1-వ స్థలము : కృష్ణారాయపురం అగ్రహారములో అగ్నిహోత్రావధాన్లు ఇల్లు
(అగ్నిహోత్రావధాన్లు జంఝాలు వడుకుచుండును. కరటక శాస్త్రుల్లు . శిష్యుడిచేత లేని పేలు నొక్కించుకొనుచుండును. వెంకమ్మ కూర తరుగుచుండును.)
వెంక:- నిన్నట్నించి క్యిమీశలవులని కుర్రవాడు వుత్తరం రాశాడు. యెన్నాళ్ళో అయింది వాణ్ని చూసి, కాయలు కాసిపోయినాయి. గడియో, గడియో రావాలి.
అగ్ని:- ఎందుకు వొట్టినే వగచడం? వొద్దు వొద్దుంటూంటే యీ యింగిలీషు చదువులో పెట్టావ్. మెరకపొలం సిస్తంతా వాడి కిందయిపోతూంది. కిందటియేడు పరీక్ష ఫెయిలయినాడుగదా? యీ ఏడు ఎలా తగలేశాడో తెలియదు. మన కి యింగిలీషు చదువు అచ్చిరాదని చెబితే విన్నావుకావు. మా పెద్దన్న దిబ్బావధాన్లు కొడుకుని ఇంగిలీషు చదువుకు పార్వతీపురం పంపించేసరికి వూష్టంవచ్చి మూడ్రోజుల్లో కొట్టేసింది. బుచ్చబ్బి కొడుక్కి యింగిలీషు చెప్పిద్దావఁనుకుంటూండ గానే చచ్చినంత ఖాయలా చేసింది.
వెంక:- మీరెప్పుడూ ఇలాంటి వోఘాయిత్తం మాటలే అంటూ వుంచారు: డబ్బు ఖర్చయిపోతుందని మీకు బెంగ. మొన్న మొన్న మన కళ్ళెదుట మన వాకట్లో జుట్టు విరబోసుకు గొట్టికాయలాడిన నేమానివారి కుర్రాడికి మునసబీ బందికాదూ?
అగ్ని:- మన వెధవాయికి చదువొచ్చేదేం కనబడదుగాని పుస్తకాల కిందా, జీతం కిందా ఇహ నాలుగేళ్ళయేసరికి మనభూమి కడతేరిపోతుంది. ఆ పైన చిప్పాదొప్పా పట్టుకు బయల్దేరాలి. నిమ్మళంగా ఇంటి దగ్గరుంటే ఈ పాటికి నాలుగష్టావు చెప్పేద్దును వొద్దంటూంటే యీ వెధవింగిలీషు చదువులో పెట్టావు.
వెంక:- మనవాడికో మునసబీ ఐనా, పోలీసుపనైనా ఐతే రుణా లిచ్చి యీ అర్హురారం భూవుఁలన్నీ కొనేస్తాడు. యాడాదికో నూరుపా యలు కర్చు పెట్టడానికింత ముందూ, వెనకా చూస్తున్నారు. మీలాగేవాడు. జంఝాలు వొడుక్కుంటూ బతకాలని వుందాయేవిటి? మీకంత భారవ్యం తోస్తే మా వాళ్ళు నాకు పసుపూ కుంకానికి ఇచ్చిన భూవఁమ్మేళి కుర్రాడికి చదువు చెప్పిస్తాను.
కరః- నీ భూవెఁందు కమ్మాలమ్మా?మున సొమ్ము చడ తిని కొవ్వు న్నాడు. అతడే పెట్టుకుంటాడు.
అగ్ని:- ఐతే నన్ను ఆక్షేపణ చేస్తావ షే? యీ మారంటే నీ అన్న వున్నాడని వూరుకునేది లేదు.
(గిరీశం, వెంకటేశం ప్రవేశింతురు)
వెంక:- మాబా బ్బాబాబు వచ్చావషోయ్ ! [వెంకటేశమును కౌగ లించుకొనును]
అగ్ని:- వెధవాయా, యీ మారైనా పాసయినావా? [వెంకటేశం తెల్లబోయి చూచును)
గిరీ:- పా“సయినాడండి, ఫస్టుగా పాసయినాడు. శ్రమపడి చదువు చెప్పా' "నండి. నేను చాలా
అగ్ని:- ఈ తురకెవడోయ్?
గిరీ: టర్క్ డామిట్, టెల్ మా”న్.
అగ్ని:-మానా? మానులా వుంచా నంచావూ? గూబ్బగలకొడతాను.
వెంకటే: - [వణుకుతూ తల్లివేపు చూచి] అమ్మా, యీయే నాకు చదువు చెప్పే మేష్టరు.
కర:- ఇంటికి పెద్దమనిషొస్తే అపృచ్చపు మాటలాడతావేవిఁటి
బావా? ఆయనేదో కుఱ్ఱవాడితో యింగిలీషు మాటంటే పుచ్చకాయల దొంగంటే బుజాలడువుఁకున్నట్టు నీ మీద పెట్టుకుంటావేం?
[బండివాడు సామాను దించును]
గిరీ:- [కరటక శాస్త్రితో] తమ బావగారా అగ్నిహోత్రావధాన్లు గారు? నన్ను తమరు యరక్కపోవచ్చుగాని డిప్టీకలక్టర్ గారింటికి తమరు వచ్చేటప్పుడు నేను వారి పిల్లలకి చదువు చెబుతూ వుండేవాణ్ని. డిప్టీ కలక్టరుగారు తమర్ని యే మ్మెచ్చుకునే వారనుకున్నారు!
కర:- అవును, మీ మొఖం చూచిన జ్ఞాపకం వుంది. డిష్టీకలక్టరు గారు మహదొడ్డ ప్రభువ్.
గిరీ:- మీలాంటి చప్పన్న భాషలూ వచ్చిన మనిషి యక్కడా లేడని, సంస్కృతం మంచినీళ్ళ ప్రవాహంలా తమరు మాట్లాడతారనీ, తమలాంటి విదూషకుణ్ని యక్కడా చూళ్ళేదనీ, డిష్టికలక్టరుగారు శల విస్తూండేవారు. కవితారసం ఆయన్ల గ్రహించేవారేరీ? నా కవిత్వవఁంటే ఆయ్న చెవి కోసుకుంటారు. చేయించారండి. మహారాజా వారి దర్శనం కూడా నాకు
అగ్ని:- [థుమధుమలాడుతూ] ఈ శషభిషలు నాకేం పనికిరావు. ఇతడి వైఖరి చూస్తే ఇక్కడే బస వేసేటట్టు కనబడుతూంది. మా ఇంట్లో భోజనం యంతమాత్రం వీలుపడదు.
వెంకమ్మ:- ఆయన మాటలు గణించకు బాబూ ఆయన మోస్త రది. మీ దయవల్ల మా వాడికో ముక్కబ్బితే మీ మేలు మరిచిపోం.
గిరీ:- అందుకభ్యంతర వేఁవిటమ్మా! మీ వాడు శలవుల్లో చదువు చెప్పమని ఎంతో బతిమాలుకుంటే పోనీ, పనికొచ్చే కుఱ్ఱవాడు కదా అని వొచ్చా”నుగాని పట్టణంలో మునసబుగారింట భోజనం చేదనివొచ్చా”నా, వారిచ్చే డబ్బు చేదని వొచ్చా”నా అమ్మా?
