ్లు పైకీ పెట్టి నడుస్తారు. ఇక్కడ పగలు గదా యిప్పుడు? అక్కడ రాత్రి.

నార్తుపోల్ అని మరోదేశం వుంది. అక్కడ ఆర్నెల్లు పగలే: అప్పుడు మరి రాత్రుండదు. ఆర్నెల్లు రాత్రే; అప్పుడు మరి పగలుండదు. అక్క డేవిఁటనుకున్నారు? సముద్రం అంతా మంచుకెరడై పోతే లేళ్ళని బళ్ళకి కట్టి సవారిణ వాయువేగ మనోవేగంగా వెళతారు. యిన్ని దేశాలు వెళ్లి అక్కడి వాళ్లకల్లా ఉపకారం చేస్తేగదా లోకోపకారం అవుతుంది? పెళ్లాం బిడ్డలూ వుంటే వాళ్ళను వొదిలి యలా పోవడం? అయితే పెళ్ళా'డమని మీరు చెప్పినమాటకూడా సుతరామూ కొట్టిపారేయకూడదు. లోకానికోసం బతకడం ఉత్తమం. అయితే లోకం అంతా యంత వెలవో అంతకన్న ఎక్కువవిలువై న రత్నంలాంటి ఆడమనిషి దొరికితే తప్పకుండా పెళ్ళా'డ వలసిందే. యీ వూరొచ్చేవరకూ నా కలాంటి దివ్యసుందర విగ్రహం కన పళ్ళేదు. మొహవెఁదట చెప్పకూడదు.

 అలాంటి మనిషి యీ వూళ్ళో కన పడ్డది. అందరాని పండుకు ఆశించడవెఁందుకని మనస్సు మళ్ళించుకోవడా నికి విశ్వప్రయత్నంచేస్తున్నానుగాని మనసులొంగకుండావుంది భగవంతు డేం జేస్తాడో! మనస్సుతో యావంటున్నానంటే “ఓ వెర్రి మనసా! నువ్వు వలచిన చిన్నది ఆణిముత్యవేఁగాని యిన్నాళ్ళూ పెళ్ళి మానేసి యిప్పుడు 'పెళ్లాడదాం, పెళ్లాడదాం అని యెందుకు సందడి పడతావు? 'సంసార సాగరం దుఃఖం, తస్మాజ్జాగ్రత్త జాగ్రత్త' అన్నాడు. సంసారంలో పడిపోతే మళ్ళీ నీకు లోకోపకారం చేయడానికి అవకాశం వుంటుందా' అని మనస్సుకి బోధపరుస్తున్నాను. పెళ్లాడితే లోకోపకారానికి, అవ కాశం యంతమాత్రం వుండదు. చూశారా వదినా! మాట వరసకి, మనం పెళ్లాడతాం అనుకుందాం. సంసారం గడుపుకోడానికి డబ్బు సంపా దించుకోవాలా?యిదివరకల్లా అంటే బ్రహ్మచర్యం ఆచరిస్తున్నాను గనుక 'సత్రాభోజనం.మఠాని'ద్ర సరిపోయింది. మాటవరసకి మిమ్మల్ని పెళ్ళా' డిం తరువాత అలా సరిపోదే! మనంగాని మావగారి మూర్ఖనికి లక్ష్య పెట్టక యవరితోనూ చ'ప్పకుండా రామవరం వెళ్ళిపోయి అక్కడ శాస్త్రాక్తంగా పెళ్ళాడావంటే, ప్రస్తుతం మట్టుకు విడో మా'రియేజి సభవారు మనకి నెలకి సూర్రూపాయలు యిస్తారు. ఓ నాలుగయిదు మాసాలు అలా కాలక్షేపం చేసి హైదరాబాదులోగాని, బరోడాలోగాని ఓ వెయ్యి రూపా యల ఉద్యోగం సులభంగా సంపాదించుకుంటాను. హైదరాబాదు నవాబు నెలరోజుల కిందట పెద్ద ఉద్యోగవిఁస్తానన్నాడు. “నేను ఒకడి దగ్గర నౌఖరీ చేస్తానా? అని విర్రవీగి తోసిపారేశాను. మీరు వివాహము చేసుకో మని సలహా యిస్తారని అప్పుడే యెరిగి వుంటే ఆ ఉద్యోగం మించి పోనియ్యక పోదును.

బుచ్ఛ:- మీరు ఉద్యోగం చెయ్యరన్నాడే, తమ్ముడు?

