shabd-logo

"దేశం లో మార్పు రావాలి "

26 June 2024

1 చూడబడింది 1

ఈ దేశం అందరిదీ .

అందరం ఒకటే .

ఈ దేశంలో ఏ వ్యత్యాసాలు ఉండకూడదు .

ఒకరికి డబ్బులు ఉన్నాయని ఒకరికి డబ్బులు లేవని భేదాలు ఉండకూడదు .

అందరం మనుషులమే..

మనిషిని చూసి మనిషి భయపడడమేంటి..?

చంపుకోవడమేంటి సమాజంలో న్యాయం లేదా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే తగాదాలు, గొడవలు ప్రాణం తీసుకునే వారికి వెళ్తున్నాయి..

సమాజంలో కుళ్ళు కుతంత్రాలు పెరిగిపోయాయి.

దుర్మార్గులు, వితండవాదులు, మూర్ఖులు ఉన్నారు ఈ సమాజంలో సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు.

ఇప్పుడు ఈ సమాజం శిథిలావస్థలో ఉంది.

ఈ సమాజాన్ని మంచిగా తయారు చేయాలి.

మంచి మనుషులు ఉన్నారు ఈ సమాజంలో అని చెప్పేలా దేశం లో మంచి సమాజాన్ని తయారు చేసేలా ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలి ..

దేశభాగు పౌరుని బాగు.

దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి ఒక బాధ్యత ఒక కర్తవ్యం అంటూ ఉంది.

అది దేశ అభివృద్ధి ,దేశ సంక్షేమం .

ఈ ప్రభుత్వము ఉన్నదే ప్రజలకు సేవ చేయడానికి మనకే పని కావాలన్నా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి అడుగుతే ఏం చేస్తారో అధికారంలో ఉన్నవాళ్లు అనేది భయం పోవాలి.

అడగాలి అడిగి మన పనులు చేపించుకోవాలి అది ప్రజల కర్తవ్యం ఏదైనా గవర్నమెంట్ అధికారి దగ్గరికి వెళ్లి అయ్యా మా పరిస్థితి ఇది మా వాడలో ఇది మా సమస్య గిది అని చెప్పుకుంటే ఏం చేస్తారో ఎవరేమంటారు అని భయపడడం మానుకోవాలి ..

నిలదీయాలి అడగాలి ఏ సమస్య అయినా చెప్పుకుంటేనే తెలుస్తది. .

అది కలెక్టర్ కైనా అది మన గ్రామ సర్పంచ్ ,కార్యదర్శి ఎవరికైనా కూడా భయం అనేది లేకుండా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేలా ఉండాలి.

ప్రజలలో చైతన్యం అవగాహన తేవాలి. .

దేశంలో మంచి సమాజం రావాలి .

మంచి మానవత్వం ,మంచి మాటలు ,మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులను తయారు చేయాలి..

దేశంలో క్రమశిక్షణను పెంచాలి .

స్కూల్లో చదువుకునేటప్పటినుంచె  బేసిక్ గా క్రమశిక్షణ గురించి పాఠాలు చెప్పే విధంగా వ్యవస్థను తయారు చేయాలి..

దేశంలో ఉన్న భారతీయులంటే క్రమశిక్షణకు మారుపేరు అనేలా దేశ ప్రజల గౌరవాన్ని దేశ పతాకాన్ని రెపరెపలాడించాలి ..

ప్రతి ఒక్క పౌరుడు దేశ గౌరవాన్ని నిలిపేలా ఉండాలి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు..
ఈ భారత దేశంలో మార్పు రావాలంటే ప్రతి ఒక్క పౌరుడు మంచిగా చదువుకొని దేశ సంక్షేమం గురించి దేశ బాగు గురించి తన వంతు సహాయ సహకారాలు అందించాలి.

దేశంలో నానాటికి పెరుగుతున్న పేదరికాన్ని లేకుండా చేయాలి.
దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి.

వాటిని వాడుకోవద్దని అధికారం ఎవరికి లేదు.

ఎవరి హక్కులకు భంగం కలిగిన రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడానికి అవసరమైతే కోర్టుల ద్వారా స్వేచ్ఛ స్వతంత్రాలను పొందుకునే హక్కు ప్రతి పౌరునికి ఉంది.

ఇప్పుడున్న దేశ ప్రజలలో ఒకటే ఉన్నది.
అది ఏంటంటే.
నా పిల్లలు నా కుటుంబం నా పని నా ఇల్లు నా అప్పులు ఇదే సరిపోతుంది జీవితానికి ..

ఇక దేశ భవిష్యత్తు దేశం గురించి ఆలోచించడం దేశానికి ఏదైనా మేలు చేయడం అలాంటిదేం లేదు ఇప్పట్లో ఈ ప్రజలలో.

ఉన్నోడు బిల్డింగ్లు కట్టుకుంటూ పోతున్నాడు లేనోడు పూట గడవక చాలా ఇబ్బందులు పడుతున్నానాటికి ఇంకా దిగజారిపోతున్నాడు.