వెంక:- యీ చదువులకోసవఁని పిల్లవాణ్ణి వొదులుకుని ఉండడం, వాడు పరాయివూళ్ళో శ్రమదమాలుపడుతూండం. నా ప్రాణాలు ఎప్పుడూ అక్కణ్ణి వుంఛాయి, డబ్బంటే యెన్నడూ వెనక చూళ్ళేదుగదా. మేం కనడం మట్టుకు కన్నాం. మీరే వాడికి తల్లీ, తండ్రిని. యల్లా కడుపులో పెట్టుకు చదువు చెబుతారో, మీదే భారం.
గిరీ:- తమరు ఇంత దూరం శలవియ్యాలమ్మా? నా మంచిచెడ్డలు - మీ కుర్రవాణ్ణడిగితే తెలుస్తుంది. మునసబుగారూ, డిప్టీ కలక్టరుగారూ యెన్నికచేసిన మనిషిని. నా మాట నే చెప్పుకోవాలా? ఇంతెందుకూ, ఇక మూడేళ్ళు నా తరిఖీదులో వుంచితే క్రిమినల్లో వరుసగా పోలీసు పరీక్ష పాసు చేయిస్తాను.
ఆగ్ని:- మూడేళ్ళే! ఈ సంవత్సరం పుస్తకాల కెంతవుతుందిరా అబ్బీ?
వెంక:- పది హేన్రూపాయలవుతుంది.
అగ్ని:- ఒక్క దమ్మిడీ యివ్వను. వీళ్ళిద్దరూ కూడి ఆ రూపా యలు పంచుకు తినేటట్టు కనబడుతూంది: నేను వేదం యనభై రెండు పన్నాలూ ఒహ దమ్మిడీ పుస్తకాల ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా టోపీ వ్యవహారంలా కనబడుతుంది.
కర:- (నవ్వుతూ) కోట్లకి విలువైన మాట అన్నావు బావా?
గిరీ:- (కరటకశాస్త్రితో) ది నీజ్ బార్బరస్, చూచారండీ, జెంటి ల్మెన్ అనగా పెద్దమనిషిని, యలా అంటున్నారో? నేను యిక యిక్కడ వుండటం భావ్యం కాదు. శలవు పుచ్చుకుంటాను.
వెంక:- చాల్చాలు. బాగానే వుంది; యింటికెవరొచ్చినా నాకిదే భయం. ఆయన మాటలకెక్కడికి బాబూ, వెళ్ళిపోకండి.
కర:- అగ్నిహోత్రావధాన్లూ! కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందూ వెనకా చూస్తున్నావ్! బుచ్చమ్మ నమ్మిన పదిహేనొందల రూపాయ లేంజేశావ్?
గిరీ:- నెల్లింగ్దర్లు! డా'మిట్!
అగ్ని :- ప్ర'తీ గాడిదెకొడుకూ అమ్మా 'వమ్మా' అంచూంచాడు. కూరగాయలషోయ్ అమ్మడానికి? ఆ రూపాయలు పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడు గదా....దాని గతి యావై ఁయ్యుండును?
కరః- చచ్చాడంటే వాడిదా' తప్పు? మంచం మీంచి దించెయ్య. డానికి సిద్ధంగా వున్నవాడి క్కట్టా'వ్!
గిరీ :- తమరేనా నులక అగ్నిహోత్రావధాన్దుగారు? యీ పెట్టెని జటలో తమంతవారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళనుకునే వారు.
అగ్ని:- మీది రాజమహేంద్రంపడి ఆ మాట చెప్పారుకారం రామావధాన్లుగారు బాగున్నారా?
గిరీ:- బాగున్నారండి. ఆయన మా మేనమాఁవగారండి.
అగ్ని:- ఆ మాట చెప్పా'రు కారు.
గిరీ:- మా మావఁ యీ దేశభోగట్టా వొచ్చినప్పుడల్లా తమర్ని యెన్నిక చేస్తూంటారండి.
అగ్ని:- నాకూ, వారికి చాలా స్నేహం. చూశారా కొంచెం నాకు ప్రథమ కోపం, యవరో తెలియకుండా అన్న మాటలు, గణించకండేం.
గిరీ:- దాని కేఁవండి. తమవంటి పెద్దలు అనడం, మాలాంటి కుర్రవాళ్ళు పడడం విధాయక వేఁగదండి?
కర:- (తనలో) యిన్నాళ్ళకి మా అగ్నిహోత్రుడికి తగినవాడు దొరికాడు.
అగ్ని:- చూశారాండీ, మీ పేరేమిటండీ?
గిరి: గిరీశం అంటారండి.
అగ్ని:- చూశారండి గిరీశంగారూ! మా కరటక శాస్తులు వట్టి అవకతవక మనిషి, మంచీ, చెడ్డా ఏమి వాడి మనసు కెక్కదు. అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల ఎంతలాభం కలిగింది! భూవుఁలకి దావా తెచ్చా"వా లేదా? నేను ఈ మధ్య దాఖల్చేయించిన పిటీషను మీద ఆర్డరు చదివి పెట్టండి (గదిలోకి వెళ్ళి కాగితం తెచ్చి గిరీశం చేతికి యిచ్చును)
గిరీ:- (చూసి) ఎవడో తెలివి తక్కువ గుమస్తా వ్రాసినట్లుంది. అక్షరం పోలికే లేదండి.
అగ్ని:- మా వకీలు గడగడ చదివేశాడండి.
గిరీ:- నేను మాత్రం చదవలేకనా! అంతకన్న గళగ్రాహిగాచదువు తాను. లెక్చిర్లి చ్చే పండితుణ్ని, నాకిది పేలపిండికాదూ? అయితే, రాసిన వాడి తెలివికి సంతోషిస్తున్నాను. యిది అరటిపండు విప్పినట్టు తరుమా చేసి దాఖలు చెయ్యమని శలవా?
అగ్ని:- అంతకంటేనా! (తనలో) డబ్బుఖర్చులేకుండా వీడిచాత కాగితముక్కలన్నీ తర్జుమా చేయించేస్తాను.
గిరీ:- యింకా యింగ్లీషు కాగితాలు యేవఁన్నా వుంటే నామీద పార'య్యండి. తర్జుమాచేసి పెడతాను.
అగ్ని:- ఆప్లాగే.
వెంక:- నూ అబ్బాయీ, మీరూ ఒక్క పర్యాయం యింగిలీషు మాట్లాడండి బాబూ!
గిరీ:- అలాగేనమ్మా.
My dear Venkatesam-
Twinkle, Twinkle, little star
How I wonder what you are,
వెంక టే:- There is a white man in the tent
గిరీ:- The boy stood on the burning deck
Where all but he had fled
వెంక టే:- Upon the same base and on the same side of it the sides of a trapezium are equal to one another.
గిరి: Of man's first disobedience and the fruit of | that mango tree, sing Venkatesa, my very good boy.
వెంకటే:- Nouns ending in 'f' or 'fe' change their 'f' or 'fe' into, ves.
అగ్ని:- యీ ఆడుతున్న మాటలకి అర్థం యేవిఁషండి?
గిరీ- యీ శలవుల్లో యే ప్రకారం చదవాలో అదంతా మాట్లాడు
కర:- అబ్బీ వొక తెనుగు పద్యం చదవరా!
వెంకటే:- “పొగచుట్టకు సతిమోవికి”....
కరః- చభాష్!
గిరీ:- డా, మిట్! డోంట్రీడ్ దట్. (మెల్లగా) 'నలదమయంత లిద్దరు' చదువ్.
వెంక టే: - నలదమయంతులిద్దరు మనః ప్రభవానల దహ్యమానులై సలిపిరి దీర్ఘ వాసర నిశల్....
కరః– అట్టే అట్టే. 'మనః ప్రభవానల' వఁంటే యేమిట్రా?