గిరీ:- అవును. బ్రహ్మచారిగా వుండి లోకోపకారం చేస్తూ వున్నంతకాలం పెళ్ళి చేసుకోనని శపధం పట్టాను. కాని ఇప్పుడు నా అదృష్టం వల్ల లోకం అంతటికన్నా విలువైన వజ్రంలాంటి భార్యా దొరికితే పెళ్ళా"డక తీరుతుందా? లోకం యొక్క విలువ వెండి అను కోండి, లోకం వెండైతే మీలాంటి సువర్ణచ్ఛాయగల కుందనపు బొమ్మ పజ్యండో వన్నెబంగారం, అవునంటారా, కాదంటారా? బంగారం విలువ కం విలువ యెక్కువా? చప్పండి.

బుచ్ఛ:- బంగా ర వేఁయెక్కువ.

గిరీ:- సరే. మీలాంటి బంగారం బొమ్మే లభించినప్పుడు లోకం గీకం అవతలబెట్టి పెళ్ళా"డక తీరదుగదా. మాటవరసకి, మనం పెళ్ళా డతాం అనుకోండి. పెళ్ళా'డిం తరువాత, సంసారం సుఖంగా జరుపుకో వాలంటే లావుగా డబ్బుండాలికదా! ఉద్యోగం చేస్తేగాని డబ్బులావుగా

బుచ్ఛ:- ఆవును.

గిరీ:- అట్టే డబ్బెందుకని అడుగుతారు ఒకవేళ, చెబుతాను వినండి. సంసారానికి ఇల్లన్నది ఒకటుండాలిగదా! యేవఁంటారు?

బుచ్చ: అవును..

గిరీ:- నాకు మేడలుంటేగాని కుదరదు యిలాంటి చిన్న ఇళ్ళలో నాకు ఉక్కిరి బిక్కిరిగా వుంటుంది? మేడచుట్టూ తోట వుండాలి. మామిడిచెట్లూ, అరటిచెట్లూ, జామచెట్లూ, చెప్పలేనన్ని వృక్షాలు వేస్తాం. మన వెంక దేశం కోతిలాగ పళ్ళుతింటూ ఎప్పుడూ ఆ చెట్లమీద వుంటాడు.

వెంక:- ఆ చెట్ల పళ్ళన్నీ నేనే కోస్తాను.

గిరీ:- అంతవాడివి కావనా? మనం అలాగ యిల్లూ, వాకిలీ,తోటా, దొడ్డి యార్పరచుకునేటప్పటికి మనకు చిన్న పిల్లలు పుడతారు.వాళ్ళని సంరక్షణ చెయ్యాలా? వాళ్ళు నేను కుర్చీమీద కుచుని రాసుకుంటూంటే వొచ్చి చెయ్యిబట్టుకు లాగి “నాన్నా, యిది కావాలి, కావా"లంటారు. మీరు బీరపువ్వులాగా వొంటినిండా సరుకులు పెట్టుకుని, చక్కగా పసుపూ, కుంకం పెట్టుకుని సుహాలక్ష్మిలాగా యింట్లోపెత్తనం చేస్తూ వుంటే ఒకపిల్ల యిటువేపు వొచ్చి మెడ కౌగిలించుకొని,ఒక పిల్ల అటువేపు వొచ్చి మెడ కౌగిలించుకౌనీ అమ్మా యిది కావాలి,అమ్మా అది కావా"లని అడుగుతారు. వాళ్ళకి సరుకు, జప్పరా చేయించాలి.

జరీ దుస్తులు కుట్టించాలి. గిరీశం గారి పిల్లల్ని తీసుకురా అది ఒకప్పుడు నవాబుగారి శలవౌతుంది. మన పిల్లల్ని వెంకటేశం లాగకాయగావంచా, తెల్లచొక్కాయితో పంపించడానికి వల్లకాదుగదా? వాళ్ళకి చిన్న బళ్ళూ, గిళ్ళూ కొనాలి. వాళ్ళకి చదువు సంధ్యా చెప్పించి ప్రయోజకుల్ని చెయ్యాలి. ఇదంతా సంసార తాపత్రయం కాదా? యిందులో పడిపోతే మరి లోకోపకారం చేయడానికి అవకాశం వుంఁటుందా? మరచిపోయినాను. అప్పుడు మన వెంకటేశం మనదగ్గిరేవుండి చదువుకుంటాడు.

బుచ్ఛ:-అలా అయితే మరి నాన్నకి ఖర్చుండదు! నాన్న, అమ్మా వాడి చదువుకోసం దెబ్బలాడు.