ఈ వ్యత్యాసాలు ఈ భేదాలు దేనికి ఏం సాధిస్తారు ఏం చేస్తారు లేనివారిని..

ప్రతి భారతీయ పౌరుడు దేశం కోసం ప్రాణమైన ఇయడానికి నిరంతరం రెడీగా ఉండాలి.

దేశాన్ని కాపాడడం కంటే పౌరునికి ఏముంటుంది ఇది ఒక మహా భాగ్యం అనుకోవాలి..

దేశంలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే.

దేశ ప్రజలలో చాలామంది చాలా చెడు సావాసాలకు బానిసలు అవుతున్నారూ..

దేశంలో ఎక్కడ కూడా మద్యపానం అమ్మడం నిషేధం విధించాలి.

మద్యపానం సేవించడం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

గవర్నమెంట్ కు వచ్చే ఆదాయం మొత్తం మద్యపానం వల్లే అని తెలుసు .

అయినా కూడా ఇంకో ప్రత్యేక మార్గం ఎన్నుకొని ఈ మధ్యపానం దేశం మొత్తం నిషేధించడం చాలా ముఖ్యం.

పొద్దున్నుంచి కష్టపడుతూ వచ్చే డబ్బులు మద్యానికి తగిలేసి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్న ఎంతోమంది నిరుపేదలు మద్యానికి బానిసై తమ కుటుంబాలను చాలా ఇబ్బందులు గురి చేస్తూ జీవితాలను బలి తీసుకునేలా చేస్తున్నాయి.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ మద్యపానం దేశం మొత్తం నిషేధించాల్సిన అవసరం ఉంది.

నేటి యువత కూడా చాలా వరకు చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు.

వద్దురా అది చెడు అలవాటు అంటే.

నీకెందుకు నా డబ్బులు నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటే ఏమైనా అవుతా నీకేం అవసరం నా గురించి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

దేశానికి కావాల్సింది యువతే.

ఏ దేశంలో లేని యువత అధిక సంఖ్యలో మనదేశంలో ఉన్నారు.

ఇన్ని కోట్లలో ఉన్న యువతను మంచి మార్గంలో పెట్టుకోవాల్సిన అవసరం దేశంలో ప్రభుత్వాలకు లేదా..?

డిగ్రీలు చదివి ఉద్యోగాల గురించి నిత్యం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులు  యువత నిరుద్యోగంతో చాలా చెప్పుకోలేని బాధలు పడుతున్నారు.

కోవిడ్ ఏ పుణ్యాన వచ్చిందేమో గాని .

ఇప్పటికీ మనిషిని చూసి మనిషి భయపడుతూ ఉండడం  చాలా విడ్డూరం...

అప్పుడంటే కోవిడ్ భయపడ్డారు ఒక రీజన్ ఉంది.

మరి ఇప్పుడు ఎందుకు మనిషిని చూసి మనిషి భయపడుతున్నాడు.

ఈ సమాజంలో మనిషి బ్రతకాలంటే డబ్బుంటేనే మనిషి బతకాలి అనేటట్టు చేస్తున్నారు రోజురోజుకి.

ఏ డబ్బు లేకపోతే మనిషి కాదా అందరితో కలిసి ఉండకూడదా? ఒకరికి పెద్ద బిల్డింగ్ ఉన్నదని ఇంకోరికి పెద్ద బిల్డింగ్ ఉండాల్సిన అవసరం లేదు కదా.

ఒకరికి ఇల్లే లేదు అలాంటప్పుడు వాడు మనిషి కాదా వాడు అందరిలాగా మనిషే కదా.

మనుషులందరూ ఒకటే రక్తం వేరు గ్రూప్ల పరంగా.

అన్ని మతాల సారం ఒక్కటే..

ఏ దేవుడైనా ఒకటే చెప్తాడు కలిసిమెలిసి ఉండాలి మనుషులందరూ కలిసిమెలిసి ఉండాలని అని..

సమాజం ఎలా ఉండాలి సమాజంలోని మనుషులు ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి? ఒకరితో ఒకరు ఐక్యమత్యంతో ఎలా మేదలాలి ఒక సబ్జెక్టుగా తీసుకొని ప్రజలందరికీ చెప్పే విధంగా ఒక బుక్కు లాంటి తయారు చేయాలి.

సమాజం అంటే అందులో ఉండే ప్రజలు మంచి మనుషులే ఉండాలి.

సమాజంలో మంచి మాటలు, మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఉండాలి.

సమాజంలో ఆపద అంటే లేని వారికి సాయం చేసే విధంగా మంచి మనసు కలిగి ఉన్న మనుషులు ఉండాలి.

సమాజంలో ఎంత మంచి మనసున్న కూడా డబ్బు లేకపోతే వాడిని మనిషి లెక్క చూడకుండా ఉండే సమాజం ఉండకూడదు.

సమాజంలో డబ్బున్న ,లేకున్నా మనిషన్నవాడు 

మనిషిని డబ్బుతో పోల్చవద్దు.