వెంకటే:- (యింటి కప్పువేపు చూసి వూరుకుండును)
గిరీ:– పసిపిల్లలికి అలాంటి కఠినవై (నపద్యానికి అర్థం తెలుస్తుందా అండి?
అగ్ని:- పద్యాలికి అర్థం చెప్పరూ?
గిరీ:- యిప్పటిమటుకు వేదంలాగా భట్టీయం వేయిస్తారు. తెల్లవాళ్ళ స్కూళ్ళలో తెలుగుపద్యాలమీద ఖాతరీ లేదండి. యంత సేపూ జా'గర్భీ 'గీగర్ఫీ, అర్థమెటిక్, ఆల్జీబ్రా, మా 'మా' టిక్స్ యివన్నీ హడలేని చెప్తారండి.
కర:- (తనలో) తర్ఫీదు మా చక్కగా వుంది. వీణ్ని పెందరాళే తోవ పెట్టకపోతే మోసఁవొస్తుంది.
అగ్ని:- అన్నోటి చెప్తారండి?
గిరి:- మరేవఁనుకున్నారు? మీ కుర్రవాళ్ళాగా చదువుకొనేవాడికి ఒక నిముషమైనా తెరిపుండదు.
అగ్ని:- అదుగో, చదువంటే అగే చదువుకోవాలి. గొట్టికాయ లాడకుండా మావాణ్ని ఖాయిదాచేస్తే యంత చదువైనా వొస్తుంది.
గిరీ:- నా దగ్గిర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరావండి. పుస్తకం చాతపడితే వేళ్ళకి పుస్తకం అంటుకుపోవాలి. అలా చదివిస్తానండి.
అగ్ని:- అలాగే చేస్తే మా వాడికి చదువొచ్చి అన్ని పరీక్షలూ పాసవుతాదండి మా వాడికి డబ్బు ఖర్చులేకుండా పెళ్ళయే సాధనం కూడా తటనించిందండి.
వెంక:- మీ నై జం కొద్దీ చిర్రూ కొర్రూ మంచారుగాని మీకు మాత్రం అబ్బిమీద ప్రేవఁలేదా యేవి(షీ? పట్ణంలో గొట్టాలమ్మొచ్చి నప్పుడు యంతో బెంగ పెట్టుకుని అబ్బిని శలవర్జీ రాశి' వెళ్ళిపొమ్మన్నారు. కారా? చదువూ చెప్పించక, పెళ్ళీ చెయ్యక తీరుతుందా యేవి?
కర:- డబ్బుఖర్చు లేకుండా కొడుక్కి పెళ్ళిచేస్తావుపోయి బావా? ఆడపిల్లల్ని అమ్మినట్టే అనుకున్నావా యేఁషి? పది హేనొందలై నాపోస్తేనే గాని అబ్బికి పిల్లనివ్వరు.
డబ్బు ఖర్చు లేకుండా వెంకడికి యలా పెళ్ళి చేస్తానో నువ్వే చూతువుగాని. రామచంద్రపురం ఆగ్రహారంలో లుబ్ధావధాన్లు గార్ని యెరుగుదువా?
కరః- యరగను.
అగ్ని:- ఆయ్న లక్షాధికారి, పద్దెనిమిది వందలికి సుబ్బిని అడ గొచ్చారు. ఉభయ ఖర్చులూ పెడతారష. పెళ్ళి మా వైభవంగా చేస్తా రష. మనం పిల్లని తీసికెళ్ళి వాళ్ళింటే పెళ్ళి చెయ్యడం. మనకి తట్టుబడి వుండదు. ఆ పద్దెనిమిదివొందులూ పెట్టి వెంకడికి పెళ్ళి చేస్తాను. ఆ
అట్టే
వెంక:- పెళ్ళికొడు క్కెన్నేళ్ళు?
అగ్ని:- యెన్నేళ్ళయితేనేఁవి? నలభై య్యయిదు.
గిరీ:- లుబ్ధావధాన్లు మా పెత్తల్లికొడుకండి. తమతో సమ్మంధ వంటే నాకు సంతోషవేఁగానండి ఆయనకి అరవయ్యేళ్లు దాటాయండి. యీడేఁవయినా నెల్లిగ్ గరల్స్, అనగా కన్యాశుల్కం, డామిట్! యంత మాత్రం కూడదండి. నేను పూనాలో వున్నప్పుడు అందు విషయమై ఒహనాడు నాలుగ్గంటలు ఒక్క బిగిని లెక్చరిచ్చానండి. కూర్చుంటే కన్యాశుల్కం కూడని పనని తమ చేతనే వొప్పిస్తాను.
కర:- బావా! ఈ సమ్మంధం చేస్తే నీ కొంపకి ఆగేట్టేస్తాను..
అగ్ని:- వీళ్ళమ్మా శిఖా తరగా. ప్రతి గాడిదకొడుకూ తిండిపోతు ల్లాగా నా యింటజేరి నన్ననేవాళ్ళే, తాంబోలం యిచ్చేస్తాను; ఇహ తన్నుకు చావండి.
వెంక:- నాతో చెప్పకుండానే!
అగ్ని:- ఆడముందలోనా ఆలోచన? యీ సమ్మంధం చెయ్యక పోతే నేను బారిక రావుణ్నే! [లేచి వెళ్లును]
కర:- యేం మార్ధవం!
వెంక:- అన్నయ్యా! ఈ సమ్మంధంచేస్తే నేన్ను య్యో, గొయ్యో చూసుకుంటాను. పెద్దదాన్ని రొమ్ముమీద కుంపట్లాగ భరిస్తూనే ఉన్నాం. ఆయనకి యింత యీడొచ్చినా కష్టం సుఖం వొళ్లు నాటక యీ దౌర్భా గ్యపు సమ్మంధం కల్పించుకొచ్చారు, సమ్మంధము తప్పించు. నే బతికి బాగుండాలంటే ఈ
కర:- గట్టి అసాధ్యం తెచ్చి పెట్టావే. ఒట్టి మూర్ఖప గాడిదకొడుకు యెదురు చెప్పినకొద్దీ మరింత కొర్రెక్కుతాడు. యేంచేయగలుగుదునని నీకు భరువసా చెప్పను? యేమీ పాలుపోకుండా ఉంది.
గిరీ:- అమ్మా! మీరు యెందుకలా విచారిస్తారు? అవుధాన్లుగారు సావకాశంగా వున్నప్పుడు ఒక గంట కూర్చుంటే డబ్బుచ్చుకు ముసలి వాళ్ళకి పెళ్ళి చెయ్యడం దౌర్జన్యఁవని లెక్చరిచ్చి మనసు మళ్ళిస్తాను.
వెంక:- బాబూ! అతడు మీ మేనత్త కొడుకయితే, మీ కాళ్లు పట్టు కుంటాను. మీరు వెళ్ళి ఆయ్న మనస్సు మళ్ళిస్తురూ నా చర్మం చెప్పులు కుట్టిస్తాను.
గిరీ:- అమ్మా యేం చెప్పను! వాడో త్వాష్ట్రం. పిల్ల దొరకడవేఁ చాలు వాడికి యీ సమ్మంధం వొదులుకుంటే వాడికి పెళ్ళే కాదు, వాడని వాడొదిలే ఘటం కాదు.