గిరీ:- నే వొద్దన్నానా?

వెంక:- నాకో చిన్న గుర్రబ్బండి కొనాలి.

గిరీ:- రేపు మనవాడికి గుణుపురం తాసిల్దారీ అడవిలో అయి కమానువెళ్ళుతూండగా, పెద్దపులొస్తే చెట్టెక్కలేక, కాళ్ళు వొణికి చతికిలబడాలని మీ అభిప్రాయఁవా యేవిఁటి?

అగ్ని:- మనవాడికి తాసిల్దారీ అవుతుందండీ?

గిరీ:- యెందుక్కాకూడదు? గుర్రాలెక్కడం, చెట్లెక్కడం మన వాడు నేర్చుకోకపోతే, “నాయనా! నువ్వు కమాన్లకి పనికిరావు. డసుకు దగ్గర కూచుని గుమాస్తాపనిచేసుకో. తాసిల్దారీ, గీసిల్దారీ తల పెట్టకు" అని దొర్లంటారు.

అగ్ని:- అషైతే చిన్న చెట్టెక్కించండిగాని పెద్ద చెట్లప్పుడే యక్క నిక

గిరీ:- అంచాతనే జామిచెట్టు యక్క మన్నాను, చూశారా?

అగ్ని:- ఓరి కోతి వెధవా!

గిరీ:- అదిగో తిడుతున్నారూ? దొర్ల చదువు చదువుకుంటే దొర్ల తరిఖీదు యివ్వక తప్పదు. మీ రిలా తిడితే భయపడి కిందపడతాడు. యిలాంటి పనులు మీ కిష్టం లేకపోతే, యింగిలీషు చదువు మానిపించి వేదం చెప్పండి.

అగ్ని:- మరిచిపోయి తిట్టాను. యీ యీంగిలీషు వాళ్ళ సంగ తంతా అదో వెర్రిమొర్రి.

గిరీ:- మీవంటి ప్రాజ్ఞులు అలా అండం నాకు ఆశ్చర్యంగా వుంది. వాళ్ళ నడవడిక మంచిదవడంచాతనే దేవుడు యింత రాజైశ్వర్యంగా వాళ్ళ కిచ్చాడు. మన శాస్త్రాల్లో మాటలు మనం మరిచిపోయినావుఁ ఆ మాటలే తెల్లవాళ్లు దొంగతనంగా పట్టుకుపోయి, శాస్త్రంచెప్పినట్టల్లా ఆచరించి మన రాజ్యం లాగుకున్నారు. మీరు యెరిగినవారుగదా' చెప్పండి. గురువులు దగ్గిర శిష్యులు యేంచేశేవారు? ఆడవికి వెళ్ళి చెట్టెక్కి సమిధలు తెచ్చే వారు, రండికి, మొండికి ఓర్చేవారు. యిప్పుడు యింత ప్రాజ్ఞులైన మీరే వంటున్నారూ? మావాడు యిల్లు కదిలివెళ్ళితే కందిపోతాడు: మావాడు జావిఁచెట్టెక్కితే కాళ్ళు విరుచుకుఁంటాడు అని భయపడుతున్నారు. మీ శిష్యులు బ్రహ్మాండవై ఁన మర్రిచెట్టుకొసకెక్కి ఆకులు కోసి తెస్తున్నారు. కారా? మన పుస్తకాల్లో మర్మం కనుక్కుని దొర్లుబాగుపడుతున్నారు. మన పుస్తకాలు బూజెక్కించి మనం చెడుతున్నాం.

అగ్ని:- మీకు చాలా తెలుసును. ఈ తెల్లవాళ్ళు చేసే విద్యలన్నీ మన గ్రంధాల్లోంచి యెత్తుకెళ్ళినవే. యీ రెయిళ్ళూ, గియిళ్ళూ యావత్తూ మన వేదంలో ఉన్నాయష. మీది మా పరిశీలనైన బుద్ధి మనకేసు గెలవ దానికి మీరు రాసిన సవబులు మా బాగున్నాయి.

గిరి: యింకా బాగుండును. రికార్డు పూర్తిగా లేదు. కొన్ని కాగితాలు మీరే పారేశారో, మీ వకీలే వుంచేసుకున్నాడో నాకు బోధపడ కుండా వుంది.

అగ్ని:- నేను పారెయ్యలేదండీ! నాకు ఇంగ్లీషు తెలియకపోవడం చాలా చిక్కొచ్చింది.