డబ్బు భూమి అంతరించే వరకు ఉంటుంది.
మనిషి నాలుగు రోజులు ఉండి చనిపోయినప్పుడు ఏం పట్టుకోకుండా ఉట్టి చేతులతో వెళ్తాడు..

ఉన్న నాలుగు రోజులు ఉన్న మనిషి.
సమాజ శ్రేయస్సు కోసం తన వంతు సహాయ సహకారాలు అందించాలి.

ఏది ఏమైనా కూడా ఇప్పటి సమాజంలో మంచి అనేది చాలా వరకు తగ్గిపోయింది.

ఇప్పటి సమాజం మొత్తం శిథిలావస్థలో ఉన్న ఇల్లులా తయారైంది.
ఇక మెడలకూలే విధంగా ఉన్న ఈ సమాజాన్ని మంచిగా చేసే మార్గాన్ని అన్వేషించాలి.
ఒక కొత్త సమాజాన్ని దాని పేరే నవ సమాజ నిర్మాణానికి పునాది వేయాల్సిన అవసరం ఉంది..

ఇది దేశ పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యత.

దేశం మనకేమిచ్చిందని ఆలోచించకుండా మనం దేశానికి ఏమి ఇచ్చామని దేశానికి మనం ఇవ్వడమే దేశం మనకు ఇచ్చిన జన్మకు సార్ధకత అని అందరూ అనుకోని దేశం గురించే బతకాలి.

దేశ పౌరులంతా దేశభక్తి కలిగి ఉండాలి.

ఈమధ్య దేశభక్తి చాలావరకు తగ్గిందనే చెప్పాలి.

దేశంలో తగాదాలు, గొడవలు లేకుండా ఐక్యమత్యంగా ఉండేవిధంగా ప్రతి ఒక్కరి లో దేశభక్తి నీ పెంచలి.

భూ ఆక్రమణ తో జగాల కోసం మనిషి నీ మనిషి చంపుకునేంతాల ఈ సమాజం ఉంది ఇప్పటి కాలంలో..

న్యాయం జరిగేలా చూడాలని అధికారుల దృష్టికి వచ్చిన పేదవారి బాధలు ఎవరికి అర్దం అవుతాయి...

ఎక్కడ న్యాయం జరగాలన్న డబ్బుంటే సరిపోతుందా న్యాయం జరుగుతుందా అలాగైతే నిరుపేదల పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళ బతుకులేంటి.

వారు కూడా ఈ దేశంలో భాగమే కదా.

కడునిరూపేదలు బతక్కుండా దేశంలో ఏమన్నా చట్టం తెస్తారా ఏంది ముందు ముందు.

దేశంలో ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు అని తేడాలు ఎందుకు దేనికి ఏమొస్తుంది ఇలా వ్యత్యాసాలు చూపిస్తే..

దొరికిన పని ఏదో చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా తన కుటుంబాన్ని తాను పోషించుకుంటూ సమాజ బాగు కోసం నిరంతరం అన్వేషించే ఒక మనిషి తన జీవితానికి ఒక అర్థం తెచ్చుకునే వాడవుతాడు.

దేశంలో ఏమైతే నాకేంటి.

దేశం ఏమైపోతే నాకేంటి.

నేను మంచిగుంటే సరిపోతుంది.

నా ఆస్తులు  మంచిగా ఉంటే సరిపోతుంది.

దేశ సంక్షేమం దేశ అభివృద్ధి తో నాకు పని ఏంటి..

నేను దేశంలో ఉన్నానా నేను హోదా సంపాదించుకున్నాను పలుకుబడి సంపాదించుకున్నాను డబ్బు సంపాదించుకున్నాను ఇదే నేటి మనుషుల తీరు అయిపోయింది.

సమాజంలో పరిస్థితి ఎలా ఉన్నాయి? ఎవరిని ఎలా చూస్తున్నారు లేనివారిని ఎలా ఎగతాళి చేస్తున్నారు ఇల్లు లేక అల్లాడుతున్న వారిని చూస్తే ఎగతాళి చేసుడు తప్ప చేతనైతే వాళ్లకు సాయం చేయాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు కొందరు మూర్ఖులు నేటి సమాజంలో..

ఈ దేశంలో ఉన్నామంటే ఒక ఇల్లు కచ్చితంగా ఉండాలి.

అది మన ఉనికిని తెలియజే స్తుంది ..

సచ్చేటప్పుడు ఎవ్వరూ పైకి ఏం పట్టకపోరూ..

ఇదే జీవిత సత్యం కదా..

అందుకే ఈ ఉన్న నాలుగు రోజులు బతికి ఉన్నప్పుడు దేశానికి సమాజానికి ఏదైనా మేలు చేస్తే అదే జన్మ కు సార్థకత చేకూరుతుంది కదా..!



KUSUMA .SAMBASHIVA ద్వారా మరిన్ని పుస్తకాలు

KUSUMA .SAMBASHIVA

KUSUMA .SAMBASHIVA

చాలా బాగా రాసారు..

ఒక పుస్తకం చదవండి