కర:- అమ్మీ, నేనో ఉపాయం చెబుతాను, యిలారా, కరటకశాస్త్రి శిష్యుడు, వెంకమ్మ నిష్క్రమింతురు]
[ గిరీ:- మైడియర్ షేక్స్పియర్! నీ తండ్రి అగ్గిరావుడోయి. మీ ఇంట్లో యవళ్ళకి అతణ్ణి లొంగదీసే యలో క్వెన్సులేదు. నా దెబ్బ చూడు, యివా కేంజేస్తానో! వీరేశలింగపంతులుగారు కన్యాశుల్కం విష యంపైఁ రాసిన ఉపన్యాసం పైకి తీయ్. మావఁగారికి లెక్చరివ్వడానికి క్కత్తీ కఠారీ నూరాలి.
వెంకటే: - మీ లెక్చరుమాట అలా వుణ్నిండికాని ఇవాళ గండం గడిచింది గదా అని సంతోషిస్తున్నాను. మీ రాకపోతే పరీక్ష ఫేలయి నందుకు మా నాన్న పెయ్యకట్టు తాడుతో చమ్డా లెక్కగొట్టును.
గిరీ:- ఇలాంటి ప్రమాదా అప్పించుకోవడఁవే ప్రజ్ఞ. ఏవయినా డిప్టికల్టీ లొచ్చినప్పుడు ఒక రస్సా వేశావంటే అది బ్రహ్మభేద్యంగా వుండాలి. పొలిటీషనంటే మరేవిఁటనుకున్నావ్? పూజా నమస్కారాల్లేక బూజెక్కునానుకాని మన కంట్రీయే ఇండిపెండెంట్ అయితే గ్లాడ్సస్ లాగ దివాన్ గిరీ చలాయిస్తును. ఏమివాయ్! మీ తండ్రి వైఖరి చూస్తే పుస్తకాలకి సొమ్మిచ్చేటట్టు కనబడదు. చుట్టలు పట్నంనించి అరకట్టే తెచ్చాం గదా ఏమి సాధనం?
వెంక టేః - నాన్నివ్వకపోతే అమ్మనడిగి డబ్బు తెస్తాను.
గిరీ:- నీ బుద్ధి యలా వికసిస్తూందో చూశావా? యిలా తర్ఫీదవు తుంటే నువ్వు కూడా పెద్ద పొలిటీషను వవుతావు.
[బుచ్చమ్మ ప్రవేశించును]
బుచ్చ:- తమ్ముడూ, అమ్మ కాళ్ళు కడుక్కోమంచుందిరా గిరీ:- (తనలో) హౌ బ్యూటిఫుల్! క్వైటనెక్ స్పెక్ట్!
బుచ్ఛ:- అయ్యా, మీరు చల్దివణ్ణం తించారా?
గిరీ:- నాటి నెయిటె స్టల్షషన్. అనగా యంతమాత్రం అభ్యం తరం లేదు. వడ్డించం డిదిగో వస్తున్నాను. తోవలో యేటి దగ్గర సంధ్యా వందనం అదీ చేసుకున్నాను.
[బుచ్చమ్మ వెళ్ళును]
గిరీ:- వాట్! యీమె నీ సిస్టరా! తల చెడ్డట్టు కనబడుతున్నదే?
వెంక టే:- మా అక్కే, జుత్తుకు చవుఁరాసుకోదు.
గిరీ:- తల చెడ్డం అంటే, విడో అన్నమాట. చవుఁరూ గివుఁరూ జాంతేనయ్. కాని యిన్నాళ్ళాయి నీకు విడో మారేజీ విషయవై ఁలెక్చర్ణిస్తూ వుంటే ఈ కథ ఎప్పుడూ చెప్పావు కావు? మీ యింట్లోనే ఓ అన్ఫార్చు నేట్ బ్యూటిఫుల్ యంగ్ విడో వుందటోయ్! ఏమీ దురవస్థ! మై హార్ట్ మెల్. నేనే తండ్రినై తే పిల్లకి విడో మారియేజ్జేసి శాశ్వతమైన కీర్తి సంపాదిస్తును. (తనలో) ఏవిఁచక్కదనం! ఈ సొంపు యక్కడా చూళ్లేదే! పల్లెటూరు వూసుపోదనుకున్నానుగాని పెద్ద కాంపేనుకి అవ కాశం యిక్కడ కూడా దొరకడం నా అదృష్టం!.
వెంకటే: - మా నాన్న నాక్కూడా పెళ్ళి చేస్తాడు.
గిరీ:- ఇవాళో పెద్ద పెళ్ళి నీకు తల వెంట్రుకంత వాసిలో తప్పి పోయింది. ఈ శలవు లాఖర్లోగా తాళాధ్యాయం కాకుండా తప్పించు కుంటే నువ్ పూరా ప్రయోజకుడివే. ఇహ నిజమైన పెళ్ళా? యింత చదువూ చదువుకుని నీ తండ్రి కుదిర్చిన యేవీఁ యరగని చిన్న పిల్లకా పుస్తె కడతావ్? మాంచి యర్రగా బుర్రగా వున్న యంగ్విదోని నువ్ పెళ్ళాడక పోతే, ఐ షడ్బి యషేమ్డాప్యూ!
2-వ స్థలము : దేవాలయం (పువ్వుల తోటలో మండపం మీద కూచుని, శిష్యుడు ప్రవేశించును)
శిష్యు:- ఆర్నెల్లకోమాటు పుస్తకం పట్టుకుంటే కొత్త శ్లోకాలు, పాత శ్లోకాలు, ఒక్కలాగ్కన పడతాయి. ఇప్పుడు కొత్త శ్లోకం కను క్కోమంటేనా శక్యవాఁ? సిద్ధాంతి నెవణ్నయినా ప్రశ్నడిగి కను ్కవాలి. లేకుంటే చటుక్కున పుస్తకం విప్పి యే శ్లోకం కనబడితే ఆ శ్లోకం చదువుతాను.
“మృగాఃప్రియాళు ద్రుమమంజరీణాం"
యిదేదో చదివిన జ్ఞాపకం లీలగా వుంది. లేళ్ళు పరుగెత్తుతాయని కాదూ? యేం గొప్పమాట చెప్పాడోయి కవి? లేళ్ళు పరిగెత్తితే యవడి క్కావాలి. పరుగెత్తకపోతే యవడిక్కావాలి?కుక్కలు పరుగెత్తుతున్నాయి కావా, నక్కలు పరుగెత్తుతున్నాయి కావా? పిల్లులు పరిగెత్తుతున్నాయి కావా? పనికొచ్చే ముక్క ఒకటి యీ పుస్తకంలో లేదు. నాలు గంకెలు జేరీజు వేయడం, వొడ్డి, వాశీ కట్టడం కాళిదాసు కేం తెలుసు? తెల్లవాడి మహిమ! దా ఏ పట్నం ఎక్కడుందో, యే కొండ లెక్కడున్నాయో అడగవయ్యా గిరీశంగార్ని, నిలుచున్న పాట్న చెబుతాడు.
“ప్రియాముఖం కింపురుషశ్చుచుంబ" ముద్దెట్టుకున్నా డటోయి ముండకొడుకు, ముక్కట్టుకొన్నాడు. కాడూ!
[కరటశాస్త్రి శిష్యుడికి కనబడకుండా వెనకనుంచి ప్రవేశించాడు]
“వర్ణ ప్రకర్షేనతి కర్ణి కారం!