గిరీ:- మీకే యింగ్లీషువొస్తే భాష్యం అయ్యంగార్ల అయిపోరా?

యీ మడి తడి పేసి వున్న కాగితాలు యావత్తుకూ జాబితా రాస్తాను తమరు వెళ్ళండి.

అగ్ని:- మీరు సంసారం పనిపాట్లు యేం శ్రద్ధగా చేసుకుంటారు! మావాడికి మీలా ప్రయోజకత్వం అబ్బితే నాకొహడి అవసరం ఉండదు. దిగేటప్పుడు నిమ్మళంగా, సాయంచేసి మరీ దింపండేం? కీడెంచి మేలెంచ మన్నారు.

(నిష్క్రమించును)

వెంక:- [నిమ్మళంగా) నాన్న యింట్లో కెళ్ళిపోయినాడు.

గిరీ:- నిమ్మళంగా దిగు.

వెంక:- (పురికి) బతికించారు [వెళ్ళిపోబోవును]

గిరీ:- ఆగు ఆగు. ఆ వొళ్ళో పళ్ళిలా పట్రా.

వెంక:- దొబ్బుతారా యేవిఁటి అన్నీని? అన్యాయం.

గిరీ:- "ఆన్యాయం పాప నాశనం" అన్నారు. ఒక్క అన్యా యంతో పాపాలన్నీ పోతాయి? అన్ని పళ్ళూ నుపు మాత్రం తింటావా యేమిటి? తింటే స్టమకేక్, కడుపునొప్పొస్తుంది. కడుపునొప్పొస్తే మీ- అమ్మ నోరు పగల్దీసి సోలడు అవఁదం వసగుండా గొంతులో పోస్తుంది. వెంక నావఁదం తాగను.

గిరీ:- అలా అయితే పళ్ళట్టే తినకు. [యాతాం వొదిలి దేశం వొళ్ళోని కాయలు యెంచుచుండును.]

వెంక:- (యేడుపు మొహంతో పెద్దపళ్ళన్నీ దొబ్బుతారాయేవిఁటి?` గిరీ:- పెద్దవాళ్ళకి పెద్ద పళ్లూ, చిన్న వాళ్లకి చిన్న పళ్లూ. ఇంత

సేపు చెట్టెక్కి చిలకలా కొరికావు చాల్దా? (నాలుగు పెద్దపళ్ళు తీసుకొని వెంకటేశం వీపుతట్టి) మైడియర్ బ్రదరినా! యిహ నీ యిష్టవొచ్చినట్టు చెట్లూ, చా'వలూ యెక్కు. ఇంగిలీషువాడు నేచర్ స్టడీ చెయ్యమన్నాడు. జామ చెట్టెక్కినప్పుడుమాత్రం పండూ, పరువుకాయ, పచ్చికాయా-వీట్ల భేదం బాగా స్టడీచేసి, పళ్ళేకొయ్యి. అందులో నాలుగు గురుదక్షిణ కింద నాకియ్యి. లేకుంటే కడుపుబ్బుతుంది. నువ్వొహమాటు చెట్టెక్కిం తరవాత వలేసి చూసినా మరి పరువుకాయ కనబడదు. “యేరకు మీ కసుగాయలు” అన్నాడు, రనెవే! (వెంక టేశం దాటువేసి పారిపోవును) పాచిక పారేటట్టే కనపడుతూంది. ఆహా! యేమి సొగసు?

కం. నదమా పొక్కిలి, జాంబూ నదమా మైచాయ, కోకనదమా పదమా పదమా జడ, నడుము వియత్ పదమా, నూగారు గూఢపదమా చెలికిన్ ॥

(నిష్క్రమించును)
 

1
వ్యాసాలు
కన్యాశుల్కం
0.0
ఈ పుస్తకం గురజాడ అప్పారావు గారి రచనలలో ప్రముఖ రచన. ఈ పుస్తకం మీకు వినోదాన్ని ఆడించటం తో పాటు చాలా విషయాలను తెలియచేస్తుంది. సగటు స్త్రీ యొక్క సామాజిక పరిస్థితి గురించి మీకు సవివరం గా వివరిస్తుంది. మనుషుల విది విధానాల గురించి మీకు క్షుణ్ణం గా వివరిస్తుంది. చాలా విషయాలు మనుషుల గురించి ఈ పుస్తకం చదవడం ద్వారా మీరు తెలుసుకుంటారు.

ఒక పుస్తకం చదవండి