ధుదోతి నిర్గంధత యాస్మ చేతః"
యిది కూడా చదివినట్టే వుందోయి. ఆ పువ్వేదో కవి కిష్టం లేదట. యిష్టం లేకపోతే ములిగిపోయింది కాబోలు? మా గురువుగారికి దొండకాయ కూర యిష్టంలేదు. గురువుగారి పెళ్ళాం పెరట్లో దొండ పాదుందని రోజూ ఆ కూరె వొండుతుంది. బతికున్న వాళ్ళ యిష్టవేఁ యిలా యేడూస్తూంటే చచ్చినవాడి యిష్టాయిష్టాలతో ఏం పని? యీచదు విక్కడితో చాలించి గిరీశంగారి దగ్గర నాలు గింగిలీషు ముక్కలు నేర్చు కుంటాను. వెంకడికి యింగిలిసొచ్చునని యేం గర్రాగా వుంది.
కరః- యేవిఁటా అబ్బి అంటున్నావు?
శిష్యుః - ఏదో నా స్వంత ఘోష.
కరః- గురువునిగదా, అదేదో నాకూ కొంచెం చెబుదూ.
శిష్యు:- చెప్పడానికే పుఁందఁడి? నాటకంలో నాచేత వేషం కట్టించి పెద్ద చాంతాళ్ళలాంటి హిందుస్తానీ ముక్కలూ, సంస్కృతం ముక్కలూ అర్ధం తెలియకుండా భట్టీయం వేయించడానికి మీకు ఓపికుందిగాని నాకు నాఁల్రోజులి కో శ్లోకం చెప్పడానికి శ్రద్ధలేదుగదా? పట్నం వొదిలి ఆర్నెల్ల కోమాటు అగ్రహారాలంట వొచ్చినపుడు మరేం వూసుపోక “పుస్తకం తియ్యం”టే సంస్కృతం యేం వచ్చేని?
కర:- యిటు పైన్చూడు యెలా చెబుతానో, రోజుకు నాలుగేసి శ్లోకాలు చెబుతాను. కొత్త శ్లోకం చదువు.
శిష్యు:- “అస్తుత్యస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ
కరః- మొదటికొచ్చావేం?
శిష్యు:- మొదలూ కొసా వొక్కలాగే కనబడుతూంది.
కర:- (నవ్వి) పోనియ్, మొదణ్ణించే చదువుదాం.
శిష్యు:- చదివినా యేం లాభం వుంది? యీ శ్లోకం శుద్ధబద్ధమట.
కర:- యవరు చెప్పారు?
శిష్యు:- గిరీశంగారు.
కర:- యేం చెప్పాడు?
శిష్యు:- హిమాలయం రెండు సముద్రాలకి దాని. రూళ్ళ కర్ర లాగ లేదట. మాపులో చూపించాడు.
కర:- హిమాలయం శిగగోశిరిగాని, అ పుస్తకం ముడిచి, నా మాట విను.
శిష్యు:- చిత్తం. (పుస్తకం మూయును)
కర:- చదువన్న దెందుకు? పొట్ట పోషించుకోడానికిగ్గదా?
శిష్యు: అవును.
కరః - యీ రోజుల్లో నీ సంస్కృత చదువెవడిక్కావాలి?
శిష్యు:- దరిద్రుని క్కావాలి.
కర:- బాగా చెప్పావు. నీకు ఇంగ్లీషు చదువుకోవాల్నుందా? శిష్యు:- చెప్పించే దాతేడీ?
కర:- నేను చెప్పిస్తాన్రా!
శిష్యు: నిజంగాను!.
కర:- నిజంగాన్రా. గాని ఒక షరతుంది.
శిష్యు:- యేవిఁటండి?
కర:- నాకో కష్ట సాధ్యమయిన రాచకార్యం తటస్థించింది. అది నువ్ నిర్వహించి చేసుకురావాలి.
శిష్యుః- నావల్లయ్యే రాచకార్యాలు కూడా వున్నాయా?
కర:- యీ రాచకార్యం నీ వల్లే కావాలి. మరెవడివల్లా కాదు. అదేవిటంటే, ఓ పదిరోజులు ఆడపిల్లవై పోవాలి.
శిష్యు: - గణియం పట్టణంలో వుండిపోయిందే?
కరః- అట్టే గణియం అవసరం లేదు. నీకు తలదువ్వి కోక కడితే పజ్యండేళ్ళ కన్నె పిల్లలా వుంటావు. నిన్ను తీసుకెళ్ళి లుద్దావుధాన్లకి పెళ్ళి చేస్తాను. నాలుగు పూటలు వాళ్ళింట నిపుణతగా మెసిలి, వేషం విప్పేసి పారిపోయిరా. నిజవైఁన పెళ్ళి ముహూర్తము చాలా వ్యవధుంది.
శిష్యుః - యిదెంత పని.
కర:- అలా అనుకోకు. అతి చేసి పట్టాయనా, అనుమానపడ తారు. పట్టుబడ్డావంటే ఒక తెగిపోతుంది.
శిష్యుః - మీకా భయం వొద్దు...
కరః- నువ్వు నెగ్గుకొస్తే, మా పిల్లన్నీ కిచ్చి యిల్లరికం ఉంచు
శిష్యుః - అలా ప్రమాణం చెయ్యండి.
కరః- ఇదుగో, యీ పుస్తకం పట్టుకు ప్రమాణం చేస్తున్నాను.
శిష్యు:- ఈ పుస్తకం మీద నాకు నమ్మకం పోయింది. మరో గట్టి 'ప్రమాణం చెయ్యండి. గిరీశంగారిని అడిగి ఒక గిలీసు పుస్తకం పట్టుకురానా?
కర: - తప్పితే భూమితో డ్రా.
శిష్యుః- మీరు యెగేస్తే భూవేఁం జేస్తుంది? మీ మాటే చాలును. కానీయండి.
8వ స్థలము: ఆగ్రి హోత్రావధాన్లు యింటి యదట వీధి.
(గిరీశం, వెంకటేశం ప్రవేశింతురు)
వెంకటే:- రాత్రి కన్యాశుల్కం మీద లెక్చరిచ్చారా?
గిరీ:- లెక్చరేవిటోయ్ ధణు తెగిరి పోయింది. మీ తండ్రిది మైరావణ చరిత్రోయ్. మీ అంకుల్ కరటక శాస్త్రి స్కౌండ్రల్లా క్కన బడుతున్నాడు.
వెంక యేం జరిగిందేం జరిగిందేఁవిటి?
గిరీ:- విను, రాత్రి భోజనాల వేళ లెక్చరు ఆరంభించమని రోజల్లా
బురిడీలు పెట్టాడోయ్ మీ మావఁ సబ్జక్టు నేను కొంచెం యెత్తగానే తను కూడా గట్టిగా సపోర్టు చేస్తానని ప్రామిస్ చేశారు. నీ తండ్రి వైఖరి చూస్తే మాత్రం కొంచెం ధైర్యం వెనకాడి నాలిక్కొన కొచ్చిన మాట మళ్ళీ మణిగిపోతూండేది. పెరుగూ, అన్నం కలుపుకునే వేళకి యిక దైమ్మించిపోతూందని తెగించి లెక్చరు ఆరంభించాను. ఇంట్రడక్షన్ రెండు సెంటెన్సులు యింకా చెప్పనేలేదు. నాలుగు యింగిలీషు మాటలు దొర్లాయోయ్. దాంతో నీతండ్రి కళ్ళెర్రజేసి “ఈ వెధవ ఇంగ్లీషు చదువు నించి బ్రాహ్మణ్యం చెడిపోతుంది. దేవభాషలాగ భోజనాల దగ్గిర కూడా ఆ మాటలే కూస్తారు. సంధ్యావందనం, శ్రీసూక్త పురుషసూక్తాలు తగల బడిపోయినాయి సరేగదా!" అని గట్టిగా కేకవేసి చెప్పేసరికి నేనుకొంచెం పస్తాయించి "థ్రోయింగ్ పెర్సు బిఫార్ స్వైన్" అనుకొని కరటక శాస్తుల్లువేపు చూసేసరికి, యేం చేస్తున్నాడనుకున్నావ్? రాస్కెల్, వులక లేదు పలకలేదు సరేకదా మొహం పక్కకు తిప్పి కడుప్పగిలేటట్టు నవ్వు తున్నాడు. యిక లెక్చరు వెళ్ళిందికాదు, సరేకదా, నోట్లోకి ముద్ద కూడా వెళ్ళి దికాదు. ఛీ! యింత యిన్సల్టు జరిగిం తరువాత తక్షణం బయలు దేరి వెళ్ళి పోదామనుకున్నాను.
వెంకటే:- -య్యో! వెళ్ళిపోతారా యేవిఁటి?
గిరీ:- నాటింది లీస్టు. కోసాకి విను నీ తండ్రిని పోకెట్లో వేశాను.
వెంకటేః- నా తండ్రికి లెక్చరిచ్చి పెళ్ళి తప్పిస్తాఁవన్నా రే?
గిరీ:- పెళ్ళి ఆపడానికి బ్రహ్మశక్యం కాదు. డిమాస్థనీసు, సురేంద్రనాధ్ 'బానర్జి వచ్చి చెప్పినా నీ తండ్రి యీ పెళ్ళి మానడు. లెక్చర్లు యంత సేపూ సిటీలోనేగాని, పల్లెటూళ్ళలో యంత మాత్రం పనికిరావు. పూవంటి సిటీలో లెక్చర్ యిచ్చావఁంటే టెంథౌజండు పీపిల్ వింటానికి వొస్తారు. మన టౌన్లోనే, పెద్ద మీటింగులు చెయ్యా లంటే, డప్పులు బణాయించి, నోటీసులు కట్టి, బజార్లు కాని, తోవంట బోయేవాళ్ళని యీడ్చుకు వొచ్చినా, యాభై మంది కారు పల్లెటూరి పిపిల్ లెక్చర్లకి ఆన్ఫిట్. మొన్న మనం వొచ్చిన బండివాడికి నా'షనల్ కాంగ్రెస్ విషయఁవై రెండు గంటలు లెక్చరు యిచ్చేసరికి ఆ గాడిదకొడుకు వాళ్ళ వూరు హెడ్ కానిస్టేబిల్ని కాంగ్రెస్వరు యెప్పుడుబదిలీచేస్తారని ఆడిగాడు! విలేజస్ లో లెక్చర్లు యంతమాత్రం కార్యంలేదు: నీ తండ్రి దగ్గర మాత్రం లెక్చరన్న మాట కూడా అనకూడదు.
వెంకటే- అయితే నాన్నని యలాగ జేబులో వేశారేవిఁటి?
గిరీ:- అది పొలిటిక్సు దెబ్బోయ్! ఆ తరవాత కథ విను. నామీద కా'కలేసిన తరువాత కోపఁవణక్క ధుమధుమలాడుకుంటూ, అన్నం కుమ్మడం ఆరంభించాడు. పెరుగూ ఇంతలో మీ అమ్మి వచ్చి గుమ్మం దగ్గర నిలబడి కోకిల కంఠంతో “నాన్న, తమ్ముడికి పెళ్ళి చెయ్యాలంటే నా సొమ్ము పెట్టి పెళ్ళి చెయ్యండిగాని, దానికొంపముంచి లుబ్దావుదాఁన్లుకి ఇవ్వొద్దని చెప్పింది. దానితో నీతండ్రికి వెర్రికోపం వొచ్చి ఉత్తరాపోశనం పట్టకుండానే ఆ పెరుగూ అన్నంతో విస్తరితీసి కెళ్ళి దాన్నె తిన రుద్దేశాడు! కరటకశాస్తులు అడ్డుపడకబోతే చెంబుతో నీళ్లువాడి నెత్తిం దిమ్మరించాడు. కరటక శాస్తుల్లుకి కోపంవొచ్చి శిష్యుణ్ణి తీసుకు వాళ వాళ్ళవూరెళ్ళి పోయినాడు.
వెంకటే:- దీని పేరేనా యేవిఁటి, మా నాన్నని జేబులో వేసు కోవడం?
గిరీ:- పేషన్స్! కొసాకీ విను. స్కాండ్రల్ కరటక శాస్త్రులు వెళ్ళిపోయినాడని సంతోషించాను గానీ, నీ సిస్టర్ ఫేట్ విషయవై మహా విచారవై ఁంది. నేనే దాని హజ్బెండై వుంటే, నిలబడ్డపాటున నీ తండ్రిని రివాల్వర్తో షూట్ చేసి వుందును. మీ అమ్మ యేడుస్తూ ఒక మూల కూచుంది. అప్పుట్టే వెళ్ళి పొయిలో నిప్పేసి, నీళ్ళుతోడి, నీ సిష్టర్ని 5 స్నానం చెయ్యమన్నాను. సిగర్సు కాల్చుకుందామని అరుగుమీద నేను బిచాణా వేసేసరికి. నీ తండ్రికి పశ్చాత్తాపం వొచ్చి తానూ ఆ అరుగు మీదే బిచాణా వేసి ఒక్క నగరయినా కాల్చనియ్యకుండా రాత్రల్లా కబుర్లలో పెట్టి చంపా'డోయ్. మొత్తానికి కత్తు కలిపేశాను.
వెంకటే:- యలాక్కలిపా రేవిఁటి?
గిరీ:- ఒక పొలిటికల్ మహాస్త్రం ప్రయోగించి కలిపేశాను.
వెంకటే:- యేవిఁటం డా అస్త్రం?
గిరీ:- ఒకడు చెప్పిందల్లా మహాబాగుందండవే. సమ్మోహనాస్త్ర వఁంటే అదేకదా?
వెంకటే: - లెక్చరిచ్చి మాతండ్రిని వొప్పించడానికి బదులుగా ఆయన చెప్పిందానికి మీరే ఒప్పుకున్నారు?
గిరీ:- మంచం నిలువునా కొలవడానికి వీల్లేనప్పుడు తిరగేశైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి. బాగా ఆలోచిస్తే యిన్ఫెంటు మా'రి యేజి కూడుననే తోస్తూంది.
వెంకటే: యిన్నాళ్ళూ కూడదని చెప్పేవారే నాతోటి?
గిరీ :- ఒపీనియన్స్ అప్పుడప్పుడు ఛేంజి చేస్తూంటేనేగాని పోలిటీషను కానేరడు. నాకు తోచిన కొత్త ఆర్గ్యుమెంటు విన్నావా? యిన్సెంటు మా'రేజీలు అయితేగాని యంగ్ విడోజ్ వుండరు. యంగు విడోజ్ వుంటేనేగాని విడో మా'రియేజ్ రిఫారమ్కి అవకాశం వుండదు గదా? సివిలిజేషన్కల్లా నిగ్గు విడో మా'రియేజ్ అయినప్పుడు యినెంటు ‘మారేజి ల్లేకపోతే, సివిలిజేషన్ హాల్టవుతుంది! మరి ముందు అడుగు పెట్టలేదు. గనక తప్పకుండా యినెంటు మా'రేజి చెయ్యవలసిందే. ఇది ఒహ కొత్త డిస్కవరీ నంబర్ టూ చిన్న పిల్లల్ని ముసలాళ్ళకిచ్చి పెళ్ళి చెయ్యడం కూడా మంచిదే అని నేను వాదిస్తాను.
వెంకటే: - సుబ్బిని లుద్దావధాన్లుకి యివ్వడం మంచిదంటారా ఏమిటి? అమ్మ ఆ సమ్మంధం చేస్తే నూతులో పడతానంటూందే?
గిరీ:- ఫెమినై న్సు ఫూల్సన్నాడు. "పడు పడు అన్న నా సవితే గాని పడ్డ నా సవితి లేదంది దెవర్తోను. నూతులో పడడం, గీతులో పడ డడం నాన్సెన్స్. ఓ రెండు తులాల సరుకోటి మీ నాన్న చేయించి ఇచ్చా డంటే, మీ అమ్మ ఆ మాట మానేస్తుంది, కాని నా ఆర్గ్యుమెంటు విను.
వెంకటే: యేవిఁటండి?
గిరీ:- పెళ్ళనే వస్తువఁ. శుభవాఁ అశుథవాఁ? మంచిదా, చెడ్డదా? చెప్పు.
వెంకటే:- మంచిదే!
గిరీ:- వెరీగుడ్! పెళ్ళ'నేది మంచి పదార్థవైఁతే"ఆధికస్య అధికం అన్నాడు గనుక చిన్నపిల్లని ఒక ముస్లవాడికి పెళ్ళిచేసి, వాడు ఫలం" చస్తే మరోడికి, మరోడు చస్తే మరోడికి, యిలాగ పెళ్ళిమీద పెళ్ళి, పెళ్ళి మీద పెళ్ళి అయి, వీడి దగ్గిరో వెయ్యి, వాడిదగ్గిరో వెయ్యి, మరోడి దగ్గిర మరోవెయ్యి.
రొట్టెమీదెనెయ్యి, నేతిమీద రొట్టెలాగ యేకో - త్రవృద్ధిగా కన్యాశుల్కం లాగి, తుదకు నాలాంటి బుద్ధిమంతుణ్ని పెళ్ళాడితే చెప్పావ్ మజా? ఇహసౌఖ్యం పూర్తిగా లభిస్తుంది. ఇహ సౌఖ్యంవుంటే పరసౌఖ్యం కూడా సాధించావే అన్నమాట. యలాగో తెలిసిందా? ఈజ్ మెంట్
హక్కు యష్టాబ్లిష్ అవుతుంది. వెంకటే: - కన్యాశుల్కం కూడా మంచిదంటున్నా రేవిఁటి?
గిరీ:- మరే చిఁటనుకున్నావ్? నెవ్వెర్డూ బై హాన్సన్నాడు. చేస్తే శుద్ధక్షవరవేఁగాని తిరుపతి మంగలాడి క్షవరం చెయ్యకూడదు. యీ ఆస్త్రం తోటే మీ తండ్రి వశ్యం అయినాడు. యింగ్లీషువాడు “థింక్ ” అన్నా డోయి. ఆలోచిస్తేగాని నిజం బోధపడదు. ఆలోచించగా కన్యా శుల్కం లేని మారేజే యీ భూప్రపంచంలో లేదు. విన్నావా? గండి?
గిరీ:- అలా అడగవోయి! ఏం? డబ్బుచ్చుకుంటేనే కన్యాశుల్క వఁయిందేం? యిన్ని తులాల బంగారం పెట్టాలి, యింత వెండి పెట్టాలి అని రూపాయలకి బదులుగా వెండి, బంగా రాల కింద ధనం లాగితే కన్యాశుల్కం ఆయింది కాదేం? యీ పెద్ద పెద్ద పంతుళ్ళవారంతా యిలా చేస్తూన్న వారేనా?
వెంక: అవును.
గిరీ:- యిక దొరల్లోనో? వాళ్ళ తస్సాగొయ్యా, యిల్లు గుల్లచేస్తా రోయి! అవి గుడ్డలు కావు, అవి శెంట్లు కావు, అవి జూయల్సు కావు.
'మా'రియేజి సెటిల్ మెంటని బోలెడు ఆస్తి కూడా లాగుతారు. యీ ఆర్గ్యు మెంటు నేను చెప్పేసరికి నీ తండ్రి బ్రహ్మానందభరితుడైనాడు. లు బావ ధాన్లు పెళ్ళికి అన్నిటికన్న పెద్ద సవబొకటి నీకు చెప్తాను విను.
వెంకటే: ఏంటండి?
గిరీ:- లుబావుఁధాన్లు ముసలాడూ, బంగారు ప్పిచ్చికాన్ను. రెండే ళ్ళకో, మూడేళ్ళకో అమాంతం బాల్చీ తన్నేస్తాడు. అనగా “కిక్స్ ది బకెట్" దాఁతో నీ చెల్లెలు రిచ్చి విదో అవుతుంది . నువ్వు పెద్దవాడివైన తరువాత దానికి విడో మా'రియేజి చేసి శాశ్వతమైనఁ కీర్తి అతిసులభంగా సంపాదించవచ్చును, యేవఁంటావ్?
వెంకటే- అవును.
గిరీ:- మరో గొప్పమాట! యీ సంబంధం అయితే నీకూ, నాకూ సంబంధం కలుస్తుందోయి.
వెంకటే:- అది నా క్లిష్టవేఁ.
గిరీ:- రాత్రి నీ తండ్రి నీకు హైకోర్టు వకా లీదాకా చదువు చెప్పిస్తా నన్నాడు! ప్రస్తుతోపయోగం పుస్తకాలమాట కదిపానుగానీ, పెళ్ళీ నుంచి వచ్చినతరువాత యిస్తానన్నాడు. యీలోగా చుట్టముక్క లేకపోతే గుడ్ల క్కొస్తాయి. సిగర్సు కోసం కాపర్సేవఁయినా సంపాదించావా లేదా?
వెంకటే: - లేదు. యీ వుదయవఁల్లా అమ్మ ధుమధుమలాడుతూనే వుంది. మా నాన్న పొడుం కోసం కొట్లో నిలవచేసిన పొగాకులోది వో కట్ట వోణిలో దాచి తీసుకొచ్చాను.
గిరీ:- దటీజ్ పోలిటిక్స్! మరియింతసేవూ చెప్పా'పు కావేం? చుట్టల్చుట్టుకొని యీ కోవిలగోపురంలో కూచుని కాల్చుకుందాం రా!
వెంక టే:- కోవిల్లో చుట్ట కాల్చవచ్చునా?
గిరీ:- కాలిస్తే కోవిల్లోనే కాల్బాలోయి. దీని పొగ ముందరు సాంబ్రాణీ, గుగ్గిలం యే మూల? యేదీ, కట్ట యిలాతే. (కట్ట అందుకొని వాసన చూచి) ఆహా యేమి ప్రొగా కోయ్! నిజంగా కంట్రీ లైఫులో చాలా చమత్కారం వుంది? బెస్టు టోబాకో, బెస్టు గేదే పెరుగు, మాంచి మీ. అంచేతనోయ్ పోయట్స్ “కంట్రీలైఫ్, కంట్రీలైఫ్" అని దేవులాడు తాడు.
వెంకటే:- మీరూ పోయల్సే గదా?
గిరీ:- అందుకభ్యంతరంవేఁవిటి? నాకూ కంట్రీలైఫ్ యిష్టవేఁగాని సీవఁలో లాగా బ్యూటిఫుల్ షెవర్డెన్లూ, లవ్ మేకింగూ ఉండవోయ్. గ్రాస్ గరల్స్ తగు మాత్రంగా వుంటారుగాని, మా డర్టీస్మెల్. అజొహటిన్నీ, మన దేశంలో మెయిడన్సు వుండరోయి. యెంత సేపూ లవ్ మేకింగ్ విడోజ్కి చెయ్యాలిగానీ మరి సాధనాంతరం లేదు. వెంకటే: మీరు విడో మీద చేసిన పొయిట్రీ రాసి యిస్తానని యిచ్చారు కారు గాదా?
గిరీ:- అడగ్గానే యిస్తే వస్తువు విలువ తగ్గిపోతుంది. 'హ టిన్నీ, మరెండేళ్ళు పోతేనేగాని దాని రసం నీకు బాగా బోధపడదు. అయినా స్పెషల్ కేసుగా నీకు ఉపదేశం చేస్తాను. నోటుబుక్కు తీసి రాయి.
[గిరీశం చుట్ట కాలుస్తూ, మధ్య మధ్య చుట్టచేతపట్టి, ఒక్కొక్క ముక్క చెప్పగా వెంకటేశం వ్రాయును.]
THE WIDOW
She leaves her bed at A.M. four,
And sweeps the dust from off the floor,
And heaps it all behind the door,
Of wondrous size she makes the cake,
And takes much pains to boil and bake,
And eats it all without mistake,
The widow !
The widow !
Through fasts and feasts she keeps her health,
And pie on pie she stores by stealth,
Till the town talk of her wealth,
The widow !
And now and then she takes a mate,
And lets the hair grow on her pate,
And cares a hang what People prate,
The widow!
I love the widow.......whomever she be,
Married again.......or single free,
Bathing and praying,
Or frisking and playing,
A model of saintliness,
Or model of comeliness,
What were the earth,
But for her birth?
The Widow!
యిది నేను రిఫార్మర్లో అచ్చువేసేటప్పటికి టెన్నిసన్ చూసి గుండెకొట్టుకున్నాడు. చుట్టతాగడం సమాప్తం చేసి యింటికి పోదాంరా, చాలా నేపయింది.
[నాలుగడుగులు యిద్దరూ నడిచే సరికి అగ్నిహోత్రావ ధాన్లు కలియును].
అగ్ని:- ఏవండీ హనుమాన్లుగారు....మీ పేరేవిఁటండీ?
గిరీ:- గిరీశం అంటారండి.
అగ్ని:- ఇదిగో, గిరీశంగారూ! రాత్రి మనవఁనుకున్న ప్రకారం మన దావాలు గెలుస్తాయనే మీ అభిప్రాయవాఁ?
గిరీ:- గెలవకపోతే నేను చెవి కదపాయించుకు వెళ్ళిపోతాను. మీ వూహపోహలు సామాన్యవై ఁనవా? అందులో “యతో ధర్మస్తతో జయః” అన్నట్టు న్యాయం మీ పక్షం వుంది. బుచ్చమ్మగారి కేసు విషయమైం - జబ్బల్పూర్ హైకోర్టు తీర్పొహటి మనకి మహాబలంగా వుంది. పెత్తండ్రిగారు యిలాంటి కేనే ఒహటి యీ మధ్య గెలిచారండి.
అగ్ని:- దీనికల్లా అసాధ్యం యీ కేసు కాకినాళ్ళో తేవలసొచ్చింది. మా కరకట శాస్లులుని పంపిస్తే యవడో చవట వకీల్ని కుదిర్చా'డు.
వాడెప్పుడూ డబ్బుతెమ్మని రాయడవేఁగాని కేసుభోగట్టా యేవీ(రాయడు గడియ గడియకి వెళదావంటే దూరాభారం గదా?
గిరీ:- మీ శలవై తే స్టీమరుమీద నేను వెళ్ళి ఆ వ్యవహారవంతా చక్కబెట్టుకు వస్తాను. మా పెత్తండ్రిగారు కాకినాడకల్లా తెలివైన ప్లీడరు. ఆయన పట్టిన కేసు యెన్నడూ పోయిందన్న మాట లేదండి.
మీరు వెళితే నేను వెళ్ళినట్టే. య' ంత ఫీజయినా మీ పెత్తండ్రిగారికే వకాల్తీ యిద్దాం. యావఁంటారు?
గిరీ :- మీ దగ్గర ఫీజు పుచ్చుకోవటం కూడానాండి? ఖర్చులు మట్టుకు మీరు పెట్టుకుంటే ఫీజక్కర్లేకుండానే పని చేయిస్తానండి.
అగ్ని :- మీరలా అంటారన్నే నెరుగుదును, గాని గెలిచిం తరు వాత మనకి తోచిన బహుమతి యిద్దాం.
గిరి :- యిచ్చినాసరే, యివ్వకపోయినా సరేనండి.
[బుచ్చమ్మ ప్రవేశించును. ]
నాన్నా! అమ్మ స్నానానికి లెమ్మంచుంది.
అలాగే. (బుచ్చమ్మ వెళ్ళిపోతూండగా గిరీశం క్రీగంట చూచును.) భోజనం చేసిన తర్వాత కాయితాలు మీ చేతికిస్తాను. అవన్నీ సావకాశంగా చూడండి. మా యింటి తూరుప్పొరుగు రావాఁవుధాన్లుమీద మందడిగోడ విషయమై మనం తెచ్చిన దావా లంచం పుచ్చుకుని మునసబు అన్యాయంగా కొట్టేశాడు. జడ్జి కోర్టులో అప్పీలు చేశాం: మా వకీలు అవతల పార్టీ దగ్గిర కతికి మన కేసు ధ్వసం చేశాడు. మీవంటివారు నాకు చెయ్యాసరావుంటే రావ్యాపుధాన్లు పిలకూడదీ నేదును.
కానిండిగానీ తూర్పు మందడిగోడ రావావుధానిదయితే పడవఁటి మందడిగోడ మంద వాల్నా లేదా? న్యాయం చెప్పండి. చూడండి, దానిమీద ఎలా యెత్తా'డో? క్రిమిన ల్నడిపించమని భుక్త సలహా చెప్పాడు.
[బుచ్చమ్మ మళ్ళీ ప్రవేశించును]
బుచ్చ :- నాన్నా! అమ్మ స్నానం చెయ్యమంచుంది.
అగ్ని:- వెధవముండా సొద. పెద్ద మనుషుల్తో వ్యవహారము మాట్లాడుతూంటే రామాయణంలో పిడకలవేట్లాటలాగ అదే పిలవడవాళ్లు
గిరి :- తప్పకుండా క్రిమినల్కేసు తా'వలసిందే. క్రిమినల్స్లో జ్యూర్ కోడు 171 శక్షన్లు ప్రకారం తెద్దావాఁ? ప్రకారం తెద్దావా? 172 డో శక్షను
అగ్ని :- రెండు శక్షన్లూ తా' లేవేఁ?
గిరీ :- నేరంగల ప్రవేశం. ఆక్రమణ.... రెండు శక్షన్లూ కూడా ఉపచరిస్తాయి సరేగదా, కళ్ళతో చూశాను. గనుక ఈ గోడ మీదయినట్లు జల్లీలై గపొడిచి సాక్ష్యంకూడా పలగ్గలనా. యీ గోడ స్పష్టంగా మీదా నాగే కనబడుతూంది.
ఆగ్ని :- అందుకు సందేహం వుందండి? ఏమరిచి ఇన్నాళ్ళు వూరుకున్నాను. పెరటిగోడ కూడా చూతురు గానండి. అక్కాబత్తుడి ముక్కు నులిపి గెల్చుకున్నాను. కాని యీ దావాలకింద సిరిపురం భూవి అమ్మెయవలసి వచ్చిందండి, రావాఁపుధాన్లు కేసుగూడా గెలిస్తే ఆ విచారం నాకు లేక పోవును.
అందరు నిష్క్రమింతురు)